Showing posts with label Bank Jobs. Show all posts
Showing posts with label Bank Jobs. Show all posts
BANK OF BARODA RECRUITMENT 2021 - 511 VARIOUS VACANCIES

BANK OF BARODA RECRUITMENT 2021 - 511 VARIOUS VACANCIES

 బ్యాంక్ ఆఫ్ బరోడలో 511 పోస్టులు 

• ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.04.2021

ముంబైలోని ప్రభుత్వరంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ విభాగం.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తన వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ ను బలోపేతం చేయడానికి సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఈ-రిలేషన్‌షిప్ మేనేజర్, టెర్షరీ హెడ్, గ్రూప్ హెడ్, ప్రొడక్ట్ హెడ్-ఇన్వెస్ట్ మెంట్ అండ్ రీసెర్చ్, హెడ్-ఆపరేషన్స్ అండ్ టెక్నాలజీ, డిజిటల్ సేల్స్ మేనేజర్, ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్-మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 29వ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.



 * మొత్తం పోస్టుల సంఖ్య: 511


పోస్టుల వివరాలు: సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్-407, ఈ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్-50, టెరరీ హెడ్-44, గ్రూప్ హెడ్-06, ప్రొడక్ట్ హెడ్(ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్)-01, హెడ్(ఆపరేషన్స్ -టెక్నాలజీ)-01, డిజిటల్ సేల్స్ మేనేజర్-01, ఐటీ ఫంక్షనల్

అనలిస్ట్ మేనేజర్-01.


సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్: అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ/నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 24-35 ఏళ్ల మధ్య ఉండాలి.


ఈ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 28-35 ఏళ్ల మధ్య

ఉండాలి.


 టెర్షరీ హెడ్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ/నాలెడ్జ్ ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి

27-40ఏళ్ల మధ్య ఉండాలి.



* గ్రూప్ హెడ్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. వయసు:

01.04.2021 నాటికి 31-45 ఏళ్ల మధ్య ఉండాలి.


ప్రొడక్ట్ హెడ్(ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్): అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 28-45ఏళ్ల మధ్య

ఉండాలి.



* హెడ్(ఆపరేషన్స్-టెక్నాలజీ): అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణుల

వ్వాలి. సంబంధిత పనిలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.


 డిజిటల్ సేల్స్ మేనేజర్: అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 26-40 ఏళ్ల మధ్య ఉండాలి.


ఐటీ ఫంక్షనల్ అనలిస్ట్ మేనేజర్:


అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంజనీరింగ్/సైన్స్/టెక్నాలజీ వారికి ప్రాధాన్య తనిస్తారు. సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయసు: 01.04.2021 నాటికి 26-35 ఏళ్ల మధ్య

ఉండాలి.


ఎంపిక విధానం: విద్యార్హతలు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ /గ్రూప్ డిస్కషన్/ఇతర ఎంపిక

ప్రక్రియకు పిలుస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


* ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 29.04.2021 వెబ్సైట్: www.bankofbaroda.co.in/careers.html

క్లర్కు కొలువులకు ఎస్‌బీఐ పిలుపు  8,904 పోస్టులకు ప్రకటన విడుదల

క్లర్కు కొలువులకు ఎస్‌బీఐ పిలుపు 8,904 పోస్టులకు ప్రకటన విడుదల

🔲క్లర్కు కొలువులకు ఎస్‌బీఐ పిలుపు
8,904 పోస్టులకు ప్రకటన విడుదల



ప్రపంచంలోని తొలి వంద అతి పెద్ద బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒకటి. మన దేశంలో ఇదే అన్నిటి కంటే పెద్దది. సాధారణ డిగ్రీ అర్హతతో ఆ అత్యున్నత బ్యాంకులోకి ఉద్యోగిగా అడుగుపెట్టే అవకాశం ఈ సంవత్సరానికి మళ్లీ వచ్చింది. దాదాపు తొమ్మిది వేల క్లర్కుల (జూనియర్‌ అసోసియేట్స్‌) ఖాళీలతో ప్రకటన వెలువడింది. రెండు వారాల్లో బ్యాంకు ఉద్యోగార్థులకు ఇది రెండో తీపికబురు. ఇటీవల రెండువేల పీవో పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చింది. ఇప్పుడు క్లర్కులు. అభ్యర్థులు పరీక్ష స్వరూపాన్ని, అందుబాటులో ఉన్న సమయాన్ని, తమ బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని సరైన ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే విజయాన్ని సాధించవచ్చు.

ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా 8904 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులను (251 బ్యాక్‌లాగ్‌లతో కలిపి) భర్తీ చేయనుంది. వాటిలో తెలంగాణ రాష్ట్రంలో 425, ఆంధ్రప్రదేశ్‌లో 253 పోస్టులు ఉన్నాయి. నియామకాలను రాష్ట్రాల వారీగా చేపడతారు. అభ్యర్థులు ఏ రాష్ట్రానికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఆ రాష్ట్రంలోనే రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు అక్కడి భాష (లోకల్‌ లాంగ్వేజి) పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం
ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు, అభ్యర్థులు ఎంపిక చేసుకునే లోకల్‌ లాంగ్వేజిపై నిర్వహించే టెస్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్‌ పరీక్షలో ప్రతిభ చూపే అభ్యర్థుల్లో పోస్టుల సంఖ్యకు 10 రెట్ల మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో సాధించిన మార్కులతో  మెరిట్‌ లిస్ట్‌ తయారుచేస్తారు.

ఉమ్మడి ప్రిపరేషన్‌
ఎస్‌బీఐ పీఓ, క్లర్క్‌ పరీక్షలు రెండింటికీ కలిపి ఉమ్మడిగా ఒకటే ప్రిపరేషన్‌ సరిపోతుంది. పీఓకు ప్రిపేర్‌ అయితే క్లర్క్‌ పరీక్షకు సన్నద్ధమైనట్లే.  ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ పరీక్షలోని ప్రశ్నల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించినంత వరకు పెద్ద తేడాలు లేవు. దాదాపు ఒకేలా ఉంటున్నాయి. మెయిన్స్‌ పరీక్షలో మాత్రం రెండింటికీ చాలా భేదం ఉంటుంది. క్లర్క్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష జూన్‌ నెల చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. అంటే రెండు నెలలకు పైగా సమయం ఉంటుంది. ఈలోగా ప్రిపరేషన్‌ పూర్తి చేయాలి. పీఓ, క్లర్క్‌ పరీక్షలు రెండింటిని రాస్తున్న అభ్యర్థులు మాత్రం జూన్‌ 8న నిర్వహించే పీఓ ప్రిలిమ్స్‌ నాటికి తమ ప్రిపరేషన్‌ పూర్తయ్యేలా ప్రణాళికను తయారు చేసుకోవాలి. రెండు పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి పట్ల అవగాహన ఏర్పడుతుంది. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులను కవర్‌ చేస్తూ,  ఒక మోడల్‌ పేపర్‌ ప్రాక్టీస్‌ చేయాలి. దీని వల్ల పరీక్ష రాసే పద్ధతికి అలవాటు పడతారు. మొదటసారి పరీక్ష రాసే అభ్యర్థులకు ఇది చాలా అవసరం. మూడు లేదా నాలుగు నెలలు అంకితభావంతో శ్రమిస్తే దేశంలోని నెంబర్‌ వన్‌ బ్యాంక్‌లో ఉద్యోగం ఖాయం.

సాధన చేస్తే.. విజయం మనదే!

