Showing posts with label AP History. Show all posts
Showing posts with label AP History. Show all posts

Andhra pradesh and Telangana - History Practice Bits

*🔥ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిస్టరీ బిట్స్🔥* 


*🌺1.నవ శక్తి పత్రిక స్థాపకుడు ?చంద్రశేఖరరావు*

*🌺2. విద్వాన్ విశ్వం పాపం నాకు ధైర్యం ఎవరిరచనలు?గద్దె  లింగయ్య* 

*🌺3.మునగాలలో జమీన్ రైతు సంఘం స్థాపించింది? కొల్లు పిచ్చయ్య రాజు*

*🌺4.రాజీ  బ్రహ్మయ్య ఏ ప్రాంతంలో ప్రసిద్ధి ?మునగాల*

*🌺5.దేశంలోనే అత్యంత ఐశ్వర్యవంతమైన జమీందారు ఎవరు ?విజయనగరం*

*🌺6. చేపల చెరువు ప్రాజెక్ట్ను 1938 సంవత్సరంలో ఆక్రమించిన జమిందారు? కాశీపట్నం*  

*🌺7.భూపతిరాజు లక్ష్మీ నరసింహ రాజు ఉద్యమం ఏ ప్రాంతంలో  జరిగినది ?పశ్చిమగోదావరి* 

*🌺8.గొర్రెపాటి వెంకట సుబ్బయ్య నాయకత్వంలో ఉద్యమం ఎక్కడ జరిగింది? కాశీపట్నం .అజారుద్దీన్ జీకే గ్రూప్* 

*🌺9.శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయ భూములు ఏ జమీందారు ఆక్రమించాడు ?చల్లపల్లి*

*🌺10. ఏ సంవత్సరంలో విశాఖపట్నం జిల్లా నుంచి శ్రీకాకుళం విడిపోయింది? 1947* 

*🌺11.బ్రిటిష్ కాలంలో భారత దేశంలోనే అతి పెద్ద జిల్లా? విశాఖపట్నం.అజారుద్దీన్ జి కే గ్రూప్స్*  

*🌺12.విశాఖపట్నంలో జమీన్రైతు సభ స్థాపించిన సంవత్సరం? 1929* 

*🌺13.ప్రజావాణి పత్రిక స్థాపకుడు ?గరిమెళ్ళ కృష్ణమూర్తి* 




ఆంధ్రప్రదేశ్ చరిత్ర - శాతవాహనుల పాలనా విధానం

ఆంధ్రప్రదేశ్ చరిత్ర - శాతవాహనుల పాలనా విధానం


*_🖊📗శాతవాహనుల పాలనా విధానం_*🖊📘

శాతవాహనుల పాలనా విధానం
మౌర్యులకు సామంతులుగా పాలనలోకి వచ్చిన శాతవాహనులు పాలనా విధానంలో వారినే అనుసరించారు. మను ధర్మశాస్త్రం, చాణుక్యుడి అర్థశాస్త్రాలు శాతవాహనులకు మార్గదర్శకాలుగా ఉన్నాయి. అయితే మౌర్యులు తమ పాలనలో కేంద్రీకృత విధానం, విస్తృత యంత్రాంగానికి ప్రాధాన్యతనిస్తే, శాతవాహనులు మాత్రం పరిమిత యంత్రాంగం, వికేంద్రీకృత విధానాలను అనుసరించారు. రాజు నిరంకుశుడైనప్పటికీ, శ్రేయోరాజ్య భావనతో పాలించేవారు. రాజు దైవాంశ సంభూతుడని, రాజ్యాధికారం ‘దైవదత్తం’ అనే భావన శాతవాహనులకు ఉండేది. రాజ్యం వారసత్వంగా సంక్రమించేది. రాజు సర్వ స్వతంత్రుడు. శాసనాల ప్రకారం శాతవాహన రాజులు రామ, భీమ, కేశవ, అర్జున గుణగణాలను ఆపాదించుకున్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాల (పురుషార్థాలు)కు పాలనలో ప్రాధాన్యమిచ్చారు.

రాజ్య పాలన
శాతవాహనులు రాజ్యాన్ని ఆహారాలు (రాష్ట్రాలు)గా విభజించారు. వీటి అధిపతులను అమాత్యులని పిలిచేవారు. రాజుకు సలహాలిచ్చే మంత్రివర్గ సభ్యులను రాజామాత్యులని వ్యవహరించేవారు. రాజు సలహాలను అమలు చేయడానికి అక్షపటల అనే సచివాలయం ఉండేది. ప్రత్యేక కార్యనిర్వహణ కోసం నియమితులైన వారిని ‘మహామాత్రులు’ అని పిలిచేవారు. అమాత్యులు, రాజామాత్యులు, మహామాత్రులు, మంత్రి మండలిని మౌర్యుల పాలన నుంచి శాతవాహనులు స్వీకరించారు. వీరందరూ ఉన్నత ఉద్యోగులే. ప్రతి ఆహారం (రాష్ర్టం)లో ఒక ప్రధాన నగరం (నిగమం)తోపాటు అనేక గ్రామాలుండేవి. గోవర్థనాహార, సోపారహార, మామలాహార, శాతవాహనాహార వంటి పేర్లు శాసనాల్లో కన్పిస్తున్నాయి. పట్టణ పాలనను నిగమ సభలు నిర్వహించేవి.  సైన్యానిధిపతిని మహాసేనాధిపతని, పత్రాలు రాసే అధికారిని లేఖకుడని, కోశాధికారిని హేరణిక, వస్తు సంచయిక అధికారిని భాండారికుడు, భూమిశిస్తు వసూలు చేసే అధికారిని నిబంధకారుడని, రెవెన్యూ రికార్డులు భద్రపరిచే వారిని మహాభాండారికుడని పిలిచేవారు. పాలనావ్యవస్థలో చివరి భాగం గ్రామం.  గ్రామాధ్యక్షుణ్ని గ్రామణి, గుల్మిక, గ్రామిక అని పిలిచేవారు. గ్రామణి ఆధీనంలో 5-10 గ్రామాలుండేవి.

