What is the use of Graphics Card in Telugu
వాస్తవానికి మీ దగ్గర శక్తిమంతమైన ప్రాసెసర్, మదర్ బోర్డు కలిగిన కంప్యూటర్ ఉన్నప్పటికీ, కొన్నిసార్లు కంప్యూటర్ స్లో అవుతుంది అంటే కారణం గ్రాఫిక్ కార్డ్ శక్తిమంతంగా లేకపోవడమే. ఫోటోషాప్, అడోబ్ ప్రీమియర్ లాంటి అప్లికేషన్స్ వాడే వారికి మాత్రమే శక్తిమంతమైన గ్రాఫిక్ కార్డ్ అవసరమనే అపోహలో ఉంటారు కొందరు. వాస్తవానికి ఒకేసారి పలు విండోలు ఓపెన్ చేసి పని చేసేటప్పుడు కూడా స్క్రీన్ మీద కనిపించే అంశాలు సక్రమంగా రెండర్ అవడం కోసం శక్తిమంతమైన గ్రాఫిక్ కార్డు అవసరం ఉంటుంది. ఒకవేళ గ్రాఫిక్ కార్డు లేకపోయినా కూడా పని నడిచిపోతుంది గానీ, కంప్యూటర్ చాలా నెమ్మదిగా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీ కంప్యూటర్ లో శక్తిమంతమైన గ్రాఫిక్ కార్డ్ అమర్చుకొని చూస్తే ఆ వ్యత్యాసం మీకే స్పష్టంగా కనిపిస్తుంది. అక్షరాలు మరింత షార్ప్ గా కనిపించడం మొదలుకొని గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు మునుపటి కన్నా మెరుగైన యూజర్ ఎక్స్ పీరియన్స్ లభిస్తుంది.
EmoticonEmoticon