Showing posts with label GK. Show all posts
Showing posts with label GK. Show all posts
విటమిన్స్ డిస్కవరీ ఇయర్

విటమిన్స్ డిస్కవరీ ఇయర్

 *🔥విటమిన్స్ డిస్కవరీ ఇయర్🔥*


*1913: విటమిన్ ఎ (రెటినాల్) కనుగొనబడింది.*


*1920 : విటమిన్ సి (ఆస్కోబిక్ ఆమ్లం) కనుగొనబడింది*


*1920: విటమిన్ డి (కాల్సిఫెరాల్) కనుగొనబడింది.*


*1922: విటమిన్ ఇ (టోకోఫెరోల్కి) కనుగొనబడింది.*


*1929: విటమిన్ కె1 (ఫైలోక్వినోన్) కనుగొనబడింది.*


*1910: బిటమిన్ బి1 (థయమిన్) కనుగొనబడింది.*


*1920 : విటమిన్ బి2 (రైబోఫ్లేవిన్) కనుగొనబడింది*


*1936: విటమిన్ బి3 (నియాసిన్) కనుగొనబడింది.*


*1931 : విటమిన్ బి5 (పాతోటినిక్ ఆమ్లం) కనుగొనబడింది*


*1934: విటమిన్ బి6 (పైరిడాక్సిన్) కనుగొనబడింది.*


*1931: విటమిన్ బి7 (బయోటిన్) కనుగొనబడింది.*


*1941: బిటమిన్ బి9 (ఫోలిక్ యాసిడ్) ను కనుగొన్నారు*

భారతదేశ ప్రధాన నదుల వెంట నగరాలు

భారతదేశ ప్రధాన నదుల వెంట నగరాలు

 *🔥భారతదేశ ప్రధాన నదుల వెంట నగరాలు🔥* 


▪️మథుర, ఆగ్రా, ఢిల్లీ, అలహాబాద్ ➠  యమునా నది


✶ గంగా నది ➠ అలహాబాద్, హరిధర్, కాన్పూర్, పాట్నా, వారణాసి (బెనారస్)


✶ బ్రహ్మపుత్ర నది ➠ సోకోవా ఘాట్, డిబ్రూగర్, గౌహతి


✶ సట్లెజ్ నది ➠ ఫిరోజ్ పూర్, లూధియానా


✶ మహానది ➠ కటక్, సంబల్ పూర్


బదరీనాథ్ ➠ ✶ అలకనందా నది


✶ తుంగభద్ర నది ➠ కర్నూలు


శ్రీనగర్ ➠ ✶ జీలం నది


సూరత్ ➠ ✶ తప్తి నది


విజయవాడ ➠ ✶ కృష్ణా నది


పండరీపూర్ ➠ ✶ భీమా నది


✶ రామగంగా నది ➠ బరేలీ


✶ ఓర్చా ➠ బేత్వా నది


✶ షిప్రా లేదా క్షిప్ర నది) ➠ ఉజ్జయిని


అయోధ్య ➠ ✶ సరయూ నది


కోల్ కతా ➠ ✶ హుగ్లీ నది


✶ గోమ్తి నది ➠ లక్నో


జబల్ పూర్ ➠ ✶ నర్మదా నది


✶ చంబల్ నది ➠ కోట


✶ గోదావరి నది ➠ నాసిక్


శ్రీరంగపట్టణం ➠ ✶ కావేరీ నది


✶ ➠ మూసీ నది


✶ గోల్డెన్ లైన్ రివర్ ➠ జంషెడ్ పూర్


అహ్మదాబాద్ ➠ ✶ సబర్మతి నది

చరిత్రలో నేటి ప్రముఖ వ్యక్తి - రామకృష్ణ పరమహంస - 18 February

చరిత్రలో నేటి ప్రముఖ వ్యక్తి - రామకృష్ణ పరమహంస - 18 February

 *చరిత్రలో నేటి ప్రముఖ వ్యక్తి*


*రామకృష్ణ పరమహంస* 

(పుట్టినప్పుడు పేరు గదాధర్ ఛటోపాధ్యాయ) (ఫిబ్రవరి 18, 1836 - ఆగష్టు 16, 1886) 


*ఒక ఆధ్యాత్మిక గురువు. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి. 19 వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం"లో ఈయన ప్రభావము చాలా ఉంది.*


*భారతదేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి, తేదీలు, ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారములు ఉన్నాయి. చాలా మంది రామకృష్ణుని శిష్యులు ఉన్నత విద్యావంతులు, ఆధారములు దొరకనిదే విషయములు ప్రకటించకుండా ఉండడము దీనికి కారణము. అతని శిష్యుడు స్వామీ శారదానంద రామకృష్ణుని చుట్టూ పెరుగుతూ ఆతని జీవితచరిత్రను చాలా మటుకు రచించాడు.*


*బాల్యము*


*రామకృష్ణులకురామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ.శ 1836, ఫిబ్రవరి 18 న పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి. వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గదాధరుడు అందగాడు, బాల్యం నుండే ఇతనికి లలితకళలు, చిత్రలేఖనములో గల ప్రవేశము వలన వారి గ్రామంలో ఇతనికి మంచిపేరు ఉండేది. అయితే చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించేవాడు కాదు. ప్రకృతిని ప్రేమిస్తూ, గ్రామం బయట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవాడు. దానివలన చదువు అబ్బలేదు. పూరీకి వెళ్ళు సాధువులు వీరి గ్రామం గుండా వెళ్ళేవారు. వారు ఆ గ్రామంలో ఆగి ప్రసంగిచేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్ధగా వినేవాడు. వారికి సేవలు చేసి వారి మత వాగ్యుద్ధాలను ఆసక్తితో వినేవాడు.*


*ఉపనయనము కాగానే బ్రాహ్మణునిగా మొదటి భిక్ష, ఒక శూద్ర యువతి దగ్గర పొందుతానని అనడము చాలా మందికి ఆశ్చర్యము కలిగించింది. బ్రాహ్మణుని వద్దనే మొదటి భిక్ష పొందవలననే నియమాన్ని ఎంత వాదించినా, ఎంత మంది చెప్పినా, కన్నీరు కార్చినా వినకుండా ఆ యువతికి మాట ఇచ్చానని తాను ఆడిన మాట తప్పక ఎటువంటి బ్రాహ్మణుడవుతాడని ప్రశ్నించాడు. చివరికి ఆతని జ్యేష్ట సోదరుడు రామ్‌కుమార్ తండ్రి మరణము తరువాత అంగీకరించెను.*


*ఇంతలో కుటుంబ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతూ వచ్చింది. రామ్‌కుమార్ కలకత్తాలో సంస్కృత పాఠశాల నడుపుతూ, కొన్ని కుటుంబాలకు పౌరోహిత్యము చేస్తూ ఉండేవాడు. ఆ కాలములో రాణీ రాషమొణి అనే ధనిక యువతి, దక్షిణేశ్వర్ కాళీ మాత గుడి కట్టించి రామ్‌కుమార్ ను పురోహితుడుగా ఉండమని కోరింది. రామ్‌కుమార్ దానికి అంగీకరించాడు. కొంత ప్రోద్బలముతో గదాధర్ దేవతను అలంకరించడానికి ఒప్పుకున్నాడు. రామ్‌కుమార్ మరణించిన తరువాత రామకృష్ణుడు పూజారిగా బాధ్యతలను తీసుకొన్నాడు.*


*పూజారి జీవితము*


*మొదట తిరస్కరించినా తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయములో పూజలో సేవచేసేవాడు. గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తా అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానము ఇవ్వడము లేదు? అనుకొనేవాడు. ఈ ప్రశ్న ఆతనిని రాత్రి, పగలు కలచివేసింది. ఇక కాళికా దేవిని ప్రత్యక్షము కమ్మని తీవ్రమైన మొరలతో ప్రార్థించడము మొదలుపెట్టాడు. తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవళ్ళు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు. రాత్రిళ్ళు అడవిలో కూర్చొని ప్రార్థించేవాడు. ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు. అప్పటి నుండి నిరంతరమూ అమ్మవారి దర్శనభాగ్యం పొందేవాడు. నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు. ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమ సత్యమును తెలిసికొనుటకై ప్రార్థించేవాడు. కొంత మంది గురువులు ఆతని దగ్గరకు వచ్చి అన్ని మతములలో పరమ సత్యము సాక్షాత్కరించు కున్నాడని గ్రహించారు. ఈ మాట అన్ని ఊళ్ళలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు.*