బీటెక్‌ పూర్తికాగానే బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపరేషన్‌ మొదలు పెట్టాను. దాదాపు ఏడాదిన్నరపాటు కోచింగ్‌ తీసుకుంటూ నిరంతరం శ్రమించాను. మొదటిసారి ఎస్‌బీఐ పీఓ ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. కానీ సెలక్షన్‌ రాలేదు. ఎస్‌బీఐ క్లర్క్స్‌కు మరింత జాగ్రత్త పడ్డాను.  93.5 (తెలంగాణ), 92.8 (ఆంధ్రప్రదేశ్‌) స్కోర్‌తో విజయం సాధించాను. ఒత్తిడికి లోనవకుండా ప్రణాళిక ప్రకారం చదివితే బ్యాంకు ఉద్యోగం కష్టమేమీ కాదు. మొదటి మూడునాలుగు నెలల పాటు రోజుకు 7 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించాను. ఆ తర్వాత రోజుకు గంటన్నర మాత్రమే సాధన చేసేవాడిని. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలను ప్రతిరోజూ సాధన చేశాను. దీన్ని స్కోరింగ్‌ సబ్జెక్టుగా పెట్టుకున్నాను. రీజనింగ్‌ కోసం ఎక్కువ సమయం కేటాయించాను. ఇంగ్లిష్‌, కరెంట్‌ అఫైర్స్‌ కోసం రోజూ న్యూస్‌ పేపర్లను చదివాను. బ్యాంకు పరీక్షలకు సాధనే కీలకమైంది. ఒక్క రోజు కూడా మిస్సవ్వకుండా ప్రాక్టీస్‌ చేయాలి. బ్యాంకు మేనేజర్‌ స్థాయికి ఎదగడం నా జీవిత లక్ష్యం.

- ఏలేటి పృథ్వీ తేజ; మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా
గెలిచే వరకు అలిసి పోవద్దు!

చిన్నప్పటి నుంచి బ్యాంకింగ్‌ రంగంలో రాణించాలన్న తపన ఉండేది. బీటెక్‌ పూర్తవగానే మొదట అమ్మానాన్నపై ఆధారపడ కూడదని లెక్చరర్‌గా కాలేజీలో చేరాను. తర్వాత పని చేస్తూనే మూడేళ్లపాటు బ్యాంకు పరీక్షలకు సిద్ధమయ్యాను.  సుమారు పదిహేను పరీక్షలు రాశాను. ఉత్తీర్ణత సాధించలేకపోయినా నిరుత్సాహపడకుండా రాస్తూనే ఉన్నాను.  92.5 (తెలంగాణ), 93.75 (ఆంధ్రప్రదేశ్‌) స్కోర్‌తో ఎస్‌బీఐ క్లర్క్స్‌లో విజయం సాధించాను. ఉద్యోగానికి ఎంపికయ్యాను. రోజుకు ఆరు గంటలపాటు అన్ని సబ్జెక్టులను సాధన చేసేవాడిని. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన విభాగాలను ప్రతిరోజూ చదివేవాడిని. జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ కోసం హిందూ న్యూస్‌పేపర్‌ రోజూ చదివాను. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునేవారికి న్యూస్‌ పేపర్‌ పఠనం ముఖ్యం. కష్టపడి ప్రయత్నిస్తే బ్యాంకు ఉద్యోగం సాధించడం సులభమే. బ్యాంకింగ్‌ రంగంలో అత్యున్నత స్థాయికి చేరాలన్నదే నా లక్ష్యం.

- బొల్లం వీరనాగబాబు; పటవల, కాకినాడ
లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌



మెరిట్‌ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న లోకల్‌ లాంగ్వేజిని పదో తరగతి లేదా పన్నెండో తరగతిలో చదివి ఉంటే లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌ రాయాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. మెయిన్స్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
10 తప్పులు.. చేయవద్దు!

ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు చాలా పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి వాటిలో ముఖ్యమైన పది పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడితే విజయానికి చేరువకావచ్చు.
1 సరైన ప్రణాళిక లేదా టైమ్‌-టేబుల్‌ లేకపోవడం: పరీక్ష తేదీ వరకు ఉన్న సమయం, సబ్జెక్టులు, దేనికి ఎంత సమయం కేటాయించాలి మొదలైన వాటి పట్ల అభ్యర్థికి స్పష్టమైన అవగాహన ఉండాలి. దానికి అనుగుణంగా స్వీయ ప్రణాళిక వేసుకొని తప్పనిసరిగా ఆచరించాలి.

2 కొన్ని సబ్జెక్టులపైనే దృష్టి కేంద్రీకరించడం: పరీక్షలో అభ్యర్థులు అన్ని సబ్జెక్టుల్లోనూ కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. తమకు నచ్చిన ఏవో కొన్నింటి పైనే ఎక్కువ దృష్టిపెడితే మిగిలిన సబ్జెక్టుల్లో నష్టం జరగవచ్చు.