ఆదాయ వనరులు
శాతవాహనుల ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. పంటలో 1/6 వంతును శిస్తుగా వసూలు చేసేవారు. వృత్తి పన్నులుండేవి. రేవులు, రహదారులపై సుంకాలు విధించేవారు. ఒక వృత్తిని అనుసరించే వారంతా సంఘంగా ఏర్పడేవారు. వీటిని శ్రేణులుగా పిలిచేవారు. ఈ శ్రేణి అధ్యక్షుడే శ్రేష్ఠి. గ్రామణి (గుల్మిక) ఆధీనంలో 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది సైనికులు ఉండేవారు. శాసనాల్లోని కటక, స్కంధావార (సైనిక శిబిరం) వివరాలు అప్పటి మిలిటరీ పాలనా విధానాన్ని సూచిస్తున్నాయి. శాతవాహనుల కాలంలో సాగుభూమిని కొలవడానికి ‘రజ్జు’ అనే కొలమానాన్ని వాడారు. ‘రజ్జుగాహకుడు’ అనే అధికారి భూమి కొలతలు, లావాదేవీలను పర్యవేక్షించేవాడు. వృత్తి పనుల వారు చెల్లించే సుంకాన్ని ‘కరుకర’ అని పిలిచేవారు. దక్షిణ భారతదేశంలో భూధానం చేయడం అనే ప్రక్రియను శాతవాహనులే ప్రారంభించారు.

సైన్య నిర్వహణ
శాతవాహనుల కాలంలో రాష్ట్రాలతో పాటు స్థానిక సంస్థలు కూడా సైన్యాన్ని నిర్వహించేవి. గ్రామణి లేదా గుల్మిక ఆధీనంలో కొంత సైన్యం ఉండేది. చరిత్రకారుడు ప్లీని ఆంధ్రులకు పదివేల కాల్బలం, రెండువేల అశ్విక దళం, వెయ్యి ఏనుగుల సైనిక బలం ఉన్నట్లు పేర్కొన్నాడు. సైన్యాన్ని కేంద్రంలో మహాసేనాధిపతి నిర్వహించేవాడు.
ప్రాంతీయ ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లకు అనుగుణంగా న్యాయ నిర్ణయం జరిగేది. స్థానిక వివాదాలను గ్రామపెద్దలే పరిష్కరించేవారు. దక్షిణ భారత మనువుగా పేరొందిన ఆపస్తంభుడి ధర్మసూత్రాలను అనుసరించి న్యాయ పరిష్కారాలు చేసేవారు.

సామాజిక వ్యవస్థ - స్వరూపం
శాతవాహనుల కాలం నాటి సమాజ పరిస్థితులు తెలుసుకోవటానికి హాలుడు ప్రాకృత భాషలో రచించిన గాథాసప్తశతి, రాణి  నాగానిక వేయించిన నానాఘట్ శాసనం, గౌతమీ బాలశ్రీ వేయించిన శిలా శాసనం, వాత్సాయనుడి కామ సూత్రాలు ముఖ్యాధారాలుగా ఉన్నాయి. అమరావతి, కార్లై నాసిక్ శిల్పాల్లో వివిధ స్త్రీ, పురుష వేషధారణలు, సంగీత వాయిద్యాలు, సైనిక విన్యాసాలు, కోలాటాలు, సమాజంలోని వివిధ వృత్తుల వారిని మనం వీక్షించవచ్చు. కొంత మంది చరిత్రకారులు శాతవాహనులది మాతృస్వామిక వ్యవస్థ అని పేర్కొన్నారు. దీనికి ఆధారం నానాఘట్, నాసిక్ శాసనాలను స్త్రీలు వేయించడమే. సంఘంలో చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. పితృస్వామిక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. కుటుంబ పెద్దను గహపతి (గృహపతి) అని పిలిచేవారు. వృత్తిని బట్టి కులాలు, ఉప కులాలు ఏర్పడ్డాయి. సంఘంలో బ్రాహ్మణులకు ప్రత్యేక గౌరవం ఉండేది. గౌతమీపుత్ర శాతకర్ణికి ‘ఆగమ నిలయ’, ‘ఏకబ్రాహ్మణ’, ‘వినివర్తిత చాతుర్వర్ణ సాంకస్య’ వంటి బిరుదులున్నాయి. అయితే శాతవాహనుల కాలంలో కుల వ్యవస్థ పూర్తిగా ఏర్పడలేదని కూడా చెప్పవచ్చు. ఒకే కుటుంబంలో వివిధ వృత్తుల వారు ఉండేవారు. వీరంతా బౌద్ధ సంఘాలకు దానాలు చేసేవారు. ‘థిమిక’ అనే చర్మకారుడు తన కుటుంబ సభ్యులతో అమరావతి స్థూపాన్ని దర్శించి, అనేక దానాలు చేశాడని తెలుస్తోంది. దీన్ని బట్టి కులవ్యవస్థ పూర్తిగా ఏర్పడలేదని ఊహించవచ్చు. సమాజంలో 18 వృత్తుల వారు ఉండేవారు. అందువల్లే కులవృత్తిపై నియమాలు ఏర్పడలేదు. అమరావతి స్థూపంలోని ‘పూర్ణకుంభం’ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట చిహ్నంగా రూపొందింది.

