Showing posts with label Today in History. Show all posts
Showing posts with label Today in History. Show all posts
Today in history Telugu 01.07.2023

Today in history Telugu 01.07.2023

Today in history Telugu 01.07.2023

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*



*🌅జూలై 1🌄*


*🏞సంఘటనలు🏞*


1857: భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది.

1904: మూడవ ఒలింపిక్ క్రీడలు సెయింట్ లూయీస్ లో ప్రారంభమయ్యాయి.

1909: భారత స్వాతంత్ర్యోద్యమము: 1909 జూలై 1 వతారీకున ఇండియన్ హౌస్ తో దగ్గరి సంబంధము కలిగిన మదన లాల్ ధిన్‌గ్రా అనే భారతీయ విద్యార్థివిలియమ్ హట్ కర్జన్ అనే బ్రిటీష్ పార్లమెంటు ప్రతినిధిని కాల్చిచంపాడు

1949: ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారత దేశపు పార్లమెంటు, ఈ రోజు న 1949 లో ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఛట్టం చేసింది. అందుకోసం, భారతదేశంలోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఏ.ఐ), ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ అందరూ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ డేని జరుపుకుంటున్నారు.

1949: కొచిన్, ట్రావెన్కోర్ అనే రెండు సంస్థానాలను కలిపి తిరు-కోచి రాష్ట్రంగా (తరువాత ఈ రాష్ట్రాన్ని కేరళ రాష్ట్రంగా పునర్వవస్తీకరించారు) భారత దేశంలో కలిపి వేసారు. అంతటితో, 1000 సంవత్సరాలుగా పాలిస్తున్న, కొచిన్ రాజకుటుంబం పాలన అంతమయ్యింది.

1955: భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.

1960: ఆంధ్రజ్యోతి దినపత్రిక విజయవాడ నుంచి ప్రారంభించబడింది.

1957: ప్రపంచ భూ భౌతిక సంవత్సరంగా 1957 సంవత్సరాన్ని, యునైటెడ్ నేషన్స్ ప్రకటించింది

1960: ఘనా రిపబ్లిక్ దినోత్సవం.

1962: బురుండి, రువాండా దేశాలకు స్వాతంత్ర్యము లభించింది.

1963: అమెరికాలోని తపాలా కార్యాలయాలు 5 అంకెలు గల జిప్ కోడ్‌ను (జోనల్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్) ప్రవేశపెట్టాయి.

1990: జనరల్ ఎస్.ఎఫ్. రోడ్రిగ్స్ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

1993: జనరల్ బి.సి.జోషి భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.

1997: బ్రిటన్ 156 సంవత్సరాల బ్రిటిష్ వలస అయిన 'హాంకాంగ్ ' ని చైనాకు తిరిగి ఇచ్చింది.

2002: సోమాలియా స్వాతంత్ర్య దినం.

2008: ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది.


*🌻🌻జననాలు🌻🌻*


1646: గాట్‌ఫ్రీడ్ లైబ్నిజ్ జర్మన్ బహుముఖ ప్రజ్ఞాశాలి, తత్త్వవేత్త. కలన గణితంలో అనేక ఆవిష్కరణలు చేశాడు. (మ.1716)

1882: బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన వైద్యులు. (మ.1962)

1904: పి. చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరు. (మ.1976)

1905: రాప్తాటి ఓబిరెడ్డి, అజ్ఞాతకవి.

1909: ఇంటూరి వెంకటేశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు. (మ.2002)

*1911: సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (మ.2002)*

1912: కె.వి.రెడ్డి, ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత, రచయిత. (మ.1972)

1913: కొత్త రాజబాపయ్య, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్ర విద్యాసలహా సంఘం సభ్యుడు. (మ.1964)

1916: షేక్ దావూద్, కవి, విద్వాంసుడు. (మ.1994)

1919: టి.ఎన్.విశ్వనాథరెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు.

1923: కె.సభా, కథా రచయిత, నవలాకారుడు, కవి, గేయకర్త, బాలసాహిత్య నిర్మాత, సంపాదకుడు, జానపద గేయ సంకలనకర్త, ప్రచురణకర్త. (మ.1980)

1926: తూమాటి దొణప్ప, ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యులు, తెలుగు విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉప కులపతి. (మ.1996)

1927: బొడ్డుపల్లి పురుషోత్తం, రచయిత, తెలుగు ఆచార్యుడు.

1928: వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, ‘హిందీ చందమామ‘ సంపాదకుడు. (మ.2015)

1929: ఏ.ఎం. రాజా, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (మ.1989)

1930: కుమ్మరి మాస్టారు, బుర్రకథ కళాకారులు. (మ.1997)

1931: యస్.రాజన్నకవి, రంగస్థల నటుడు.

1933: దరియా హుస్సేన్‌ షేక్‌, అనంతపురం రాయలకళాగోష్ఠి కార్యదర్శి

1934: వంగపండు అప్పలస్వామి, తెలుగు కవి, రచయిత.

1937: పడాల బాలకోటయ్య, రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (మ.2015)

1939: కొలకలూరి ఇనాక్, ఆధునిక సాహిత్య ప్రక్రియలో అన్ని రుచులనూ చవిచూచిన నేర్పరి. వేల మందికి విద్యాదానం చేసిన ఉపకులపతి

1941: డి.కె.ఆదికేశవులు, చిత్తూరు లోక్‌సభ సభ్యులు.

1946: కల్లూరు రాఘవేంద్రరావు, కథారచయిత, బాలసాహిత్యవేత్త.

1946: శాంతి నారాయణ కథారచయిత, అవధాని.

1946: అర్నాద్, అర్నాద్ గా పేరొందిన చెందిన దుంప హరనాథరెడ్డి తెలుగు నవలా రచయిత. 50 కి పైగా రచనలు చేసాడు.

1949: వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు.

1950: గుడిమెట్ల చెన్నయ్య, తెలుగు రచయిత.

1955: పాలగిరి రామక్రిష్ణా రెడ్డి, నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనెలను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు.

1960: అనురాధా నిప్పాణి, రంగస్థల నటి, దర్శకురాలు, రచయిత.

1961: ప్రిన్సెస్ డయానా (వేల్స్ యువరాజు ఛార్లెస్ భార్య), నార్ ఫ్లోక్ (ఇంగ్లాండు) లోని సాండ్రిన్గాం(మ.1997).

1963: ఎస్.ఎం. బాషా, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు.

1986: సితార: భారతీయ సినీ నేపథ్య గాయిని.


*🌹🌹మరణాలు🌹🌹*


1839:మహముద్ II ఒట్టొమాన్ సుల్తాన్, సంస్కర్త, పాశ్చాత్యీకరణ చేసిన వాడు. (జ.1785)

1962: బి.సి.రాయ్, భారత రత్న గ్రహీతలైన ప్రముఖ వైద్యులు. (జ.1882)

1966: దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆధునిక తెలుగుకవి. (జ.1921)

1991: పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (జ.1917)

1992: తాతినేని ప్రకాశరావు, తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకులు. (జ.1924)

2002: కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (జ.1906)

2006: కొరటాల సత్యనారాయణ,ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలలో ముఖ్యుడు. (జ.1923).


*🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷*


🔻జాతీయ వైద్యుల దినోత్సవం - బి.సి.రాయ్ జయంతి, వర్ధంతి దినం.

🔻ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం (భారత దేశంలో)

🔻వాస్తు దినోత్సవం.