*గురువులు, సాధనలు*


*కాలక్రమంలో తోతాపురి అను నాగా సాంప్రదాయపు సాధువు వీరికి అద్వైతజ్ఞానం ఉపదేశించారు. వీరి గురువుగారు చిన్నప్పటినుండి కష్టపడి సాధించిన నిర్వికల్ప సమాధిస్థితిని రామకృష్ణులు కేవలం మూడు రోజులలోనే పొందారు. తర్వాత భైరవీ బ్రాహ్మణి అనే ఆమె వీరికి భక్తిభావంలో భగవత్ సాక్షాత్కారమును ఉపదేశించారు. ఈ విధంగా భగవత్, ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం, క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు.*


*వైవాహిక జీవితము*


*కామార్పుకూర్ లో రామకృష్ణుడు దక్షిణేశ్వర్ లో అత్మజ్ఞాన అభ్యాసములతో పిచ్చివాడై పోయాడని పుకారు వచ్చింది. ఊరివారు రామకృష్ణుని తల్లితో ఆతనికి వివాహము చెయ్యమని, దానితో సంసారిక బాధ్యతలలో పడగలడని చెప్పారు. వివాహమునకు అభ్యంతరము చెప్పక పోవడమే కాకుండా, మూడు మైళ్ళ దూరములో ఉన్న జయరాంబాటి గ్రామంలో రామచంద్ర ముఖర్జీ ఇంట్లో పెళ్ళికూ


తురు దొరుకుతుందని చెప్పాడు. 5 ఏళ్ళ శారదా దేవితో ఆతని పెళ్ళి నిశ్చయమైనది. శారద రామకృష్ణుని మొదటి శిష్యురాలు. తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెను త్రిపుర సుందరి శక్తిగా పూజించడము మొదలు పెట్టాడు. ఆమెను సాక్షాత్ కాళికాదేవి లా భావించి పూజించారు. ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు.*


*ఆమె పరిత్యాగము రామకృష్ణుని పరిత్యాగము వలే శిష్యులందరికి ప్రస్ఫుటముగా కనపడేది. వారిద్దరి సంబంధము సామాన్య మానవులు అర్థము చేసుకోలేరని భావించేవారు. చాలా కాలము అమెతో గడిపిన తరువాత రామకృష్ణుడు వారి బంధము ఆధ్యాత్మికమైనదని నిర్ణయించారు. శిష్యులందరూ వారు దినసరి జీవితాన్ని పంచుకున్నపటికీ, ఒకరి దగ్గర ఒకరు ఉన్నపుడు మటుకు ఆధ్యాత్మికత కంటే ఏ ఇతర విషయాల పై మనస్సు పోయేది కాదని భావించేవారు. మతగురువుల జీవితాల్లో స్త్రీ, పురుషుల మధ్య ఇలా జీవితకాలమంతా ఆధ్యాత్మిక సంబంధము ఉండడము ఇంకెక్కడా కానరాదు. రామకృష్ణుని మరణానంతరము శారదా దేవి కుడా మతగురువుగా మారెను.*


BOOKS & AUTHOR (JANUARY 2021)

BOOKS & AUTHOR (JANUARY 2021)

 📚✍️BOOKS & AUTHOR (JANUARY 2021)


📓‘Manohar Parrikar – Off the Record’  by senior journalist Shri Waman Subha Prabhu 


📔“Right Under our Nose” – R Giridharan, a general manager at RBI.


📒“Modi India Calling – 2021” – 450-page coffee-table book, filled with over hundreds of photographs of Prime Minister Narendra Modi from his “107 overseas and bilateral visits” 


📕The Population Myth: Islam, Family Planning and Politics in India – former chief election commissioner (CEC) S Y Quraishi 


📗Making of a General-A Himalayan Echo – (Retd) Lt General Konsam Himalay Singh (Manipur)

SAARC  Member Countries

SAARC Member Countries

 ♦️ SAARC  Member Countries  ♦️


✍🏻Trick - MBBS – PAIN


✨M = Maldives, ( मालदीव )

✨B = Bangladesh ( बांग्लादेश )

✨B = Bhutan ( भूटान )

✨S = Srilanka ( श्रीलंका )

✨P = Pakistan ( पाकिस्तान )

✨A = Afghanistan ( अफगानिस्तान )

✨I = India  ( भारत )

✨N = Nepal (नेपाल)


✨ Total 8 Country

ASEAN Member Countries

ASEAN Member Countries

 ♦♦️ ASEAN Member Countries ♦️  


✍️ Trick : TV CLIP of MBBS


🔷 T= Thailand 

🔷 V= Vietnam

🔷 C= Cambodia 

🔷 L=Laos

🔷 I=Indonesia

🔷 P=Philippines  , of silent 

🔷 M= Malaysia

🔷 B- Burma (Myanmar)

🔷B=Brunei 

🔷S= Singapore


🔶 Total 10 Countries

Highest Mountain Peak of States

Highest Mountain Peak of States

 🌋Highest Mountain Peak of State🌋


⛰Andhra Pradesh Highest Peak

♟Arma Konda (1,680m)

🏔Range/region 👉 Eastern Ghats


⛰Arunachal Pradesh Highest Peak

♟Kangto (7,090m)

🏔Range/Region 👉 Eastern Himalayas 


⛰Bihar Highest Peak

♟Someshwar Fort (880m)

🏔Range/region 👉 West Champaran district 


⛰Chhattisgarh Highest Peak

♟Bailadila Range (1,276m)

🏔Range/region 👉 Dantewada district 


⛰Goa Highest Peak

♟Sosogad (1,022m)

🏔Range/region 👉 Western  Ghats


⛰Gujarat Highest Peak

♟Girnar (1,145m)

🏔Range/region  👉 Junagargh District 


⛰Haryana Highest Peak

♟Karoh Peak (1,499m)

🏔Range/region 👉 Morni Hills 


⛰Himachal Pradesh Highest Peak

♟ReoPurgyil (6,816m)

🏔Range/region 👉 Western Himalayas


⛰Jammu and Kashmir(claimed) Highest Peak

♟K2 (8,611m)

🏔Range/region 👉 Karakoram 


⛰Jammu and Kashmir (administered) Highest Peak

♟Saltoro Kangri (7,742m)

🏔Range/region 👉 Saltoro Range. Part of Karakoram 


⛰Jharkhand Highest Peak

♟Parasnath (1,366m)

🏔Range/region 👉 Parasnath Hills 


⛰Karnataka Highest Peak

♟Mullayanagiri (1,925m)

🏔Range/region 👉 Western Ghats 


⛰Kerala Highest Peak

♟Anamudi (2,695m)

🏔Range/region 👉 Western Ghats


⛰Madhya Pradesh Highest Peak

♟Dhupgarh (1,350m)

🏔Range/region 👉 Satpura Range


⛰Maharashtra Highest Peak

♟Kalsubai (1,646m)

🏔Range/region 👉 Western Ghats 

            

⛰Manipur Highest Peak

♟Mount Iso (Tenipu) (2,994m)

🏔Range/region 👉 Senapati District


⛰Meghalaya Highest Peak

♟Shillong Peak (1,965m)

🏔Range/region 👉 Khasi Hills 


⛰Mizoram Highest Peak

♟Phawngpui (2,165m)

🏔Range/region 👉  Shaiha district 


⛰Nagaland Highest Peak

♟Mount Saramati (3,841m)

🏔Range/region 👉 Naga Hills 


⛰Odisha Highest Peak

♟Deomali (1,672m)

🏔Range/region 👉 Eastern Ghats 


⛰Rajasthan Highest Peak

♟Guru Shikhar (1,722m)

🏔Range/region 👉 Aravalli hills 


⛰Sikkim Highest Peak

♟Kangchenjunga (8,598m)

🏔Range/region 👉  Eastern  Himalayan 


⛰Tamil Nadu Highest Peak

♟Doddabetta (2,636m)

🏔Range/region  👉  Nilgiri  Hills 


⛰Telangana Highest Peak

♟Laxmidevipalli (670m)

🏔Range/region 👉 Deccan plateau


⛰Tripura Highest Peak

♟Betalongchhip (1,097m)

🏔Range/region 👉  Jampuri  hills 


⛰Uttar Pradesh Highest Peak

♟Amsot Peak  (957m)

🏔Range/region 👉 Shivalik  Hills 


⛰Uttarakhand Highest Peak

♟Nanda Devi (7,816m)

🏔Range/region 👉 Gharwal Himalayan 


⛰West Bengal Highest Peak

♟Sandakphu (3,636m)

🏔Range/region 👉 Eastern  Himalayan 


⛰Andaman & Nicobar Islands Highest Peak

♟Saddle Peak (731m)