స్త్రీ స్వేచ్ఛా గౌరవాలు
సంఘంలో ప్రతి స్త్రీకి గౌరవం లభించేది.  స్త్రీలకు ఆస్తిహక్కులుండేవి. ఆనాటి బౌద్ధ విహారాలకు స్త్రీలే ఎక్కువగా దానధర్మాలు చేశారు. గౌతమీపుత్ర, వాసిష్టీపుత్ర అనే మాతృ సంజ్ఞలు స్త్రీలకున్న గౌరవాన్ని సూచిస్తున్నాయి. హాలుడి గాథాసప్తశతి ప్రకారం.. సంఘంలో స్త్రీలు మధుపానం, బృంద నాట్యాలు, జంట నాట్యాలు చేస్తూ విచ్చలవిడిగా వ్యవహరించేవారు. సతీసహగమనం ప్రధానసాంఘిక దురాచారంగా ఉండేది. వ్యవసాయం, వాణిజ్యం బాగా అభివృద్ధి చెందింది. అందుకే హాలుడి వర్ణనల్లో విలాసవంతమైన జీవితం కనిపిస్తోంది. స్త్రీలు ‘మహాభోజకి’, ‘మహాసేనాపత్ని’, ‘మహాదంనాయకి’ వంటి బిరుదులను ఆపాదించుకున్నారు. వాత్సాయనుడు తన కామసూత్రాల్లో ఘట నిబంధన, కౌముదీ గమన అనే నాటకాలు, మదనోత్సవం, హోళిక, ఉద్యానగమనే  పండుగలను వర్ణించాడు. స్త్రీ, పురుషులు ఒకే విధమైన ఆభరణాలను ధరించేవారు. జూదం, నాట్యం, సంగీతాలు నాటి ప్రజల ప్రధాన వినోదాలు. శాతవాహనుల కాలంలో శకులు, యవనులు (గ్రీకులు), పహ్లవులు సమాజంలో మిళితమై వైదిక, బౌద్ధ మతాలను అనుసరించారు. వీరు ధర్మదేవ, అగ్నివర్మన్, రుషభదత్తుడు వంటి హిందూ పేర్లు పెట్టుకున్నారు. శక రాజైన రుద్ర దమనుడు కుమార్తె రుద్ర భట్టారికను శాతవాహన రాజు వివాహం చేసుకున్నాడు. రుషభదత్తుడు రాజస్థాన్ పుష్కర ప్రాంతానికి యాత్రలు చేసి బ్రాహ్మణులకు గోవులు, గ్రామాలను దానం చేశాడు. గౌతమీపుత్ర శాతకర్ణి ‘ఏకబ్రాహ్మణ’, ‘ఆగమనిలయ’, ‘వినివర్తిత, చాతుర్వర్ణ సాంకస్య’, ‘ద్విజకుటుంబ వివర్ధన’ (బ్రాహ్మణుల అభివృద్ధి) ‘క్షత్రియ దర్పమాన మర్దన ’వంటి బిరుదులు ధరించి వర్ణ సంకరాన్ని అరికట్టాడు.

మత పరిస్థితులు
 శాతవాహన కాలంలో వైదిక, బౌద్ధ, జైన మతాలు ఆంధ్ర దేశంలో వర్థిల్లాయి. రాజులు వైదిక మతాన్ని ఆదరిస్తే, స్త్రీలు బౌద్ధమతాన్ని పోషించారు. మొదటి శాతకర్ణి రెండు అశ్వమేధ యాగాలతో పాటు ఒక రాజసూయ యాగం చేశాడు. శివారాధన ఉందని గాథాసప్తశతి పేర్కొంది. మధ్యప్రదేశ్‌లోని విదిశ ప్రాంతంలో హోలియోడోరస్ (గ్రీకు) క్రీ.పూ.1వ శతాబ్దంలో వేసిన స్తంభ శాసనం భాగవత మతం గురించి ప్రస్తావించింది. శాతవాహన రాజుల్లో కృష్ణ, వైదిశ్రీ, యజ్ఞశ్రీ పేర్లను బట్టి వీరు వైదిక ధర్మాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. శివకేశవులు, రాధాకృష్ణులను ప్రజలు ఆరాధించేవారని గాథాసప్తశతి పేర్కొంది. చెట్లు, పుట్టలు, సర్పాలను కూడా ఆరాధించేవారు. శాతవాహనుల కాలానికి చెందిన (క్రీ.పూ.2 శతాబ్దం) గుడిమల్లం శివలింగాన్ని (చిత్తూరు జిల్లా) దేశంలోనే అతి ప్రాచీనమైందిగా గుర్తించారు. అనార్యులు, అటవిక తెగలను బ్రాహ్మణ సమాజంలోకి స్వీకరించడానికి వ్రత్సష్టోమ వంటి యజ్ఞాలు నిర్వహించేవారు.

బౌద్ధ మతం
క్రీ.పూ. రెండో శతాబ్దం నుంచి క్రీ.శ. మూడో శతాబ్దం వరకు పశ్చిమ, తూర్పు దక్కను ప్రాంతాల్లో బౌద్ధం విశేష ఆదరణ పొందింది. స్థూపాలు, చైత్య గృహాలు (ప్రార్థనా స్థలాలు), విహారాలు (వసతులు) వెలిశాయి. శాతవాహన రాజు కృష్ణుడు (కన్హ) బౌద్ధ భిక్షువుల కోసం నాసిక్‌లో గుహాలయాన్ని నిర్మించాడు. గౌతమీ బాలశ్రీ, రెండో పులోమావి, కార్లై (మహారాష్ర్ట)లో మహా సాంఘీకులకు గుహదానం చేశారు. శక రాజైన రుషభదత్తుడు గోవర్థనాహారలో గుహ నిర్మాణానికి బౌద్ధ సన్యాసులకు నాలుగువేల కార్షాపణులు (వెండినాణేలు) దానం చేశాడు. నాసిక్, కార్లై, కన్హేరి, కుడ, భాజా, బేడ్సా, అజంతా వంటి గుహలను దక్కన్ పశ్చిమ ప్రాంతంలో నిర్మించారు. తూర్పు తీరంలో అమరావతి, భట్టిప్రోలు, జగ్గయ్యపేట, గుంటుపల్లి, శాలిహుండం (శ్రీకాకుళం జిల్లా), రామతీర్థం (విజయనగరం జిల్లా), అనకాపల్లిలో బుద్ధన్న కొండలు వంటి అనేక బౌద్ధవాస్తు నిర్మాణాలు వెలిశాయి. బౌద్ధంలో అనేక శాఖలున్నాయి. వీటిలో అంధక శాఖ (ఆంధ్రా), బాదనీయ శాఖ (నాసిక్), మహా సాంఘికులు (కార్లై), చైత్యకులు (అమరావతి), పూర్వ- అపరశైలీయులు (నాగార్జున కొండ) ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఆంధ్ర దేశంలో అతి ప్రాచీన స్థూపం భట్టిప్రోలు (గుంటూరు జిల్లా)లో ఉంది. వీరికాలంలో శ్రీ పర్వతం (నాగార్జున కొండ) ప్రముఖ విద్యాకేంద్రంగా వెలుగొందింది. పశ్చిమగోదావరి జిల్లాలోని గుంటుపల్లి గుహాలయం శాతవాహనుల కాలం నాటిదే. ఆ కాలంలో ప్రబలిన మహాసాంఘిక వాదానికి మరో పేరే చైత్యక వాదం.