🔻ప్రపంచ వ్యవసాయ దినోత్సవం.

Today in History in Telugu - 8th October

🌎 *చరిత్రలో ఈ రోజు*

👉 *08 అక్టోబర్  2020*

👉 *గురువారం* 

👉 *సంవత్సరములో 282వ రోజు 41వ వారం*

👉 *సంవత్సరాంతమునకు ఇంకా 84 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*

〰〰〰〰〰〰〰〰

   _గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మాహార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్ర. చరిత్ర అంటే అనేక సంఘటనల సమహారం...అనేక మార్పులకు ...ప్రగతికి..పోరాటాలకు.. పరిణామ క్రమానికి..మంచి చెడులకు సాక్ష్యం.. అలాంటి సంఘటనలెన్నో...మార్పులెన్నో మానవాళి పరిణామ క్రమంలో ఆ వివరాలు మీకోసం అందిస్తున్న సమాచారం.._

〰〰〰〰〰〰〰〰

_అక్టోబరు (October), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో పదవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.అక్టోబరు నెలలో గాంధీ జయంతి వంటి మరిన్ని ప్రత్యేక రోజులతో ముడుపడి ఉంటుంది.ఈ మాసంలో శరదృతువు జరిగే కాలంలో అక్టోబరు రెండవ నెల. పండుగలు, కాలానుగుణ సంఘటనలు వంటి సందర్భాలను గుర్తించే ముఖ్యమైన రోజులు అక్టోబరు‌లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఈ నెలలో ఉన్నాయి._

〰〰〰〰〰〰〰〰

🔴 *ప్రత్యేక  దినాలు*

🚩 *భారత వైమానిక దళం వ్యవస్థాపక దినోత్సవం*

1932 అక్టోబరు 8 న భారత వైమానిక దళం అనేక యుద్ధాలు, మిషన్లలో పాల్గొంది. అందువల్ల అక్టోబర్ 8 ను భారత వైమానిక దళం వార్షికోత్సవంగా జరుపుకుంటారు.ప్రతి సంవత్సరం ఐ.ఎ.ఎఫ్. ముందుగానే ఈ రోజుకు ప్లాన్ చేస్తుంది.

తనకు అవసరమైన సిబ్బందికి అధునాతన శిక్షణ ఇచ్చుకోవడంలోను, అధునాతన యంత్రసామాగ్రిని సమకూర్చుకోవడంలోను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ముందంజలో ఉండటమే కాకుండా.. ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. 1932 అక్టోబరు ఎనిమిదో తేదీన స్థాపితమైనప్పటికీ.. భారత వైమానిక దళంలోకి తొలి ఎయిర్‌క్రాఫ్ట్‌ను 1933 ఏప్రిల్ ఒకటో తేదీన వచ్చి చేరింది. ఆరంభంలో కేవలం ఐదు మంది పైలట్స్, ఒక ఆర్‌ఏఎఫ్‌ను కలిగివున్నది.

భారత రక్షణ వ్యవస్థలో మూడు రక్షణ దళాలు ఉన్నాయి. అవి : సైనిక, వైమానిక, నావికా దళాలు. ఈ రక్షణ దళాలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆధీనంలో ఉంటాయి. వీటి ప్రధాన కార్యాలయాలు న్యూడిల్లీలో ఉన్నాయి. బ్రిటీష్‌ కాలంలో 1932 అక్టోబర్‌ 8న వైమానిక దళం ఏర్పడింది. ఈ దళం రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గంది. దేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత 'భారత వైమానిక దళం' (ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌) ఏర్పడింది. 1.70 లక్షల మంది సిబ్బందితో, 1300 విమానాలతో భారత వైమానిక దళం ప్రపంచంలోనే నాలుగో పెద్ద వైమానిక దళంగా ప్రసిద్ధి పొందింది. వైమానిక దళం సేవలను గుర్తిస్తూ ఏటా అక్టోబర్‌ 8న భారత వైమానిక దళ దినోత్సవం నిర్వహిస్తారు.

1933 ఏప్రిల్‌ 1న భారత వైమానిక ఎయిర్‌ క్రాఫ్ట్‌ వచ్చింది. హరీష్‌ చంద్ర సిర్కార్‌, సుబ్రతో ముఖర్జీ, భూపేంద్ర సింగ్‌, అజాద్‌ భక్షా అవాన్‌, అమర్జీత్‌ సింగ్‌ మన తొలి వైమానిక దళ పైలట్లు. వీరు రెండో ప్రపపంచ యుద్ధంలో విధులు నిర్వహించారు. తర్వాత సుబ్రతో ముఖర్జీ తొలి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. సైన్యానికి అధునాతన శిక్షణ ఇవ్వడంలో, అధునాతన యుద్ధ సామగ్రిని సమకూర్చుకోవడంలో భారత వైమానిక దళం ముందుంది. ఈ దళం నిత్యం మన దేశ తీర ప్రాంతానికి గస్తీ కాస్తూ ఉంటుంది.

🚩 *రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ దినోత్సవం.*

〰〰〰〰〰〰〰〰

🏀 *సంఘటనలు*

✴1932: భారతీయ వైమానిక దళం ఏర్పాటయింది.

✴1993: దక్షిణాఫ్రికాలో జాతివివక్ష అంతమవడంతో దానిపై విధించిన ఆంక్షలను ఐక్యరాజ్యసమితి ఎత్తివేసింది.

✴2009: 2009 అక్టోబరు 8న, ఒబామా మాథ్యూ, షెపర్డ్, జేమ్స్ బైర్డ్, Jr. హేట్ ప్రతీకార నేరాల నిరోధక చట్టంపై సంతకం చేశారు

〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*

❇1860: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు.(మ.1933)

❇1891: భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత, నాటక కర్త. (మ.1940)

❇1895: అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. (మ.1952)

❇1902: వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ ఉపకులపతి (మ.1961).

❇1918: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (మ.2006)

❇1918: బత్తుల సుమిత్రాదేవి, హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు. (మ.1980)

❇1935: ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, వైద్యుడు. (మ.1997)

❇1935: భారత క్రీడాకారుడు మిల్ఖా సింగ్ జననం.

❇1950: చివుకుల ఉపేంద్ర, అమెరికా లోని ఫ్రాంక్లిన్‌టౌన్‌షిప్‌కు డెప్యూటీ మేయర్‌గా, 2000లో మేయర్‌గా, న్యూజెర్సీ శాసనసభ్యుడుగా, శాసనసభకు ఉపసభాపతి.

❇1977: మంచు లక్ష్మి, భారతీయ సినీ, టెలివిజన్ నటి, నిర్మాత,

❇1981: దాసరి మారుతి, తెలుగు సినీ దర్శకుడు.

❇1981: భారతీయ సినిమా నటి వేద శాస్త్రి జననం.

〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*

◾1936: ప్రేమ్‌చంద్, భారతదేశపు హిందీ, ఉర్దూ కవి. (జ.1880)

◾1963: సి.యస్.ఆర్. ఆంజనేయులు, ( చిలకలపూడి సీతారామాంజనేయులు) తెలుగు సినిమా నటుడు. (జ.1907)

◾1976: కందుకూరి రామభద్రరావు, తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. (జ.1905)

◾1979 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మరణం (జ.1902).

