Showing posts with label motivational. Show all posts
Showing posts with label motivational. Show all posts
“నీ గురించి నువ్వు తెలుసుకో..!”   “నీ కలలను సాకారం చేసుకో..!”

“నీ గురించి నువ్వు తెలుసుకో..!” “నీ కలలను సాకారం చేసుకో..!”

 “నీ గురించి నువ్వు తెలుసుకో..!”

 “నీ కలలను సాకారం చేసుకో..!”

*ఒకసారి, ఒక బిచ్చ గాడు రైలులో భిక్షాటన చేస్తున్నప్పుడు, చక్కగా దుస్తులు ధరించిన వ్యాపారి సూట్ మరియు బూట్లు ధరించి ఉండటంగమనించాడు.


*ఈ వ్యక్తి చాలా ధన వంతుడని, అతను భావించాడు. కాబట్టి నేను అతనిని అడిగితే అతను ఖచ్చితంగా దానంచేస్తాడు అనుకొని  అతని దగ్గరకు వెళ్లి ఆ వ్యక్తిని భిక్ష కోసం అడిగాడు.


*ఆ వ్యక్తి బిచ్చగాడిని చూసి… “మీరుఎల్లప్పుడూ అడుక్కుంటూ, ప్రజల నుంచి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా... మరి మీరు ఎవరికైనా ఏదైనా తిరిగి ఇస్తున్నారా?" అని అడిగాడు ఆ వ్యక్తి.


*ఆ బిచ్చగాడు, "సార్, నేను బిచ్చగాడిని, నేను ప్రజలను డబ్బును మాత్రమే అడగగలను. కానీ నేను ఎవరికైనా,... ఏదైనా ఎలా ఇవ్వగలను? చెప్పండి” అన్నాడు.


*ఆ మాట విన్న ఆవ్యక్తి ఇలా అన్నాడు, "మీరు ఎవరికీ ఏమీ ఇవ్వ లేనప్పుడు,  మీరుకూడా ఇతరులను అడిగే హక్కు లేదు కదా. నేను ఒక వ్యాపార వేత్తని అంతేకాక లావా దేవీలను మాత్రమే నమ్ముతాను. మీరు నాకు ఇవ్వడానికి ఏదైనా ఉంటే,  మీకు ప్రతి ఫలంగా ఏదైనా ఇస్తాను." అన్నాడు. 


 *అప్పుడే, రైలు ఒక స్టేషన్‌కు రావడం జరిగింది. ఆ వ్యాపార వేత్త ట్రైన్ దిగి వెళ్లి పోయాడు.


*బిచ్చగాడు ఆ వ్యాపారవేత్త చెప్పినదాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. అతనిమాటలు ఎలా గోలా బిచ్చగాడి హృదయాన్ని చేరు కున్నాయి.


 *ప్రతిఫలంగా నేను ఎవరికీ ఏమీ ఇవ్వలే నందున నేను భిక్షలో ఎక్కువ డబ్బు పొందలేను అనిఅనుకొంటూ... ఆలోచించడం  మొదలు పెట్టాడు. కానీ నేను బిచ్చగాడిని, ఎవరికైనా ఇవ్వడానికి  నా దగ్గర విలువైనదేదీ లేదు కదా..! 


*’అయినా ఎంతసేపు నేను ఇతరులకు ఏమీ ఇవ్వకుండా.... ప్రజలను దానం అడుగుతూనే ఉండడం ఏమి బాగా లేదు.’  అని లోతుగా ఆలోచించిన తరువాత, భిక్షగాడు దానం అడిగే దాని కన్నా ముందు ఏదైనా తన వద్ద వుంటే, అప్పుడు ఆ దానం చేసిన వ్యక్తికి ప్రతిఫలంగా అది తిరిగి ఇవ్వాలని నిర్ణయించు కున్నాడు.


*కానీ ఇప్పుడు వున్న ప్రశ్న ఏమిటంటే, అతను భిక్షకు బదులుగా ఇతరులకు ఏమి ఇవ్వ గలడు?   రోజంతా దీని గురించే ఆలోచిస్తూ గడిచింది. కానీ అతని ప్రశ్నకు సమాధానం దొరకలేదు.


*మరుసటి రోజు అతను స్టేషన్ దగ్గర కూర్చున్న ప్పుడు, అతని కళ్ళు స్టేషన్ చుట్టూ ఉన్న మొక్కలపై వికసించిన కొన్ని అందమైన పువ్వుల మీద పడ్డాయి.  అతనికి ఒక ఆలోచన వచ్చి, వాళ్ళు చేసే దానానికి బదులుగా ప్రజలకు కొన్ని పువ్వులు ఎందుకు ఇవ్వకూడదు అని అనుకొన్నాడు.


*అతనికి ఈ ఆలోచన నచ్చి.. వెంటనే అక్కడ నుండి కొన్ని పువ్వులు తెచ్చుకున్నాడు. భిక్షాటన చేయడానికి రైలు ఎక్కడు.


*ఎవరైనా అతనికి భిక్ష ఇచ్చినప్పుడు, అతను వారికి ప్రతిగా కొన్ని పువ్వులు ఇచ్చేవాడు.  ప్రజలు ఆ పువ్వులను తమతో సంతోషంగా ఉంచుకునేవారు.


*ఇప్పుడు భిక్షగాడు ప్రతిరోజూ కొన్ని పువ్వులు తెచ్చుకుని, భిక్షకు ప్రతిఫలంగా ఆ పువ్వులను ప్రజలకు పంచుతూ ఉండేవాడు.


*కొద్ది రోజుల్లోనే అతను చాలా మంది తనకు భిక్ష పెట్టడం మొదలు పెట్టడాన్ని అతడు గ్రహించాడు. అతను స్టేషన్ దగ్గర ఉన్న పూలన్నింటినీ తెంపే వాడు. అతనికి పువ్వులు ఉన్నంత వరకు, చాలా మంది అతనికి భిక్ష పెట్టేవారు. కానీఅతనితో ఎక్కువ పువ్వులు లేనప్పుడు, అతనికి పెద్దగా భిక్ష వచ్చేది కాదు. ఇలా ప్రతి రోజూ కొనసాగుతూ ఉండేది.


*ఒకరోజు అతను భిక్షాటనచేస్తున్నప్పుడు, అదే వ్యాపారవేత్త రైలులో కూర్చుని ఉండడం చూశాడు, అతని కారణంగా అతను పువ్వులు పంపిణీ చేయడానికి ప్రేరణ పొందాడు.


*భిక్షగాడు వెంటనే అతని దగ్గరకు వెళ్లి, "ఈ రోజు మీరు ఇచ్చే భిక్షకు బదులుగా కొన్ని పువ్వులు నా దగ్గర ఉన్నాయి అవి మీకు ఇస్తాను " అన్నాడు.


*అప్పుడా వ్యాపారవేత్త  అతనికి కొంత డబ్బు ఇవ్వడంతో, ఆ బిచ్చ గాడు అతనికి ప్రతిగా కొన్నిపువ్వులు ఇచ్చాడు. ఆ వ్యాపార వేత్తకు బిక్షగాడి ఆలోచన బాగా నచ్చింది. మరియు బాగా ఆకట్టుకున్నాడు.


*అతను, "వావ్! ఈ రోజు మీరు కూడా నాలాగే వ్యాపార వేత్తగా మారారు!” అని అతన్ని అభినందించి. బిచ్చ గాడి నుండి పువ్వులు తీసుకొని, అతను ప్రక్క స్టేషన్‌లో దిగిపోయాడు.


*మళ్ళీ మరోసారి, ఆ వ్యాపార వేత్త మాటలు బిచ్చగాడి హృదయంలోకి చేరు కున్నాయి. అతనుఆ వ్యక్తి చెప్పిన దాని గురించి పదే పదే ఆలోచిస్తూ సంతోషంగా ఉండటం ప్రారంభించాడు.


*అతని కళ్ళు ఇప్పుడు ప్రకాశించటం ప్రారంభిం చాయి, అతను ఇప్పుడు తన జీవితాన్ని మార్చు కోగల విజయానికి బాటని కనుకొన్నానని  అతను భావించాడు.


*అతను వెంటనే రైలు నుండిదిగి ఉత్సాహంగా ఆకాశంవైపు చూస్తూ.... చాలా బిగ్గర గొంతుతో ఇలా అన్నాడు, “నేను ఇకపై బిచ్చగాడిని కాదు, నేను ఇప్పుడు వ్యాపారిని, నేను కూడా ఆ పెద్దమనిషిలా పెద్ద వ్యాపారిగా మారగలను, నేను కూడా ధన వంతుడిని కాగలను"  అని అనడం జరిగింది.


*అక్కడున్న ప్రజలు అతడిని చూసి, బహుశా ఈ బిచ్చగాడు పిచ్చివాడై ఉంటాడని అనుకున్నారు. మరుసటి రోజు నుండి ఆ బిచ్చ గాడు మళ్లీ ఆ స్టేషన్‌లో కనిపించ లేదు.


 *నాలుగు సంవత్సరాల తరువాత, సూట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఒకే స్టేషన్ నుండి ప్రయాణిస్తున్నారు.  ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు, అందులో ఒక వ్యక్తి చేతులు జోడించి మరొకరికి నమస్కరించి,   "మీరునన్నుగుర్తించారా?" అని అడిగాడు.


*మరొక వ్యక్తి "లేదు! బహుశా మనం మొదటి సారి కలుస్తున్నామేమో." అని అనడం జరిగింది.


*మొదటి వ్యక్తి మళ్లీ అన్నాడు, "మనం మొదటిసారి కలుసు కోవడం కాదు., ఇది మూడోసారి" అన్నాడు.


*రెండవ వ్యక్తి, "అవునా.. సరే, నాకు గుర్తులేదు. మనం ఎప్పుడు కలుసు కున్నాము?" అని అడగడం జరిగింది.


*అప్పుడా మొదటి వ్యక్తి నవ్వి, "మనం ఇంతకు ముందు ఒకే రైలులో రెండుసార్లు కలుసు కున్నాము. నేను జీవితంలో ఏమి చేయాలో మొదటి సమావేశంలో మీరు చెప్పిన అదే బిచ్చ గాడిని, రెండవ సమావేశంలో 'నేను నిజంగా బిజినెస్ మ్యాన్' అని మీరు నన్ను మెచ్చు కొన్నారు అది కూడా నేనే"......!!


*ఫలితంగా, ఈ రోజు నేను చాలా పెద్ద పూల వ్యాపారిని ఇప్పుడు.... అదే వ్యాపారానికి సంబంధించి నేను వేరే నగరానికి వెళ్తున్నాను." 


*"మొదటి సమావేశంలో మీరు నాకు ప్రకృతి నియమాన్ని చెప్పారు .. దాని ప్రకారం…’మనం ఏదైనా ఇచ్చినప్పుడు మాత్రమే మనకుఏదైనా లభిస్తుంది!" అని.


*”ఈలావాదేవీ నియమం నిజంగా పనిచేసింది. నేను దానిని బాగా అనుభూతి చెందాను, అంతకు మునుపు నేను ఎప్పుడూ… నన్ను నేను బిచ్చగాడిగానే భావించుకొనే వాణ్ని , నేను దాని కంటే పైకి ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు.”


*”కానీ.. నేను మిమ్మల్ని రెండోసారి కలిసినప్పుడు, నేను...ఒక వ్యాపారవేత్త అయ్యానని మీరు నాకు తెలియపరిచారు. మీకు ధన్యవాదాలు, ఆ రోజు నుండి, నా దృక్పథం మారిపోయింది. ఇప్పుడు నేను వ్యాపార వేత్తగా మారాను, నేను ఇకపై బిచ్చగాడిని కాదు.” అని ఆ వ్యాపార వేత్తతో అనడం జరిగింది.


*బిచ్చగాడు తనను తాను బిచ్చగాడిగా భావించినంత కాలం, అతను బిచ్చగాడుగానే ఉన్నాడు. మరియు తనను తాను వ్యాపార వేత్తగా భావించి నప్పుడు, అతను ఒకవాపారవేత్త గా ఎదగడం జరిగింది.

                    

*"కాబట్టి…

“నీ గురించి నువ్వు తెలుసుకో..!”

 “నీ కలలను సాకారం చేసుకో..!!”✍️

మనలో ఆందోళనని (STRESS) తగ్గించుకోవడం ఎలా......?

మనలో ఆందోళనని (STRESS) తగ్గించుకోవడం ఎలా......?

 మనలో ఆందోళనని (STRESS) తగ్గించుకోవడం ఎలా......?


ఆందోళన నుండి బయట పడడం ఎలా.....??


మన అందరిలోనూ Stress ఆనేది ఉంటుంది  ఈ Stress వల్ల మన ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే  ఈ Stress ని తగ్గించుకునేందుకు  నాలుగు పాయింట్స్  చెప్తాను వీటిని మీరు పాటించి Stress ని తగ్గించుకొని  ఆరోగ్యాంగా ఉండండి.


1. DONT CONFUSE


మనం  Stress కి గురికావడానికి Main Reason


మనం Confuse అవ్వడం.


దీనిని తగ్గించుకోవడానికి మనం మూడు Steps Follow అవ్వాలి అవి ఏంటి అంటే


★. మనం ఎందుకు Confuse అవుతున్నాము దానికి గల కారణాలు ఏవి అనేది తెలుసుకోవాలి.


★. తర్వాత ఆ కారణాల్ని Analyze  చేసుకోవాలి. అంటే దాని నుండి బయట పడడానికి మనం ఏం చేయగలం అనేది మనం ఆలోచించాలి. అవి ఆచరించాలి.


★. మనం ఏం చేయాలి అనే దానికి ఒక నిర్ణయానికి వచ్చి దాన్నే చేయాలి.