🏔Range/region 👉 North Andman Island 


⛰Puducherry Highest Peak

♟Les Montagnes Rouges (30m)

🏔Range/region 👉 Karaikal district

REPORTS OF DIFFERENT ORGANISATIONS IN TELUGU

REPORTS OF DIFFERENT ORGANISATIONS IN TELUGU

 🎪REPORTS OF DIFFERENT ORGANISATIONS


💠WORLD ECONOMIC FORUM (WEF)

🔹Global Environment Index 

🔹Human Capital Index 

🔹Inclusive Growth and Development report 

🔹Global Gender Gap Index 

🔹Global Risk Report

🔹Global Info Tech Report 

🔹Travel and Tourism 

🔹Global Competitiveness Report 

🔹Enabling Trade Report 

🔹World Power Language Index 

🔹Global Energy Architecture Performance Index


💠WORLD BANK (WB)

🔹Ease of doing Business 

🔹World Development Report  

🔹Easing of Living Index 

🔹Universal Health Coverage Index 

🔹Logistics Performance Index


💠World Health Organisation (WHO)

🔹World Health Statistics 

🔹Ambient Air Pollution Report 

🔹World Tuberculosis Report 

🔹Global Nutrition Report 

🔹World Health Report


💠International Monitoring Fund (IMF)

🔹Global Financial Stability

🔹World Economic Outlook 

🔹Fiscal Monitor


💠United Nation Devlopment Programme (UNDP)

🔹Gender Inequality Index 

🔹Human Development Index 

🔹Sustainable Development Goal

🔹Multidimensional Poverty Index


💠United Nation Environment Program (UNEP)

🔹Actions on Air Quality 

🔹Global Environment Outlook

🔹Emission Gap Report


💠UN-Habitat

🔹World Cities Report 

🔹Habitat Commitment Index

రెవెన్యూ పదజాలం

రెవెన్యూ పదజాలం

*రెవెన్యూ పదజాలం..*


 ఇప్పటికీ చాలామందికి అర్థంకాని గందరగోళం.. నిజాం కాలం నుంచి చలామణిలో ఉన్న ఈ పదాలపై ఓ సారి లుక్కేద్దాం.. రెవెన్యూ శాఖ పదాలు ఎక్కువగా ఉర్దూలోనే ఉన్నాయి. కాలక్రమేణా ఇంగ్లిష్‌, తెలుగు పదాలు కొన్ని వచ్చి చేరినా ఈ పరిభాష ఇప్పటికీ సామాన్యులకే కాదు.. ఆ శాఖలో కొందరు ఉద్యోగులకు సైతం తెలియదంటే అతిశయోక్తి కాదు.  'రెవెన్యూ శాఖ'  ముఖ్యమైన అందులోని కొన్ని పదాలు.. 


*వాటి అర్థాలు మీ కోసం..*


*గ్రామ కంఠం :* గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అం టారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి.


*అసైన్డ్‌భూమి :* భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు.


*ఆయకట్టు :* ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు.


*బంజరు భూమి (బంచరామి) :* గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు.


*అగ్రహారం :* పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు.


*దేవళ్‌ ఇనాం :* దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి.


*అడంగల్‌ (పహాణీ) :* గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.


*తరి :* సాగు భూమి


*ఖుష్కీ :* మెట్ట ప్రాంతం


*గెట్టు :* పొలం హద్దు


*కౌల్దార్‌ :* భూమిని కౌలుకు తీసకునేవాడు


*కమతం :* భూమి విస్తీర్ణం


*ఇలాకా :* ప్రాంతం


*ఇనాం :* సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి


*బాలోతా ఇనాం :* భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి


*సర్ఫేఖాస్‌ :* నిజాం నవాబు సొంత భూమి


*సీలింగ్‌ :* భూ గరిష్ఠ పరిమితి


*సర్వే నంబర్‌ :* భూముల గుర్తింపు కోసం కేటాయించేది


*నక్షా :* భూముల వివరాలు తెలిపే చిత్రపటం


*కబ్జాదార్‌ :* భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి


*ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) :* భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.


*ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌ :* దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.


*బందోబస్తు :* వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.


*బీ మెమో :* ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.


*పోరంబోకు :* భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.


*ఫైసల్‌ పట్టీ :* బదిలీ రిజిస్టర్‌


*చౌఫస్లా :* ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.


*డైగ్లాట్‌ :* తెలుగు, ఇంగ్లిఫ్‌ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.


*విరాసత్‌/ఫౌతి :* భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.


*కాస్తు :* సాగు చేయడం


*మింజుములే :* మొత్తం భూమి.


*మార్ట్‌గేజ్‌ :* రుణం కోసం భూమిని కుదవపెట్టడం.


*మోకా :* క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్‌).


*పట్టాదారు పాస్‌ పుస్తకం :* రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.


*టైటిల్‌ డీడ్‌ :* భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.


*ఆర్వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) :* భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.


*ఆర్‌ఎస్సార్‌ :* రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.


*పర్మినెంట్‌ రిజిస్టర్‌ :* సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.


*సేత్వార్‌ :* రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.


*సాదాబైనామా :* భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.


*దస్తావేజు :* భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.


*ఎకరం :* భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.


*అబి :* వానకాలం పంట


*ఆబాది :* గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు


*అసైన్‌మెంట్‌ :* ప్రత్యేకంగాకేటాయంచిన భూమి


*శిఖం :* చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం


*బేవార్స్‌ :* హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.


*దో ఫసల్‌ :* రెండు పంటలు పండే భూమి


*ఫసలీ :* జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.


*నాలా :* వ్యవసాయేతర భూమి


*ఇస్తిఫా భూమి :* పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి


*ఇనాం దస్తర్‌దాన్‌ :* పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి


*ఖాస్రాపహానీ :* ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.


*గైరాన్‌ :* సామాజిక పోరంబోకు


*యేక్‌రార్‌నామా :* ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం..

భారతదేశంలో ప్రధాన ఆనకట్టలు మరియు నది ప్రాజెక్టులు

భారతదేశంలో ప్రధాన ఆనకట్టలు మరియు నది ప్రాజెక్టులు

🌉*భారతదేశంలో ప్రధాన ఆనకట్టలు మరియు నది ప్రాజెక్టులు*🌉


🍫1. ఇడుక్కి ఆనకట్ట - పెరియార్ నది

- కేరళ

🍫2. ఉకై ప్రాజెక్ట్ - తపతి(తాపి) నది

- గుజరాత్

🍫3. కాక్రాపర్ ప్రాజెక్ట్ - తపతి(తాపి) నది

- గుజరాత్

🍫4. కోల్డమ్ ప్రాజెక్ట్ - - సట్లెజ్ నది

- హిమాచల్ ప్రదేశ్

🍫5. గంగా సాగర్ ప్రాజెక్ట్ - చంబల్ నది

- మధ్యప్రదేశ్


🍫6. జవహర్ సాగర్ ప్రాజెక్ట్ - చంబల్ నది

- రాజస్థాన్

🍫7. జయక్వాడి ప్రాజెక్ట్ - (గోదావరి నది)

- మహారాష్ట్ర మహారాష్ట్ర

🍫8. టెహ్రీ ఆనకట్ట ప్రాజెక్ట్ - భాగీరథి నది

- ఉత్తరాఖండ్

🍫9. తిలయ్య ప్రాజెక్ట్ - బారకర్ నది

- జార్ఖండ్

🍫10. తుల్బుల్ ప్రాజెక్ట్ - జీలం నది

- జమ్మూ కాశ్మీర్


🍫11. దుర్గాపూర్ బ్యారేజ్ ప్రాజెక్ట్ - దామోదర్ నది

- పశ్చిమ బెంగాల్

🍫12. దుల్ హస్తి ప్రాజెక్ట్ - చెనాబ్ నది

- జమ్మూ కాశ్మీర్

🍫13. నాగ్‌పూర్ పవర్ స్టేషన్ ప్రాజెక్ట్

- కొరాడి నది - మహారాష్ట్ర

🍫14. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ - కృష్ణ నది

- ఆంధ్రప్రదేశ్

🍫15. నాథ్పా జాక్రీ ప్రాజెక్ట్ - సట్లెజ్ నది

- హిమాచల్ ప్రదేశ్


🍫16. పంచెట్ ఆనకట్ట - దామోదర్ నది

- జార్ఖండ్

🍫17. పోచంపాడ్ ప్రాజెక్ట్ - మహానది

- కర్ణాటక

🍫18. ఫరక్కా ప్రాజెక్ట్ - గంగా నది

- పశ్చిమ బెంగాల్

🍫19. బన్సాగర్ ప్రాజెక్ట్ -సన్ నది

- మధ్యప్రదేశ్

🍫20. భాక్ర నంగల్ ప్రాజెక్ట్ - సట్లెజ్ నది

- హిమాచల్ ప్రదేశ్


🍫21.భీమా ప్రాజెక్ట్ - పావన నది

- తెలంగాణ

🍫22. మాటాటిలా ప్రాజెక్ట్ - బెట్వా నది

- ఉత్తర ప్రదేశ్

🍫23. రంజిత్ సాగర్ డ్యామ్ ప్రాజెక్ట్ - రవి నది

- జమ్మూ కాశ్మీర్

🍫24. రానా ప్రతాప్ సాగర్ ప్రాజెక్ట్ - చంబల్ నది

- రాజస్థాన్

🍫25. సట్లెజ్ ప్రాజెక్ట్ - చెనాబ్ నది చెనాబ్ నది

- జమ్మూ కాశ్మీర్

🍫26. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్

- గుజరాత్

🍫27. హిడ్కల్ ప్రాజెక్ట్ - ఘటప్రభా నది

- కర్ణాటక.