3 పరిమాణంపై దృష్టి పెట్టి, నాణ్యతను విస్మరించడం: కొంతమంది రోజుకు 16 లేదా 18 గంటలు చదివాం అంటుంటారు. ఎన్ని గంటలు సిద్ధమైనా ఎంత నేర్చుకున్నారన్నదే ముఖ్యం. గంటలకు గంటలు సమయం గడిపి బాగా ప్రిపేర్‌ అవుతున్నాం అనుకోకూడదు. ఈ రోజు ఎంత నేర్చుకున్నారో కచ్చితంగా పరిశీలించుకోవాలి.

4 రివిజన్‌ చేయకపోవడం: అభ్యర్థులు తాము నేర్చుకున్న టాపిక్స్‌ అన్నింటినీ ఎప్పటికప్పుడు రివిజన్‌ చేయాలి. రివిజన్‌ చేయకపోతే చదివింది సరిగా గుర్తుకు రాక మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది.

5 తాజా మోడల్‌ ప్రశ్నలకు, ట్రెండ్‌కు అనుగుణంగా ప్రిపరేషన్‌ లేకపోవడం: ప్రతి పరీక్షలోనూ ఎంతో కొంత మార్పు కనిపిస్తుంటుంది. గత పరీక్షలను పరిశీలించి  ప్రిపేర్‌ కావాలి. అదే సిలబస్‌, అవే ప్రశ్నలు అంటూ పరీక్ష సరళిని గమనించకుండా సాగితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

6 ప్రిలిమ్స్‌ పూర్తయ్యాక మెయిన్స్‌కు ప్రిపేరవడం: ప్రిలిమ్స్‌ అయిన తర్వాత మెయిన్స్‌ సంగతి చూద్దామని కొందరు అనుకుంటారు. అప్పుడు సమయం సరిపోక ఫెయిల్‌ అవుతారు. అందుకే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు ఏకకాలంలో ప్రిపరేషన్‌ ఉండాలి. కామన్‌ టాపిక్స్‌ నుంచి మొదలు పెట్టాలి.

7 ఆన్‌లైన్‌ మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేయకపోవడం: పరీక్షలు ఆన్‌లైన్‌ పద్ధతిలోనే ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ప్రాక్టీస్‌ చేయాలి. దానివల్ల అసలు పరీక్ష సమయంలో ఎలాంటి తడబాటు లేకుండా ఉంటుంది.

8 మోడల్‌ పేపర్‌ విశ్లేషించుకోకపోవడం: అభ్యర్థులు మోడల్‌ పేపర్‌ రాసిన తర్వాత దాన్ని విశ్లేషించుకోవాలి. ఎందులో వెనుకబడి ఉన్నారో గమనించాలి. మెరుగుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రిపరేషన్‌ గుడ్డిగా సాగకూడదు.

9 ఇంగ్లిష్‌ సబ్జెక్టుపై అశ్రద్ధ: ఇది ఎక్కువ మంది అభ్యర్థులు చేసే పొరపాటు.  తెలిసిన భాషే కదా అని అశ్రద్ధ చేస్తారు. భాష తెలిసి ఉండటానికి, దానిలో అడిగే ప్రశ్నలకు తేేడా ఉంటుంది. అందుకే ఈ సబ్జెక్టుకు ప్రత్యేకంగా ప్రిపరేషన్‌ అవసరమే.

10 షార్ట్‌కట్స్‌ నేర్చుకోకపోవడం: సంప్రదాయ పద్ధతిలో ప్రశ్నలు సాధించడం వల్ల సమయం ఎక్కువ పడుతుంది. సంక్షిప్త పద్ధతుల (షార్ట్‌కట్స్‌) వల్ల తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టవచ్చు. వాటిని నేర్చుకోకపోతే నష్టపోతారు.