2. Take actions and never look back


మనలో చాలా మందికి ఉండే అలవాటు మనం ఎప్పుడు మనం చేసింది కరెక్టే నా ఇలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా అని ఆలోచించడం 


ఇలా ఆలోచించడం వల్ల మనకి నష్టం ఎక్కువ మనం ఏ విషయం పై అంతగా ఆలోచిస్తున్నామో తెలుసుకోవాలి. అలాగే మనం ఒక నిర్ణయం తీసుకున్నాక ఒక దాని గురించి పదే పదే ఆలోచించకూడదు ఒకసారి Decide అయ్యామంటే ఇక దానిని ఎలా చేయాలి అని ఆలోచించాలి తప్ప అది చేయొచ్చ లేదా అని కాదు దీని వల్ల మనకి ఒక్క సందేహం వచ్చి దాని నుండి కొన్ని వందల సందేహాలు పుట్టుకొస్తాయి. ఇలా మనం చేయకుండా ఉండడం వల్ల మనలోని Stress ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.


3. Live today foget yesterday and dont think about tomorrow


మనం ఎప్పుడు ప్రస్తుతం లో జీవించాలి.


మన Concentration అంతా కూడా ప్రస్తుతం పైనే ఉండాలి. అంతే కాని నిన్న ఇలా జరిగింది రేపు ఎం జరుగుతుందో ఆ తర్వాత ఏం జరుగుతోందో అని ఆలోచించడం మానేయాలి. ఎలా అంటే గతం లో జరిగిన దానిగురించి భవిష్యత్ లో జరగబోయేదాని గురించి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని కోల్పోవద్దు. మన కర్తవ్యం ఎంటో ఆలోచించాలి దాన్ని నిర్వర్తించాలి తప్ప గతం గురించి భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని కోల్పోవద్దు. మన  Future గురించి  Plans  ఉండాలి కానీ అవి ఆందోళన కలిగించెవి అలాగే మన ప్రస్తుతాన్ని కోల్పోయేవి అయ్యి ఉండకూడదు. మన Future బాగుండాలి అంటే ఈరోజు మనం ఎంత చేయగలమో అంత చెయాలి మన స్ధాయి కి మించి పనిచేయాలి కానీ అనవసరమైన వాటి గురించి ఆలోచించకూడదు.


4. Embrace the worst case scenario


 మనం మన పరిస్థితులని పూర్తిగా ఆహ్వానించాలి ఒప్పుకోగలగాలి వాటిని మన Style లో ఎదుర్కోవాలి అవి పాజిటివ్ అయినా నెగటివ్ అయినా మనం ఒకలాగే స్వీకరించాలి. మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి వాటన్నిటికి మనం ఆందోళన చెందకూడదు, మనం ఏం చేయగాలమో అది చేస్తూ పోవాలి అంటే తప్ప పదే పదే దాని గురించే ఆలోచిస్తూ ఉండకూడదు. ఎలాంటి ఆపద వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా మనం ఏం చేయగలమో నిశ్చయించుకొని క్డ్ చెయ్యాలి తప్ప అనవసరంగా ఆలోచిస్తూ ఆందోళన కి గురికావద్దు.


ముగింపు :-   


మన జీవితం లో సంతోషాలు బాధలు రెండు వస్తుంటాయి పోతుంటాయి అవి సర్వ సాధారణం. వాటి గురించే ఆలోచిస్తూ మనలో ఆందోళన పెంచుకోవద్దు. దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండకపోగా మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. వాటి గురించి ఆలోచిస్తూ ఉండకూడదు.


మనం  మనకి సమస్య వచ్చిన ప్రతీసారీ ఈ సమయం వెళ్ళిపోతుంది మళ్ళీ మన ఆనంద క్షణాలు రాబోతున్నాయి అని మన మనసుకి సర్దిచెప్పుకోవాలి తప్ప ఇంకా కృంగిపోకూడదు.

అద్భుతమైన లైఫ్ ఖచ్చితంగా ఇలా సాధ్యం!

అద్భుతమైన లైఫ్ ఖచ్చితంగా ఇలా సాధ్యం!

 *అద్భుతమైన లైఫ్ ఖచ్చితంగా ఇలా సాధ్యం!*


ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారు? అద్భుతంగానా, డిజప్పాయింటెడ్‌గానా, బోర్‌గానా, చిరాకుగానా…? ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్‌ని డిసైడ్ చేసే అతి పెద్ద ఫేక్టర్ ఇది.


బ్రెయిన్‌కి పంపించబడాల్సిన instructions చాలాసార్లు తప్పుగా హైజాక్ అవుతుంటాయి. అందుకే మనం ఫెయిల్యూర్డ్ పీపుల్‌గా మిగిలిపోతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే *“నెగిటివ్ ప్రోగ్రామింగ్”* చేయబడుతోంది బ్రెయిన్.


*బ్రెయిన్‌కి మంచీ చెడూకి మధ్య తేడా తెలీదు. మనం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేస్తుంది.*


చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీరు *“ఈ మధ్య జనాల పేర్లు మర్చిపోతున్నాం” అని రిపీటెడ్‌గా అనుకుంటూ ఉన్నారనుకోండి.. బ్రెయిన్ అలాగే ప్రోగ్రామింగ్ చెయ్యబడుతుంది.* మీరు గుర్తుంచుకోవాలని ట్రై చేసిన ప్రతీసారీ గుర్తుంచుకోవలసిన పేరుని డెఫినెట్‌గా మర్చిపోయి… మన నెగిటివ్ ప్రోగ్రామింగ్‌ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పారేస్తుంది బ్రెయిన్.


మీకు హెల్త్ బాలేదని అనుకుంటూ ఉండండి…. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. *“బాలేదు బాలేదు” అనుకుంటున్న క్షణం నుండి బ్రెయిన్ వివిధ organsకి ఆదేశాలు జారీచేసి, బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేసి ఏదో ఒక discomfort తలెత్తేలా చేసి తీరుతుంది.* దానికి మనం అప్పజెప్పిన task ఏదైతే ఉందో… “మన హెల్త్ బాలేదని” దాన్ని కంప్లీట్ చెయ్యడమే దాని లక్ష్యం.

————

చాలామంది ఉద్యోగాలు రావట్లేదనో, లైఫ్‌లో తాము ఎందుకూ పనికిరామనో, సంతోషం అంటే ఏమిటో తెలీదనో.. *రకరకాల మెంటల్ ట్రాప్‌లలో ఇరుక్కుపోతుంటారు.* ఇవి రిపీటెడ్ సజెషన్లని బ్రెయిన్‌కి పంపిస్తుంటాయి. దాంతో ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతీ ప్రయత్నంలోనూ ఏదో ఒక లోపం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది, సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా చిరాకుగానే ఉండిపోతుంటాం.

————–

ప్రతీ క్షణం మన ఆలోచనల ద్వారానో, నోటితో మాటల ద్వారానో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఆ ఆలోచనలు ప్రోగ్రామింగ్ లాంటివి. *ఈ ప్రోగ్రామింగ్‌లో పాజిటివ్ ఏటిట్యూడ్ సాధించగలిగితే ఖచ్చితంగా ప్రతీ క్షణం చాలా అద్భుతంగా ఉంటుంది.*


అంటే *మనల్ని మనం blame చేసుకోవడం తగ్గించాలి, ఇతరులు మనల్ని చులకన చేస్తూ మాట్లాడే వాటిని బ్రెయిన్‌కి తీసుకుని కుంగిపోవడం తగ్గించాలి.* ఎంత నెగిటివ్ ఎనర్జీ మనం లోపలకు పంప్ చేస్తే అంత నెగిటివ్ output వస్తుంది. సరిగ్గా అలాగే *ఎంత పాజిటివ్ ఎనర్జీ పంప్ చేస్తే అంత పాజిటివ్ output వస్తుంది.*


ఇక్కడా మరో చిన్న ఉదాహరణ తీసుకుంటే… ఓ పబ్లిక్ గేదరింగ్‌లో అందరితో కలవలేక ఓ మూలన ఇరుక్కుంటే అందరూ సంతోషంగా ఉన్నట్లు కన్పిస్తారు. మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అరమరికలు మర్చిపోయి మనుషుల మధ్య దూసుకుపోతే మన సంతోషం ముందూ, కలివిడితనం ముందూ అందరూ సరెండర్ అయిపోతారు.


సో *లైఫ్‌లో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్‌ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది.*

—————————

*ప్రోగ్రామింగ్ ట్రాప్ అని మరొకటి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన పాత జ్ఞాపకాలూ, అనుభవాలూ ఏమైనా మన బ్రెయిన్ డేటాబేస్‌లో ఉన్నాయేమో బ్రెయిన్ చకాచకా స్కాన్ చేస్తుంది.*


ఉదా.కు.. రోజూ మీకు టీ తాగే అలవాటు ఉంటే గతంలో ఎప్పుడో ఓరోజు సాయంత్రం టీ తాగలేదనుకుందాం. బాగా తలనొప్పి వచ్చి ఉంటుంది.


సో ఈరోజు మీరు మళ్లీ టీ తాగలేదనుకుందాం. వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకపోయినా.. *బ్రెయిన్ ఒక కండిషన్‌కి ఓ రిజల్ట్‌ని match చేసుకుని ఆ outcome ఎలాగైనా సాధించి పెడుతుంది.*


ఇక్కడ కండిషన్ ఏంటంటే.. టీ తాగలేదు.


రిజల్ట్స్ ఏమిటంటే తలనొప్పి రావాలి.


సో తలనొప్పి వచ్చే ఛాన్స్ లేకపోయినా డేటాబేస్‌లోని పాత రికార్డుల ప్రకారం శరీరంలో బయలాజికల్ మార్పులను సృష్టించి మొత్తానికి తలనొప్పి తెప్పించేస్తుంది.

————

*సో ప్రతీ కండిషన్‌నీ, ప్రతీ అనుభవాన్నీ, ప్రతీ రోజునీ, ప్రతీ క్షణాన్నీ కొత్తగా చూస్తే, కొత్తగా రెస్పాండ్ అవుతూ పోతే బ్రెయిన్ డేటాబేస్‌లోని పాత రికార్డులూ, పనికిమాలిన చేదు జ్ఞాపకాలూ అన్నీ కొట్టుకుపోతాయి. లైఫ్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.. ఇప్పుడే లైఫ్ మొదలెట్టినంత తాజాగా ఉంటాం.*

ఏది నిజం? ఏది అబధ్ధం ? ఏది భ్రమ ?

ఏది నిజం? ఏది అబధ్ధం ? ఏది భ్రమ ?

 *ఏది నిజం? ఏది అబధ్ధం ? ఏది భ్రమ ?*

ఒక గురుకులం లో గురువు గారు తన శిష్యులకు ఆనాటి పాఠం ఇలా చెప్తున్నారు..


ఒక సాధువు ఒక ఊరి బయట నివసించేవాడు.  ఆయన ఉదయాన్నే లేచి నది వద్దకు వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున ధ్యానం చేసుకునేవాడు.. ఇదీ అతని దినచర్య...


ఒక రోజు ఆయన తన దినచర్య మొదలు పెట్టటానికి నది వద్దకు వెళ్ళగా... అక్కడ ఆయన కళ్ళకు కనపడింది ఏమిటంటే.. ఒక వేటగాడు ఒక మహిళ ఒడిలో తల పెట్టుకుని నిద్ర పోతున్నాడు.. అతని పక్కనే ఒక ఖాళీ మద్యం సీసా కూడా పడి ఉంది.. సాధువుకి అదంతా చూసి చిరాకు, కోపం వచ్చాయి..


ఒక రోజుని మొదలు పెట్టాలంటే మంచి పనులతో మంచిగా మొదలుపెట్టాలి... అంతేకానీ.. ఈ మనిషి ఎంత పాపిష్టి వాడు, మహా పాపి... ఇంత పొద్దున్నే పద్ధతి లేకుండా పడి ఉన్నాడు... బహుశా నాస్తికుడు కూడా అయి ఉండవచ్చు అనుకుని... సరే నాకెందుకులే అనుకుని..తన స్నానం, ధ్యానం సంగతి చూసుకుంటున్నాడు...


సాధువు ధ్యానం కోసం కళ్ళు మూసుకుని భగవన్నామ స్మరణ చేసుకుంటుండగా...


ఒక శబ్దం వినిపించింది... కాపాడండి, కాపాడండి అని ఎవరో అరుస్తున్నారు... ఏమిటా ఆ అరుపులు అని సాధువు కళ్ళు తెరిచి చూడగా... నదిలో ఒక మనిషి మునిగిపోతూ కాపాడమని అరుస్తున్నాడు...


సాధువు ఏమి చెయ్యాలో ఆలోచించేలోపే మహిళ వళ్ళో తలపెట్టుకుని నిద్రపోతున్న మనిషి లేచి.., పరుగున వెళ్ళి నదిలో మునిగిపోతున్న మనిషిని కాపాడి ఒడ్డుకి తెచ్చాడు... మునిగిపోయే మనిషికి ఏ ప్రమాదము లేదు అని అర్ధం అయి సాధువు సంతోషపడ్డాడు...


కాపాడిన మనిషిని చూసి సాధువు ఆశ్చర్య పోయాడు.. అయోమయం పడుతున్నాడు..


