టాలెంట్ ఉన్న విద్యార్థులకు అనేక రాయితీలు కల్పించి చదువులు చెబుతున్న రోజులివి. వారినే మరింతగా నూరి, ర్యాంకుల పంట పండించి గొప్పలు చెప్పుకొనే వ్యవస్థ మనది. ఈ నేపథ్యంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో అందునా వెనుకబాటుతనం ఉన్న ప్రదేశాల్లోని బాలబాలికలను ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేయడమే కాదు, వారికి అత్యున్నత విద్యను అందించేందుకు ఉద్దేశిం చినవే నవోదయ పాఠశాలలు. రెండు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా దాదాపుగా ప్రతి జిల్లాలో ఈ పాఠశాల లను ఏర్పాటు చేశారు. వాటిని జిల్లా స్థాయిలో మోడల్ పాఠశాలలుగా మార్చేందుకు ఇతోధిక కృషి ఇప్పటికీ జరుగుతుండటం విశేషం. ఆ పాఠశాలల్లో బోధించేం దుకు నవోదయ విద్యాలయ సమితి భారీ సంఖ్యలో వివిధ పోస్టుల భర్తీకోసం ప్రకటన విడుదల చేసింది.
పోస్టులు - ఖాళీలు:
అసిస్టెంట్ కమిషనర్(2), ప్రిన్సిపాల్(40), పిజిటి(880), టిజిటి(660), మిసిలేనియస్ టీచర్స్(255), థర్డ్ లాంగ్వేజ్ టీచర్స్(235)
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(పిజిటి) ఖాళీలు:
బయాలజీ (77), కెమిస్ట్రీ(90), కామర్స్(52), ఎకనామిక్స్ (112), ఇంగ్లీష్ (76), జాగ్రఫీ(56), హిందీ(78), హిస్టరీ(70), మేథ్స్(117), ఫిజిక్స్(102), ఐటి(50)
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టిజిటి) ఖాళీలు:
ఇంగ్లీష్ (159), హిందీ(132), మేథ్స్(229), సైన్స్(72), సోషల్(68)
మిసిలేనియస్ టీచర్స్ ఖాళీలు:
మ్యూజిక్(41), ఆర్ట్(50), పిఇటి(ఎం)(28), పిఇటి(ఎఫ్) (91), లైబ్రేరియన్(45)
థర్డ్ లాంగ్వేజ్ టీచర్స్ ఖాళీలు:
అస్సామి(40), బెంగాలి(61), బోడో(7), గారో(7), గుజరాతి (16), కన్నడ(8), ఖాశీ(5), మలయాళం(5), మరాఠి(9), మిజో(5), నేపాలి(5), ఒరియా(20), పంజాబి(15), తమిళ్(1), తెలుగు(4), ఉర్దు(27)
అర్హత:
అసిస్టెంట్ కమిషనర్ పోస్టుకు పీజీ(హ్యుమానిటీస్/ సైన్స్/ కామర్స్) ఉత్తీర్ణులై ఉండాలి. గవర్నమెంట్/ సెమీ గవర్నమెం ట్/ అటానమస్ సంస్థల్లో కనీసం అయిదేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసిన వారికి, రీసెర్చ్ వర్క్ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ప్రిన్సిపాల్ పోస్టుకు కనీసం 50 శాతం మార్కులతో పీజీ, బిఇడి పూర్తిచేసి ఉండాలి. గవర్నమెంట్/ సెమీ గవర్న మెంట్/ అటానమస్/ సిబిఎస్‌ఇ సంస్థల్లో పనిచేసిన అను భవం ఉండాలి. వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసినవారికి పన్నెండేళ్లు పిజిటి/ మాస్టర్/ లెక్చరర్‌గా సర్వీస్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
పిజిటిలకు రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యు యేట్ ఎమ్మెస్సీ/ 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీ పూర్తి చేసి ఉండాలి. ఐటి విభాగానికి తప్ప మిగిలిన అన్ని విభాగాల పోస్టులకు బిఇడి ఉండాలి. హిందీ్క్ష ఇంగ్లీష్ భాషల్లో నైపుణ్యం ఉండాలి.