ఆంధ్రప్రదేశ్ చరిత్ర - శాతవాహనులు-ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్ చరిత్ర - శాతవాహనులు-ముఖ్యాంశాలు


*_🖊📘శాతవాహనులు-ముఖ్యాంశాలు_*🖊📗

శాతవాహనులు-ముఖ్యాంశాలు

ఆంధ్ర శబ్దాన్ని పేర్కొంది - ఐతరేయ బ్రాహ్మణం
ఆంధ్ర పథాన్ని ప్రస్తావించింది - భీమసేన జాతకం
ఆంధ్ర నగరిని పేర్కొంది - సెరివణిజ జాతకం
త్రిలింగ దేశాన్ని ప్రస్తావించింది - శక్తి సంగ్రమ తంత్రం
శాతవాహనులు, పురాణాల్లో పేర్కొన్న ఆంధ్ర భృత్యులు ఒకరేనని ఆర్.జి.భండార్కర్ అభిప్రాయపడ్డారు.
శాతవాహనుల ఆదిమ నివాసం నాసిక్ ప్రాంతమని పి. శ్రీనివాస అయ్యంగార్ గోపాలాచారి, పులాస్కర్ పేర్కొన్నారు.
వి.ఎన్.సుంక్తాంకర్ అభిప్రాయంలో శాతవాహనుల తొలి నివాసం ‘బళ్లారి’ ప్రాంతం.
శాతవాహనులు గోదావరి, కృష్ణా, మండల వాసులని వి.ఎ.స్మిత్, రాయ్ చౌదరి, గుత్తి వెంకట్రావ్‌లు అభిప్రాయపడ్డారు.
‘వాసుదేవ విష్ణు మిరాసీ’ అభిప్రాయంలో శాతవాహనుల జన్మభూమి విదర్భ ప్రాంతం.
శాతవాహనుల ప్రాచీన రాజధాని శ్రీకాకుళం (కృష్ణాజిల్లా) ఆ తర్వాత వరుసగా ధాన్యకటకం, ప్రతిష్టానపురాలని ఎల్.డి.బార్నెట్ అభిప్రాయపడ్డారు.
సంస్కృత భాషలో ‘శర్వవర్మన్’ కాతంత్ర వ్యాకరణం రచించాడు.
ఆచార్య నాగార్జునుడు సుహృల్లేఖ గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు.
ప్రాకృత భాషలో హాలుడు రచించిన గ్రంథం‘గాథాసప్తశతి’.
నానాఘట్ శాసనాన్ని మొదటి శాతకర్ణి భార్య నాగనిక వేయించింది.
నాసిక్ శిలా శాసనాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమీ బాలాశ్రీ వేయించింది.
హతిగుంఫా శిలాశాసనాన్ని - కళింగాధిపతి ఖారవేలుడు (ఒడిశా) వేయించాడు.
క్రీ.శ.150లో శకరాజైన రుద్రదమనుడు మొట్ట మొదటిసారిగా సంస్కృత భాషలో వేయించిన శాసనం ‘గిర్నార్ శాసనం’
శాతవాహన రాజ్య స్థాపకుడు - శ్రీముఖుడు
రెండు అశ్వమేధ, ఒక రాజసూయ యాగం చేసిన శాతవాహన రాజు - మొదటి శాతకర్ణి
మొదటి శాతకర్ణికి గల బిరుదులు - దక్షిణాపథపతి, ఏక వీరుడు, శూరుడు
కార్షాపణులు అంటే - వెండి నాణేలు
మధ్యప్రదేశ్‌లో ఉన్న సాంచీ స్థూపానికి దక్షిణ తోరణ ద్వారాన్ని నిర్మించిన శాతవాహన రాజు - రెండో శాతకర్ణి
ఏ శాతవాహన రాజు కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం రాజ భాష అయింది?
- కుంతల శాతకర్ణి
17వ శాతవాహన రాజైన హాలుడికి గల బిరుదు?
- కవి వత్సలుడు
లీలావతి పరిణయ కావ్యాన్ని రచించింది - కుతూహలుడు
కావ్య మీమాంస గ్రంథాన్ని రచించింది - రాజశేఖరుడు
నహపాణుని రాజధాని - మిన్నగార
‘క్షహరాట వంశ నిరవశేషకర’అనే బిరుదు ఎవరికి ఉంది?
- శకరాజైన నహపాణుడికి
క్షత్రియ దర్పమాన, త్రిసముద్రతోయ పీతవాహన, ఏకబ్రాహ్మణ, ఆగమనిలయ అనే బిరుదులున్న శాతవాహన రాజు?
- గౌతమీపుత్ర శాతకర్ణి
నహపాణుడు (శకరాజు) వేయించిన వెండి నాణేలు ఎక్కడ లభించాయి?
- మహారాష్ర్టలోని జోగల్‌తంబిలో
నాణేలపై ఓడ బొమ్మలు ముద్రించిన శాతవాహన రాజు?
- యజ్ఞశ్రీ శాతకర్ణి
పురుషార్థాలు అంటే - ధర్మ, అర్థ, కామ, మోక్షాలు
ఆహారాలు అంటే - రాష్ట్రాలు
నిగమాలు అనగా?
- ప్రధాన నగరాలు
గ్రామిణి, గుల్మిక, గ్రామిక పదాలు దేన్ని సూచిస్తాయి?
- గ్రామ పరిపాలనాధికారిని
ఒక వృత్తిని అనుసరించే వారిని శ్రేణులు (సంఘాలు)అంటారు. దీని అధ్యక్షుడు శ్రేష్టి
స్కంధావారం అంటే - సైనిక శిబిరం
సాగుభూమిని కొలిచేందుకు ‘రజ్జు’ అనే కొలమానాన్ని వాడేవారు. భూమి కొలతలు, లావాదేవీలను పర్యవేక్షించే వారిని రజ్జు గాహకుడు అనేవారు.
వృత్తి పనులవారు కరుకర అనే పన్నును చెల్లించేవారు.
దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ‘భూదానం’ చేయడం అనే ప్రక్రియను శాతవాహనులే ప్రారంభించారు.
కుటుంబ పెద్దను గహపతి (గృహపతి) అని పిలిచేవారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట చిహ్నం పూర్ణ కుంభాన్ని అమరావతి స్థూపంనుంచి తీసుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ‘విదిశ’ ప్రాంతంలో హోలియో డోరస్ క్రీ.పూ.1వ శతాబ్దంలో వేసిన స్తంభ శాసనం భాగవత మతం గురించి ప్రస్తావించింది.
ఆంధ్ర దేశంలో అతి ప్రాచీనమైన గుడి మల్లం శివలింగం చిత్తూరు జిల్లాలో లభ్యమైంది.
ఆంధ్ర దేశంలో అతి ప్రాచీన స్థూపం (క్రీ.పూ.2వ శతాబ్దం) ‘భట్టిప్రోలు’ (గుంటూరు జిల్లా)లో లభించింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లి గుహాలయాలు శాతవాహనుల కాలంలో నిర్మాణమయ్యాయి.
శాతవాహన రాజుల ఆజ్ఞలను అమలు చేయటానికి ‘అక్ష పటలం’ అనే సచివాలయం ఉండేది.
శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు అజంతాలోని 9.10 గుహల్లో ఉన్నాయి.
చైత్యగృహాలు అంటే బౌద్ధుల ప్రార్థనా స్థలాలు.
తిలపిష్టకులు అంటే ఎవరు?
- తెలకలివాళ్లు (గానుగ ద్వారా నూనె తీసేవారు)
గధికులు అంటే - మందులు తయారుచేసేవారు
సార్థవాహులు అంటే ఎవరు?
ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తువులు తీసుకొనిపోయి వ్యాపారం చేసేవారు
కోలికులు అంటే - సాలెవారు
ఒసకరులు అంటే - మేదర్లు
వజ్రయానం అంటే - బుద్ధుడిని తాంత్రిక పూజా విధానంలో పూజించడం
శాతవాహనుల ప్రధాన ఆదాయం భూమిశిస్తు. పంటలో 1/6 వంతును శిస్తుగా వసూలు చేసేవారు.
కొండ కుందాచార్యుడు ‘సమయసారం’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడు శాతవాహన రాజుల సమకాలికుడు.
‘కథా సరిత్సాగరం’ను సంస్కృత భాషలో ‘సోమదేవసూరి’ రచించాడు.
బృహత్కథా శ్లోక సంగ్రహం రచయిత - బుధస్వామి
మహాయాన మాధ్యమిక సిద్ధాంత కర్త - ఆచార్య నాగార్జునుడు.

