Showing posts with label Tech News. Show all posts
Showing posts with label Tech News. Show all posts

SONY LAUNCHED NEW TV 32W830

 

సోనీ స్మార్ట్ టీవీ @32 వేలు ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ 32డబ్ల్యూ830' పేరుతో అండ్రాయిడ్ టీవీని రూ.31,900 ధరతో ఇండియా మార్కెట్ కు తీసుకొచ్చింది. ఇందులో హెచ్ డీఆర్ 10, హెచ్ఎల్ జ్, గూగుల్ క్రోమ్ కాస్ట్, 3 హెచ్ డీఎంఐ పోర్టులు, 2 యూఎస్ బీ పోర్టులు, బ్లూటూత్, 20 వాట్ల స్పీకర్లు ఉంటాయి. ఎక్స్ రియాల్టీ ప్రోపిక్చర్ ప్రాసెసింగ్ టెక్నాలజీ వల్ల ఫొటోలు, వీడియోలు చాలా బాగా కనిపిస్తాయని కంపెనీ తెలిపింది.




BAJAJ LAUNCHED NEW BIKE CT 110 X

 బజాజ్ నుంచి సీటీ110ఎక్స్ బజాజ్ ఆటో ఇండియా మార్కెట్లోకి గురువారం సీటీ110ఎక్స్ పేరుతో బడ్జెట్ బైకును తీసుకొచ్చింది. దీని ఢిల్లీ ఎక్స్ షోరూమ్ రూ.55,494 అని కంపెనీ ప్రకటించింది. ఇందులో 115 సీసీడీటీఎస్ ఐ ఇంజన్, సెమీ నాబీ టైర్స్, ట్యాంక్ పాడ్స్, 170 ఎంఎం గ్రౌండ్ క్లియరెనస్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇది

7,500 ఆర్పీఎం వద్ద 8.6 హెచ్ పీని రిలీజ్ చేస్తుంది.




How do security bugs occur in Telugu

How do security bugs occur in Telugu

How do security bugs occur in Telugu


ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు దాన్ని రియల్ టైమ్ లో సక్రమంగా టెస్ట్ చేయకపోతే ఆటోమేటిక్ గా దాంట్లో అనేక లోపాలు ఏర్పడుతుంటాయి. ఎప్పుడో ఒకప్పుడు ఫలానా అప్లికేషన్లో ఫలానా లోపం ఉంది అన్న విషయం వివిధ ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థల దగ్గర పనిచేసే సెక్యూరిటీ పరిశోధకులు గుర్తిస్తూ ఉంటారు. వెంటనే దానికి సంబంధించిన సమాచారం అధికారికంగా ఆయా అప్లికేషన్ తయారీ సంస్థలకి తెలియజేస్తారు. వెంటనే ఆ అప్లికేషన్లో లోపాలను సరి చేసిన తర్వాత సంస్థ అధికారికంగా ఒక అప్ డేట్ విడుదల చేస్తుంది. దాన్ని అప్ డేట్ చేసుకున్న వారికి ఆ బగ్ నుంచి రక్షణ లభిస్తుంది. పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన వారు బగ్ బారిన పడతారు. 