- జి.ఎస్‌. గిరిధర్‌
ముఖ్యాంశాలు

మొత్తం పోస్టులు: 8,904 (251 బ్యాక్‌లాగ్‌ ఖాళీలతో కలిపి)
అర్హత: ఏదైనా డిగ్రీ (డిగ్రీ చివరి సంవత్సరం/ చివరి సెమిస్టర్‌ అభ్యర్థులు కూడా అర్హులే)
వయసు: 01.04.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపునకు చివరి తేది: 03.05.2019
పరీక్ష: ప్రిలిమ్స్‌ -జూన్‌లో, మెయిన్స్‌ - జులైలో
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: తెలంగాణ - హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.
ఆంధ్రప్రదేశ్‌ - చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
https://bank.sbi/careers/
https://www.sbi.co.in/careers/

TELANGANA DCCB's RECRUITMENT 2018-19 APPLY 439 DISTRICT WISE STAFF ASSISTANT & ASSISTANT MANAGER VACANCIES

TELANGANA DCCB's RECRUITMENT 2018-19 APPLY 439 DISTRICT WISE STAFF ASSISTANT & ASSISTANT MANAGER VACANCIES




ఉద్యోగ సమాచారం తెలంగాణ డీసీసీబీల్లో 439 ఖాళీలు
తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్.. రాష్ట్రంలోని వివిధ డీసీసీ బీల్లో ఖాళీగా ఉన్న 439 అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులను ఐబీపీఎస్ ద్వారా భర్తీ చేయనున్నారు.

 డీసీసీబీల వారీ ఖాళీలు:
1.ఆదిలాబాద్: స్టాఫ్ అసిస్టెంట్-41, అసిస్టెంట్ మేనేజర్-20.

2.హైదరాబాద్: స్టాఫ్ అసిస్టెంట్-56,అసిస్టెంట్ మేనేజర్-32.

3. కరీంనగర్: స్టాఫ్ అసిస్టెంట్-76,అసిస్టెంట్ మేనేజర్-27.

4. మెదక్: స్టాఫ్ అసిస్టెంట్-24,  అసిస్టెంట్ మేనేజర్-25.

5. నల్లగొండ: స్టాఫ్ అసిస్టెంట్-34,  అసిస్టెంట్ మేనేజర్-16.

6. నిజామాబాద్: స్టాఫ్ అసిస్టెంట్-58, అసిస్టెంట్ మేనేజర్-14.


7. వరంగల్: అసిస్టెంట్ మేనేజర్-16.

* దరఖాస్తు విధానం: ఆన్ లైన్.

* దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబర్ 19, 2018

 * దరఖాస్తుకు చివరితేదీ: జనవరి 5, 2019.

 గమనిక: పూర్తి వివరాలకు డిసెంబర్ 19, 2018 నుంచి సంబంధిత జిల్లాలకు సంబం ధించిన డీసీసీబీ వెబ్ సైట్లను చూడవచ్చు.

TELANGANA DCCB's RECRUITMENT 2018-19 APPLY 439 DISTRICT WISE STAFF ASSISTANT & ASSISTANT MANAGER VACANCIES

State Bank of India- Specialist officer 2018 notification - 47 Vacancies

ఎస్బిఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు
ముంబయిలోని స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియాకు చెందిన సిఆరిపి విభాగం స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు-ఖాళీలు: ఆనలిటిక్స్ ట్రాన్స్ లేటర్-04
సెక్టాటే క్రెడిట్ స్పెషలిస్ట్-19,
పోర్ట్ ఫోలియో మేనేజిమెంట్ స్పెషలిస్ట్-20

మొత్తం పోస్టులు: 47

అర్హత: పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, పిజి, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్. ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్లైన్ చివరితేది: 22-11-2018

వెబ్ సైట్:https://www.sbi.co.in/careers/

State Bank of India- Specialist officer 2018 notification - 47 Vacancies




IBPS Clerks Notification 2018- Apply Online for 7275 Vacancies

Institute of Banking Personnel Selection released notification for recruiting clerks in public sector banks.
Changes in IBPS Clerk 2018
·         IBPS introduced separate sectional timing for each sections in preliminary exam.
·         The IBPS Clerk Mains exam has 4 sections with a total score of 200 marks that has to be completed within a time frame of 160 minutes.
·         The time duration for completing the multiple sections has also been altered. The number of questions as well as the maximum marks of each section has also been altered
Exam Pattern Of IBPS Clerk 2018
IBPS selection process for the clerk exam 2018 consists of 2 stages, which are:
1.Prelims Exam
2.Mains Exam