ఆంధ్రప్రదేశ్ చరిత్ర - వేంగి చాళుక్యుల పాలనాంశాలు

ఆంధ్రప్రదేశ్ చరిత్ర - వేంగి చాళుక్యుల పాలనాంశాలు


*_🖊📗వేంగి చాళుక్యుల పాలనాంశాలు_*🖊📘

వేంగి చాళుక్యుల పాలనాంశాలు
క్రీ.శ.6వ శతాబ్దం నుంచి పదో శతాబ్దం వరకు సుమారు నాలుగు శతాబ్దాల పాటు పిఠాపురం, పెదవేగి రాజధానులుగా చేసుకొని వేంగి చాళుక్యులు ఆంధ్రదేశాన్ని పాలించారు. ఈ యుగంలోనే ఆంధ్రదేశం ప్రాచీన యుగం నుంచి తొలి మధ్య యుగంలోకి ప్రవేశించింది. రాష్ట్రకూటులు, కల్యాణీ చాళుక్యులు, చోళులు, పల్లవులు, సమకాలీన రాజ్యాల తాకిడిని తట్టుకొని తూర్పు చాళుక్యులు రాజకీయ సుస్థిరతను సాధించారు. వీరి కాలంలో ఆర్థిక, సాంఘిక, మత, సాంస్కృతిక రంగాల్లో విశేష అభివృద్ధి జరిగింది.

పాలనా విశేషాలు
శాసనాలు, సాహిత్యం ద్వారా వీరి పాలనా విశేషాలు తెలుస్తున్నాయి. వీరు పశ్చిమ ప్రాంత బాదామీ చాళుక్యుల పాలనా పద్ధతులను అనుసరించారు. నాటి సమకాలీన రాజ్యాలైన రాష్ట్రకూటులు, కళ్యాణీ చాళుక్యులు, పల్లవులు, చోళుల పాలనాంశాలను జోడించి వీరు పాలన సాగించారు. పాలనలో రాజు నిరంకుశుడు. రాజ్యాధికారం వంశపారంపర్యంగా జ్యేష్ట పుత్రుడికి సంక్రమించేది. శాసనాల ప్రకారం రాజ్య పాలన ‘సప్తాంగాలు’ (ఏడు విభాగాలు), పద్దెనిమిది తీర్థాల (కార్యాలయాల) ద్వారా జరిగేది.

సప్తాంగాలు
రాజ్య పాలనలో మంత్రి, పురోహితుడు, సేనాపతి, యువరాజు, దేవారిక, ప్రధానుడు (ముఖ్యుడు), అధ్యక్షుడు (కార్యాలయ అధిపతి), రాజ ప్రాసాదంలో పాలనను 72 నియోగాలు నిర్వహించేవి. నియోగాల అధిపతిని నియోగాధికృతుడు అని పిలిచేవారు. ఈ విషయం చాళుక్య మొదటి అమ్మరాజు వేయించిన శాసనం ద్వారా తెలుస్తోంది. పఠవర్ధన కుటుంబం రాజప్రాసాద పాలన నిర్వహించేదని అమ్మరాజు శాసనం పేర్కొంటోంది. రాజ్యాన్ని విషయాలు (రాష్ట్రాలు), నాడులు (కొట్టాలు, జిల్లాలు), గ్రామాలుగా విభజించేవారు. వారగోష్టి (సభా సమావేశాలు) నిర్వహించేవారు. విషయాల అధిపతిని నియోగ వల్లభుడు అని పిలిచేవారు. సర్వ లోకాశ్రయుడు వేయించిన చందలూరు శాసనం ప్రకారం నాడుల అధిపతిని నియోగికా వల్లభుడు అని వ్యవహరించేవారు. ఉదా: కమ్మనాడు (ఒంగోలు, బాపట్ల ప్రాంతం), పాకనాడు (కందుకూరు, నెల్లూరు ప్రాంతాలు), రేనాడు (కడప, రాయలసీమ), వెలనాడు (తెనాలి, గుంటూరు), పల్నాడు (మాచర్ల ప్రాంతం). నాడులను గ్రామాలుగా విభజించారు. గ్రామాధిపతిని గ్రామేయిక, గ్రామిణి, ఊర్గపుండ అని వివిధ పేర్లతో పిలిచేవారు. గ్రామ పాలనలో సుంకాలను వసూలు చేసే వారిని మన్నేయులు అని పిలిచేవారు. గ్రామాల్లో తగవులను పంచవర (గ్రామసభ) ద్వారా పరిష్కరించేవారు.