What is the use of Graphics Card in Telugu

 What is the use of Graphics Card in Telugu

వాస్తవానికి మీ దగ్గర శక్తిమంతమైన ప్రాసెసర్, మదర్ బోర్డు కలిగిన కంప్యూటర్ ఉన్నప్పటికీ, కొన్నిసార్లు కంప్యూటర్ స్లో అవుతుంది అంటే కారణం గ్రాఫిక్ కార్డ్ శక్తిమంతంగా లేకపోవడమే. ఫోటోషాప్, అడోబ్ ప్రీమియర్ లాంటి అప్లికేషన్స్ వాడే వారికి మాత్రమే శక్తిమంతమైన గ్రాఫిక్ కార్డ్ అవసరమనే అపోహలో ఉంటారు కొందరు. వాస్తవానికి ఒకేసారి పలు విండోలు ఓపెన్ చేసి పని చేసేటప్పుడు కూడా స్క్రీన్ మీద కనిపించే అంశాలు సక్రమంగా రెండర్ అవడం కోసం శక్తిమంతమైన గ్రాఫిక్ కార్డు అవసరం ఉంటుంది. ఒకవేళ గ్రాఫిక్ కార్డు లేకపోయినా కూడా పని నడిచిపోతుంది గానీ, కంప్యూటర్ చాలా నెమ్మదిగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీ కంప్యూటర్ లో శక్తిమంతమైన గ్రాఫిక్ కార్డ్ అమర్చుకొని చూస్తే ఆ వ్యత్యాసం మీకే స్పష్టంగా కనిపిస్తుంది. అక్షరాలు మరింత షార్ప్ గా కనిపించడం మొదలుకొని గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు మునుపటి కన్నా మెరుగైన యూజర్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది.



వాట్సప్‌లో కొత్తగా వచ్చిన 'PiP' ఫీచర్ ఎలా పని చేస్తుందంటే...?

వాట్సప్‌లో కొత్తగా వచ్చిన 'PiP' ఫీచర్ ఎలా పని చేస్తుందంటే...?


♦మెసేజింగ్‌ మాధ్యమంలో విపరీతంగా దూసుకుపోతున్న వాట్సాప్‌, ఎప్పడికప్పుడు సరికొత్త ఫీచర్లతో అలరిస్తూ ఉంది.తాజాగా వాట్సాప్ PiP అనే కొత్ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చింది.అక్టోబర్‌లోనే ఆండ్రాయిడ్ బీటా వర్షన్ విడుదల చేసింది వాట్సప్ . గూగుల్ ప్లేస్టోర్‌లో 2.18.280 వాట్సాప్ అప్‌డేట్ చేసుకున్నవాళ్లు ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు.ఈ PiP ఫీచర్ ఇప్పటికే iOS లో అందుబాటులో ఉంది ఇప్పుడు లేటెస్ట్ గా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం విడుదల చేసింది.

🔹PiP ఫీచర్ అంటే ఏంటి ?

ఇప్పటివరకు మీకు వాట్సప్‌లో వచ్చిన వీడియో లింక్స్ క్లిక్ చేస్తే వేరే విండోలో ప్లే అయ్యేవి. ఇకపై మరో యాప్‌కి రీడైరెక్ట్ కాకుండా వాట్సప్‌లోనే ఆ వీడియోలు ప్లే అవుతాయి. థర్డ్ పార్టీ యాప్స్ అయిన యూట్యూబ్, ఫేస్‌బుక్, టంబ్లర్ లాంటి వీడియో లింక్స్ అన్నీ ఇక వాట్సప్‌లో ప్లే చేసుకోవచ్చు. మొదట హాఫ్ విండోలో ఓపెన్ అయ్యే వీడియోను ఫుల్ స్క్రీన్‌లోనూ చూడొచ్చు.

🔸ఈ PiP ఫీచర్ ఎలా పని చేస్తుందంటే..?

- 🔸ఒక్కసారి వాట్సాప్ అప్ డేట్ చేశాక యూట్యూబ్ లేదా ఇన్‌స్టా‌గ్రామ్‌ యొక్క వీడియో లింక్ ను మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి

♦వీడియో కాల్స్ కోసం..


🔸వీడియో కాల్స్ కోసం వాట్సాప్ PiP మోడ్ ను కలిగి ఉంది. ఇక్కడ, వినియోగదారులు వాట్సాప్ పై వీడియో కాల్ స్క్రీన్ ను షింక్ చేయవచ్చు .వినియోగదారులు వీడియో కాల్ లో ఉండగా వాట్సాప్ మరియు ఇతర యాప్లను ఉపయోగించడం కొనసాగించవచ్చు. ఈ ఫీచర్ Android మరియు iOS వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.

వాట్సప్‌లో కొత్తగా వచ్చిన 'PiP' ఫీచర్ ఎలా పని చేస్తుందంటే...?