◾2008: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త సంఘ సేవకురాలు, చిత్రకారిణి. (జ.1917) 🙏🏻




Today in History in Telugu - 4th October

Today in History in Telugu - 4th October

 *చరిత్రలో ఈ రోజు అక్టోబర్/ 4🌏*


*🔎సంఘటనలు🔍*



🌾1934: అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది.


*🌹జననాలు🌹*


💞1911: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (మ.1998)


💞1912: కుంకలగుంట సైదులు, మద్రాసు, విజయవాడ ఆకాశవాణిలో నాదస్వరవిద్వాంసుడు.


💞1920: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, హేతువాది, వామపక్షవాది. (మ.2013)


💞1957: గాజుల సత్యనారాయణ, తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష రచయిత.


💞1977: సంఘవి, కన్నడ, తెలుగు సినిమా నటి.


*💐మరణాలు💐*


🌺1904 : ఫ్రెడెరిక్ ఆగస్టు బార్తోల్డి, అమెరికా దేశంలో ఉన్న స్టేట్యు ఆప్ లిబర్టీ శిల్పి, ప్రాన్స్ లో బెల్ఫోర్ట్ లో చెక్కిన సింహం విగ్రహము విగ్రహ శిల్పి (జ.1834) .


🌺1947: మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1858)


🌺2015: ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (జ.1934)


*🇮🇳పండుగలు , జాతీయ దినాలు🇮🇳*


*🥀అంతర్జాతీయ జంతు దినోత్సవం*.


*🥀ప్రపంచ అంతరిక్ష వారం.*

Today in History in Telugu - 1st October

Today in History in Telugu - 1st October

 *చరిత్రలో ఈ రోజు అక్టోబర్ /1🌏*


*🔎సంఘటనలు 🔍*


🌾1953: కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ.


🌾1958: భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, తూనికలు కొలతలకు 1 అక్టోబర్ 1958 న ప్రవేశ పెట్టారు. డబ్బు, కానీ, అర్ధణా, అణా, బేడ అన్న 'డబ్బు', 'రూపాయి' లను 1 ఏప్రిల్ 1957 నుంచి నయాపైసలు, పైసలు, ఐదు పైసలు, పదిపైసలు అన్న దశాంశ పద్ధతిని ప్రవేశ పెట్టారు. 1793: ద్రవ్యరాశి మెట్రిక్ పద్ధతి (కొలమానం (యూనిట్) ) లోని ద్రవ్యరాశి (బరువు) ని కొలిచే, మనం కె.జి అని పిలిచే కిలోగ్రామ్ ని, ఫ్రాన్స్ లో ప్రవేశపెట్టారు.


🌾1982 తొలి CD ప్లేయర్ ను సోని లాంచ్ చేసింది.


🌾1984 : బజరంగ్ దళ్ అనేది ఒక హిందూ మత సంస్థ. బజరంగ్ దళ్ స్థాపన.


🌾1997: జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.


🌾2000: జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం

.

*❤️జననాలు❤️*


💞1847: అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (మ.1933)


💞1862: రఘుపతి వేంకటరత్నం నాయుడు, విద్యావేత్త, సంఘసంస్కర్త. (మ.1939)


💞1890: అంకితం వెంకట భానోజీరావు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కింగ్ జార్జి ఆసుపత్రుల నిర్మాణానికి భూమిని దానం చేసిన వితరణశీలి.


💞1908: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974)


💞1915: కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (మ.2013)


💞1921: తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (మ.1974)


💞1922: అల్లు రామలింగయ్య, హాస్య నటుడు. (మ.2004)


💞1934: భువన్ చంద్ర ఖండూరి, భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకుడు, ప్రస్తుత ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి.


💞1934: చేకూరి రామారావు, తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, భాషా శాస్త్రవేత్త. (మ.2014)


💞1939: ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (మ.2015)


💞1942: బోయ జంగయ్య, రచయిత. (మ.2016)


💞1951: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (మ.2002)


💞1961: నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు


💞1901: ప్రతాప్ సింగ్ ఖైరాన్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి.


*💐మరణాలు💐*


🍁1939: వెన్నెలకంటి సుబ్బారావు, ఆంగ్లంలో తొలి స్వీయచరిత్ర కర్త. (జ.1784)


🍁1946: గూడవల్లి రామబ్రహ్మం, సినిమా దర్శకులు, సంపాదకులు. (జ.1902)


🍁1975: ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (జ.1912)


🍁1979: పి.వి.రాజమన్నార్, న్యాయవాది, పండితుడు, భారత రాజకీయనాయకుడు. (జ.1901)


*🇮🇳పండుగలు , జాతీయ దినాలు🇮🇳*


*🥀అంతర్జాతీయ శాకాహార దినోత్సవం*


*🥀: ప్రపంచ వృద్ధుల దినోత్సవం* .


*🥀: జాతీయ రక్తదాన దినోత్సవం.*


*🥀సైప్రస్, నైజీరియా, తువాలు, పలౌ స్వాతంత్య్ర దినోత్సవం.*


*🥀ప్రపంచ ఆవాస దినోత్సవం*.


*🥀స్వచ్ఛంద రక్తదాన దినం*.


*🥀అంతర్జాతీయ సంగీత దినం*.

Today in History in Telugu - 23rd September

🌎 *చరిత్రలో ఈ రోజు*

23rd September 

👉 *సంవత్సరములో 267వ రోజు 39వ వారం*

👉 *సంవత్సరాంతమునకు ఇంకా 99 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*

〰〰〰〰〰〰〰〰

   _గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మాహార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్ర. చరిత్ర అంటే అనేక సంఘటనల సమహారం...అనేక మార్పులకు ...ప్రగతికి..పోరాటాలకు.. పరిణామ క్రమానికి..మంచి చెడులకు సాక్ష్యం.. అలాంటి సంఘటనలెన్నో...మార్పులెన్నో మానవాళి పరిణామ క్రమంలో ఆ వివరాలు మీకోసం అందిస్తున్న సమాచారం.._

〰〰〰〰〰〰〰〰

🔴 *ప్రత్యేక  దినాలు*

🚩 *.....

〰〰〰〰〰〰〰〰

🏀 *సంఘటనలు*

✴2009: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి ఓషన్ శాట్-2, మరో 6 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.

✴2009 నుంచి, HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్‌' గా EDS మార్కెట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది.

〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*

❇1886: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (మ.1966)

❇1893: బులుసు అప్పన్నశాస్త్రి, తర్కశాస్త్ర పారంగతులు.

❇1902: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (మ.1971)

❇1914: ఒమర్ అలీ సైఫుద్దీన్ 3, బ్రూనై దేశపు 28వ సుల్తాన్. (మ.1986)

❇1917: అసీమా చటర్జీ, భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006)

❇1922: ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (మ.1987)

❇1926: బాచు అచ్యుతరామయ్య రంగస్థల నటుడు, రాజకీయ నాయకుడు, క్రీడాకారుడు. (మ.2018)

❇1934: పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. (మ.2008)

❇1939: కందుల వరాహ నరసింహ శర్మ, రచయిత.

❇1943: తనుజ, ఒక భారతీయ నటి

❇1949: ఒక అమెరికన్ గాయకుడు-గీతరచయిత బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్ జననం.

❇1972: కోరుకంటి చందర్ తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు.

❇1985: అంబటి రాయుడు, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.

❇1987: భారతీయ గాయకుడు రాహుల్ వైద్య జననం.

〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*

◾1939: సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1856)

◾1973: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1904)

◾1974: జయచామరాజ వడయార్‌ బహదూర్‌, మైసూర్‌ సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919)

◾1996: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి. (జ.1960)

◾2010: కె.బి. తిలక్, స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (జ.1926)

◾2010: భావరాజు సర్వేశ్వరరావు, భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త. (జ.1915)🙏




Today in History in Telugu - 19th September

*_♦UTF👊KAKINADA👍CITY♦_*
<><><><><><><><><><><><>
🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *19 సెప్టెంబర్  2020*
👉 *శనివారo*
👉 *సంవత్సరములో 263వ రోజు 38వ వారం*
👉 *సంవత్సరాంతమునకు ఇంకా 103 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*
〰〰〰〰〰〰〰〰
   _గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మాహార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్ర. చరిత్ర అంటే అనేక సంఘటనల సమహారం...అనేక మార్పులకు ...ప్రగతికి..పోరాటాలకు.. పరిణామ క్రమానికి..మంచి చెడులకు సాక్ష్యం.. అలాంటి సంఘటనలెన్నో...మార్పులెన్నో మానవాళి పరిణామ క్రమంలో ఆ వివరాలు మీకోసం అందిస్తున్న సమాచారం.._
〰〰〰〰〰〰〰〰
🔴 *ప్రత్యేక  దినాలు*
🚩 *తెలుగు మాధ్యమాల దినోత్సవం*
[తెలుగు మాధ్యమాలలో వాడుక భాషను విజయవంతంగా ప్రవేశపెట్టిన తాపీ ధర్మారావు గుర్తుగా ఆయన జన్మదినం రోజున ఈ దినోత్సవం జరుపబడుతుంది. ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా, న్యూ మీడియా, పత్రికలు, రేడియో, టెలివిజన్, ఫేస్‌బుక్ మొదలైనవి మాధ్యమాలుగా ఉన్నాయి. దేశంలో మరే భాషలో లేనన్ని వార్తాఛానళ్లు, పత్రికలు తెలుగులో ఉన్నాయి. తెలుగు భాషా పండితుడు తాపీ ధర్మారావు ప్రజల భాషను గౌరవించి తొలిసారిగా 1936లో 'జనవాణి' పత్రికలో వాడుక భాషను ప్రవేశపెట్టాడు. ఆ తరువాత అనేకమంది సంపాదకులు ఈ విధానాన్ని కొనసాగిస్తూవచ్చారు. గ్రాంధిక భాషకాకుండా ప్రజలు ఉపయోగించే వాడుక భాషను వివిధ మాధ్యమాలలో వాడుతూ వారికి అవసరమైన విషయాలను అందించడం లక్ష్యం. తాపీ ధర్మారావు గారు తెలుగువారినుద్దేశించి – ‘‘అందరికి తెలియు మాటలు వందలు గద మారు బాస వాగగనేలా అందమ్మనియా, వీనుల విందనియా దాస్యమెంత వెర్రిదిరా… నీ భావము నీ జాతికి నీ భాషను చెప్పలేక నీల్గెదవు…’’ అని హెచ్చరించాడు. తెలుగు భాషకు ప్రత్యేకించి వ్యావహారిక భాషకు ఎంతో సేవచేసిన ఈ మహనీయుడు 8-5-1973 న మరణించాడు.]
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴....
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇1887: తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. (మ.1973)
❇1905: చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్, భాగవతార్ సుప్రసిద్ధ హరికథా కళాకారుడు, రంగస్థల, సినిమా నటుడు.
❇1911: బోయి భీమన్న, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, పద్మభూషణ పురస్కార గ్రహీత. (మ.2005)
❇1924: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ.2010)
❇1929: బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (మ.2002)
❇1935: మౌలానా అబ్దుల్‌ రహీం ఖురేషీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడు. రాముడు అయోధ్యలో కాదు, పాకిస్థాన్‌లో పుట్టినట్లుగా ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించాడు. (మ.2016)
❇1965: సునీతా విలియమ్స్, యునైటెడ్ స్టేట్స్ నావికాదళ అధికారిణి, నాసా వ్యోమగామి.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾1719: రెండవ షాజహాన్, 11వ మొఘల్ చక్రవర్తి.(జ.1698)
◾1965: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (జ. 1900) .
◾2014: ఉప్పలపు శ్రీనివాస్, మాండలిన్ విద్వాంసుడు. (జ.1969)
◾2015: నడిచే గణితవిజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన ఆచార్య నల్లాన్ చక్రవర్తుల పట్టాభిరామాచార్యులు, తన 82వ ఏట, వరంగల్లులో చనిపోయాడు. (చూ. సాక్షి, తే.21-9-2015) ఆయన వరంగల్లు లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి.) లో గణిత ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు (జ.1933).🙏🏻



Today in History in Telugu - 10th April

*🌍చరిత్రలో ఈ రోజు/*
*2020 ఏప్రిల్ 10📝*

🔴 *ప్రత్యేక  దినాలు*

🚩 *ప్రపంచ హోమియోపతి దినోత్సవం💈*
[హోమియోపతి వైద్యవిధానాన్ని కనిపెట్టిన క్రిస్టియన్ ఫ్రెడెరిక్ శామ్యూల్ హానిమాన్ జననం]

🚩 *అంతర్జాతీయ తోబుట్టువుల రోజు👨‍👨‍👧‍👦*
చక్కని అనుబంధానికి నిదర్శనం
అన్నా చెల్లెలు - అక్కా తమ్ముడు
రక్త సంబంధంతో ఒక్కటై
కడవరకూ వీడని నీడలా
ప్రేమతో మెలిగే వారందరికీ
అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవ శుభాకాంక్షలు

🚩 *గుడ్ ఫ్రైడే*
నాయందు విశ్వాస ముంచు ప్రతివారూ చీకటిలో నిలిచి యుండకుండా యుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి యున్నాను.

*✝️మీకు మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.*
💐💐💐

*📚సంఘటనలు🔍*

✴1857 : భారత మెదటి స్వాతంత్ర్య యుద్ధం మీరట్‌లో మెదలయ్యింది

✴1953: వార్నెర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3-D చిత్రం అమెరికన్ స్టుడియోలో ప్రదర్శింపబడింది. ఆచిత్రం పేరు House of Wax.

 *❣️జననాలు❣️*

❇1755: హోమియోపతి వైద్యవిధానాన్ని కనిపెట్టిన క్రిస్టియన్ ఫ్రెడెరిక్ శామ్యూల్ హానిమాన్ జననం (మ.1843).

❇1880: సి.వై.చింతామణి, పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయుడు, ఉదారవాద రాజకీయ నాయకుడు (మ.1941).

❇1894: ఘనశ్యాం దాస్ బిర్లా, భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని (మ. 1983).

❇1898: ప్రముఖ హేతువాది ఎ.టి.కోవూర్ జననం (మ.1978).

❇1932: ప్రముఖ భారతీయ హిందుస్తానీ సంగీత విద్వాంసురాలు కిషోరీ అమోంకర్ జననం.

❇1932: ఓమర్ షరీఫ్, హాలీవుడ్ నటుడు. ఈజిప్ట్ దేశం లోని అలెగాండ్రియాలో పుట్టాడు. ఇతడి అసలు పేరు 'మైకేల్ షాలౌబ్' (మ.2015).

❇1952: స్టీవెన్ సీగల్, అమెరికా యాక్షన్ చలన చిత్ర నటుడు, నిర్మాత, రచయిత, యుద్ధ కళాకారుడు, గిటారు వాద్యకారుడు

❇1993: అరుణాంక్.ఎలుకటూరి జననం.