అణుబాంబు కనిపెట్టిందెవరు? Who is the inventor of Atom Bomb

అణుబాంబు కనిపెట్టిందెవరు? Who is the inventor of Atom Bomb

 *✅తెలుసు కుందాం✅*

*🟥అణుబాంబు కనిపెట్టిందెవరు?:*

🟢అణుబాంబు పరిశోధనలు 1945 లో ప్రారంభమై , రెండవ ప్రపంచ యుద్ధకాలములో " ఒప్పెన్‌ హైమర్ " అనే అమెరికన్‌ శాస్త్రజ్ఞుడి పర్యవేసణలో మెక్సికో ప్రాంతాల పరిశోధన్లు పూర్తయి 1945 లో కార్యరూపము దాల్చిందని ... అణుబాంబుని 1945 ఆగష్ట్ 06 న హిరోషిమా మీద , ఆగష్ట్ 09 న నాగసాకీ మీద వేసారు . 75 సం.లు దాటినా ఆ దారుణ పరిణామాలు మానవాళి ఇంకా మర్చిపోలేదు . నాగషాకీ , హిరోషిమా ల్లో జరిగిన ఘోర నరమేధం ఈ శాస్త్రజ్ఞుడు ఊహించని రీతిలో జరగడం చేత పశ్చాత్తాప పడి , భగవద్గీత తో భారతీయ వేదాంతం లో ఓదార్పు పొందాడట. హీరోషిమా, నాగసాకిలో వేసిన అణు బాంబు వల్ల 40 వేల మంది మరణించారు. మరో 35 వేల మంది గాయపడడమో, దాని ప్రభావానికి అస్వస్థకు గురి కావడమో జరిగింది.

Andhra Pradesh - YSR BHIMA Scheme details in Telugu

Andhra Pradesh - YSR BHIMA Scheme details in Telugu

 *పేద ‌కుటుంబాల‌కు అండ‌గా.. ‘వైఎస్సార్ బీమా’ పధకం*

YSR BHIMA Scheme: 


*పేద ‌కుటుంబాల‌కు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించాల‌నే ల‌క్ష్యంగా జ‌గ‌న్ స‌ర్కార్ తాజాగా ‘వైఎస్సార్ బీమా పధకానికి శ్రీకారం చుట్టింది.*


*ఈ పధకానికి సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది.*


*దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, బియ్యం కార్డు ఉన్నా కుటుంబ పెద్దలకు వైఎస్సార్‌ బీమా పథకం వ‌ర్తిస్తుంది.*


ఈ ప‌థ‌కం ద్వారా ఒక‌టిన్న‌ర కోట్ల కుటుంబాల పెద్ద‌లు, లేదా కుటుంబాన్ని పోషించే వ్య‌క్తులకు ఈ ప‌థ‌కం వ‌ర్తించును.


ఈ ప‌థ‌కం ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వమే చెల్లిస్తుంది.


ఈ ప‌థ‌కానికి నోడ‌ల్ ఏజెన్సీగా కార్మిక సంక్షేమ మ‌రియు ఉపాధి క‌ల్ప‌న శాఖ వ్య‌వ‌హ‌రిస్తుంది. కేత్ర‌స్థాయిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ ( వైఎస్ ఆర్ కాంత్రి ప‌థం) ముఖ్య కార్యనిర్వ‌హ‌ణాధికారి ద్వారా ఈ ప‌థ‌కం అమ‌లవుతుంది.


గ్రామ లేదా వార్డు స‌చివాల‌యంలో నియ‌మించ‌బ‌డిన వెల్ఫేర్ అసిస్టెంట్ ఈ ప‌థ‌కానికి రిజిస్ట్రేష‌న్ అథారిటీగా వ్య‌వ‌హ‌రిస్తారు.


*ప్ర‌యోజ‌నాలు:*


18 నుండి 50 సంవ‌త్సరాల మ‌ధ్య వ‌య‌సు ‌వారు ప్ర‌మాద‌వ‌శాత్తు శాశ్వ‌త వైక‌ల్యం సంభ‌వించినా లేదా మ‌ర‌ణించినా బాధిత కుటుంబానికి ఈ ప‌థ‌కం ద్వారా రూ. 5 ల‌క్ష‌లను ఉప‌శ‌మ‌నంగా అందిస్తారు.


అలాగే 51 నుంచి 70 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు ‌వారు ప్ర‌మాద‌వ‌శాత్తు మ‌ర‌ణిస్తే బాధిత కుటుంబానికి ఈ ప‌థకం ద్వారా రూ. 3 ల‌క్ష‌లను ఉప‌శ‌మ‌నంగా అందిస్తారు .


అదేవిధంగా 18 నుంచి 50 సంవ‌త్సరాల వారు స‌హ‌జ మ‌ర‌ణం పొందితే.. 2 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక ఉప‌‌శ‌మ‌నం అందుతాయి.


*అర్హ‌త‌లు: –*


రైస్ కార్డు కలిగి ఉండి.. 18 నుంచి 70 సంవ‌త్స‌రాలు గల కుటుంబ పెద్ద ఈ ప‌థ‌కానికి అర్హులు.


– ల‌బ్దిదారులు వ‌య‌సుని ఆధార్ కార్డు ద్వారా లెక్కిస్తారు.


– మాగాణి అయితే 2.5 ఎక‌రాల లోపు మాత్ర‌మే ఉండాలి. – అలాగే మెట్ట భూమి అయితే.. 5 ఎక‌రాల లోపు ఉండాలి.


*అన‌ర్హులు –*


ఆదాయ‌పు ప‌న్ను చెల్లింపు దారులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు, – పీఎఫ్ మ‌రియు ఈపీఎఫ్ చెల్లించే వారు – గృహిణులు , విద్యార్థులు, – యాచ‌కులు, మ‌తిస్థిమితం లేనివారు.


గ్రామ/వార్డు వలంటీర్‌ తమ స్మార్ట్‌ఫోన్లలో వైఎస్‌ఆర్‌ బీమా మొబైల్‌ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకొని బియ్యం కార్డుదారుని ఇంటి వద్దకు వెళ్లి రైస్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాలను తనిఖీచేసి కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబాన్ని పోషించే వ్యక్తిని ఎంపిక .


ఈ పథకానికి సంబంధించి అర్హులకు త్వరలోనే బీమా కార్డు మంజూరవుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.


*నామినీ గా ఎవరు ఉండాలి: –*


పాలసీదారు భార్య / 21 సం౹౹ పూర్తి కానీ కొడుకు / పెళ్లి కాని కూతురు/ వితంతువు అయిన కూతురు ఒకవేళ ల‌బ్దిదారు తో ఉంటే. వైఎస్సార్ బీమా ప‌థ‌కం / ల‌బ్దిదారు మీద ఆధార పడిన తల్లిదండ్రులు / వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలు.


ఏదైనా జాతీయ బ్యాంకు లో సేవింగ్స్ లేదా జన ధన్ ఖాతా తెరవాలి, అప్పుడే నామినీ పేరును సూచించాలి.


సంవత్సరానికి ప్రీమియం ₹15/- వ్యక్తులు చెల్లించాలి.


అనంత‌రం ల‌బ్దిదారుల‌కు ఐడెంటిటీ కార్డు ఇస్తారు అందులో విశిష్ట గుర్తింపు సంఖ్య(Unique Id), పాలసీ నెం. ఉంటాయి.