సైనిక పాలన
సైనికాధికారిని సంధి విగ్రహాధికారి, మహా సామంతాధిపతిగా పిలిచేవారు. రాజ్య రక్షణలో సేనను హస్తిపకులు (ఏనుగులు), అశ్వికులు (గుర్రాలు), పదాతులు (సైన్యం)గా విభజించారు. బాణాలు, తోమరాలు వీరి ఆయుధాలు. యుద్ధ సమయంలో ఏనుగులకు సారాయి పట్టించేవారు. గుర్రాలకు కవచాలు తొడిగేవారు. యుద్ధ భూమికి మహిళలు కూడా వెళ్లేవారు. యుద్ధానికి భయపడి యుద్ధభూమి నుంచి వెనుదిరిగే వారికి స్త్రీ వేషం వేయించి ఊరేగించేవారు.

రెవెన్యూ పాలన
భూమిని వివిధ తరగతులుగా విభజించేవారు. భూసారాన్ని బట్టి పన్నులు విధించేవారు. పన్నులు లేని భూమిని ఉంబాలీ అని పిలిచేవారు. భూమి శిస్తు అరిపన్ను, సిద్ధాయి అనే పేర్లతో ఉండేది. యువరాజు వ్యక్తిగత ఖర్చుల కోసం దేవరాచపన్ను, సైన్య నిర్వహణ కోసం పడమేరిపన్ను, సంధి విగ్రహాధి పన్నులు వసూలు చేసేవారు. గొడుగులు తయారుచేసే వారిపై ‘కొదెన’ అనే పన్ను వేసేవారు. పశువుల పచ్చికబయళ్లపై పుల్లరి పన్ను విధించేవారు. భూమిని రాజకోల, రాజమానకోలతో కొలిచేవారు. భూమి ప్రమాణాలు ఖండిక, పుట్టి, కుంచం, తూములుగా ఉండేవి. ద్రవ్య చెలామణీలో గ్యద్యాణాలు, మాడలు (బంగారు నాణేలు), రూకలు (వెండి నాణేలు) ఉండేవి. రాగి నాణేలను చిన్నం అని పిలిచేవారు. భూమి పన్నుతో సమానంగా వ్యాపారస్తుల నుంచి హెజ్జుంక (లేదా) పెర్జుంక పన్నులు విధించేవారు. పన్నులు వసూలు చేసే అధికారిని సుంకాధిరావు, సుంకం కైకొండుదేవ, పెర్జుంకడకనివార అని పిలిచేవారు. వర్తక శ్రేణులను నకరాలు అనేవారు. నకరం (వర్తక శ్రేణి) ప్రధాన కేంద్రంగా పెనుగొండ (పశ్చిమ గోదావరి జిల్లా) ఉండేది. సమాజంలో వర్తకుల తర్వాత వృత్తి పనివారైన తెలకలి వారి (నూనె తీసేవారి)కి అధిక గౌరవం ఉండేది. ఆనాడు దేశీయ కొండ పట్టణం (మోటుపల్లి - ప్రకాశం జిల్లా), కులోత్తుంగచోళ పట్టణం (విశాఖపట్నం), చోళ పాండ్యపురం (ఘంటసాల-కృష్ణా జిల్లా), మచిలీపట్నం ప్రధాన రేవు కేంద్రాలుగా ఉండేవి. పశ్చిమాసియా, బర్మా, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలతో వర్తక వ్యాపారాలు జరిగేవి.

1/6వ వంతు భూమిశిస్తు వసూలు చేసేవారు. తూర్పు చాళుక్యుల పాలన, ద్రవ్య వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ తర్వాతి కాలంలో వచ్చిన కాకతీయులు, రెడ్డి రాజులకు మార్గదర్శకమైంది.

సామాజిక పరిస్థితులు
తూర్పు చాళుక్యుల కాలంలో చైనా యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్ ఆంధ్ర దేశంలో పర్యటించాడు. భూములు సారవంతమైనవని, ప్రజలు నల్లగా, కఠిన స్వభావంతో ఉండేవారని, బౌద్ధమతం క్షీణ దశకు వచ్చి, హిందూ మతంలో దేవుళ్ల పూజా విధానాలు పెరిగాయని పేర్కొన్నాడు. సమాజంలో కుల వ్యవస్థ వేళ్లూనుకుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలు స్పష్టంగా ఏర్పడ్డాయి. బ్రాహ్మణులు అధిక గౌరవం పొందారు. బ్రాహ్మణులు తొలిసారిగా వైదికులు, నియోగులుగా విభజితమయ్యారు. పూజలు, యజ్ఞాలు, యాగాలు నిర్వహించే పురోహిత వర్గం వైదికులు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసేవారు నియోగులు. ఇవే కాకుండా ప్రాంతాల వారీగా బ్రాహ్మణుల్లో వెలనాటులు, కమ్మ బ్రాహ్మణులు తదితర శాఖలు ఏర్పడ్డాయి. తమిళ ప్రాంతం నుంచి వచ్చి ఆంధ్ర దేశంలో స్థిరపడిన బ్రాహ్మణులు ఆరామ ద్రావిడులుగా గుర్తింపు పొందారు. ఆంధ్ర దేశంలో వైశ్యులు పెనుగొండ ముఖ్య కేంద్రంగా వర్తక వ్యాపారాలు చేసేవారు. నకరాలు పేరుతో వర్తక శ్రేణులుగా ఏర్పడ్డారు. 16వ శతాబ్దంలో రాసిన వైశ్య పురాణం ప్రకారం కన్యకాపరమేశ్వరి వీరి ఇష్టదైవం. వీరు అనేక దేవాలయాలకు దాన ధర్మాలు చేశారు.