❇1941: మణి శంకర్ అయ్యర్, ఒక మాజీ భారత దౌత్యవేత్త

❇1952:  నారాయణ్‌ రాణె, మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి

 *🌹మరణాలు🌹*

◾1813: సుప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రజ్ఞుడు జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ మరణం (జ.1736).

◾1995: భారత స్వాతంత్య్ర సమర యోధుడు, భారత మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయి మరణం (జ.1896).

◾1997: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు (జ. 1920)

◾1998: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (జ.1914)🙏🏻


Today in History in Telugu - 30th March

Today in History in Telugu - 30th March

🔳చరిత్రలో ఈ రోజు/మార్చి 30

1842 : ఈథర్ ను మత్తుమందుగా అమెరికన్ శస్త్రవైద్యుడు డా. క్రాఫోర్డ్ లాంగ్ మొదటిసారిగా ఉపయోగించాడు.

1867 : అలాస్కా ను రష్యా నుండి అమెరికా కొనుగోలు చేసింది.

1908 : సుప్రసిద్ధ భారతీయ నటి మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దేవికారాణి జననం (మ.1994).

1935 : ప్రముఖ తెలుగు సాహితీకారుడు తంగిరాల వెంకట సుబ్బారావు జననం.

1953 : ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు జమలాపురం కేశవరావు మరణం (జ.1908).

1983 : ప్రముఖ భారతీయ నటుడు నితిన్ జననం.

2002 : ప్రముఖ హిందీ సినీ గీత రచయిత ఆనంద్ బక్షీ మరణం (జ. 1930)

2005 : భారత దేశ రచయిత, కార్టూనిస్ట్ ఓ.వి.విజయన్ మరణం (జననం.1930).

2011 : ప్రఖ్యాత తెలుగు సినిమా హాస్యనటుడు మరియు ప్రతినాయకుడు నూతన్ ప్రసాద్ మరణం (జ.1945).
Today in History in Telugu - 26th March

Today in History in Telugu - 26th March

🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *26 మార్చి, 2020*
👉 *గురువారం*
👉 *సంవత్సరములో 86వ రోజు 13వ వారం*
👉 *సంవత్సరాంతమునకు ఇంకా 280 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*
〰〰〰〰〰〰〰〰
🔴 *ప్రత్యేక  దినాలు*
🚩 *బంగ్లాదేశ్ స్వాతంత్య్ర దినోత్సవం.*
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴1971: పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్గా అవతరించింది. (బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం)
✴1977: భారత లోక్ సభ స్పీకర్గా నీలం సంజీవరెడ్డి పదవి స్వీకారం.
✴2000: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఎన్నికయ్యాడు.
✴2008: భూటాన్లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇1872: దివాకర్ల తిరుపతి శాస్త్రి, వంద సంస్కృత, తెలుగు గ్రంథాలు, నాటకములు, అనువాదాలు వ్రాశారు/[మ. 1920]
❇1875: మాక్స్ అబ్రహమ్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త. (మరణం. 1922) .
❇1912: పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయితగా ప్రసిద్ధిగాంచాడు, ఆంధ్రప్రభ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్‌గా, ఈ పత్రికలతో పాటుగా గోభూమి, క్రాంతి, సంజయ, ప్రజాప్రభ వారపత్రిక, Pedestrian పత్రికలలో సంపాదకునిగా పనిచేశాడు
❇1933: ఆచార్య కుబేర్ నాథ్ రాయ్, ప్రముఖ రచయిత.
❇1965: ప్రకాష్ రాజ్, దక్షిణ భారతదేశానికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾1797: జేమ్స్ హట్టన్ స్కాటిష్ తత్వవేత్త, ప్రముఖ ప్రకృతి ప్రియుడు (జ.1726)
◾2006: అనిల్ బిశ్వాస్, ప్రముఖ రాజకీయవేత్త (పశ్చిమ బెంగాల్ సి.పి.యం రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు. (జ.1944)
◾2006: దుక్కిపాటి మధుసూదనరావు, తెలుగు సినీ నిర్మాత. (జ.1917)
◾2016: పూసపాటి ఆనంద గజపతి రాజు, విజయనగరం పూసపాటి రాజవంశీయుడు, మాజీ మంత్రి. (జ.1950) 🙏🏻
Today in History in Telugu - 24th March

Today in History in Telugu - 24th March


*🌏చరిత్రలో ఈరోజు మార్చి 24🌏*

*🔍సంఘటనలు🔎*

🌸1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.

🌸1896 చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.

🌸1977: భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పదవీ విరమణ.

🌸1977: భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.

🌸1997: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎ.జె.ఎం. అహ్మది పదవీ విరమణ.

🌸1998: భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.

🌸1998: పశ్చిమ బెంగాల్లో దంతన్ ప్రాంతంలో భయంకర టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజల మరణం.3000 మంది గాయపడ్డారు.

🌸2008: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్థిక శాఖామంత్రికి సమర్పించింది.

*❣జననాలు❣*

🏵1775: ముత్తుస్వామి దీక్షితులు, భారత దేశానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, వాగ్గేయకారుడు. (మ.1835)

🏵1914: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు.

🏵1984: ఆడ్రియన్ డీసౌజా, భారత హాకీ క్రీడాకారుడు.

*💐మరణాలు💐*

🦠1603: ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I, ఇంగ్లాండు మహారాణి. (జ.1533)

🦠1963: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది.

🦠2016: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.1950)

🦠2017: గ్రంధి సుబ్బారావు వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి ద్వారా సుప్రసిద్ధుడు.

*🇮🇳జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు🌏*

*🌏ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం*

Today in History in Telugu - 23rd March

Today in History in Telugu - 23rd March



*🌏చరిత్రలో ఈరోజు మార్చి 23🌏*

*🔍సంఘటనలు🔍*

🏵1931 : భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన భగత్ సింగ్ (జ. 1907, రాజ్‌గురు (జ. 1908), సుఖ్‌దేవ్ (జ. 1907) లు ఉరి తీయబడ్డారు. వారి మరణాలకు గుర్తుగా ఆ రోజు అమరవీరుల దినొత్సవంగా గుర్తిస్తారు.

🏵1942 : రెండవ ప్రపంచ యుద్ధంలో హిందూ మహాసముద్రములో అండమాన్ దీవులను జపనీయులు ఆక్రమించుకున్నారు.

🏵1956 : ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది. (పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం)

*❣జననాలు❣*

🌸1749 : ప్రముఖ ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త పియర్ సైమన్ లాప్లేస్ (మ.1827)

🌸1893 : భారత దేశ ప్రముఖ ఆవిష్కర్త, ఇంజనీర్ జి.డి.నాయుడు (మరణం:1974)

🌸1910: ప్రముఖ సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త రామమనోహర్ లోహియా

🌸1934: కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (మ.2018)

🌸1950: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.2016)

🌸1953: అశోక్ దాస్, భారతీయ అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త.

🌸1968: మేకా శ్రీకాంత్, ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకడు

*💐మరణాలు💐*

▪1931: భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1907)

▪1931: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు, భగత్ సింగ్ సహచరుడు. (జ.1907)

▪1931: రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (జ.1908)

▪1992: ఫ్రెడరిక్ హేయక్, ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత.