""ఇతన్ని చెడ్డవాడు అనుకున్నాను, ఇప్పుడు ఒక ప్రాణం కాపాడాడు.. మంచివాడు అనిపిస్తున్నాడు... ఇతను మంచివాడా, చెడ్డవాడా ""అని అర్ధం కాక అతని వద్దకే వెళ్ళి అడిగారు... నువ్వు ఒకరిని కాపాడి చాలా మంచి పని చేసావు... కానీ ఇందాకా నువ్వున్న పరిస్థితిలో... నిన్ను చూసిన నాకు నీ మీద ఒక చెడ్డ అభిప్రాయం వచ్చింది... అని తన మనసులో మాట బయటపెట్టాడు...


అప్పుడు ఆ మనిషి చెప్పాడు... ""స్వామీ.. నేను చాలా రోజులు ప్రయాణించి పొద్దున్నే మా ఊరు చేరాను... నేనొచ్చే సమయానికి మా అమ్మ నా కోసం భోజనం, నీరు తీసుకొచ్చింది... హాయిగా మా అమ్మ కమ్మటి చేతి భోజనం కడుపునిండా తినేసి, మంచినీళ్ళు తాగాను... చల్లటి ఉదయం వేళ హాయైన గాలి.. కడుపునిండా తిన్న భోజనం.. నాకున్న అలసటకి నిద్ర వచ్చేసింది... మా అమ్మ ఒడిలో తలవాల్చి కంటినిండా నిద్రపోయాను... హాయిగా మంచి నిద్ర పోయి లేచాక ఇప్పుడు అలసట కూడా లేదు అని చెప్పాడు....


మరి ఆ ఖాళీ మద్యం సీసా ఏమిటీ అనడిగాడు సాధువు... ఆ మనిషి నవ్వుతూ చెప్పాడు...ఓ అదా..నాకు మంచినీరు తేవటానికి ఏదీ దొరక్క మా అమ్మ ఆ సీసాలో నీళ్ళు తెచ్చింది అంతే ... అన్నాడు..


అది విన్న సాధువుకి తాను ఇంతకు ముందు ఈ మనిషి గురించి ఎంత తప్పుగా అనుకున్నాడో... అని అనుకుని కొంచెం బాధనిపించి కళ్ళు తడి అయ్యాయి... మనసులోనే అతనికి క్షమాపణ చెప్పుకుని... ఇంకెప్పుడూ తొందరపడి ఎవరి గురించీ ఏ అభిప్రాయమూ ఏర్పరుచుకోకూడదు.... అని ఒక కొత్తపాఠం నేర్చుకున్నాడు..


అంతే కదా...  మనం కూడా ఒక సంఘటన చూసి అందరూ తమ దృష్టికోణం లో తలా ఒక రకంగా ఊహించేసుకుంటాము...


అందులో నిజం ఏంటి, అబద్ధం/భ్రమ ఏంటీ అనేది ఎంత అవసరం అని చూసుకోము...

దాని వల్ల కొంత మంది అమాయకులు ఎంత బలి అవుతారో అని అంచనా కూడా వేయరు చాలామంది...


**చూసే కళ్ళను, వినే చెవులను కూడా ఒక్కోసారి పూర్తిగా నమ్మకూడదు.. ఒక అభిప్రాయానికి వచ్చే ముందు కొంచెం మంచీ చెడు ఆలోచిస్తే బావుంటుంది...


సర్వేజనా సుఖినోభవంతు... 🙏🙏🙏

ఇవ్వడం నేర్చుకోవాలి..

ఇవ్వడం నేర్చుకోవాలి..

 *🌻ఇవ్వడం నేర్చుకోవాలి..*🌻


ఒక వ్యక్తి ఎడారిలో దారి తప్పిపోయాడు. 


అతడు తెచ్చుకున్న నీళ్లు రెండు రోజుల తర్వాత అయిపోయాయి.


 నడుస్తున్నాడు. 


నీరు ఎక్కడా కనబడటం లేదు.


 తన జీవితపు ఆఖరు దశకు చేరానని అతడికి తెలిసిపోయింది. 


ఈ రాత్రి గడవదు.


 రేపు ఉదయం చూడను 


అని అనుకుంటున్న దశలో


 ప్రయత్నం చెయ్యడమా? అలాగే నిరాశతో కూలబడి పోవడమా ఎటూ నిశ్చయించుకోలేకపోతున్నాడు. 


💧దూరంగా ఒక గుడిసెలాంటిది కనబడింది.


 అది నిజమా? తన భ్రమా? ఏమో! నిజమేమో! అక్కడ తనకు నీరు దొరకవచ్చునేమో!


💧చనిపోయేముందు ఆఖరు ప్రయత్నం చెయ్యాలనుకున్నాడు. 


శక్తిని కూడదీసుకున్నాడు. తడబడిపోతున్న అడుగులతో ముందుకు నడుస్తున్నాడు.


 గుడిసెలోకి వెళ్లాడు. అక్కడ ఒక నీటి పంపు (బోరింగ్) కనబడింది.


💧దానిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. 


దాని దగ్గరకి వెళ్లి కొట్టాడు. 

నీరు రావడం లేదు. 

శక్తినంతా ఉపయోగించి కొట్టాడు. 


అయినా ప్రయోజనం లేదు.


 నిరాశ నిస్పృహ ఆవరించాయి. 


ఒంట్లో ఉన్న కొద్ది నీరూ అయిపోయింది.


 కళ్లు మూసుకుపోతున్నాయి. 


💧ఒక మూలన సీసా కనిపించింది. 


దానిలో నీరు ఉంది.


 మూత గట్టిగా బిగించి ఉంది.


 మూత విప్పి దాన్ని ఎత్తిపట్టి తాగుదామని పైకి ఎత్తాడు.


💧దానికి ఒక కాగితం కట్టి ఉంది. 


దాని మీద ఇలా ఉంది. 


ఈ బాటిల్లో నీరు బోరింగ్ పంపులో పోయండి. 


పంపు కొట్టండి.. నీరు వస్తుంది. మీరు మళ్లీ ఈ బాటిల్ నింపి పెట్టండి. 


💧అతడికి సందేహం కలిగింది. 


ఈ నీరు తాగెయ్యడమా? బోరింగ్ పంపులో పొయ్యడమా?


 ఎంత కొట్టినా రాని నీరు.. ఈ బాటిల్లో నీరు పోస్తే వస్తుందా?


 ఉన్న ఈ నీరు కాస్తా పోసేస్తే తర్వాత రాకపోతే తన గతి ఏమి కాను? 


చేతిలో ఉన్న నీరు తాగితే కనీసం ఇంకో రెండు రోజులు బతకొచ్చు.


 అందులో పోసేస్తే మరణం ఖాయం.


💧ఏమి చేయాలి? ఎంతకూ ఆలోచనలు తెగడం లేదు. 


💧ఒక నిశ్చయానికి వచ్చాడు. నీళ్లను పంపులో పోశాడు.


 బోరింగ్ పంపు కొట్టడం మొదలుపెట్టాడు.


 *ఆశ్చర్యం!!!!!*


💧పాతాళ గంగ పైకి తన్నుకు వచ్చింది. 


నీళ్లు తాగి బాటిల్ నింపాడు. మూలన పెట్టాడు. 


తను తెచ్చుకున్న బాటిల్ నింపుకున్నాడు. 


గుడిసెలో ఎడారి మ్యాప్ కనబడింది. 


తను ఎటు వెళ్లాలో చూసి బయలుదేరాడు. 


*💧_ఏదైనా పొందాలంటే ఇవ్వడం నేర్చుకోవాలి.*💧


 ఇవ్వడం వల్ల మనం


 పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. 


ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి.


 కృషి చెయ్యకుండా ఫలితంఆశించకూడదు_ 



_చావు బతుకుల మధ్య_

*ఇక్కడ తర్కం*



🚰 ఎంత కొట్టినా పంపు నుండి రాని నీళ్ళు కొద్ది పోస్తే ఎలా వస్తాయి ?



🚰 రిస్క్ తీసుకోకుండా బాటిల్లో నీళ్ళు తాగేస్తే....

మహా అంటే మరి కొన్ని గంటలు ప్రాణం నిలుపుకోవచ్చు. తరువాతా...??



🚰 అసలు బాటిల్లో నీళ్ళు ఎలా వచ్చాయి. 


తన కన్నా ముందు ఎవరికో ఇలాంటి సమస్యే ఎదురై వుండొచ్చు. 


వాళ్ళు పంపులో పోసి ఆ తరువాత తిరిగి బాటిల్ లో నింపి వుండొచ్చు.



✅ కాబట్టి రిస్క్ అనుకున్నా గానీ బాటిల్ లో నీళ్ళు పంపులో పోయడమే కరెక్ట్.


✅ గత్యంతరం లేని క్లిష్ట పరిస్థితుల్లో *నమ్మకం* ముఖ్యం!!! *నమ్మడమే* శ్రేయస్కరం. 


మిత్రమా....


 _*నువ్వు ఇవ్వకుండా*_

_*దేనినీ పొందలేవు*_

సేవారామ్‌ అదృష్టం! -- చందమామ కథలు

సేవారామ్‌ అదృష్టం! -- చందమామ కథలు

 *సేవారామ్‌ అదృష్టం! -- చందమామ కథలు*


*సేవారామ్‌ అనే క్షురకుడు చాలా పేదవాడు. ఎంత కష్టపడినప్పటికీ పూట గడవడమే కష్టంగా ఉండేది. ఏరోజు సంపాదన ఆ రోజుకు బొటాబొటిగా సరిపోతూ ఉండేది. ఒక్కొక్క రోజు బియ్యం కొనడానికి కూడా డబ్బులు చాలేవి కావు. అలాంటి రోజుల్లో అతడి భార్య శివానీ, ‘‘పుట్టింట ఎంతో గారాబంగా, ఎలాంటి కొరతా లేకుండా పెరిగిన నేను, ఈ చేతగాని దద్దమ్మను కట్టుకోవడంవల్ల తిండికీ, బట్టకూ కూడా కరువై పోయింది కదా," అని వాపోయేది.*


*ఒకనాటి సాయంకాలం సేవారామ్‌ దమ్మిడీ సంపాదన కూడా లేకుండా వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. భార్య నోట చీవాట్లు తింటూ పడుకున్నాడు. అయితే ఎంత సేపటికీ నిద్ర పట్టలేదు. తెల్లవారాక ఏం చేయడమా అని తీవ్రంగా ఆలోచించాడు. వేకువ జామునే లేచి, స్నానం చేసి కత్తి, కత్తెర, దువ్వెనలు, అద్దం, తలనూనెలు ఉన్న తన పెట్టెను తీసుకుని ఇంటి నుంచి వెలుపలికి వచ్చాడు. భార్యను కేక వేసి పిలిచి, ‘‘కావలసినంత డబ్బు సంపాయించిన తరవాతే తిరిగి వస్తాను,'' అని చెప్పి చకచకా వెళ్ళి పోయాడు.*


*గుమ్మంలోకి వచ్చిన అతడి భార్య శివానీ, భర్త కేసి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది గానీ, అతన్ని వెనక్కు పిలవలేదు. రోజూ క్షవరం, చేసుకునే ధనికులెవరూ ఆ గ్రామంలో లేరు. క్షవరం చేయించుకున్నా డబ్బులు తరవాత ఇస్తామని చెప్పే పేదలే ఆ గ్రామంలో ఎక్కువ. అందుకే సేవారామ్‌ నిరుపేద క్షురకుడుగానే కాలం గడుపుతున్నాడు. సేవారామ్‌ పట్నం కేసి వేగంగా నడవసాగాడు.*


*బాగా అలిసిపోయినప్పుడు చెట్ల కింద నీడలో విశ్రాంతి తీసుకుంటూ; అలా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, అటువైపు వచ్చే బాటసారులెవరైనా క్షవరం చేయమని అడిగితే బావుణ్ణుకదా అన్న ఆశతో ఎదురు చూస్తూ పయనం సాగించాడు. అయితే, ఏ ఒక్కరూ రాలేదు. చీకటి పడుతూండగా బాగా అలిసిపోయి ఒక ఎత్తయిన చెట్టుకింద పడుకుని అలాగే నిద్రపోయాడు.*


*ఆ చెట్టు మీద ఒక దయ్యం ఉంటున్నది. సేవారామ్ గురక విని, మంచి ఆహారం దొరికిందన్న ఉత్సాహంతో ఒక్క ఉరుకున కిందికి దూకింది. వాణ్ణి చంపడానికి ముందు హడలగొట్టాలని నిర్ణయించి, వాడి భుజాలు పట్టుకుని ఊపింది. సేవారామ్ మెల్లగా కళ్ళు తెరిచాడు. దయ్యం తన ముఖం భయంకరంగా కనిపించేలా నానా వంకర్లు తిప్పుతూ, ‘‘నిన్ను నేను మింగేస్తాను. మానవా!'' అన్నది రెండు చేతులతో గొంతును పట్టుకోబోతూ.*


*బాగా అలిసిపోయి నిద్రమత్తులో ఉన్న సేవారామ్ తను ఎలా చచ్చినా ఫరవాలేదనుకున్నాడు. దయ్యం మింగినా మింగనీ అనుకుంటూ హఠాత్తుగా భార్య జ్ఞాపకం రావడంతో, ‘‘పాపం శివానీ నేను లేకపోతే ఎలా బతుకుతుంది? కనీసం ఆమె కోసమైనా జీవించి తీరాలి," అనుకుని, ‘‘ఏమిటీ చిలిపి చేష్ట?" అంటూ, ‘‘వెళ్ళిపో!" అన్నట్టు చేయి ఊపాడు. అయితే దయ్యం అక్కడి నుంచి కదలలేదు.*