ఐటి విభాగానికి 50 శాతం మార్కులతో బిఇ/ బిటెక్/ ఎమ్మెస్సీ/ ఎంసిఏ/ బిఎస్సీ(కంప్యూటర్స్)/ బిసిఏ /పీజీ డిప్లొమా(కంప్యూటర్స్) పాసయితే సరిపోతుంది. టిజిటిగా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
టిజిటిలకు 50 శాతం మార్కులతో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులు/ 50 శాతం మార్కులతో సంబంధిత డిగ్రీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. బిఇడి పూర్తయి ఉండాలి. సిబిఎస్‌ఇ వారు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పాసై ఉండాలి. రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసిన అనుభవంతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం ఉండాలి.
మిసిలేనియస్ టీచర్ పోస్టులకు సంబంధిత విభాగంలో అయిదేళ్ల కోర్సు/ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్‌తోపాటు రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసిన అనుభవం ఉండాలి.
థర్డ్ లాంగ్వేజ్ టీచర్స్‌కు 50 శాతం మార్కులతో డిగ్రీ + బిఇడి పూర్తి చేసి ఉండాలి. సీటెట్ పాసై ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పరిజ్ఞానంతోపాటు వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి.
ఫిజిక్స్, మేథ్స్‌లో బిఎస్సీ (ఆనర్స్) చేసినవారు టిజిటి (మేథ్స్)పోస్టుకు, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్‌లో బిఏ (ఆనర్స్) చేసినవారు టిజిటి(సోషల్) పోస్టుకు అనర్హులు.
వయసు: జూలై 31 నాటికి అసిస్టెంట్ కమిషనర్స్ పోస్టుకు 45 ఏళ్లు మించరాదు. ప్రిన్సిపాల్స్‌కు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. పిజిటిలకు 40 ఏళ్లు, టిజిటిలు్క్ష మిసిలేనియస్ టీచర్లు్క్ష థర్డ్ లాంగ్వేజ్ టీచర్స్‌కు 35 ఏళ్లు మించరాదు. ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.
అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష ఫీజు వివరాలు
అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్ పోస్టులకు రూ.1500 పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. మిగిలిన పోస్టులన్నింటికీ రూ.1000 కడితే సరిపోతుంది.
రాత పరీక్ష వివరాలు
అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్ పోస్టులకు నిర్వహించే రాత పరీక్షలో మొత్తం అయిదు పార్టులు ఉంటాయి. అన్నింటికీ కలిపి 3 గంటల సమయం ఇస్తారు. మొత్తం మార్కులు 180. మొదటి నాలుగు పార్టుల్లో రీజనింగ్ ఎబిలిటీ నుంచి 20, జనరల్ అవేర్‌నెస్ నుంచి 40, లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 40(జనరల్ ఇంగ్లీష్ 20 + జనరల్ హిందీ 20), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. పార్టు 5లో అసిస్టెంట్ కమిషనర్ పోస్టుకు ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధిత ప్రశ్నలు 60 ఇస్తారు. అదే ప్రిన్సిపాల్ పోస్టుకు అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ ప్రొసీజర్/ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రశ్నలు వస్తాయి. మిగిలిన పోస్టులన్నింటికీ 200 మార్కులకుగాను జనరల్ పేపర్ ఉంటుంది. పరీక్ష సమయం రెండున్నర గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్‌చాయిస్ టైప్‌లో ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్‌్క్ష హిందీ నుంచి 40, జనరల్ అవేర్‌నెస్ నుంచి 30, జనరల్ ఇంటెలిజెన్స్‌్క్ష న్యూమరికల్ ఎబిలిటీ్క్ష రీజనింగ్ నుంచి 30, టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 20, సంబంధిత సబ్జెక్టు నుంచి 80 ప్రశ్నలు ఇస్తారు. అయితే పిజిటిలకు పీజీ స్థాయిలోను, టిజిటి తదితరులకు డిగ్రీ స్థాయిలోను ప్రశ్నలు ఇస్తారు. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.
పరీక్ష కేంద్రాలు
అసిస్టెంట్ కమిషనర్ ్క్ష ప్రిన్సిపాల్ పోస్టులకోసం రాత పరీక్షను ఢిల్లీలో నిర్వహిస్తారు. మిగిలిన పోస్టులకు దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నం నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో పూర్తిచేసిన దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని ఇటీవలి ఫొటో అతికించి జాగ్రత్త చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు సెప్టెంబరు 10 నాటి ఎంప్లాయిమెంట్ న్యూస్/ వెబ్‌సైట్ చూడవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 9
ఇ చలాన్ ద్వారా పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఆఖరుతేదీ: అక్టోబరు 14
రాత పరీక్ష: నవంబరు/డిసెంబరులో
వెబ్‌సైట్:
EmoticonEmoticon