▪2015: లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా ప్రసిద్ధుడు. (జ.1923)

*🌏జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🇮🇳*

🌏 ప్రపంచ వాతావరణ దినోత్సవం.

🌟 అమర వీరుల దినోత్సవం.

  
Today in History in Telugu - 22nd March

Today in History in Telugu - 22nd March

🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *22 మార్చి, 2020*
👉 *ఆదివారం*
👉 *సంవత్సరములో 82వ రోజు 12వ వారం*
👉 *సంవత్సరాంతమునకు ఇంకా 284 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*
〰〰〰〰〰〰〰〰
🔴 *ప్రత్యేక  దినాలు*
🚩 *జనతా కర్ఫ్యూ*
[ఇది మన కోసం. మన దేశ ప్రజల క్షేమం కోసం. అందరం భాగస్వాములౌదాం.
ముందు పాటించి చూద్దాం. తరువాత ఫలితాల ఫలితాల కోసం బేరీజు వేద్దాం. మనం అనుకున్నంత ఫలితం లేకపోయినా పాటించడంలో తప్పులేదు. మరచిపోకండి ఇది మన కోసం మన అందరికోసం.]
🚩 *ప్రపంచ జల దినోత్సవం*
[సాధారణ ప్రజలకు అవగాహనరేకెత్తించేందు కోసం, నీటి ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఆ మొత్తం రోజంతా ప్రజలు వారి కుళాయిలను ఉపయోగించకుండా ఉండేందు కోసం ప్రోత్సహపడింది.
"ప్రాణకోటికి   జీవనాధారం   జలం. అలాంటి జలాన్ని కాపాడి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మన ముందుంది."
నీళ్ల గురించి చెప్పమంటే మంచినీళ్లు తాగినంత ఈజీగా చెప్పొచ్చు అని అనుకుంటున్నారా?... ఆగండాగండి.
జీవ మనుగడకు ఆధారమైన నీటి గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి గురించి మరికొంత తెలుసుకుందాం.
రంగు, రుచి, వాసన లేని పదార్థం నీరు అనే విషయం మనకు తెలిసిందే.
అయితే, అన్ని పదార్థాల మాదిరిగా సాధారణ రసాయిన నిమయాలను నీళ్లు పాటించవు.
ఆ విరుద్ధ స్వభావం వల్లే భూమ్మీద జీవ మనుగడ సాధ్యం అయింది.
మన భూగోళం మీద నీరు మొదట వాయురూపంలో ఉండేది.
తేలికైన ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులతో అది రూపొందింది.
శీతలీకరిస్తే అన్ని రసాయన పదార్థాల మాదిరిగా కాకుండా నీరు విస్తరిస్తుంది. అందువల్లే మంచుగడ్డలు నీటిపై ప్రవహిస్తాయి.
నిజానికి ఇది చాలా అసహజంగా కనిపిస్తుంది.
మంచు యుగాల నుంచి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి కారణంగా గడ్డ కట్టిన నీటిలోనూ జీవరాశులు బతికేలా చేసింది.
ఇదొక్కటే కాదు. చల్లటి నీటి కంటే వేడి నీళ్లే త్వరగా గడ్డకడుతాయనే విషయం మీకు తెలుసా.. చాలా మందికి తెలియదు.
ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. గ్లాసులో నీళ్లు పోసి రంగు, రుచి, వాసనలు లేని ఆ అద్భుత పదార్థాన్ని చూడండి.
నీటికి ఆ విచిత్ర లక్షణం లేకుంటే మీరు, నేనే కాదు ఈ భూమ్మీద జీవమే లేదు.]
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴1739: నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.
✴1946: బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్కు స్వాతంత్ర్యం లభించింది.
✴1957: భారత ప్రభుత్వం శకసంవత్సరాన్ని జాతీయ సంవత్సరంగా స్వీకరించింది.
✴1960: ఆర్థర్ లియొనార్డ్, చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
✴1971: భారత లోక్ సభ స్పీకర్గా గుర్‌దయాళ్ సింగ్ థిల్లాన్ పదవి స్వీకారం.
✴1982: నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.
✴2000: భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇1828: అమరావతి శేషయ్య శాస్త్ర్రి, ఎండోమెంటు డిప్యూటీ కలెక్టరుగా రెండున్నర లక్షల ఒరిజనల్ క్లైమ్సు పత్రాలను పరిశీలించి అనేక వేలఎండోమెంటు క్లైమ్సులు పరిష్కరించాడు. (మ.1903)
❇1868: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953)
❇1900: యజ్ఞనారాయణ శాస్త్రి, ప్రముఖ తెలుగు రచయిత, కవి, శతావధానులు.
❇1920: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (మ.2007)
❇1907: టేకుమళ్ల కామేశ్వరరావు, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾1832: గేథే, జర్మనీ రచయిత. (జ.1749)
◾2005: జెమినీ గణేశన్, సుప్రసిద్ధ తమిళ నటుడు. (మ.2005)
◾2007: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, సుప్రసిద్ధ తత్వవేత్త. (జ.1918)
◾2009: టి.ఎల్. ( తాడేపల్లి లక్ష్మీ) కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1923)
◾2016: మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1939) 🙏🏻
Today in History in Telugu - 18th March

Today in History in Telugu - 18th March



*🌏చరిత్రలో ఈ రోజు/మార్చి 18🌏*

*🔎సంఘటనలు🔍*

▪1922 : మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు.

▪1965 : అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.

▪1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె. గుజ్రాల్ పదవీ విరమణ.

*❣జననాలు❣*


☀1837: గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

☀1858: రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త (మరణం:1913)

☀1933: దండమూడి రామమోహనరావు, మృదంగం వాయిద్యకారుడు.

☀1938: శశి కపూర్, ప్రముఖ చలన చిత్ర నటుడు.

☀1953: టి.దేవేందర్ గౌడ్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు

*💐మరణాలు💐*

🌸1804: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (జ.1762)

🌸1871: అగస్టస్ డీ మోర్గాన్, భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత, తర్క శాస్త్రవేత్త. (జ.1806)

🌸2017: చంద్రహాసన్, రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత, సినిమా నిర్మాత.

🌸2019: బొమ్మ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసన సభ్యుడు.

*🌏జాతీయ దినాలు🇮🇳*

*🏵మానవ హక్కుల దినం.*

*🇮🇳భారత ఆయుధ కర్మాగారాల దినోత్సవం.*

Today in History in Telugu - 16th March



*🌏చరిత్రలో ఈ రోజు/మార్చి 16🌏*

*❣జననాలు❣*

🏵1751: జేమ్స్ మాడిసన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

🏵1764: మామిడి వెంకటార్యులు, తొలి తెలుగు నిఘంటు కర్త.

🏵1789: జార్జి సైమన్ ఓమ్, జర్మనీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త. (మ. 1854)

🏵1901: పొట్టి శ్రీరాములు, ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ ఆంరణ నిరాహారదీక్ష చేసిన అమరజీవి. (మ.1952)

🏵1917: ఆవుల సాంబశివరావు, ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, ప్రముఖ హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (మ.2003)

🏵1925: మునిపల్లె రాజు, భారత ప్రభుత్వ రక్షణ శాఖలోని ఇంజనీరింగు సర్వీసులో సర్వేయరుగా ఉద్యోగం చేసాడు

🏵1928: ఉషశ్రీ, రేడియో వ్యాఖ్యాత, సాహిత్య రచయిత. (మ.1990)

🏵1939 : శాస్త్రీయ మరియు లలిత సంగీత గాయకురాలు శ్రీరంగం గోపాలరత్నం జననం (మ.1993).