*‘‘నేను కిందటిసారి పట్టుకున్న దయ్యాన్ని చూడాలనుకుంటున్నావా?'' అంటూ సేవారామ్, తలకింద పెట్టుకున్న పెట్టెను తెరిచి, అందులోంచి చిన్న అద్దాన్ని వెలికి తీసి, ‘‘దీనిలోకి చూడు," అంటూ దాని ముందు ఉంచి, ‘‘ఇలాంటివి నా పెట్టెలో ఇంకా కొన్ని ఉన్నాయి," అన్నాడు.*


*అద్దంలో తన మొహం చూసి, దయ్యం హడలి పోయి కీచుమంటూ అరిచింది. అయ్యా, ఆ భయంకరమైన దయ్యంతో కలిపి, నన్ను కూడా పెట్టెలో బంధించకు! అంటూ సేవారామ్ చేతులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ బతిమలాడసాగింది. అలా అయితే, నువ్వు తెల్లవారే సరికి నాకు మణులు, మాణిక్యాలు తెచ్చి ఇవ్వాలి! సరేనా? అని గద్దించాడు సేవారామ్ దృఢమైన కంఠ స్వరంతో.*


*మరు క్షణమే దయ్యం మాయమై పోయింది. సేవారామ్ అద్దాన్ని పెట్టెలో పెట్టి, కోడికూత వినిపించేంతవరకు కాచుక్కూర్చోవాలని నిర్ణయించాడు. అయితే, మరికొంత సేపటికల్లా దయ్యం తిరిగి రావడం చూసి అతడు ఆశ్చర్యపోయాడు. దయ్యం ఒక చిన్న మూటను తెచ్చి సేవారామ్ ముందు పడవేసింది. అందులో తళతళ మెరిసే మణులు, మాణిక్యాలు కనిపించాయి.*


*సరే, ఇప్పటికి నిన్ను వదిలి పెడుతున్నాను. పట్నం వెళ్ళి సాయంకాలానికి తిరిగివస్తాను, అంటూ సేవారామ్ అక్కడి నుంచి బయలుదేరి పట్నం కేసి నడవసాగాడు. తన వద్ద ఉన్న కొన్ని మణులను అమ్మి డబ్బుగా మార్చుకోవాలనుకున్నాడు. కొంత దూరం నడిచాక అతడికొక ఆలోచన కలిగింది. మణులను అమ్మకుండా తాకట్టు పెడితే, ఆ తరవాత విడిపించుకోవచ్చుకదా అనుకున్నాడు. వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, తన వద్ద ఉన్న విలువైన మణులను కొన్నిటిని తాకట్టు పెట్టుకుని, కొంత మొత్తం ఇస్తే, ఒక నెల తరవాత వచ్చి, అసలూ, వడ్డీ చెల్లించి తన మణులు విడిపించుకోగలనని చెప్పాడు. వడ్డీ వ్యాపారి మణులను పరిశీలించి చూసి, నాణ్యమైనవే అని నిర్ధారించుకుని సేవారామ్కు అడిగిన డబ్బు ఇచ్చి పంపాడు.*


*సేవారామ్ బాగా ఆకలిగా ఉండడంతో భోజనశాలకు వెళ్ళి తృప్తిగా భోజనం చేసి, ఖాళీగా ఉన్న ఒక ఇంటి అరుగు మీద నడుం వాల్చాడు. చాలా సేపు ఆదమరచి నిద్రపోయూడు. పొద్దువాలుతూండగా లేచి, ఉత్సా హంగా దయ్యం ఉన్న చెట్టు కేసి నడిచి, చీకటి పడుతూండగా అక్కడికి చేరుకున్నాడు.*


*తన పెట్టెను తలకడగా పెట్టుకుని నిన్నలాగే పడుకున్నాడేగాని, ఏ క్షణంలోనైనా దయ్యం రావచ్చు గనక నిద్రపోకుండా కాచుకున్నాడు. అప్పటికే చెట్టు మీది దయ్యం, దాపుల మరొక చెట్టు మీద ఉన్న దయ్యం స్నేహితుడితో రాత్రి జరిగినదంతా చెప్పింది. రెండు దయ్యాలు కలిసి, సేవారామ్ కిచ్చిన మణులను తిరిగి రాబట్టుకోవాలనీ, తమలాంటి భయంకర దయ్యాలను దాచి పెట్టిన పెట్టెను దొంగిలించాలనీ పథకం వేశాయి. అర్ధరాత్రి సమయంలో రెండు దయ్యాలూ చెట్టు దిగి వచ్చి, సేవారామ్ నిద్రపోతున్నాడా, లేడా అని మెల్లగా పరీక్షించి చూశాయి. అతడికి తెలియకుండా అతడి తలకింది పెట్టెను ఎత్తుకెళ్ళడానికి వీలవుతుందా అని పరిశీలించి చూడసాగాయి.*


*సేవారామ్ మేలుకునే ఉన్నప్పటికీ, నిద్రపోతున్నట్టు నటించసాగాడు. ఆ దయ్యాలు రెండూ కలిసి, అతడి తలకింది సంచీని మెల్లగా లాగాయి. కొంత లాగేంతవరకు, కదలకుండా ఉన్న సేవారామ్, మరుక్షణమే బంతిలా ఎగిరి లేచి, పెట్టె తెరిచి అందులోని కత్తెరనూ, అద్దాన్నీ వెలుపలికి తీశాడు. ఒక చేతిలో కత్తెరనూ, రెండవ చేతిలో అద్దాన్నీ పట్టుకున్నాడు. కత్తెరను రెండు దయ్యాల కేసీ గురిచేసి, వేళ్ళతో కత్తెరను వేగంగా కదిలిస్తూ వింత శబ్దాన్ని పుట్టించ సాగాడు.*


*అదే సమయంలో అద్దాన్ని కూడా వాటికేసి చూపాడు. దయ్యాలు కత్తెరకు భయపడ్డాయో, అద్దానికి ఎక్కువ భయపడ్డాయో తెలియదుగాని, రెండూ వేగంగా కదలడం చూడడంతో దయ్యాలు రెండూ హడలిపోయి, చెట్టెక్కడానికి ప్రయత్నించసాగాయి. దాన్ని గమనించిన సేవారామ్, కదలకండి. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళి, బంగారు నాణాలు నాకు తెచ్చి ఇవ్వాలి. తెల్లవారే సరికి రాక పోయారో, రెండో దయ్యం ఆ పెట్టెలోని భయానక ప్రాణులతో కలిసిపోక తప్పదు! అని హెచ్చరించాడు.*


*ఇప్పుడు పరిగెత్తడం రెండవ దయ్యం వంతయింది. సేవారామ్ లోలోపల నవ్వుకున్నాడు. అయితే, చేతుల్లోని కత్తెరనూ, అద్దాన్నీ కదిలిస్తూనే ఉన్నాడు. మొదటి దయ్యం దీనంగా నిలబడుకుని, తన మిత్రుడు ఎప్పుడు వస్తాడా, చెట్టు మీదికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని భయం భయంగా ఎదురుచూడ సాగింది.*


*రెండవ దయ్యం తెల్లవారు జామున వచ్చి, తనతో తెచ్చిన బంగారు నాణాల సంచీని సేవారామ్ కు ఇచ్చింది. అతడు దానిని వెంటనే తన సంచీలో పెట్టుకుని, చేతిలోని కత్తెరను అదే వేగంతో కదిలిస్తూ, ఇప్పుడిప్పుడే తెల్లవారుతున్నది. నేను పట్నం వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తాను. మీరిద్దరూ బుద్ధిగా నడుచుకున్నట్టయితే, ఆ సంచీలోని ప్రాణులను వదిలి పెడతాను, అన్నాడు.*


*ఆ తరవాత కత్తెరను, అద్దాన్ని సంచీలో పెట్టుకుని బయలుదేరి తిన్నగా తన ఇల్లు చేరాడు. భార్య శివానీకి తన రెండు రోజుల అనుభవాలను వివరించాడు. అంతా విని, అమితాశ్చర్యం చెందిన అతడి భార్య, నువ్వు ప్రపంచంలోకెల్లా చాలా ధైర్యవంతుడివి, తెలివైనవాడివి! అని మెచ్చుకున్నది. నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినాలనే నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను, అన్నాడు అప్పటికే పేదరికం నుంచి బయటపడిన సేవారామ్ ఎంతో సంతోషంగా జీవితం కొనసాగించారు.*

ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా

ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా

 *❇ప్రముఖ కవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా.... నివాళులు అర్పిస్తూ...


*ఆధునిక తెలుగు కవుల్లో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా (సెప్టెంబర్ 28, 1895 - జూలై 24, 1971). సమకాలీన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి, సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసాడు. నాడు తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించి, ఆ కారణంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని ఈ మూఢాచారాలపై తిరగబడ్డాడు జాషువా; ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.*


*☸గుర్రం జాషువా☸*


*🔯జననం : సెప్టెంబరు 28, 1895,గుంటూరు జిల్లా,వినుకొండ🔯*


*🔯మరణం : 24 జూలై 1971 (aged 75),గుంటూరు*


*🔯నివాస ప్రాంతం : గుంటూరు జిల్లా వినుకొండ*


*🔯ఇతర పేర్లు : జాషువా*


*🔯వృత్తి : రచయిత,కవి,సాహితీకారుడు.*


*🔯సాధించిన విజయాలు : నవయుగ కవి చక్రవర్తి*


*🔯మతం : christian*

  

✡️ *కులం :* *యాదవ్*


*🔯తండ్రి : వీరయ్య*


*🔯తల్లి : లింగమ్మ*


*🔯జీవిత విశేషాలు*


జాషువా 1895, సెప్టెంబర్ 28 న వీరయ్య, లింగమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందిన వారు. తండ్రి యాదవ, తల్లి మాదిగ, ఈ ఒక్క విషయం చాలు, మూఢాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కోడానికి. బాల్యం వినుకొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగింది. చదువుకోడానికి బడిలో చేరిన తరువాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులు, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు..


అయితే జాషువా ఊరుకొనేవాడు కాదు, తిరగబడేవాడు. ఆధిపత్య వర్గాల పిల్లలు కులం పేరుతో హేళన చేస్తే, తిరగబడి వాళ్ళను కొట్టాడు. 1910లో మేరీని పెళ్ళి చేసుకున్నాడు. మిషనరీ పాఠశాలలో నెలకు మూడు రూపాయల జీతంపై ఉద్యోగం చేసేవాడు. ఆ ఉద్యోగం పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915-16 లలో అక్కడ సినిమా వాచకుడిగా పనిచేసాడు. టాకీ సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణలను చదువుతూ పోవడమే ఈ పని. తరువాత గుంటూరులోని లూథరన్‌ చర్చి నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా 10 సంవత్సరాల పాటు పనిచేసాడు. తరువాత 1928 నుండి 1942 వరకు గుంటూరు లోనే ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పనిచేసాడు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ ప్రచారకుడిగా కూడా పనిచేసాడు. 1957-59 మధ్య కాలంలో మద్రాసురేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేసాడు.


ఒకసారి వినుకొండలో జరిగిన ఒక అవధాన సభలో ఆయన పద్యాలు చదివాడు. తక్కువ కులం వాడిని సభ లోకి ఎందుకు రానిచ్చారంటూ కొందరు ఆయనను అవమానించారు. ఆయనకు జరిగిన అవమానాలకు ఇది ఒక మచ్చు మాత్రమే. అంటరాని వాడని హిందువులు ఈసడిస్తే, క్రైస్తవుడై ఉండీ, హిందూ మత సంబంధ రచనలు చేస్తున్నాడని క్రైస్తవ మతాధిపతులు ఆయన్ను నిరసించారు. ఆయన కుటుంబాన్ని క్రైస్తవ సమాజం నుండి బహిష్కరించారు. క్రమంగా ఆయన నాస్తికత్వం వైపు జరిగాడు.


జీవనం కోసం ఎన్నో రకాల ఉద్యోగాలు చేసిన జాషువాకు 1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. 1971 జూలై 24న గుంటూరులో గుర్రం జాషువా మరణించాడు.


*🔯సాహితీ వ్యవసాయం*


చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది. బొమ్మలు గీయడం, పాటలు పాడడం చేసేవాడు. బాల్య స్నేహితుడూ, తరువాతి కాలంలో రచయితా అయిన దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహచర్యంలో ఆయనకు కవిత్వంపై ఆసక్తి కలిగింది. జూపూడి హనుమచ్ఛాస్త్రి వద్ద మేఘసందేశం,రఘువంశం, కుమార సంభవం నేర్చుకున్నాడు. జాషువా 36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు రాసాడు. వాటిలో ప్రముఖమైనవి:


గబ్బిలం (1941) ఆయన రచనల్లో సర్వోత్తమమైనది. కాళిదాసు మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు. ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని కథాంశం. ఎందుకంటే గుడిలోకి దళితునకు ప్రవేశం లేదు కాని గబ్బిలానికి అడ్డు లేదు. కథానాయకుడి వేదనను వర్ణించిన తీరు హృదయాలను కలచివేస్తుంది.


1932లో వచ్చిన ఫిరదౌసి మరొక ప్రధాన రచన. పర్షియన్ చక్రవర్తి ఘజనీ మొహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి ఫిరదౌసి. అతనికి రాజుగారు మాటకొక బంగారు నాణెం ఇస్తానని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని వ్రాశాడు. చివరకు అసూయాపరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు. ఆవేదనతో ఆత్మహత్య చేసుకొన్న ఆ కవి హృదయాన్ని జాషువా అద్భుతంగా వర్ణించాడు.


1948 లో రాసిన బాపూజీ - మహాత్మా గాంధీ మరణ వార్త విని ఆవేదనతో జాషువా సృష్టించిన స్మృత్యంజలి.