క్లెయిమ్ ఇంటిమేట్ చేసిన 15 రోజుల లోపల బీమా చెల్లించాలి.


క్లెయిమ్ అమౌంట్ నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్ ల‌కే పంపించ‌బ‌డుతుంది.


ఈ బీమా విషయంలో లేదా క్లెయిమ్ చెల్లింపు విషయం లో ఏమైనా ఫిర్యాదులు ఉంటే పీడీ, డీఆర్‌డీఏ సంప్రదించండి.


*ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే:*


*18-50 సం౹౹ ౼* *₹5,00,000/-*


*51-70 సం౹౹ ౼ ₹3,00,000/-*


*️సహజ మరణం:*


*18-50 సం౹౹ ౼ ₹2,00,000/-*


*ఎంపిక:


వాలంటీర్ల డోర్-to-డోర్ సర్వే ద్వారా.*


*రైస్ కార్డు కలిగి ఉండాలి (రైస్ కార్డుకు ఉండే అర్హతలు దీనికి వర్తిస్తాయి).*


*సచివాలయం పరిధిలో : సంక్షేమ కార్యదర్శి పర్యవేక్షిస్తారు.*


*️ఏదైనా జాతీయ బ్యాంకు లో సేవింగ్స్ లేదా జన ధన్ ఖాతా తెరవాలి, అప్పుడే నామినీ పేరును సూచించాలి.*


*️సంవత్సరానికి ప్రీమియం ₹15/- వ్యక్తులు చెల్లించాలి.*


*️సచివాలయాలు బీమా నమోదుకు,బీమా ప్రాసెసింగ్, క్లెయిమ్ చెల్లింపుకు facilitation సెంటర్లగా ఉంటాయి.*


*️వయస్సుకు ప్రామాణిక నిర్ధారణ పత్రంగా ఆధార్ కార్డును తీసుకుంటారు.*


*నామినీ గా ఎవరు ఉండాలి:*


    / *భార్య*


    / *21 సం౹౹ పూర్తి కానీ కొడుకు*


    / *పెళ్లి కాని కూతురు*


/ *వితంతువు అయిన కూతురు* *ఒకవేళ benificiary తో ఉంటే.*


    / *benificiary మీద ఆధార పడిన తల్లిదండ్రులు.*


/ *వితంతువు అయిన కోడలు లేదా ఆమె పిల్లలు.*


*️పై వాళ్ళు తప్ప ఇంక ఎవరిని నామినీ గా పెట్టరాదు.*


*️benificiary కి ఐడెంటిటీ కార్డు ఇస్తారు అందులో విశిష్ట గుర్తింపు సంఖ్య(Unique Id), పాలసీ నెం. ఉంటాయి.*


*️క్లెయిమ్ ఇంటిమేట్ చేసిన 15రోజుల లోపల బీమా చెల్లించాలి.*


*️SERP క్రింద ఉండే జిల్లా సమాఖ్య లు క్లెయిమ్ ని ప్రాసెస్ చేస్తాయి.*


*️క్లెయిమ్ అమౌంట్ నేరుగా వాళ్ళ బ్యాంకు అకౌంట్ కే transfer చేయబడుతుంది, చేతికి ఇవ్వరు( బ్యాంకు ఖాతా ఎల్లపుడు రన్నింగ్ లో పెట్టుకోవడం benificiary బాధ్యత)*


*️బీమా enrollment విషయంలో లేదా క్లెయిమ్ చెల్లింపు విషయం లో  ఏమైనా ఫిర్యాదులు ఉంటే PD, DRDA గారిని సంప్రదించండి*

Gk - Environment Related Days

Gk - Environment Related Days

 *🔥Environment Related Days🔥*


☃️World Wetlands Day - 02 Feb


☃️World Wildlife Day - 03 March


☃️International Day of Action for Rivers - 14 March


☃️International Day of Forests - 21 March


☃️World Water Day - 22 March


☃️World Meteorological Day - 23 March


☃️Earth Day - 22 Apr


☃️International Day for Biological Diversity - 22 May


☃️World Environment Day - 05 June


☃️World Oceans Day - 08 June


☃️International Climate Change Day - 21 June


☃️World Rainforest Day - 22 June


☃️World Nature Conservation Day

- 28 July


☃️Ozone Day - 16 Sep


☃️World Environmental Health Day - 26 Sep


☃️World Rivers Day - Last Sunday of September


☃️World Animal Day - 4 Oct


☃️International Day of Climate Action - 24 Oct


☃️World Fisheries Day - 21 Nov


☃️World Soil Day - 05 Dec


☃️International Mountain Day - 11 Dec


Important Main passes of india

Important Main passes of india

 🔴Important Main passes of india


🔆Rohtang Pass 

 Manali, it is  a high mountain pass that connects the Kullu Valley with the Lahaul and Spiti valleys  of Himachal Pradesh.


🔆Shipkila 

 Himachal Pradesh (India) with Tibet (China).


🔆Pir-Panjal 

• The traditional pass between Jammu and Srinagar lies on the Mughal Road.


🔆Chang La 

• This is a pass through the Indus gorge in the Ladakh region of the Jammu and  

Kashmir State.


🔆Zojila 

pass connects the valley of Kashmir with Kargil and Leh.


🔆Bhorghat 

• Situated in the Western Ghats, this pass connects Mumbai with Pune.


🔆Palghat 

• Lying between the Palghat Hills in the north and the Nilgiri Hills in the south, the  Palakkad Gap is generally known as the Palghat.


🔆Lipu Lekh 

 Uttarakhand,


🔆Niti Pass 

 Uttarakhand, this pass connects India with Tibet  

(China).


🔆Mana Pass 

 Uttarakhand with Tibet.


🔆Nathula Pass 

• The Nathula Pass is located on the Indo-China border, connecting the Indian state of  

Sikkim with China.


🔆Diphu Pass 

•  Arunachal Pradesh, it  

connects Arunachal Pradesh with Mandalay (Myanmar).


🔆Dihang Pass 

 Arunachal Pradesh, the  

Dihang Pass connects India with Tibet.


🔆Bomdila pass and sella pass

 Arunachal Pradesh



🔆Banihal Pass (Jawahar Tunnel) 

 this is mountain pass in the Panjal Range which  joins the Jammu Division with the Kashmir Valley.


🔆Asirgarh Pass 

Madhya Pradesh.


🔆Aghil Pass (Karakoram Range) 

• Joining Ladakh with the Sinkiang province of China.


🔆Haldighati -Rajasthan.

Important Health related Days

Important Health related Days

 🔮Important Health related Days


🧬04 Jan - Siddha Day 


🧬04 Feb - World Cancer Day


🧬11 Feb - Unani Day 


🧬21 March - World Down Syndrome Day


🧬24 March - World Tuberculosis Day


🧬02 Apr - World Autism Awareness Day


🧬07 Apr - World Health Day


🧬10 Apr - World Homeopathy Day


🧬17 Apr - World Hemophilia Day


🧬25 Apr - World Malaria Day


🧬05 May - International Midwives Day


🧬05 May(1st Tuesday of May) - World Asthma Day


🧬08 May - World Thalassaemia Day 


🧬06 May - National Nurses Day 

Join🔜 @ExamPlus_Official


🧬12 May - International Nurses Day


🧬06 -12 May - National Nurses Week 


🧬17 May - World Hypertension Day 


🧬18 May - World AIDS Vaccine Day


🧬21 June - International Yoga Day


🧬25 June - World Vitiligo Day


🧬01 July - Doctors Day


🧬28 July - World Hepatitis Day


🧬Second Saturday of Sep - World First Aid Day


🧬17 Sep - World Patient Safety Day


🧬21 Sep - World Alzheimers Day


🧬25 Sep - World Pharmacist Day


🧬28 Sep - World Rabies Day


🧬29 Sep - World Heart Day


🧬12 Oct - World Arthritis Day


🧬20 Oct - World Osteoporosis Day


🧬21 Oct - World Iodine Deficiency Day


🧬24 Oct - World Polio Day


🧬06 Nov - Ayurveda Day 


🧬12 Nov - World Pneumonia Day


🧬14 Nov - World Diabetes Day


🧬18 Nov - Natoropathy Day


🧬01 Dec - ‌‌‌‌‌‌World AIDS Day

‌‍

Important Days of the Year dedicated to Animals

 ❇️ Important Days of the Year dedicated to Animals ❇️ 


🐧 20 Jan ➖ Penguin Awareness Day

🦓 31 Jan ➖ International Zebra Day

🦝 3rd Saturday of Feb ➖ World Pangolin Day

🎋 27 Feb ➖ International Polar Bear Day

🍃 3 March ➖ World Wildlife Day

 🦆20 March ➖ World Sparrow Day

🦔 20 March ➖ Frog Day 

🐶 11 Apr ➖ National Pet Day 

🐬 14 Apr ➖ Dolphin Day

🐲 24 Apr  ➖ World Day for Laboratory Animals

🦅 2nd Saturday of May ➖ International Migratory Bird Day

🦧 15 May ➖ International Kangaroo Care Awareness Day

🐢 23 May ➖ World Turtle Day

🔹 21 June ➖ World Giraffe Day

🐫 22 June ➖ World Camel Day

🐅 29 July ➖ International Tiger Day

🐱 8 August ➖ World Cat Day

🦁 10 August ➖ World Lion Day

🐘 12 August ➖ World Elephant Day

🔰 19 August➖ International Orangutan Day

🔰 3rd Saturday of Sep ➖ International Red Panda Day

🦏 22 Sept ➖ World Rhino Day

🐆 23 Oct ➖ International Snow Leopard Day

🐆 4 Dec ➖ International Cheetah Day

🐒 14 Dec ➖ International Monkey Day.❇️ Important Days of the Year dedicated to Animals ❇️ 