🏵1953 : అమెరికన్ సాఫ్టువేర్ స్వేచ్ఛ కార్యకర్త మరియు కంప్యూటర్ ప్రోగ్రామర్ రిచర్డ్ స్టాల్‌మన్ జననం

🏵1969 : బార్బడస్ కు చెందిన వెస్ట్‌ఇండీస్ జట్టు మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఓటిస్ గిబ్సన్ జననం.

*💐మరణాలు💐*

⭐1935: జాన్ జేమ్స్ రికర్డ్ మెక్లియాడ్, నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త (జ. 1876)

⭐1968: సముద్రాల రాఘవాచార్య, సముద్రాల సీనియర్ గా ప్రసిద్ధి చెందిన రచయిత, నిర్మాత, దర్శకుడు, నేపథ్యగాయకుడు. (జ.1902)

⭐1993: శ్రీరంగం గోపాలరత్నం, ఆకాశవాణిలో శాస్త్రీయ, లలిత సంగీత గాయకురాలు.

⭐2018: కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (జ.1934)



Today in History in Telugu - 14th March

Today in History in Telugu - 14th March



*🌏చరిత్రలో ఈ రోజు/మార్చి 14🌏*

*🔍సంఘటనలు🔎*

▪1888: అత్యధిక సర్క్యులేషన్ కల మలయాళ వార్తాపత్రిక మలయాళ మనోరమను కందత్తిల్ వర్ఘీస్ మాప్పిల్లై స్థాపించాడు.

▪1931: భారతదేశములో తొలి టాకీ చిత్రము, అర్దెషీర్ ఇరానీ దర్శకత్వము వహించిన ఆలం ఆరా ముంబైలోని గోరేగాఁవ్ లోని ఇంపీరియల్ సినిమా థియేటరులో విడుదలయ్యింది

▪2008: హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.

*❣జననాలు❣*

🌸1842: కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (మ.1915)

🌸1879: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1955)

🌸1917: కె.వి.మహదేవన్, సుప్రసిద్ధ తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)

🌸1930: నాయని కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు రచయిత్రి. (మ.2016)

🌸1937: జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు, 2009 లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.

*💐మరణాలు💐*

⭐1664: సిక్కుల ఎనిమిదవ గురువు గురు హర్‌కిషన్ ఢిల్లీలో మరణించాడు.

⭐1883: ప్రఖ్యాత తత్వవేత్త, రాజకీయ-ఆర్థికవేత్త, విప్లవ కారుడు కారల్ మార్క్స్ మరణించాడు.

⭐2013: అడబాల, రంగస్థల నటుడు, రూపశిల్పి. (జ.1936)

*🌏జాతీయ దినాలు🇮🇳*

*☀పై డే : గణితంలో వాడే ఒక గుర్తు పేరు 'పై' (22/7). పై యొక్క విలువ 3.14159.... దానిని పురస్కరించుకకుని, గణిత మేధావులు ఈ రోజును పై డేగా జరుపుకుంటున్నారు.*

Today in History in Telugu - 11th March


*🌏చరిత్రలో ఈ రోజు/మార్చి 11🌏*

*🔍సంఘటనలు🔎*

🌸1990 : సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి లిథ్వేనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.

🌸1999 : అమెరికా లోని నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది.

🌸2009: వన్డే క్రికెట్‌లో అతితక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారతీయుడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు.

*❣జననాలు❣*

🌟1915: విజయ్ హజారే, భారత క్రికెటర్ జననం. (మ. 2004)

🌟1922: మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (మ.2000)

🌟1926: చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. (మ.2018)

*💐మరణాలు💐*

🏵1689: శంభాజీ, మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు.

🏵1955: అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ ‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1881)

🏵1970: నేదునూరి గంగాధరం, ప్రముఖ తెలుగు రచయిత. (జ.1904)

🏵1979: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, ప్రముఖ తెలుగు సాహితీకారులు. (జ.1893)

🏵2009: విమలా థాకర్, గాంధేయవాది, వినోబా భావే సన్నిహితురాలు.

🏵2009: కె.ఎన్‌.వై.పతంజలి, ప్రముఖ తెలుగు రచయిత. (జ.1952)

🏵2013: శ్రీపాద పినాకపాణి, శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, వైద్యరంగంలో నిష్ణాతుడు. (జ.1913)

🏵2018: చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు. (జ.1926)




Today in History in Telugu - 6th March


*🌏చరిత్రలో ఈ రోజు/మార్చి 6🌏*

*🔍సంఘటనలు🔎*

🌟2009: న్యూయార్క్లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.

🌟1992: కంప్యూటర్లపై మైకెలాంజిలో అనే వైరస్ దాడి ప్రారంభం.

🌟1983: అమెరికా తోలి ఫుట్ బాల్ లీగ్ ప్రారంభం.

*❣జననాలు❣*

☀1475: మైఖేలాంజెలో, ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. (మ.1564)

☀1899: తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (మ.1949)

☀1902: కల్లూరు వేంకట నారాయణ రావు, విద్యార్థి దశలోనే విజ్ఞానచంద్రికాగ్రంథమాల వారు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నాడు

☀1913: కస్తూరి శివరావు, హాస్యనటులకు ప్రాధాన్యత సంతరింపజేసిన ప్రముఖ హాస్యనటుడు. (మ.1966)

☀1919: గడియారం రామకృష్ణ శర్మ, సాహితీవేత్త.

☀1933: కృష్ణకుమారి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటి.

*💐మరణాలు💐*

🏵1964: రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు, చివరి పిఠాపురం మహారాజు. సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (జ.1885)

🏵1976: దువ్వూరి వేంకటరమణ శాస్త్రి, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు.

🏵1995: మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (జ.1902)

🏵2016: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (జ.1971)

🏵2019: కటికితల రామస్వామి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు (జ.1932)

 *🌏జాతీయ దినాలు🇮🇳*

*🌏ఘనా గణతంత్ర దినోత్సవం.*




Today in History in Telugu - 5th March

Today in History in Telugu - 5th March

🌏చరిత్రలో ఈ రోజు/మార్చి 5🌏*

*🔎సంఘటనలు🔍*

☀2010: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.

☀1824: బర్మా పై బ్రిటన్ యుద్ధం ప్రకటన.

☀1931: రాజకీయ ఖైదీ ల విడుదల ఒపందంపై బ్రిటిష్ ప్రతినిధులు, మహాత్మా గాంధీ సంతకం.

☀1931 : గాంధీ- ఇర్విన్ ఒడంబడిక కుదిరింది.

*❣జననాలు❣*

🥀1901: ఈలపాట రఘురామయ్య, సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు. (మ.1975)

🥀1913 : కిరాణా ఘరానాకు చెందిన హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు గంగూబాయి హనగల్ జననం (మ.2009).

🥀1917: కాంచనమాల, అలనాటి అందాల నటి. (మ.1981)

🥀1918: జేమ్స్ టోబిన్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .

🥀1920: మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992)

🥀1924: గణపతిరాజు అచ్యుతరామరాజు, వాది, సాహిత్య, సాంస్కృతిక, నాటక కళాకారులు. (మ.2004)

🥀1928 : ఆల్కే పదంసీ, పలు ప్రతిష్ఠాత్మక అడ్వర్‌టైజ్‌మెంట్లకు సృష్టికర్త.