*🔯సంవత్సరాల వారీగా జాషువా రచనల జాబితా*


1919 - రుక్మిణీ కళ్యాణం


1922 - చిదానంద ప్రభాతం,

 కుశలవోపాఖ్యానం


1924 - కోకిల


1925 - ధ్రువ విజయం, కృష్ణనాడి, సంసార సాగరం


1926 - శివాజీ ప్రబంధం, వీరాబాయి, కృష్ణదేవరాయలు, వేమన యోగీంద్రుడు, భారతమాత


1927 - భారత వీరుడు, సూర్యోదయం, చంద్రోదయం, గిజిగాడు


1928 - రణచ్యుతి, ఆంధ్రుడను, తుమ్మెద పెళ్ళికొడుకు


1929 - సఖి, బుద్ధుడు, తెలుగు తల్లి, శిశువు, బాష్ప సందేశం


1930 - దీర్ఘ నిశ్వాసము, ప్రబోధము, శిల్పి, హెచ్చరిక, సాలీడు, మాతృప్రేమ


1931 - భీష్ముడు, యుగంధర మంత్రి, సమదృష్టి, నేల బాలుడు, నెమలి నెలత, లోక బాంధవుడు, అనసూయ, శల్య సారథ్యము, సందేహ డోల


1932 - స్వప్న కథ, అనాథ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, సింధూరము, బుద్ధ మహిమ, క్రీస్తు, గుంటూరు సీమ, వివేకానంద, చీట్లపేక, జేబున్నీసా, పశ్చాత్తాపం.


1933 - అయోమయము, అఖండ గౌతమి, ఆశ్వాసము, మేఘుడు, శ్మశానవాటిక,


1934 - ఆంధ్ర భోజుడు


*1941 - గబ్బిలము*


1945 - కాందిశీకుడు


1946 - తెరచాటు


1948 - చిన్న నాయకుడు, బాపూజీ, నేతాజీ 


1950 - స్వయంవరం


1957 - కొత్తలోకం


1958 - క్రీస్తు చరిత్ర


1963 - రాష్ట్ర పూజ, ముసాఫిరులు


1966 - నాగార్జునసాగరం, నా కథఅవార్డులు


1964లో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు


1964లో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా నియమితుడయ్యాడు.


1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది.


1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం అందజేసింది.


*🔯బిరుదులూ, పురస్కారాలు*


జాషువా తన జీవితకాలంలో ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నాడు. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి కాలికి గండపెండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు. అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా భావించాడు.


ఎన్నో బిరుదులు, సత్కారాలు అందుకున్నాడాయన. కవితా విశారద, కవికోకిల, కవి దిగ్గజ - నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా ప్రసిద్ధుడయ్యాడు. పద్మభూషణ, ఆంధ్ర ప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు, క్రీస్తుచరితకు 1964 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ,1970 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కళాప్రపూర్ణ మొదలైన పురస్కారాలు అందుకున్నాడు.

కొండంత దేవుడు

 *కొండంత దేవుడు*


మనిషి దృష్టిలో దేవుడు కొండంతటివాడు. అన్నమయ్య ‘కొండంత వరములు గుప్పెటి వాడు’ అని కీర్తించాడు. అయితే, మనిషికి కొండంత వరాలను పొందే అర్హత కూడా ఉండాలి. ఆంజనేయుడిలా సంజీవని పర్వతాన్ని అందరూ మోయలేరు. కొండంత వరాలను అందరూ సద్వినియోగం చేసుకోలేరు.


అమోఘమైన వరాలను పొందిన రాక్షసులందరూ తమ సహజమైన తమో గుణంతో, నష్టమే పొందారు తప్ప- ఎలాంటి లోక కల్యాణాన్ని చెయ్యలేకపోయారు.


జన్మతః ప్రతి మనిషికీ కొన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి. దానికి లోబడి లోకకార్యాలు చేస్తుంటాడు. జీవితమంటే కష్టసుఖాల కూడలి కనుక రెండూ రుచిచూడాలి. సాధారణ కష్టాలను ఎదుర్కొని మనిషి బయటపడుతుంటాడు. కానీ, శక్తికి మించిన ఆపదలు వచ్చినప్పుడు ఆకాశంవైపు చూసి చేతులు జోడిస్తాడు. ఆపద తొలగేవరకు ఆందోళన చెందుతాడు. సమస్య తొలగిపోతే దేవుడు కరుణించాడని కృతజ్ఞతలు చెప్పుకొంటాడు. లేని పక్షంలో దేవుడి ఉనికినే సందేహిస్తాడు. నిందిస్తాడు కూడా.


శ్రీకృష్ణ తులాభార సన్నివేశంలో భగవంతుడి దివ్యతత్వం గురించి నారదమహర్షి సత్యభామకు వివరిస్తాడు.


రాసులకొద్దీ ధనకనక వస్తువులు ఎన్ని వేసినా, తులాభారం తూగదు. చివరకు రుక్మిణి సమర్పించిన తులసి దళంతో తూగుతుంది.


అప్పుడు నారదుడు భక్తికితప్ప మరిదేనికీ శ్రీహరి వశుడు కాడన్న పరమ రహస్యాన్ని ప్రకటిస్తాడు. ఇది ఆస్తిక ప్రపంచానికి ఒక అద్భుత సందేశం.


లోకాలన్నీ సృష్టించి, పోషిస్తున్న పరమాత్మను ప్రాపంచిక వస్తువులతో ఆకట్టుకోగలమా? ఈ ప్రశ్న ఎవరూ వేసుకోరు. అందువల్లనే కొబ్బరి కాయల కొలమానం మొదలెడతారు. ఎన్ని పూజలు, పునస్కారాలు, రాసులకొద్దీ నివేదనలు సమర్పించినా- భక్తి లేకపోతే, అవి పరమాత్మను మెప్పించలేవు.


పత్రం, పుష్పం, ఫలం, తోయం- ఇవన్నీ చాలా సాధారణ వస్తువులు. సామాన్యులందరికీ అందుబాటులో ఉంటాయి. వీటిని భక్తితో తనకు సమర్పిస్తే, ఇష్టంగా స్వీకరిస్తానంటాడు కృష్ణుడు. అనడమే కాదు- విదురుడు పెట్టిన అరటిపండు తొక్కను ఆప్యాయంగా స్వీకరించి ఆరగించాడు. విదురుడు పరమభక్తుడు. కృష్ణుడు విదురుడి భక్తినే చూశాడు. పారవశ్యంతో అతడిచ్చినది పండు కాదని తెలిసినా, స్వీకరించాడు.


శబరి ఎంగిలి పండును శ్రీరాముడికి సమర్పించిన సన్నివేశం కూడా ఇలాంటిదే. దశరథుడు శ్రీరాముని పుత్రుడిగా పొందడానికి, ‘రారా...కన్నా...’ అంటూ ఆలింగనం చేసుకునేందుకు తపమేమి చేసెనో- అని త్యాగరాజు కీర్తించాడు.


నిజమైన భక్తులు పూజా సమయంలో మాత్రమే భగవంతుని ఆరాధించరు. వారు అనుక్షణం తమలోని అంతర్యామితో అనుబంధం కలిగి ఉంటారు. ఆనందంలో ఓలలాడుతుంటారు. కీర్తనలు పాడతారు. పరవశంతో నాట్యాలు చేస్తారు. చైతన్య మహాప్రభు, శ్రీరామకృష్ణులు ఇలాంటి స్థితిలోనే ఉండేవారు. అంతర్యామి దర్శన భాగ్యం లభించాక పాదాలు నిలవవు. మనసు ఆనందంతో గెంతులేస్తుంది.


‘పిబరే రామరసం’ అంటూ ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ పాడిన పాటను సామాన్య భక్తులు ఎలా ఆలపించగలరు?


ప్రపంచంలో మనకు కొండ గొప్పదిగా కనిపిస్తుంది. అందుకే కొండంత దేవుడు అంటారు. కానీ, ఆయన మేరుపర్వతం కన్నా గొప్పవాడు. అంతటి దేవుడికి కొండంత పత్రిలాగా ఆడంబర నివేదనలు అవసరంలేదు.


భక్తితో చింతాకంత నివేదనకు- ద్రౌపది అక్షయపాత్రలోని అడుగునగల మెతుకు తిని తృప్తి చెందినట్లు ఉంటుంది ఆయన అనుగ్రహం. ఆ అనుగ్రహం పొందగలిగితే జీవితం ధన్యం.




నీతి కథ : మంచితనం-సంస్కారం

 💦 *నీతి కథ : మంచితనం-సంస్కారం*


రామయ్య నడిపించే బడిలో చాలామంది పిల్లలు చదువుకొనేవాళ్ళు. కొందరు చక్కగా చదివేవాళ్ళు; అయితే మరికొందరు చదువుల్లో బాగా వెనకబడి ఉండేవాళ్ళు. రామయ్య అందరినీ సమానంగా చూసేవాడు. సరిగా చదవని పిల్లలకు ఎలాగైనా విద్యను అందించాలని ప్రయత్నించేవాడు.


రామయ్య బడిలో చదివే సిద్ధయ్య అలా బాగా వెనకబడిన పిల్లవాడు. ఎంత ప్రయత్నించినా వాడికి చదువు సరిగా అబ్బలేదు. అదే తరగతి పిల్లవాడు గణేషుడు వాడిని పదే పదే ఎగతాళి చేసి ఆటపట్టిస్తుండేవాడు. దాంతో మనసు విరిగిపోయిన సిద్ధయ్య, ఒకసారి బడిలోంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సమయానికి అక్కడికి వచ్చిన రామయ్య అతన్ని ఆపి, కారణం అడిగాడు. “నేను చదువుకోను!” అన్నాడు.


ఇక చేసేదేమీ లేక, సిద్ధయ్య తండ్రిని పిలిపించి అతనికి సిద్ధయ్యను అప్పగించాడు రామయ్య. వెళ్ళేముందు తనకు నమస్కరించిన సిద్ధయ్యతో “నీకు చదువు రాలేదని బాధ పడకు. చదువు రాకున్నా పరవాలేదు-చదివే వాళ్ళను గౌరవించు. నీ‌ మంచితనపు వన్నె తగ్గకుండా జాగ్రత్తగా కాపాడుకో” అని చెప్పాడు.


ఇంటికి వెళ్ళిన తర్వాత, సిద్ధయ్య తండ్రి పొలంలోనే సేద్యం చేయసాగాడు. రానురాను అతనికి సేద్యంలో‌ మెళకువలన్నీ బాగా అర్థమయ్యాయి. పంటల్ని మార్చి మార్చి వేసుకోవటం, నీటిని పొదుపుగా వాడటం, నేల పై పొరల్లోని సారాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవటం లాంటివి అతనికి చాలా నచ్చిన అంశాలు. అతను వాటినన్నిటినీ తన పొలంలో అమలుపరచి, బంగారం‌ పండించాడు. తన ఇంటికి అవసరమైన పంటలు అన్నింటినీ అతను స్వయంగా పండించుకొని, ఊళ్ళో వాళ్లందరిచేతా ‘శభాష్’ అనిపించుకున్నాడు. చుట్టు ప్రక్కల అనేక గ్రామాల్లో రైతులకు వ్యవసాయపరంగా ఎలాంటి సందేహాలు వచ్చినా వాళ్లు సిద్ధయ్యను సంప్రతించేవాళ్ళు.


ఆ సమయంలో సిద్ధయ్య ఉండే ఊరికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన గుళ్ళో‌ ప్రవచనాలు ఇస్తున్నాడనీ, చక్కగా మాట్లాడతాడనీ విని, సిద్ధయ్య వెళ్ళి, ఆయన చెప్పే మంచి సంగతులన్నీ శ్రద్ధగా విన్నాడు. ఆ తరువాత ఆయనకు పట్టువస్త్రాలు, పండ్లు ఇంకా ఏవేవో ఇద్దామనుకొని దగ్గరకు వెళ్ళేసరికి, ఆయన వేరెవరో కాదు- చిన్ననాడు బడిలో‌తనని ఆట పట్టించిన గణేషుడు! సిద్ధయ్య అతని పాండిత్యాన్ని మెచ్చుకుని, చక్కగా మాట్లాడి, అతనికి సన్మానం చేసి నమస్కరించేసరికి, ఆశ్చర్యం వేసింది. ఊళ్ళోవాళ్ళు సిద్ధయ్యను ఎంత గౌరవిస్తున్నారో చూసినతనికి తన చిన్ననాటి ప్రవర్తన గుర్తుకొచ్చి సిగ్గు వేసింది.


“నాకే చదువు వచ్చనే గర్వంతో నేను నిన్ను బడిలో చాలా అవమానించాను. నీ సంస్కారాన్నీ‌ , నీలో ఉన్న మంచితనాన్నీ గమనించని నన్ను క్షమించు సిద్ధయ్యా!” అన్నాడు అతను నీళ్ళు నిండిన కళ్ళతో.


“అలా అనకు మిత్రమా, పాండిత్యం‌ పాండిత్యమే. నీ అంతటివాడు నా మిత్రుడని చెప్పుకోవటం నాకు గర్వకారణం, కాదూ?” అన్నాడు సిద్ధయ్య, అణకువతో.

        💦🐋🐥🐬💦






ధైర్యం

 *ధైర్యం

 “ధైర్యే సాహసే లక్ష్మీయని” అష్టలక్ష్ములలో చేర్చిన  ధైర్యాన్ని   ఆయుధంగా చేసుకుని అసాధ్యాన్ని  సుసాధ్యం  చేసిన వారున్న లోకమిది. ‘ధైర్యమే వెలలేని ఆభరణమని’ భావించి  జీవితంలో ఎదురైన ఆటుపోట్లను ఎదుర్కొని  ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగిన వారూ ఉన్నారు.  