🐧 20 Jan ➖ Penguin Awareness Day

🦓 31 Jan ➖ International Zebra Day

🦝 3rd Saturday of Feb ➖ World Pangolin Day

🎋 27 Feb ➖ International Polar Bear Day

🍃 3 March ➖ World Wildlife Day

 🦆20 March ➖ World Sparrow Day

🦔 20 March ➖ Frog Day 

🐶 11 Apr ➖ National Pet Day 

🐬 14 Apr ➖ Dolphin Day

🐲 24 Apr  ➖ World Day for Laboratory Animals

🦅 2nd Saturday of May ➖ International Migratory Bird Day

🦧 15 May ➖ International Kangaroo Care Awareness Day

🐢 23 May ➖ World Turtle Day

🔹 21 June ➖ World Giraffe Day

🐫 22 June ➖ World Camel Day

🐅 29 July ➖ International Tiger Day

🐱 8 August ➖ World Cat Day

🦁 10 August ➖ World Lion Day

🐘 12 August ➖ World Elephant Day

🔰 19 August➖ International Orangutan Day

🔰 3rd Saturday of Sep ➖ International Red Panda Day

🦏 22 Sept ➖ World Rhino Day

🐆 23 Oct ➖ International Snow Leopard Day

🐆 4 Dec ➖ International Cheetah Day

🐒 14 Dec ➖ International Monkey Day. 




List of Commonly Used Abbreviations

🔵Full Form important question..🔵
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

1. PAN - permanent account number.
2. PDF - portable document format.
3. SIM - Subscriber Identity Module.
4. ATM - Automated Teller machine.
5. IFSC - Indian Financial System Code.
6. FSSAI(Fssai) - Food Safety & Standards
Authority of India.
7. Wi-Fi - Wireless fidelity.
8. GOOGLE - Global Organization Of Oriented
Group Language Of Earth.
9. YAHOO - Yet Another Hierarchical Officious
Oracle.
10. WINDOW - Wide Interactive Network
Development for Office work Solution.
11. COMPUTER - Common Oriented Machine.
Particularly United and used under Technical and
Educational Research.
12. VIRUS - Vital Information Resources Under
Siege.
13. UMTS - Universal Mobile Telecommunicati
ons System.
14. AMOLED - Active-matrix organic light-
emitting diode.
15. OLED - Organic light-emitting diode.
16. IMEI - International Mobile Equipment
Identity.
17. ESN - Electronic Serial Number.
18. UPS - Uninterruptible power supply.
19. HDMI - High-Definition Multimedia Interface.
20. VPN - Virtual private network.
21. APN - Access Point Name.
22. LED - Light emitting diode.
23. DLNA - Digital Living Network Alliance.
24. RAM - Random access memory.
25. ROM - Read only memory.
26. VGA - Video Graphics Array.
27. QVGA - Quarter Video Graphics Array.
28. WVGA - Wide video graphics array.
29. WXGA - Widescreen Extended Graphics Array.
30. USB - Universal serial Bus.
31. WLAN - Wireless Local Area Network.
32. PPI - Pixels Per Inch.
33. LCD - Liquid Crystal Display.
34. HSDPA - High speed down-link packet
access.
35. HSUPA - High-Speed Uplink Packet Access.
36. HSPA - High Speed Packet Access.
37. GPRS - General Packet Radio Service.
38. EDGE - Enhanced Data Rates for Globa
Evolution.
39. NFC - Near field communication.
40. OTG - On-the-go.
41. S-LCD - Super Liquid Crystal Display.
42. O.S - Operating system.
43. SNS - Social network service.
44. H.S - HOTSPOT.
45. P.O.I - Point of interest.
46. GPS - Global Positioning System.
47. DVD - Digital Video Disk.
48. DTP - Desk top publishing.
49. DNSE - Digital natural sound engine.
50. OVI - Ohio Video Intranet.
51. CDMA - Code Division Multiple Access.
52. WCDMA - Wide-band Code Division Multiple
Access.
53. GSM - Global System for Mobile
Communications.
54. DIVX - Digital internet video access.
55. APK - Authenticated public key.
56. J2ME - Java 2 micro edition.
57. SIS - Installation source.
58. DELL - Digital electronic link library.
59. ACER - Acquisition Collaboration
Experimentation Reflection.
60. RSS - Really simple syndication.
61. TFT - Thin film transistor.
62. AMR- Adaptive Multi-Rate.
63. MPEG - moving pictures experts group.
64. IVRS - Interactive Voice Response System.
65. HP - Hewlett Packard.
Do we know actual full form of some words???
66. News paper =
North East West South past and present events
report.
67. Chess =
Chariot, Horse, Elephant, Soldiers.
68. Cold =
Chronic Obstructive Lung Disease.
69. Joke =
Joy of Kids Entertainment.
70. Aim =
Ambition in Mind.
71. Date =
Day and Time Evolution.
72. Eat =
Energy and Taste.
73. Tea =
Taste and Energy Admitted.
74. Pen =
Power Enriched in Nib.
75. Smile =
Sweet Memories in Lips Expression.
76. etc. =
End of Thinking Capacity
77. OK =
Objection Killed
78. Or =
Orl Korec (Greek Word)
79. Bye =
_Be with you


భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య - సెప్టెంబర్ 15 ఇంజనీర్ దినోత్సవం సందర్భంగా

*'భారతరత్న' మోక్షగుండం విశ్వేశ్వరయ్య*

 సెప్టెంబర్ 15
ఇంజనీర్  దినోత్సవం సందర్భంగా

*"ప్రజల సంపాదనాశక్తిని, కార్యదక్షతను నైపుణ్యాన్ని వివిధములైన చేతిపనుల ద్వారా పెంపొందించాలి. చేతనైన వారందరూ కష్టించి పని చేసే వీలు కల్పించాలి. యాంత్రిక శక్తిని ఉపయోగించుకుని దేశ పారిశ్రామిక ప్రగతికి ముందంజ వేయాలి. భారతీయులలో ప్రబలంగా ఉన్న 'అంతా తలరాత' అన్న అలస భావం రూపుమాపి నిరంతర కృషి ద్వారా సంపదను సాధించే దీక్షను, కర్తవ్య పాలనను ప్రజలలో రేకెత్తించుట ప్రభుత్వం కర్తవ్యం."*

1912 మైసూరు సంస్థాన దివానుగా అధికారాన్ని చేపడుతూ శ్రీ విశ్వేశ్వరయ్య చేసిన ప్రసంగం నుండి పై వాక్యాలు ఉటంకింపబడినాయి. విశ్వవిఖ్యాత ఇంజనీర్‌గా, పాలనాదక్షుడుగా, రాజనీతిజ్ఞుడుగా, నిష్కామ దేశభక్తుడిగా అఖండ కీర్తిని ఆర్జించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య.

విశ్వేశ్వరయ్య పూర్వీకులు నేటి ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామం నుండి సుమారు రెండు శతాబ్దాల క్రితం, కర్ణాటక రాష్ట్రం (అప్పట్లో మైసూరు) లోని, చిక్క బళ్ళాపుర సమీపంలోని ముద్దేనహళ్ళిలో స్థిరపడినారు. అక్కడే విశ్వేశ్వరయ్య 1861 సెప్టెంబర్ 15వ తేదీన జన్మించారు. తండ్రి శ్రీనివాస శాస్త్రి. తల్లి వెంకట లక్ష్మమ్మ. వారిదో సామాన్య కుటుంబం. బాల్యంలోనే తండ్రి మరణించాడు. మేన మామ రామయ్య బాలుడైన విశ్వేశ్వరయ్యను చేరదీసి బెంగుళూరు సెంట్రల్ కాలేజీలో చదువుకునే ఏర్పాటు చేశాడు.