🥀1937: నెమలికంటి తారకరామారావు, శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదు లోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు.జి సైదేశ్వర రావు

🥀1958: నాజర్, దక్షిణాదికి చెందిన ఒక సుప్రసిద్ధ నటుడు.

🥀1984: ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (మ.2015)

🥀1987 : రష్యా దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి అన్నా చక్వతడ్జే జననం.

*💐మరణాలు💐*

🏵1827: అలెస్సాండ్రో వోల్టా, బ్యాటరీని ఆవిష్కరించిన ఇటలీ శాస్త్రవేత్త. (జ.1745)

🏵1827: పియర్ సైమన్ లాప్లేస్ ప్రముఖ ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు (జ.1749)

🏵1945: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి, శతావధాని.

🏵1953 : రష్యా నేత సోవియట్ యూనియన్‌కు బ్యూరోక్రాటిక్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ మరణం (జ.1878).

🏵1996: పిఠాపురం నాగేశ్వరరావు, ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు.

🏵2004: కొంగర జగ్గయ్య, ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ.1928)

🏵2013: రాజసులోచన, తెలుగు సినిమా నటి, కూచిపూడి, భరతనాట్య నర్తకి. (జ.1935)

🏵2017: సి.వి.సుబ్బన్న ప్రముఖ శతావధాని (జ.1929)

*🌏జాతీయ దినాలు🇮🇳*

*▪అస్సాం రైఫిల్స్ రైటింగ్ దినోత్సవం.*

*🌏ప్రపంచ బధిరుల దినం*.

Today in History in Telugu - 4th March

Today in History in Telugu - 4th March




*🌏చరిత్రలో ఈ రోజు/మార్చి 4🌏*

*🔍సంఘటనలు🔎*

🥀1961 : భారత మొదటి విమాన వాహక నౌక ఐ.ఎన్.ఎస్.విక్రాంత్ పని మొదలుపెట్టింది.

*❣జననాలు❣*

🌟1856 : ప్రముఖ భారతీయ రచయిత్రి తోరూదత్ జననం.

🌟1886: బులుసు సాంబమూర్తి, దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, ఈయన మద్రాసు శాసన పరిషత్ అధ్యక్షులు.

🌟1962: బుర్రా విజయదుర్గ, ప్రముఖ రంగస్థల నటీమణి.

🌟1973: చంద్రశేఖర్ యేలేటి, తెలుగు సినిమా దర్శకుడు.

🌟1987 : ప్రముఖ తెలుగు సినిమా నటి శ్రద్దా దాస్ జననం.

🌟1980 : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న జననం.

*💐మరణాలు💐*

🏵1964: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు

🏵2002: కె.వి.రఘునాథరెడ్డి కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి (జ.1924)

🏵2016: పి.ఎ.సంగ్మా, లోక్‌సభ మాజీ స్పీకరు. (జ.1947)

🏵2016: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (జ.1944)

*🌏జాతీయ దినాలు🇮🇳*

*🇮🇳భారత జాతీయ భద్రతా దినోత్సవం*





Today in History in Telugu - 1st March


🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *01 మార్చి, 2020*
👉 *ఆదివారం*
👉 *సంవత్సరములో 61వ రోజు 9వ వారం*
👉 *సంవత్సరాంతమునకు ఇంకా 305 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*
〰〰〰〰〰〰〰〰
🔴 *ప్రత్యేక  దినాలు*
🚩 .....
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴1768: మార్చి 1, 1768లో సంతకాలు చేసిన మరో ఒప్పందం ద్వారా షా ఆలం దానాన్ని అంగీకరించి సర్కారులను కంపెనీకి అప్పగించి, తమ స్నేహానికి గుర్తుగా, నిజాము, 50,000 భరణం పొందాడు. చివరికి, 1823లో ఉత్తర సర్కారులపై పూర్తి హక్కులను నిజాము నుండి కొనేసాక అవి బ్రిటిషు వారి అధీనమై పోయాయి. సర్కారులు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమవగా, ప్రస్తుతపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలున్న ప్రాంతాన్ని గోదావరి జిల్లాగా ఏర్పరిచారు. బ్రిటిషు పాలన, 1768-1947.

✴1925: గోదావరి జిల్లా ను, కృష్ణా జిల్లాను విడదీసి, 1925 ఏప్రిల్ 15, 1925 లో, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటినుండి, గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తరువాత, తూర్పు గోదావరి జిల్లాగా పేరు మార్చుకొంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా ఏర్పడింది.విశాఖపట్నం జిల్లా నుంచి, శ్రీకాకుళం జిల్లా 1950 ఆగస్టు 15 నాడు ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది. చూడు: తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వెబ్‌సైటు

✴1925:బ్రిటిష్‌ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మారింది). తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు.[1] చూడు: పశ్చిమ గోదావరి జిల్లా.

✴1969 : భారతీయ రైల్వేలు రాజధాని ఎక్స్‌ప్రెస్ లను ప్రవేశపెట్టాయి. మొదటి రైలు ఢిల్లీ, కోల్‌కతాల మధ్య మొదలైంది.

✴2008: బంగ్లాదేశ్తో చిట్టగాంగ్లో జరుగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇1887: *చెరుకువాడ వేంకట నరసింహం,* ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (మ.1964)

❇1901: *నల్లపాటి వెంకటరామయ్య,*  ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్. (మ.1983)

❇1908: *ఖండవల్లి లక్ష్మీరంజనం,*  సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. వీరు తూర్పు గోదావరి జిల్లా పెదపూడి గ్రామం. (మ.1986)

❇1918: *ఆవేటి పూర్ణిమ,*  ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి. (మ.1995)

❇1938:  *యలమంచిలి హనుమంతరావు,*  ఆల్‌ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (మ.2016)

❇1942: *.జె.రావు,*  భారత ఎన్నికల కమిషన్ పరిశీలకులు, బీహార్ లాంటి ప్రమాదకర రాష్ట్రంలో ఎనికల ప్రక్రియను గాడిలో పెట్టిన ధీరుడు.

❇1951: *నితీశ్ కుమార్,*  బీహార్ ముఖ్యమంత్రి.

❇1955: *వెలమల సిమ్మన్న,*  బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు.

❇1968 : భారతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి  *కుంజరని దేవి*  జననం.

❇1986: *ఎన్. సి. కారుణ్య,*  పాడుతా తీయగా కార్యక్రమంలో విజేతగా నిలిచాడు. ఇతడి రెండవ ఆల్బమ్ సాయి మాధురిని శ్రీ సత్యసాయి బాబా సమక్షంలో విడుదల చేశాడు. ఇతడు ఇండియన్ అయిడల్ (సీజన్ 2) లో రెండవ స్థానాన్ని పొంది జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾1989: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి *వసంత్‌దాదా పాటిల్.*

◾1997: *యలమంచిలి వెంకటప్పయ్య,*  స్వాతంత్ర్య సమర యోధుడు.  హేతువాది. మంత్రాలులేని వివాహాలు, కులాంతర వివాహాలు పట్టుబట్టి చేయించారు. (జననం: 30 డిశెంబరు 1898 )

◾2010: *తాడూరి బాలాగౌడ్,*  భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు మరియు నిజామాబాదు లోకసభ నియోజకవర్గం సభ్యుడు. (జ.1931) 🙏🏻