 

“ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు తాల్మియన్న” భర్తృహరి సుభాషితాన్ని నిజం చేస్తూ యక్షప్రశ్నలకు సమాధానాలిచ్చి  నలుగురు సోదరులను దక్కించుకున్న  పాండవాగ్రజుడు స్థితప్రజ్ఞత లోకానికి ఆదర్శం. 


“కార్యసాధనలో  ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని,  అపజయమెదురైనా  ధైర్యాన్ని కోల్పోకూడదని, సత్య, ధర్మాలదే విజయమన్న” పురాణాలు ,  అంతిమ విజయాలు  దక్కించుకున్న  రాముడు , పాండవుల చరితలను రామాయణ, మహాభారతాల్లో వర్ణించాయి. 


“  ఆపదల నుండి కాపాడేది, దుఃఖాన్ని చేరనీయనిది,  కార్యసాధనకు మార్గమైనది  ధైర్యమేనని”  మనుచరిత్రలో పెద్దన లిఖించినట్టు యముణ్ణి  మెప్పించి పతిని దక్కించుకున్న సావిత్రి, నలుడికి దూరమై బాధలనుభవించినా ధైర్యంగా ఎదుర్కొన్న దమయంతిల చరితలను పురాణాలు అందించి మహిళలకు మార్గదర్శనం చేశాయి.     


 “పరులెవ్వరూ సాధించలేని  కార్యాలను,  విశ్వసించిన సిద్ధాంతానికి  కట్టుబడి కొనసాగించడమే ధైర్యమని” గ్రంథాలు చెప్పినట్టు భరతమాత స్వేఛ్చకై  బ్రిటీషు  వారినెదిరించిన మహాత్ముడు  నిరూపించాడు.   


“ఆశ,  ధైర్యాలు  విజయ కిరీటంలో రెండు వజ్రాలన్న” మాటలకు ప్రతిరూపాలన్నట్టు ప్రవర్తించిన వారున్నారు.  కాల్చమని  ఆంగ్లేయులకు  రొమ్ము చూపిన టంగుటూరి ప్రకాశం, వీరమరణం పొందిన అల్లూరి  సీతారామరాజు, శత్రువుకు  తలవంచక ఆత్మార్పణం చేసుకున్న  చంద్రశేఖర ఆజాద్,  ఉరికంబమెక్కినా భయమెరుగని భగత్ సింగ్ తదితరులు  నిరూపించారు.  


“ధైర్యంతో  సమస్యలను పరిష్కరించుకోవాలని” పెద్దలన్నట్టుగా  ముందుకు సాగిన మహానుభావుల్ని చరిత్ర గుర్తించింది. పత్రికల ద్వారా స్వాతంత్య్ర  స్ఫూర్తిని రగిలించిన కాశీనాధుని నాగేశ్వరరావు, ముట్నూరి కృష్ణారావు, సి.వి. చింతామణి , అయ్యదేవర గార్లు బ్రిటీషు ఆగడాల నెదుర్కొన్నారే తప్ప వెనుకడుగేయలేదు. కేసరి , మరాఠా పత్రికల్లో స్వాతంత్య్ర  వార్తలు వ్రాసినందుకు   బాలగంగాధర్ తిలక్, తెలుగు స్వరాజ్య పత్రికలో సంపాదకీయం వ్రాసినందుకు  గాడిచెర్ల హరిసర్వోత్తమరావులకు జైలు శిక్షలు విధించినా భయపడి వెనక్కు తగ్గలేదు.  


   ​కుటుంబాలకు  దూరమై  శీతోష్ణస్థితుల కతీతంగా విధులు నిర్వర్తిస్తూ దేశరక్షణకై ప్రాణాలొడ్డుతున్న  వీరసైనికుల ధైర్య సాహసాలే కాదు త్యాగాలూ  తిరుగులేనివిగా కీర్తించాలి. 

 


“ఏ కార్యం తలపెట్టినా  ధైర్యంగా ముందడుగేయాలని, లేనప్పుడు విజయం దక్కదని” విశ్వసించినప్పుడే  పరాజయం ఎదురైనా తట్టుకుని నిలబడే  ధైర్యం కలుగుతుంది.

 

“పుట్టుకతో ధైర్యసాహసాల్ని వెంట తెచ్చుకోరని,  పరిస్థితులు, అనుభవాలే మనిషిని  తీర్చిదిద్దుతాయన్నట్టు” ధైర్యంగా  సమస్యలను  ఎదుర్కోవాలే తప్ప  ఆత్మహత్యలను శరణు వేడకూడదు.  ధైర్యంగా జీవితాన్ని  కొనసాగించే వారికి లోకమే దాసోహమవుతుంది.

స్థిరచిత్తం - మోటివేషనల్ స్టోరీ

*స్థిరచిత్తం*

జయాపజయాలతో సంబంధం లేకుండా మొదలుపెట్టిన పనిని పూర్తిచెయ్యాలంటారు పెద్దలు. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే సూత్రమది. జీవిత గమనంలో మనిషి ఎన్నో కార్యాలను తలపెడతాడు. పనులన్నీ సఫలం కావాలని ఆశించకపోయినా కొన్ని విజయాలనైనా రుచి చూడాలన్న కోరిక ఉండకపోదు. ఏకాగ్రత, స్థిరచిత్తం పనుల్ని సఫలం చేస్తాయి. ఆధ్యాత్మికత ఆ రెండింటినీ మనిషి వశం చేస్తుంది.

ఒక్కొక్కసారి కార్యం పూర్తయినట్లే అనిపిస్తుంది. విజయం మన ముంగిట నిలిచినట్లే తోస్తుంది. అంతలోనే అపజయం ఎదురవుతుంది. పరాజయానికి సమర్థతాలేమి కన్నా సరైన ప్రణాళిక లేకపోవడమే ఎక్కువ కారణమవుతుంది. అర్జునుడు పక్షి కనుగుడ్డుకు గురిపెట్టినప్పుడు, మత్స్యయంత్రం ఛేదనకు పూనుకొన్నప్పుడు అతడి విజయానికి కారణమయ్యింది ప్రతిభ మాత్రమే కాదు- రెప్పపాటు నిడివి సైతం తేడాలేకుండా బాణాన్ని వెయ్యాలన్న సమయానుకూలమైన నిర్ణయం.

మనసు పరిపరి విధాలైన ఆలోచనల్ని చేస్తుంది. ఏ ఒక్క ఆలోచనా కడవరకు సాగదు. ఉద్రేకపూరిత భావనలు మనసును అల్లకల్లోలం చేస్తాయి. అస్థిరమైన మనసు కార్యసాధనకు ఆటంకమవుతుంది. మనసును వశం చేసుకున్నవాడు విశ్వవిజేత అవుతాడని బుద్ధుడి మాట. విశ్వామిత్రుడు మనోస్థిరత్వాన్ని సాధించలేకపోయాడు. మేనకాధీనుడై చిరకాలం దీనుడిగా మిగిలిపోయాడు. ఊర్వశిని త్యజించిన అర్జునుడు మనసుపై విజయం సాధించాడు. విజయుడిగా స్థిరపడ్డాడు. కార్యసఫలతకు కృషి చేసే సాధకుడు మనో నిబ్బరాన్ని అలవరచుకోవాలి. సమయానుకూలంగా మనసును అధీనంలోకి తెచ్చుకోవడం కోసం ధ్యాన సాధన చేయాలి.

అహంకారం అవరోధాలకు కారణమవుతుంది. లక్ష్యసాధనకోసం పురోగమించే వ్యక్తి అహంకార రహితుడు కావాలి. అధికారం, అహంకారం, మమకారం మత్తు కన్నా ప్రమాదకరమైనవి. ‘నేను వదిలి రా, నేను కనబడతాను’ అంటాడు భగవంతుడు భక్తుడితో. తీవ్రమైన ఆటంకాల వరద ముంచేస్తున్నప్పుడు మహావృక్షంలా అహంకరించినవాడు కూకటి వేళ్లతో సహా కూలిపోతాడు. సమయానుకూలంగా గడ్డిపోచల మాదిరిగా తలదించుకు నిలిచిన వ్యక్తి ఆపదల నుంచి గట్టెక్కుతాడు. కఠినమైన టెంకాయను గుడిలో పగలగొట్టడం అహంకార నిర్మూలన చేయమన్న భక్తుడి వేడికోలుకు ప్రతీక.

మనిషి తన జీవిత కాలంలో గొప్ప కార్యాలెన్నో తలపెడతాడు. విజయం వరించినా లేకపోయినా పరాజయం మాత్రం కచ్చితంగా నిర్ధారితమై ఉంటుంది. ఓటములకు లోనై అలసట చెందిన మనిషి అంతర్గతంగా మనసు చెప్పే మాటల్ని ఆలకించాలి. పరాజయాలకు కారణాలను విశ్లేషించుకోవాలి. సమయానుకూలమైన నిర్ణయాలను స్వాగతించాలి. నరికిన మోడు నుంచి చిగురించిన పచ్చని మొక్కలా తనను తాను మలచుకోవాలి.

సాధకుడి విజయాలకు పరమార్థం వ్యక్తి ప్రగతి మాత్రమే అయి ఉండదు. సమాజ పురోగతి సైతం అందులో అంతర్లీనమై ఉంటుంది. సమాజ సహకారం, తోడ్పాటు లేనిదే ఏ వ్యక్తీ ఉన్నతుడిగా ఎదగలేడు. లక్ష్య సాధన చేసిన వ్యక్తి విజయ శిఖరాలను అందుకున్న తరుణంలో విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలి. పంచభూతాలు విశ్వమంతా ఆవరించిన ప్రకృతి నేర్పే విలువైన పాఠం మనిషిని విశాలదృక్పథుడిగా మార్చడమే. భూమి అట్టడుగు పొరల్లో పడి ఉన్న నన్ను ఇంత ఎత్తుకు పెంచిన రైతుకు ఏమివ్వగలను... సమయానుకూలతను బట్టి ధాన్యరూపంలో నన్ను నేను అర్పించుకోవడం తప్ప- అనుకొని పంటసిరి మురిసిపోతుంది!


చెడు చేస్తే...

చెడు చేస్తే...


పూర్వం ఒక రాజు ఉండేవాడు...పరమక్రూరంగా , దయ లేకుండా అందరినీ బాధపెట్టేవాడు..

అలాంటి రాజు ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు అధికారులు ప్రజలు అందరినీ సమావేశపరిచి ఒక ప్రమాణం చేసాడు "నేను ఈ రోజు నుంచి ఎవ్వరినీ బాధపెట్టను , అందరితో మంచిగా ఉంటాను , దయగా ప్రవర్తిస్తాను" అని...మాట ఇచ్చినట్టే , మాటకు కట్టుబడి అతను మంచిగానే ఉన్నాడు..కొంతకాలానికి అందరూ అతన్ని దయగలమారాజు అనుకుంటున్నారు...

మంత్రుల్లో ఒకరు ఈ మార్పు ఎలా సాధ్యం , తెలుసుకోకపోతే ఎలా అని చాలా కుతూహలంగా రాజు దగ్గరికి వెళ్ళి మీలో ఎందుకు ఉన్నట్టుండి అంత మార్పు వచ్చింది , కారణం చెప్తారా అని అడిగాడు...

రాజు సమాధానం చెప్తున్నాడు..నేను ఒకరోజు గుర్రం మీద అడవిలో తిరుగుతుంటే ఒక వేటకుక్క నక్కని వెంటాడుతోంది...నక్క కష్టపడి తన గుహలోకి వెళ్ళేలోపే వేటకుక్క నక్క కాలు కరిచింది...నక్క కుంటిది అయిపోయింది...ఆ రోజు కాసేపటికి పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాను..అక్కడ అదే వేటకుక్క ఉంది...ఒక మనిషి ఒక పెద్ద రాయి తీసుకుని వేటకుక్క మీదకి విసిరాడు ...ఆ రాయి కుక్కకాలుకి తగిలి వేటకుక్క కాలు విరిగింది....అతను కొంచెం దూరం వెళ్ళాడో లేదో ఒక గుర్రం అతన్ని బలంగా తన్నింది...అతను కిందపడి కాలు విరగ్గొట్టుకున్నాడు...ఆ గుర్రం పరిగెత్తుకుంటూ వెళ్ళబోయింది...ఒక గుంటలో పడి దాని కాలూ విరిగిపోయింది...వరుసగా జరిగిన ఈ సంఘటనలకు నాకు ఒక ఆలోచన  తోచింది... నక్క కాలు కుక్క కరిస్తే , కుక్క కాలు మనిషి రాయి వల్ల  విరిగింది , మనిషి కాలు గుర్రం పడేసినందువల్ల విరిగితే..గుర్రం ఒక గుంటలో పడి కాలు పోగొట్టుకుంది...

ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకీ జరుగుతుంది అని బాగా తెలిసొచ్చింది...
అప్పుడు నా వల్ల ఎందరు బాధపడ్డారో..వారందరి వల్ల నేనూ బాధపడాల్సి వస్తే ఆ పరిస్థితి ఊహించుకుంటేనే వంట్లో వణుకు పుట్టింది...ఆ క్షణంలోనే నిజాయితీగా నిర్ణయించుకున్నాను...ఎవ్వరినీ ఇంక కష్టపెట్టకూడదు అని అందరితో దయగా ఉండాలి అనుకున్నాను అని రాజు వివరించాడు...