చాళుక్యుల కాలంలో 18 ఉప కులాలు (అష్టాదశ వర్గాలు) ఏర్పడ్డాయి. విశ్వ కర్మలు (వడ్రంగులు) పంచాణం అనే ఐదు చేతివృత్తుల వారిగా (కాసే, కంచేరి, కంసాలి, వడ్రంగి, విశ్వకర్మలు) ఏర్పడ్డారు. వీరికి సంఘంలో గౌరవ మర్యాదలుండేవి. వీరు రాగి రేకులపై శాసనాలు కూడా లిఖించేవారు. సమాజంలో స్త్రీలకు గౌరవం ఉన్నా బాల్య వివాహాలు, బహుభార్యత్వం, స్త్రీని ఒక భోగ వస్తువుగా పరిగణించడం వంటివి ఉండేవి. దేవదాసీ విధానం అమల్లోకి వచ్చింది. మాన్యగార, పటేలు, గౌండ అనే గ్రామాధికారులుండేవారు. కోలాటాలు, గేయ నాటకాలు ఆనాటి సమాజంలో ప్రధాన వినోదాలు. చాళుక్య సోమేశ్వరుడు రచించిన అభిలషితార్థ చింతామణి గ్రంథం ఈ విషయాలను ప్రస్తావించింది.

సాహిత్య వికాసం
గుణగ విజయాదిత్యుడి కాలంలో తొలిసారిగా తెలుగు వచనం శాసనాల్లో కనిపిస్తుంది. జయసింహ వల్లభుడు వేయించిన విప్పర్ల శాసనంలో కూడా తొలి తెలుగు వచనం ఉంది. బెజవాడ యుద్ధమల్లుడి శాసనంలో మధ్యక్కర ప్రయోగం ఉంది. రాజరాజ నరేంద్రుడి కాలంలో నారాయణభట్టు సహకారంతో సంస్కృత మహాభారతాన్ని నన్నయభట్టు తెలుగులో అనువదించడం ప్రారంభించాడు. సంస్కృతంలో మహావీరాచార్యుడు రచించిన గణిత సార సంగ్రహం గ్రంథాన్ని పావులూరి మల్లన తెలుగులోకి అనువదించాడు. ఆంధ్రశబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని నన్నయ భట్టు తెలుగులో రచించాడు. పాల్కురికి సోమనాథుడు బసవపురాణం, పండితారాధ్య చరిత్ర రచించాడు. పండితారాధ్యుడు రచించిన శివతత్వసారం తొలి శతకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వేములవాడ భీమ కవి కవిజనాశ్రయం, రాఘవ పాండవీయం వంటి గ్రంథాలు రచించాడు.

మత పరిస్థితులు
శాసనాల ప్రకారం బ్రాహ్మణులు హిరణ్యగర్భ, బహుసువర్ణ వ్రతాలను ఉన్నత కులాల వారి కోసం జరిపేవారు. పులకేశిన్-1 బహుసువర్ణ, సువర్ణగర్భ, అగ్నిష్టోమ, అశ్వమేధ, వాజపేయ, పౌండరీక వంటి యజ్ఞయాగాలు చేశాడు. తత్ఫలితంగా రాజులు బ్రాహ్మణులకు పన్నులు లేని గ్రామాలు, భూములను దానం చేసేవారు. శ్రీ పృథ్వీవల్లభ సత్యాశ్రయుడు వేయించిన మారుటూరు శాసనం ఆంధ్ర దేశంలో తొలిసారిగా లభ్యమైంది. దీని ప్రకారం వేంగి చాళుక్యులు, ఆంధ్రా బ్రాహ్మణుల దాన వివరాలు తెలుస్తున్నాయి. తూర్పు చాళుక్య రాజైన జయసింహ వల్లభుడు పల్లవుల ఆధీనంలో ఉన్న నెల్లూరు ప్రాంత బోయ కొట్టాలను జయించి, ఆటవిక తెగలను బ్రాహ్మణ సమాజంలోకి తీసుకురావడంతో బోయలు బ్రాహ్మణ పూజారులుగా ఏర్పడ్డారు. ఆగమాలు, పురాణాలు, దర్శనాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, వేదాంగాలు, యోగ, న్యాయ, వైశేషిక వంటి అంశాలు ప్రధానంగా అధ్యయనం చేశారు. బ్రాహ్మణులు ద్వివేదులు, త్రివేదులు, చతుర్వేదులుగా ఏర్పడ్డారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి ఘటికలు అనే సంస్థలు ఏర్పడ్డాయి. 14 రకాల విద్యలను ఘటికల్లో అభ్యసించేవారు. జయసింహ వల్లభుడి నిడమర్రు శాసనం ప్రకారం గుంటూరు జిల్లా కంతేరు వద్ద ఉన్న అసనపురంలో ఘటిక ఉన్నట్లు తెలుస్తోంది. కడప, కర్నూలు ప్రాంతాల్లో ఘటికలుండేవి. వీటిలో శ్రవణం, మననం, ధారణం పద్ధతుల్లో విద్యాభ్యాసం జరిగేది. మతం పరంగా బౌద్ధం ప్రాధాన్యం కోల్పోయింది. జైన మతం కొంతమేరకు వర్ధిల్లింది. కుబ్జ విష్ణువర్ధనుడి భార్య అయ్యణ మహాదేవి, రాజరాజ నరేంద్రుడి తండ్రి విమలాదిత్యుడు జైన మతాన్ని ఆదరించినట్లు తెలుస్తోంది. విజయవాడ, సిద్ధవటం, ఆర్యావటం, రామతీర్థం కేంద్రాలుగా జైనం వర్ధిల్లింది.

వేంగి చాళుక్యుల కాలంలో శైవ మతం గొప్ప ఆదరణ పొందింది. రాజులు పరమ బ్రాహ్మణ్య, పరమ మహేశ్వర, పరమ భాగవత వంటి బిరుదులు ఆపాదించుకున్నారు. క్రీ.శ.8వ శతాబ్దం నాటికి శైవ మత శాఖైన పాశుపతం ఆంధ్ర దేశంలో ప్రవేశించింది. పాశుపత శాఖతోపాటు కాలాముఖ శాఖ ఏర్పడింది. రెండో అమ్మరాజు వేయించిన తాడికొండ, బెజవాడ శాసనాలు అమరావతి, బెజవాడల్లో కాలాముఖులు ప్రాచీన దేవాలయాల్లో సింహ పరిషత్తు గోష్టులు నిర్వహించేవారని పేర్కొంటున్నాయి. రెండో పులకేశి ఆలంపురంలో సుదర్శనాచార్యుడి వద్ద శివ మండల దీక్ష తీసుకున్నాడు. కర్మ రాష్ట్రం (కమ్మ రాష్ట్రం) నుంచి రెండు వందల మంది బ్రాహ్మణులు తమిళనాడుకు వలస పోయారు. క్రీ.శ.7వ శతాబ్దంలో ఈ బ్రాహ్మణులు నందివర్మ, పల్లవ మల్లరాజు నుంచి అనేక భూదానాలు పొందారు. చతుర్వేదులు, త్రివేదులు, షడంగవాదులు, కర్మవాదులు అనే బ్రాహ్మణ శాఖలు ఏర్పడ్డాయి. మతానికి దేవాలయం ప్రధాన కేంద్రమైంది.