విశ్వేశ్వరయ్య గారి విద్యార్థి జీవితం విద్యాభ్యాసం సాగించే వారందరికీ దిక్సూచి. మేనమామ ఇంట్లోవుంటూ కాలేజీ ఫీజులకోసం ప్రైవేట్ ట్యూషన్ చెబుతూ 1881లో పట్టభద్రులయ్యారు. సెంట్రల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఛార్లెస్ వాటర్స్ విశ్వేశ్వరయ్య నెంతగానో ప్రోత్సహించాడు. గణితంలో అసామాన్య ప్రతిభకల విశ్వేశ్వరయ్య గారి నుండి అధ్యాపకులే తమ సంశయాలను పరిష్కరించుకునేవారు. శిష్యుని కుశాగ్ర బుద్ధికి ముగ్ధుడైన ప్రిన్సిపాల్ తాను ఉపయోగించుకునే వెబ్‌స్టర్ డిక్షనరీని బహుమానంగా ఇచ్చాడు. తన కోటుకున్న బంగారు బొత్తాములను భార్యద్వారా శిష్యుడు విశ్వేశ్వరయ్యకు పంపారు. అదీ ఆనాటి గురుశిష్యుల అనుబంధం - శిష్యవాత్సల్యం.

ఇటువంటి పెద్దలు ఆదరించినందువల్లనే బాలుడైన విశ్వేశ్వరయ్య, ఆ తర్వాత డా. ఎం.వి; సర్. ఎం.వి; భారతరత్న ఎం.వి. అంటూ ప్రస్తుతింపబడినారు. అప్పట్లో మైసూరు సంస్థాన దివానుగా వుండిన దివాన్ రంగాచార్లుగారు విశ్వేశ్వరయ్య విద్యావినయములను గుర్తించి ఇంజనీరింగ్ విద్యాభ్యాసం సాగించేందుకు స్కాలర్‌షిప్ మంజూరు చేసి, పూనేకు పంపారు. ఇంజనీరింగ్ పరీక్షలో బొంబాయి రాష్ట్రంలో సర్వప్రథముడుగా ఉత్తీర్ణులైన విశ్వేశ్వరయ్యగారిని రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అసిస్టెంట్ ఇంజనీర్ గా నియమించింది. ఏడాది లోపునే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా నియమించారు. ఆ రోజుల్లో అందులోను ఆంగ్లేయుల పాలనలో అంత త్వరలోనే పదవీ ఉన్నతి పొందడం చాల అరుదు. పూనేలో ఉన్నప్పుడే గోఖలే, తిలక్, రనడే వంటి మహనీయుల సాహచర్యం విశ్వేశ్వరయ్య గారికి లభించింది. గాంధీజీ, నెహ్రూల కంటే వయస్సులో పెద్ద విశ్వేశ్వరయ్య.

ఆంగ్ల పాలకులు విశ్వేశ్వరయ్యగారి కార్యదీక్షను గుర్తించి ప్రపంచ జలాశయాలలో ఒకటిగ పెద్దదైన బరాజ్ (సింధురాష్ట్రం) నిర్మాణానికి ప్రత్యేక ఇంజనీర్ గా నియమించారు. బ్రహ్మాండమైన ఈ జలాశయ నిర్మాణం నాలుగేళ్ళలో పూర్తి అయింది.

1901లో భారత ప్రభుత్వ ప్రతినిధిగ విశ్వేశ్వరయ్యగారు జపాన్ దేశం వెళ్ళి అచట కుటీర పరిశ్రమల తీరుతెన్నులను అవలోకించారు. ఆ పద్ధతిలో కుటీర పరిశ్రమల అభివృద్ధికి బృహత్ పధకాన్ని సిత్థపరచి ప్రభుత్వానికి అందించారు. జపాన్ పర్యటనానంతరం, విశ్వేశ్వరయ్యగారు పూనా నగర నీటి సరఫరా పధకాన్ని రూపొందించారు. ఆ నిర్మాణ కాలంలోనే ఆటోమేటిక్ స్లూస్‌గేట్ రూపొందించారు. ఈ స్లూస్‌గేట్ నిర్మాణం ప్రపంచ ఇంజనీర్ల మన్ననలందుకున్నది. ఈ కొత్త పరిశోధనను తన పేరు మీద పేటెంట్ చేసుకోవలసిందిగ మిత్రులు సూచించారు. తన కార్యనిర్వహణలో భాగంగా సాగినదికాన పేటెంట్ తీసుకోవటం సముచితం కాదన్నాడు. లార్డ్ కిచనర్ స్లూస్‌గేట్ నిర్మాణంలో విశ్వేశ్వరయ్య ప్రతిభను కొనియాడాడు.

1906లో ఏడెన్ నగరం నీటి, సరఫరా ప్రణాళికను రూపొందించారు. ప్రభుత్వం విశ్వేశ్వరయ్యగారిని సూపరింటెండెంట్ ఇంజనీర్ గా నియమించింది. అప్పుడే కొల్హాపూర్, ధార్వాడ, బిజాపూర్ మొదలగు పట్టణాలలో మంచినీటి పథకాలను సిద్ధపరచారు. బొంబాయి రాష్ట్ర ప్రభుత్వోద్యోగాన్ని స్వయంగా వదులుకున్నారు. రెండు సంస్థానాల నుండి ఛీఫ్ ఇంజనీర్ పదవులు చేపట్టమని ఆహ్వానాలు వచ్చాయి. అన్నిటిని తిరస్కరించి ఇటలీ, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, మొదలగు దేశాలలోని బృహన్నిర్మాణాలను పరిశీలించి, ఆయాదేశ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరిపి 1909లో స్వదేశం వచ్చారు.

ఇటలీ పర్యటనలో ఉన్నపుడే హైదరాబాద్ నగర రక్షణా పథకం నిర్మించుటకు స్పెషల్ చీఫ్ ఇంజనీర్ గా ఆహ్వానించాడు నిజాం. విశ్వేశ్వరయ్యగారి నేతృత్వంలో సాగినవే హుసేన్‌సాగర్, హైదరాబాదు నగర విస్తృత పథకాలు.

స్వరాష్ట్రమైన మైసూరు సంస్థానాన్ని ఆదర్శ సంస్థానంగా తీర్చి దిద్దిన వారు ఆయన. చీఫ్ ఇంజనీర్ గా, ఆ తర్వాత దివాన్ గా పనిచేసిన ఆరేళ్ళలో అరువదేళ్ళ అభివృద్ధిని సాధించారు. హెబ్బాళ్ వ్యవసాయ కళాశాల, మైసూరు విశ్వవిద్యాలయం, ఛేంబర్ ఆఫ్ కామర్స్, సోప్ ఫ్యాక్టరీ, కన్నడ సాహిత్య పరిషత్ మున్నగు వాటిని నెలకొల్పారు.

విశ్వేశ్వరయ్య గారి ప్రజ్ఞా ప్రతిఫలంగా నిర్మింపబడినదే కృష్ణరాజసాగర్, లక్షలాది ఎకరాల మెట్ట భూములు సస్యశ్యామలంగా మారాయి. బృందావన్ ఉద్యానవనం వారి ప్రకృతి ప్రేమకు నిదర్శనం. భారతదేశ సంస్థానాలలో మొదటి ఉక్కు కర్మాగారం నెలకొల్పినది మైసూరు.

మైసూరు మహారాజా గారితో అభిప్రాయభేదం రాగా రాజీనామా చేసి బొంబాయి వెళ్ళిపోయారు. విదేశీ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ప్రారంభింపబడిన భద్రావతి కర్మాగార నిర్మాణ కార్యక్రమం దెబ్బతినింది మహారాజా గత్యంతరం లేక బొంబాయిలోని విశ్వేశ్వరయ్య గారిని ఆహ్వానిస్తూ 'ఈ కర్మాగార పథకం మీదే, అది ఇప్పుడు రోగ గ్రస్తమైంది. మీరు ప్రారంభించిన ప్రజాప్రతినిధి సభ సభ్యులు దీనిని తెల్ల ఏనుగ అంటూ ఎగతాళి చేస్తున్నారు. మీరు వచ్చి దీనిని పునరుద్ధరించాలి' అని వ్రాశారు.