ఇదంతా విన్న మంత్రి ఈ రాజుకి చాదస్తం ఎక్కువయినట్టుంది...రాజుని ఈ పరిస్థితుల్లో సింహాసనం నుంచి తప్పించి..కిరీటం నేను దక్కించుకోవచ్చు అని పన్నాగం పన్నుకుంటూ ఆలోచనల్లో పడి ముందున్న మెట్లు చూసుకోలేదు..మెట్ల మీద  జారి పడి మంత్రి మెడ విరిగి లేవలేని స్థితికి చేరుకున్నాడు...రాజు పదవి కాదు కదా మనిషిగా కూడా ఒకరిమీద ఆధారపడేలా అయ్యాడు..ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకీ అదే చెడు జరుగుతుంది అన్న మంచి విషయం ఈ కధ సారాంశం..


మనిషి జయించవలసిన 6 దోషాలు

మనిషి జయించవలసిన 6 దోషాలు

 మనిషి జయించవలసిన 6 దోషాలు


వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే అతినిద్ర, బద్ధకం, భయం, క్రోధం, అలసత్వం, ఎడతెగని ఆలోచన అనే ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి. ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే.. నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాబాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే. రెండో లక్షణం బద్ధకం.


ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం. అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని అనుమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం. ఇక, క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు. అలాగే.. ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం. ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి అంటుంది భారతం.

7, సెప్టెంబర్ - క్షమాగుణ దినోత్సవం

7, సెప్టెంబర్ - క్షమాగుణ దినోత్సవం

*💁🏻‍♂️ క్షమాగుణ దినోత్సవం*
〰〰〰〰〰〰〰〰
👉 *ఈరోజు(7, సెప్టెంబర్) క్షమాగుణ దినోత్సవం*
🔹 తనపై గురి చూసి రాయిని విసిరేవారికి.. ప్రేమతో పండును ప్రసాదించే వృక్షం క్షమాపణకు నిలువెత్తు సాక్ష్యం.
మన్నించే మనసే సామరస్యతకు సోపానం.
అన్న సత్యం తెలిస్తే... ద్వేషానికి తావులేని సుఖమయ సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది.
🔹 బంధువులైనా.. జీవిత భాగస్వాములైనా.. స్నేహితులైనా.. సొంత సంతానమైనా సహోదరులైనా.. మరింత సన్నిహితులైనా అందరి మధ్య అనురాగాన్ని పండించే గుణం ప్రేమ అయితే..
దానిని ఎప్పటికీ నిలిపి ఉంచే లక్షణం క్షమాగుణం..
🔹 ఈ 'క్షమాగుణ దినోత్సవాన్ని' ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
🔺 *మానసిక ప్రశాంతత..*
క్షమాపణ చెప్పడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. క్షమాపణ చెప్పేవారిలో మానసిక పరిపక్వత చెందిన వారిగా భావించొచ్చు. క్షమాపణతో అవతలి వారిలో అపరాథ భావం తొలగిపోతోంది. తద్వారా ఆందోళన పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది.
🔺 *ఒత్తిడికి దివ్య ఔషధం*
క్షమాపణ మానసిక ఒత్తిడికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. క్షమాగుణం కలిగిన వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వీరికి శత్రువులు సైతం తక్కువగా ఉంటారు. ఇటువంటి వ్యక్తులను మహోన్నతి వ్యక్తులగా చెప్పొచ్చు.
🔺 *క్షమాపణతో మనస్పర్థలు తొలగి పోతాయి*
స్నేహితులు, బంధువులు, ప్రేమికులు, తోబుట్టువుల మధ్య చిన్నచిన్న తగాదాలు ఏర్పడతాయి. కొన్ని వెంటనే సమసిపోతే మరికొంతమంది మాత్రం కొన్నేళ్లపాటు మొహం చాటేస్తారు. వారి మధ్య మనస్పర్థలు ఒకరంటే ఒకరికి గిట్టని స్థాయికి చేరుకుంటాయి. ప్రతి ఒక్కరూ క్షమాపణ చెప్పేందుకు ముందుకు వస్తే సమస్యలు తొలగి పోతాయి.
🔅 అందరూ క్షమా గుణాన్ని అలవరచుకుంటే మంచిది.
😛ఉపసంహరంః  క్షమించమన్నారు గా అని నీతి మాలిన దారుణాలకు, అకృత్యాలకు పాల్పడిన వారిని క్షమించి వదిలేయమని కాదు.
🙏 *ఏది ఏమైనా అందరికీ క్షమా గుణ దినోత్సవ శుభాకాంక్షలు.*  🙏
తప్పకుండా చదవండి...

తప్పకుండా చదవండి...

*తప్పకుండా చదవండి...*

◆ జననం ధర్మమని, మరణం తప్పదని అందరికి తెలుసు 60 లేదా 70 కాకపోతే 80 సంవత్సరాలు...

◆ ఖాళీ చేతులతో తల్లి గర్భంనుండి వచ్చాము, ఖాళీ చేతులలో భూగర్భంలోకి పోతాం, తొలిస్నానం గుర్తులేదు, చివరిస్నానంతెలియదు.

◆ నీగురించి నీవు ఎక్కువ మాట్లాడు తున్నావ్ అంటే నీకు ౼ నేను అన్నది పోలేదన్నమాట...

◆ జ్ఞానమున్న వారితో  వాదించు ఓడినా జ్ఞానం వస్తుంది, అజ్ఞానునితో వాదించకు  నీ విజ్ఞతను కోల్పోతావు...

◆ ఈ ప్రపంచమంతా అవకాశవాదులతోనే నిండి ఉంది, ఎవరు ఏ క్షణాన ఎలా ప్రవర్తిస్తారో తెలియదు....
అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటే మంచిది...

◆ మనం ఎంత మంచిగా ఉన్న ఎవరో ఒకరి కథలో చెడ్డ వాళ్లమే, 
_కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది.._

◆ బయట గరికగడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు.
_అలాగే మోసం చేసేవాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివారు అభివృద్ధి చెందలేదు.._

◆ ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచేలోపు,  అబద్దం అందంగా తయారై అందర్నీ తనవైపు ఆకర్షిస్తుంది..

◆ మన దగ్గర డబ్బులేకుంటే మన రక్తసంబంధంలోనే విలువుండదు, _అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది._,
_ఒకప్పుడు గుణం చూసి దగ్గరయ్యేవారు,  ఇప్పుడు ధనం చూసి దగ్గరవుతున్నారు..._

◆ ఎదుటి వ్యక్తి నీపై నేరుగా నెగ్గే దమ్ము లేనప్పుడే నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు...

◆ నీ నొప్పి నువ్వు గ్రహిస్తే ప్రాణాలతో బతికి ఉన్నావని అర్ధం,
_ఇతరుల నొప్పిని కుడా నీవు గ్రహించగలిగితే మానవత్వం గల మనిషిగా బతికి ఉన్నావని అర్ధం.._

_ఇక చివరిగా_

◆ మన వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునేవారి గురించి ఆలోచించకండి ఎందుకంటే...?  వారిస్థానం ఎప్పుడు మన వెనుకే...
కథ - బాల్య స్నేహితుడు

కథ - బాల్య స్నేహితుడు

*మిత్రులారా నమస్కారం ఒక కథ .... రెండు నిమిషాలు సమయం చాలు..... చదవండి....  నచ్చితే మళ్లీ చదవండి....  చదివి రిలాక్స్  కాగలరు....*  కథ పేరు: *బాల్య స్నేహితుడు*.

తాడేపల్లిగూడెం పెళ్లికి వచ్చాం...
ఊళ్ళో ఊర్వశి థియేటర్లో ఎన్టీఆర్
"రాముడు భీముడు" సినిమా ఆడుతోంది.

మా ఆవిడ సినిమాకి వెళదామంటే..
సరే అని  వెళ్ళాం.

టికెట్స్ తీసుకొని లోపలికి వెళుతుంటే..
ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపి గాడు నన్ను గుర్తు పట్టాడు. పలకరించుకున్నాక,
మా ఆవిడకి పరిచయం చేశాను.
నిడదవోలులో ఇంటర్లో క్లాస్మెట్ అని..!

హాల్లో కూర్చున్నాక అడిగింది.. "అదేమిటండి మీ క్లాస్మెట్ అంటున్నారు.....
ఇలా గేట్ దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం.." అంది.

"ఏమో చదువు అయ్యాక, ఇప్పుడే గదా కలిసింది" అన్నాను.

వాడిల్లు చిన్నప్పుడు మా వీధిలోనే...
చాలా అల్లరి వెధవ....
సినిమాల పిచ్చి ఎక్కువ...
ప్రతి రోజు పేపర్ తిరగెయ్యటం,
ఏ సినిమా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందో చూడటం...

ప్రతీ సినిమా రిలీజ్ రోజే ఉదయం ఆట చూసేయ్యటం...
సినిమా హాల్స్ కేబిన్ దగ్గరకి వెళ్ళి తెగి పోయిన ఫిల్మ్ ముక్కలు ఏరు కోవటం..
ఇదే పని.

అప్పుడప్పుడు వాడి డబ్బులుతో నేల టిక్కెట్ కి  నన్ను కూడా తీసుకెళ్లేవాడు...
"ఎందుకురా" అంటే..
"ఒక్కడిని అయితే బెంచ్ టికెట్ తీసుకునేవాడిని..
నువ్వూ వస్తే 2నేల టికెట్స్..
అంతే గదరా.."
అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా...!

"మా పెద్దోళ్ళు,
వాడితో తిరిగితే ఎక్కడ  చెడి పోతామో అని వాడితో ఆడనిచ్చే వారు కాదు.
చివరకు వాళ్ళు చెప్పినట్టే, వీడు లైఫ్ లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలడ్డాడు" అన్నాను.

"మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోడులా ఉన్నాడు....
లేపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాలకి ఎందుకు తీసుకెళుతాడు..
అయినా మీరు మటుకు చేసేది ఏమైనా పెద్ద ఉద్యోగమా ఏంటి....
ఇప్పటి వరకు కనీసం ఓ స్కూటర్ కూడా కొనలేదు" అంటూ దెప్పింది.

నాకు ఉక్రోషం వచ్చి "ఎలా చూసినా వాడికంటే బెటరే కదా" అన్నాను.

ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చిన..
ఆ కుర్రోడికి డబ్బులు ఇవ్వబోతుంటే..
"వద్దు సార్" అని వెళ్లి పోయాడు.

ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ..
"నిజంగా మీ ఫ్రెండ్ మంచోడు అండీ..
మీరే సరిగ్గా పలకరించ లేదు..
పోజు కొడుతూ మాట్లాడారు." అన్నది.

"కాదులే...
వాడి పొజిషన్ ఇప్పుడు బాగా లేదు కదా..
నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాననుకో...
రేపు ఎప్పుడైనా అప్పు అడిగితే...
అదో తలనొప్పి మళ్లీ..!" అన్నాను సాలోచనగా.

"అతను ఏ పొజిషన్ లో ఉన్నా..
బాల్య స్నేహితుడు బాల్య స్నేహితుడే..!* అంది.

"కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థాంక్స్ చెప్పండి" అంది నిశ్చయంగా..

సినిమా అయిపోయింది..

మా ఆవిడ పోరు పడలేక..
ఎంట్రన్స్ దగ్గర సిబ్బందిని,
వాడి గురించి వాకబు చేస్తే...
అతను పై ఫ్లోర్ లోని  ఒక రూమ్ లోకి  తీసుకెళ్లాడు.

పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూమ్...
ఒక సోఫాలో గోపి గాడు కూర్చుని ఉంటే....
హాల్ మేనేజర్ ఆరోజు కలెక్షన్స్ లెక్కలు చెబుతున్నాడు...
ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకు వాళ్ళు అనుకుంట...
మేము లోపలికి వెళ్లగానే...
లేచి బయటకు వెళ్లిపోయారు.

గోపి గాడు మమ్మల్ని చూడగానే రారా..
రారా..
అంటూ ఇద్దర్ని కూర్చో బెట్టి, కాఫీ తెప్పించాడు.
ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాలు వాడిదేనని.!

మొదట్లో 16mm ప్రొజెక్టర్ తో  ఊర్లలో పండగలకి పబ్బాలకి సినిమాలాడించి,
ఈ స్టేజీకి ఎదిగాడుట.
ఇంకా ఏలూరులో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందట. కొత్త సినిమాలు జిల్లాల వారిగా కొంటాడుట..! అలా తను ఎదిగిన క్రమాన్ని చెప్పుకొచ్చాడు.

"ఎలా వచ్చార్రా.." అని అడిగితే..
"రిక్షాలో" అని చెప్పా.

డ్రైవర్ని పిలిచి,
వద్దన్నా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు.

దారిలో మా ఆవిడ.. "ఇలా ఇంకెప్పుడూ,
ఎవర్నీ తక్కువ అంచనా వేయకండి....
ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను..."
అంది చిరు కోపంగా.!!