Important Dates  
Online Application Process: September 18 to October 10, 2018
Payment of application fee: September 18 to October 10, 2018
Download of Pre-exam training call letter: November 2018
Conduct of Pre-exam training: November 26 to December 1, 2018
Download of Prelim exam call letter: November 2018
Date of Prelim Exam: December 8, 9, 15, and 16, 2018
Eligibility Criteria
Candidate must have a Degree (Graduation) in any discipline from a  recognised University or any equivalent qualification recognized as such by the Central Government.  
The lower age limit is 20 years and upper age limit is 28 years. 


Note: Please check the detailed notification for relaxation in upper age limit. 
Application Process
IBPS will activate the application link on its official website on September 18, 2018. The application fee is Rs. 100 for SC/ST/PWD/EXSM candidates and Rs. 600 for all other candidates.
How to apply
·         Candidates are first required to go to the IBPS’s website 




IBPS Clerks Notification 2018- Apply Online for 7275 Vacancies

Vijaya Bank Recruitment 2018 – Apply Online for 330 Asst Manager Posts

The Vijaya Bank has released a notification, inviting interested aspirants to apply for the post of Probationary Assistant Manager (credit) in JMG scale I in general banking stream. 

Total Vacancies: 330

Important Dates
·         Starting Date to Apply Online & Payment of Fee: 12-09-2018
·         Last Date to Apply Online & Payment of Fee: 27-09-2018
·         Last Date for for Editing Application Details: 27-09-2018
·         Last date for printing the application: 12-10-2018

Eligibility Criteria
Educational qualification: The aspirants should be holding a graduation degree in any discipline with minimum 60 per cent marks and should have pursued MBA/ PGDBM/ PGDM/ PGBM/ PGDBA through full time course froma reputed institution/ post graduation degree in commerce/ science/ economics/ law or CA or ICWA or CS.

Age limit: The age of the aspirants should be minimum 21 years and should not exceed 31 years. Relaxation in age will be provided as per the norms.

Pay Scale
A stipend of Rs 15,000 will be paid during the training. After training, the employees will get a monthly salary of Rs 23,700 to Rs 42,020.

Selection Procedure
The selection will be done on the basis of an online test/ personal interview.


Vijaya Bank Recruitment 2018 – Apply Online for 330  Asst Manager Posts


Reserve Bank of India - Specialist Officers(SO) Recruitment 2018 in Grade-B: Apply Online


Reserve bank of India (RBI) has invited online applications from qualified candidates for various Specialist Officer posts in the organisation. 
RBI Vacancy Details
Specialists in Grade ‘B’ (DR) – 60 Posts
·         Finance- 14 Posts
·         Data Analytics - 14 Posts
·         Risk Modelling - 12 Posts
·         Forensic Audit - 12 Posts
·         Professional Copy Editing - 4 Posts
·         Human Resource Management – 4 Posts

·         Important Events Dates- 
·         Commencement of online registration of application: 17th August 2018
·         Closure of registration of application: 07th September 2018
·         Closure for editing application details: 07/09/2018
·         Last date for printing your application: 22/09/2018
·         Online Fee Payment: 17/08/2018 to 07/09/2018
·          
·         Date of Examination- 29th September 2018
·         Paper I: Online - Objective
·         Paper II: Online - Descriptive 
·         Paper III: Offline - Descriptive

Educational Qualifications
The educational qualification needed for this recruitment are as follows:
·         Candidate should have  completed Graduate/Post Graduation in relevant dicipline from Recognized Board/University.

Selection Process:
Selection for the aforementioned posts will be done through Online/Offline examinations in the following three papers followed by Interview. Marks scored in Paper-I, Paper-II, Paper-III and Interview together will be counted for final selection.

Reserve Bank of India - Specialist Officers(SO) Recruitment 2018 in Grade-B: Apply Online