కర్మాగార పర్యవేక్షణ, వ్యయం మున్నగు వాటిపై అన్ని అధికారాలు విశ్వేశ్వరయ్య గారు చేపట్టారు. కార్మికులకు కొద్దిగా కూలీ పెంచారు. అవినీతిపరులైన విదేశీ ఇంజనీర్లను తొలగించారు. రేయింబగళ్ళు కార్మికులను ప్రోత్సహిస్తూ నష్టాల ఊబిలో నుండి లేవనెత్తి రెండేళ్ళలో లాభాలు చూపించారు. పెద్ద కర్మాగారాల్లో సుశిక్షితులైన భారతీయులనే నియమించాలని అందుకు శిక్షణావకాశాలు పెంచాలన్నారు. భద్రావతి కర్మాగారం పర్యవేక్షకులుగా మహారాజా గారి నుండి లభించిన లక్షా యాభైవేల రూపాయలను తిప్పి పంపుతూ, ఆ పైకంతో పారిశ్రామిక శిక్షణ సంస్థను నెలకొల్పమని రాజాగారిని కోరారు విశ్వేశ్వరయ్య. ఆ సంస్థకు తన పేరు పెట్టుటకు సమ్మతింపలేదు. ఆ విధంగా వెలిసిందే జయ చామరాజేంద్ర ఆక్యుపేషనల్ ఇన్‌స్టిస్టూట్.

విశ్వేశ్వరయ్యగారు 1921లో భారత ఉత్పత్తిదారుల సమాఖ్యను నెలకొల్పి జీవి తాంతం ఆ సమాఖ్య అధ్యక్షులుగా పనిచేశారు. 1922 లో అఖిలపక్ష రాజకీయ సమ్మేళనానికి, 1923లో ఇండియన్ సైన్స్ కాంగ్రెసుకు అధ్యక్షత వహించారు.

విశ్వేశ్వరయ్య స్వదేశీ సంస్థాన ప్రజలు బ్రిటిష్ ఇండియాలోని ప్రజలకంటే ఎక్కువ బాధలు పడుతున్నారని గ్రహించి వారి స్వేచ్ఛకోసం గొప్ప కృషి చేశారు. మైసూరు సంస్థానంలో ప్రజాప్రతినిధి సభను ప్రారంభించారు.

కర్తవ్య నిర్వహణలో, నిజాయితీలో అటువంటి వారు అరుదు. దివాన్ పదవి స్వీకరించే ముందు బంధుమిత్రులను ఆహ్వానించారు. " నేను దివాన్ పదవిలో వుండగా ఎటువంటి ఉద్యోగాలు కోరమని, సిఫార్సులు చేయమని వాగ్ధానం చేయమన్నారు." తన బంధువులను ప్రభుత్వోద్యోగాల నుండి తప్పించి, ఇతర వృత్తులను చేపట్టుటకు సొంతపైకం యిచ్చారు.

మైసూరు సంస్థానంలో మోటార్ కార్ల నిర్మాణం ప్రారంభించాలనుకున్నారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తిరస్కరించింది. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇండియాలో విమాన నిర్మాణం అత్యవసరమైనది. విశ్వేశ్వరయ్య గారి సలహా మేరకు బెంగుళూరులో భారత ప్రభుత్వం విమాన కార్ఖానా నెలకొల్పింది. విశాఖ పట్నంలోని నౌకా నిర్మాణ పధకాన్ని రూపొందించి వాల్ చంద్ హీరాచంద్ గారిచే ప్రారంభింపచేసిన వారాయనే.

గాంధీజీ - విశ్వేశ్వరయ్యగారులు దేశాభివృద్ధి సాధనలో భిన్న దృక్పధాలు కలవారు. గాంధీజీ గ్రామీణ పరిశ్రమలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. విశ్వేశ్వరయ్యగారు భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చి కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహించాలన్నారు.

" నా అభిప్రాయాలు ఎలా ఉన్నా, మీ సహకారం లభించే అదృష్టానికి నోచుకున్నందుకు సంతోషిస్తున్నాను. నా అభిప్రాయాలను వ్యతిరేకించినా మీ దేశ భక్తి, శక్తిసామర్ధ్యాల పట్ల నాకున్న గౌరవం ఏనాటికీ తరగదు." అన్నారు గాంధీజీ.

"మీరేమైనా చెప్పండి. భారత గ్రామీణుల గురించి నాకు మీకంటే ఎక్కువగా తెలుసు" అని గాంధీజీ అన్నప్పుడు, "నేను మీకంటే పదేళ్ళు పెద్దవాడినన్న విషయం గమనించ మనవి. దేశ ఆర్ధిక ప్రగతి విషయంలో మీ కంటే ఎక్కువ అవగాహన నాకుంది " అంటూ బదులు వ్రాశారు విశ్వేశ్వరయ్యగారు, గాంధీజీకి వ్రాసిన జాబులో.

భారతదేశంలోని పెద్ద జలాశయాలు, ఆనకట్టలు నిర్మించుటలో వారి సలహాలను ప్రభుత్వం గొప్పగా భావించేది.

తొంభై ఏళ్ళ వయసులో ప్రధాని నెహ్రూ ఆహ్వానాన్ని మన్నించి పాట్నా వద్ద గంగానదిపై వంతెన నిర్మాణ పథకాన్ని, కొందరు ఇంజనీర్ల బృందంతో రూపొందించారు. తుంగభద్ర ప్రాజెక్టు పథక శిల్పి వారే.

విశ్వేశ్వరయ్య నిజాయితీకి సాకారం. ఒక మారు విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. కొంత పైకం కావాల్సి వచ్చింది. మైసూరు బ్యాంక్ మేనేజర్ బి. వి. నారాయణరెడ్డి గారికి ముందుగా ఫోన్ చేసి, బ్యాంక్ కు వెళ్ళారు. మేనేజర్ వారినెంతో గౌరవంగా లోపలికి తీసుకెళ్ళారు. అన్ని దరఖాస్తులు సిద్ధమైనాయి. విశ్వేశ్వరయ్య తమ వద్దవున్న భారత ప్రభుత్వ రుణ పత్రాలను ఇచ్చి తాకట్టు పెట్టుకోమన్నారు. మేనేజర్ ఆశ్చర్యంతో "తాము తాకట్టు పెట్టడమా! ఇది మీరు నెలకొల్పిన బ్యాంక్" అంటూ తిప్పి ఇవ్వగా విశ్వేశ్వరయ్య తీసుకోలేదు. బ్యాంకు వారు తక్కువ వడ్డీ సూచించగా - అందరికీ విధించే వడ్డీ వేయమన్నారు. ఎక్కువ వడ్డీ వేయమని కోరిన వారు విశ్వేశ్వరయ్య గారొక్కరే, అన్నారు బ్యాంక్ మేనేజర్.

విశ్వేశ్వరయ్య వ్యక్తిగత జీవితం అతి క్రమశిక్షణతో వుండేది. రెండు సార్లు భార్యావియోగం కల్గింది. మూడోసారి పెళ్ళాడిన భార్య వ్యవహారం నచ్చక ఆమెకు విడాకులిచ్చారు. కాల నియమాన్ని, ఆహార విహార నియమాలను కచ్ఛితంగా పాటించిన విశ్వేశ్వరయ్య 100 సం. వయస్సులో కళ్ళద్దాలు లేకుండా చదివేవారు. "గంధపు చెక్క వలె సేవలొ అరిగిపో, కాని ఇనుములా తుప్పు పట్టవద్దు." అనునది వారి జీవన ధ్యేయం. దేశ విదేశాలలోని విశ్వవిద్యాలయాలు వారిని సత్కరించాయి. 1961లో విశ్వేశ్వరయ్య గారి శతజయంతి ఉత్సవాలకు భారత ప్రధాని నెహ్రూ విచ్చేశారు." మేము మాటలతో కాల యాపన చేశాం. మీరు నిరంతర క్రియాశూరులై నవభారత నిర్మాణానికి కృషి చేసిన మహనీయు" లంటూ నివాళులర్పించారు నెహ్రూ.

భారత ప్రభుత్వం విశ్వేశ్వరయ్యగారిని 'భారతరత్న' బిరుదంతో సత్కరించింది. విశ్వేశ్వరయ్య ప్లాన్‌డ్ ఎకానమి ఆఫ్ ఇండియా రికన్‌స్ట్రక్టింగ్ ఇండియా, మెమాయిర్స్ ఆఫ్ మై వర్కింక్ లైఫ్ (ఆత్మకథ) రచించారు.

జీవితాంతం దేశ ప్రగతికి, ప్రజా శ్రేయస్సుకు కృషి చేసిన విశ్వేశ్వరయ్యగారు 12-4-1962న దివంగతులయ్యారు