(శ్రీ ఆచంట సుబ్రహ్మణ్యం గారి రచన ఇది)

👉మాట : "మన కళ్ళకు కనబడేవన్నీ నిజాలు కాదు...
మనం చేసేదే మంచి పని కాదు...
మనం సంపాదించినదే ఎక్కువ కాదు...
ఎదుటివాడిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించు...
వాడు మన కన్నా గొప్పవాడే.."👈
జీవితం విలువ

జీవితం విలువ

ఒక బాగా పేరు ఉన్న వ్యక్తి, 200 మంది ఉన్నగదిలో ఉపన్యాసం ఇస్తున్నాడు.
⏩తన జేబులో నుంచి ఒక రెండు వేల రూపాయల నోట్ ని తీసి ఇది ఎవరికైనా కావాలా అని అడిగాడు.
ఆ గదిలో ఉన్న 200 మంది చేతులు గాలిలోకి లేపారు.
⏩సరే ఈ రెండు వేల రూపాయలని మీలో ఒకరికి తప్పకుండా ఇస్తాను అని ఆ రెండు వేల
రూపాయలని బాగా మడతలు పడేలా నలిపేసాడు.
⏩మరల తను ఇప్పుడు ఇది ఎవరికి కావాలి అని అడిగాడు. మళ్లీ అందరు చేతుల్ని లేపారు.
⏩తను మంచిది అని వాళ్ళతో అని మరల ఆ రెండువేల రూపాయలని కింద
పడేసి తన కాళ్ళతో తోక్కేసాడు. అప్పుడు ఆ రెండువేల రూపాయలు నోటు బాగా మడతలు పడి,
మట్టి కొట్టుకుపోయింది.
⏩మరల అతడు దాన్ని తీసి ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి అన్నాడు. ఇప్పుడు కూడా అందరు తమ చేతులు పైకెత్తారు.
⏩అప్పుడు అతడు అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా చెప్పాడు...
నా మిత్రులారా మీరందరూ ఇప్పటి వరకు ఒక మంచి పాఠాన్ని నేర్చుకున్నారు.
⏩ఇప్పటి వరకు ఈ రెండువేల రూపాయల్ని ఏమి చేసిన మీరందరూ ఇంకా కావాలి అంటున్నారు.
⏩ఎందుకంటే నేను ఏమి చేసిన ఈ రెండు వేల
రూపాయల విలువ ఏ మాత్రం తగ్గలేదు. ఇది ఇప్పటికి రెండు వేల రూపాయలు.
🔄అలాగే మన జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకి
ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతుంటాయి.. కొన్ని సార్లు కిందకి పడిపోతాం. కొన్ని
సార్లు మనం ఎందుకు పనికిరాము అనుకుంటాం. జీవితం ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది.. ఒకవేళ
మనం పరీక్షలలో ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు..
✅జీవితం ప్రతి సారి మనకు ఒక క్రొత్త అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది... జారవిడచిన
అవకాశాల కోసం చింతించక క్రొత్త ఆశలతో సరికొత్త ఊహలతో ముందడుగు వేయి...
రూపాయి నోటు ఎంత చిరిగినా దాని విలువ ఎలా పోగొట్టుకోలేదో.. మన విలువ కూడా ఎప్పటికీ
తరగదు..
"నువ్వు ఎప్పడు నీ విలువను
పోగొట్టుకోలేవు".
"నువ్వు ఒక గొప్ప వ్యక్తివి" ...
ఈ విషయం ఎప్పటికి మరవొద్దు....

నారద తుంబురుల కథ

నారద తుంబురుల కథ

*నారద తుంబురుల కథ*

ఒకనాడు నారద తుంబురులు కలిసి వైకుంఠానికి వెళ్ళారు. తుంబురుడు గొప్ప గాయకుడు. తన గానామృతం తో విష్ణుమూర్తిని కీర్తించాడు. విష్ణుమూర్తి సంతసించి తుంబురుని మంచి వస్త్రాభరణాలతో సత్కరించాడు. నారదుడికి తుంబురుడిపై ఈర్ష్య కలిగింది.

“తుంబురుడే గొప్ప గాయకుడా? నేను కూడా అలా పాడటం నేర్చుకుని విష్ణుమూర్తి దగ్గర సత్కారం పొందుతాను.” అనుకున్నాడు.

అలా నారదుడు కొన్నాళ్ళు సంగీతాన్ని అభ్యసించి విష్ణుమూర్తి దగ్గర గానం చేశాడు. కానీ ఆ గానం తుంబురునిలా శ్రీహరిని సంతృప్తి పరచలేకపోయింది. అయినా నారదుడు తన పట్టు విడువలేదు. ఎలాగైనా తుంబురుని కన్నా బాగా పాడి విష్ణువును ప్రసన్నం చేసుకోవాలనుకున్నాడు.

శివుడు అత్యుత్తమ గాయకుడు కాబట్టి ఆయన అనుగ్రహం సంపాదించి ఆయన దగ్గర సంగీతం నేర్చుకుని మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. అయితే ఈసారి కూడా శ్రీహరి ఆయన గానానికి సంతృప్తి చెందలేదు.

అయినా సరే నారదుడు తన సాధన మానలేదు. ఎన్నో సంగీతపరికరాలు పాడైపోయాయి. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా విష్ణుమూర్తిని తన గానంతో ఆకట్టుకోలేక పోతున్నాడు. చివరికి తానిక విష్ణుభగవానుని సంతృప్తి పరచలేనని అర్థమై ఆఖరి అవకాశంగా తుంబురుల వారి దగ్గరకు వెళ్ళి తన్ను శిష్యుడిగా చేర్చుకోమన్నాడు.

తుంబురుడు అందుకు సంతోషంగా అంగీకరించాడు. ఆయన వద్ద శిష్యరికంలో విష్ణువును ఆకట్టుకునేలా ఎలా పాడాలో నేర్చుకున్నాడు. తర్వాత విష్ణువు దగ్గరికి వెళ్ళి అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ నారాయణుని కీర్తించాడు.

ఆ గానానికి ప్రీతి చెందిన విష్ణువు నారదుని కూడా తుంబురుని లాగే సన్మానించి

“ఈ రోజు నీవు నన్ను తుంబురుని కంటే ఆనందింప జేశావు.” అంటూ మెచ్చుకున్నాడు. నారదుడు పరమానంద భరితుడయ్యాడు.

కాబట్టి ఈర్ష్య పడితే ప్రయోజనం లేదు. మనకన్నా ప్రతిభావంతుల దగ్గర నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటేనే విజయం సిద్ధిస్తుంది.
సంకల్ప సిద్ధి

సంకల్ప సిద్ధి

*సంకల్ప సిద్ధి*

సంకల్పం అంటే మంచి ఆలోచన, మంచి నిర్ణయం. ఆలోచనలు మారుతూ ఉంటాయి, సంకల్పం దృఢంగా ఉంటుంది. ఆలోచనలు రెండు రకాలు- మంచి ఆలోచన, చెడు ఆలోచన. అందరికీ ఉపయోగపడేలా ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టాలనుకోవడం మంచి ఆలోచన. స్వార్థంతో, పర్యవసానంతో పనిలేకుండా సాగించే మనో వ్యాపారం చెడు ఆలోచన. ఆలోచన మంచిదైతే మంచి ఫలితం, చెడు ఆలోచన అయితే అందుకు తగ్గ ఫలం అనుభవించక తప్పదు.

మనం అనుకున్నది జరగాలంటే అందుకు తగ్గట్టుగా పాటుపడాలి, ప్రయత్నించాలి. దాన్నే పురుషకారం లేక మానవ ప్రయత్నం అంటారు. తలదాచుకోవడానికి ఇల్లు, ఒళ్లు కప్పుకోవడానికి బట్ట, కడుపు నిండటానికి తిండి, ఏదో రకంగా సంపాదించుకోక తప్పదు. అవసరాల మేరకు కష్టపడి సంపాదించుకోవడం మానవ ధర్మం. స్వార్థం మితిమీరి సంపాదన అడ్డదారి పట్టితే జరిగేది వికల్పం. సంకల్పాన్ని సాధించడానికి వేసే ప్రతి అడుగూ ఆచితూచి ముందుకు వేయాలి.

తెలివైన జీవులు తాము ఎటుపోవాలో ముందుగానే తెలుసుకుని ఆ దారిని అనుసరిస్తారు. తెలిసీ తెలియని జీవులు జీవితం ద్వారా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. సంకల్ప వికల్పాలు అంతవరకు వారిని వెంటాడుతూనే ఉంటాయి.

ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవడానికి రెండు ముఖ్యమైన పద్ధతులున్నాయి. వాటినే జ్ఞానమార్గం, కర్మమార్గం అంటారు. వేదాలు, శాస్త్రాలు జ్ఞానమార్గంలో నడిచేవారికి దారిదీపాల్లా పనికి వస్తాయి. అందుకు అవకాశం లేనివారికి జీవితానుభవాలే పాఠాలు నేర్పుతాయి. అలాగని, జ్ఞానులకు జీవిత పాఠాలు అనవసరం అనలేం. కర్మ జీవులకు జ్ఞానంతో పనిలేదనీ చెప్పలేం. దారులు వేరైనా గమ్యం ఒకటే కాబట్టి, శ్రద్ధాభక్తులు తోడు అయినప్పుడు- కర్మజ్ఞానాలు పరిపుష్టమై పూర్ణత్వం సాధిస్తాయి. సంకల్పసిద్ధికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు త్రివేణీ సంగమంలా సహకరిస్తాయి.

వైరాగ్యం అంటే మామూలుగా విరక్తి అనే అర్థంలో ఆ పదాన్ని వాడతారు. ఒక వస్తువుపైన ఆసక్తి మితిమీరినప్పుడు కలిగేది విరక్తి. జీవితంలో ఎదురయ్యే పురాణ, ప్రసూతి, శ్మశాన వైరాగ్యాలు తాత్కాలికం. అనుభవించి రసహీనమని గ్రహించినప్పుడు నిజమైన వైరాగ్యం వరిస్తుంది. జీవిత సత్యాన్ని తెలుసుకున్నవాడే తెలివైనవాడు. సాధకుడు దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా, నిరంతరం సాగిపోవాలంటారు విజ్ఞులు, ప్రాజ్ఞులు, అనుభవజ్ఞులు.

ఫలితం ఆశించకుండా పనిచేయమని కృష్ణుడు పరోక్షంగా మనల్ని ఆదేశిస్తున్నాడు. పనిమీద దృష్టి కేంద్రీకరిస్తే అదే యోగమై దైవానికి ప్రీతి కలిగిస్తుంది. పనికి తగ్గ ఫలితం తప్పకుండా ఏదోవిధంగా మనల్ని వరిస్తుంది. ఈ కర్మకౌశలం తెలుసుకున్నప్పుడే కర్మజీవి బుద్ధిజీవిగా మారతాడు. అతడికి సంకల్ప సిద్ధి కలుగుతుంది.

జీవితమే యోగంగా, పరహితం కోరుకునే వ్యక్తి సాధించేది జీవన్ముక్తి. జీవన్ముక్తుడికి కావలసింది తోటివారి హితం.

సంకల్పం అన్న పదానికి అర్థం మంచి ఆలోచన (సమ్యక్‌ + సంకల్పం). నిరంతర సాధనవల్ల ఆ వ్యక్తి తలపెట్టిన ప్రతి పనీ విశ్వ శ్రేయకార్యంగా విరచితం అవుతుంది. పరహితంకోసం పాటుపడే అతడి ప్రతి ఆలోచనా ఒక సదాశయం కలిగి ఉంటుంది. ఆ ఆలోచన ఆచరణీయమై మంచి ఫలితాన్నే ప్రసాదిస్తుంది. సూటిగా చెప్పాలంటే- అలాంటి వ్యక్తి బుర్రలో చెడు, కీడు, చేటు తెచ్చే ఆలోచనకే చోటుండదు.

మనో వ్యాపారం దృఢ సంకల్పమైనప్పుడు మనోరథం సిద్ధిస్తుంది. సంకల్పం సత్‌ సంకల్పమైనప్పుడు పారిజాతంలా
 గుబాళిస్తుంది!
ఒత్తిడికి దివ్యౌషధం.. ఏంటో తెలుసా?

ఒత్తిడికి దివ్యౌషధం.. ఏంటో తెలుసా?

*ఒత్తిడికి దివ్యౌషధం.. ఏంటో తెలుసా?*
           
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి జీవనం యాంత్రికం అయిపోయింది. ఈ యాంత్రిక జీవితంలో వయసు, పేద, ధనిక, ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ ఒత్తిడి ప్రభావం ఆరోగ్యం మీద పడుతోంది. ఈ దశలో ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడిని తగ్గించే చిట్కాలేమిటో తెలుసుకుని వాటిని ఆచరిస్తే సరిపోతుంది... ఆ చిట్కాలు మీకోసం..

* ఒత్తిడిని తగ్గించడంలో దివ్య ఔషధంగా పని చేసేది నవ్వు. ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వితే 80శాతం ఒత్తిడి మటుమాయమైపోతుంది. అంతేకాదు, నవ్వడం వల్ల ఒత్తిడిని కలిగించే కార్టిసాల్‌ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి, ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్స్‌ అనే రసాయనాలు వెలువడతాయి.

* పెద్ద పెద్ద శబ్దాలు వినడం వల్ల ఒత్తిడి అధికం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు అటువంటి శబ్దాలకు దూరంగా ఉండాలి.

* ప్రకృతిలోని పక్షుల కిలకిలారావాలు, శ్రావ్యమైన సంగీతం వినడం, నీటి ప్రవాహం, సముద్ర కెరటాలను చూస్తూ ఉండటం వంటివి చేయడం వల్ల ఒత్తిడిని జయించవచ్చు.

* మనస్సులో ఎటువంటి ఆలోచనలు రానీయకుండా అన్నీ పక్కనపెట్టి శ్వాసమీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం, వేకువజామునే వాకింగ్ చేయడం ద్వారా మానసిక దృఢత్వాన్ని పొందవచ్చు.

* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఎంతో లాభం చేకూరుతుంది, వ్యాయామం చేయడం వల్ల సమస్యలు వచ్చినప్పుడు కృంగి పోకుండా వాటిని ఎదుర్కొనేందుకు కావాల్సిన మానసిక స్థైర్యం వస్తుంది.

* కండరాలు, శరీర అవయవాలు బిగదీసి ఉండకుండా ఫ్రీగా ఉండేట్టు చూసుకోవాలి. ఈ చిన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఒత్తిడి లేకుండా మనసు ఆహ్లాదంగా మారుతుంది.