దేవుళ్లను ఊరేగించడం, జాతరలు జరపడం తొలిసారిగా వేంగి చాళుక్యుల కాలంలో వచ్చింది. బెజవాడ యుద్ధమల్లుడి శాసనం ప్రకారం చేబ్రోలు నుంచి బెజవాడ వరకు మహాసేనుడి ఊరేగింపు, జాతర జరిగింది. పురాణ దేవుళ్లను ఆరాధించే స్మార్థ విధానం ఈ యుగంలో ప్రారంభమైంది. శివుడు, విష్ణువు, సూర్యుడు, గణపతి, శక్తి అనే ఐదుగురు దేవుళ్లను పూజించడం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీశైలం, ఆలంపురం, త్రిపురాంతకం ప్రాంతాల్లో కాపాలికులు అనే శైవులు ప్రాధాన్యం సంతరించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ చరిత్ర - శాసనాలు

ఆంధ్రప్రదేశ్ చరిత్ర - శాసనాలు

🌷*శాసనాలు:చరిత్ర🌷

👉 *●నాసిక్ శాసనం:*

 గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను తెలియజేస్తూ ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించినది.ఈ శాసనమును రెండవ పులోమావి కాలంలో వేయించింది. గౌతమి బాలశ్రీ తనను తాను రాజర్షి వధువుగా పేర్కొంది.

👉 *●నానాఘట్ శాసనం:*

మొదటి శాతకర్ణి విజయాలను తెలియజేస్తూ ఇతని భార్య నాగానిక వేయించినది.ఈయన రెండు అశ్వమేధాలు  ఒక రాజసూయయాగం చేసినట్లు ఈ శాసనం తెలుపుతుంది.

👉*●కార్లే శాసనం:*

గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను గురించి తెలుపుతుంది.

👉*●ఐహూల్ శాసనం:*

 2వ పులకేశి  విజయాలను తెలుపుతుంది. ఈ శాసనాన్ని రవి కీర్తి రచించాడు.

👉*●హథిగుంపా  శాసనం:*

దీనిని వేయించిన కళింగ చక్రవర్తి ఖరవేలుడు. ఇతనికి బిక్షురాజు, మహ మేఘవాహాన అను బిరుదులు కలవు. ఈ శాసనం ప్రాకృతిక భాష (బ్రాహ్మిలిపి)లో రచింపబడినది. ఈ శాసనం ఉదయగిరి వద్ద లభించింది. ఖారవేలుడు దిగ్విజయ సూచకంగా రాజసూయయాగం చేసినట్లు ఈ శాసనం ద్వార తెలుస్తుంది.

👉*●అలహద్ శాసనం:*

సముద్ర గుప్తుని విజయాలను గురించి తెలుపును. ఈ శాసనాన్ని  హరిసేనుడు రచించాడు.

👉*●చేజేర్ల శాసనం:*

కందరుడు వేయించాడు. కందరుని విజయాలను గురించి తెలియజేస్తుంది.
బయ్యారం చెరువు శాసనం:
దీన్ని గణపతిదేవుని సోదరి మైలాంబ వేయించింది.

👉*●జునాఘడ్ శాసనం:*
రుద్రదమనుడు  వేయించాడు.

👉*●సాంచీ శాసనం:*

రెండవ శాతకర్ణి వేయించాడు. ఈ శాసనం ఇతనిని "రాజస్యశ్రీ శాతకర్ణి"  గా పేర్కొంది.

👉*యజ్ఞశ్రీ శాతకర్ణి:*

చినగంజాంలో దొరికిన శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి తెలుపుచున్నది.

👉హైదరాబాద్  శాసనం:

రెండవ పులకేశి క్రీ.శ. 609 లో రాజ్యానికి వచ్చినట్లు తెలిపే శాసనం.

👉*మంచి కళ్ళు శాసనం:*

సిం హవర్మ వేయించిన పల్లవుల తొలి శాసనం (విజయపురి సమీపంలో)
అశోకుని గిర్నాల్ శాసనం:
పశ్చిమ భారతదేశం మీద  చంద్రగుప్తుడి ఆధిపత్యాన్ని తెలుపుతుంది. 

👉*●భట్టిఫ్రోలు శాసనం:*

కుబేరకుడనే యక్షరాజు వేయించాడు. శాతవాహనుల కాలంలో నిగమసభల గురించి ఈ శాసనం తెలుపుతుంది.

👉*●కాజీపేట శాసనం:*

మోదటి  బ్రేతరాజును ప్రధమ కాకతీయ రాజుగా
పేర్కొన్నది.

👉శాతవాహనుల శాసనాలు:

ఇవన్నీ ప్రాకృతిక భాషలోను మరియు బ్రాహ్మి లిపిలోను ఉన్నాయి.

👉*●ఉత్తర మేరూర్ శాసనం:*

మొదటి పరాంతకుని గురించి తెలుపును. ఈ శాసనం దక్షిణ భరతదేశంలో చోళుల కాలంలో గ్రామీణ ప్రభుత్వాలు వర్దిల్లాయని  తెలుపుతుంది.

మోదటి  బ్రేతరాజును ప్రధమ కాకతీయ రాజుగా
పేర్కొన్నది.

👉శాతవాహనుల శాసనాలు:

ఇవన్నీ ప్రాకృతిక భాషలోను మరియు బ్రాహ్మి లిపిలోను ఉన్నాయి.

👉*●అద్దంకి శాసనం:*

పాండురంగడు వేయించిన తొలి తెలుగు శాసనం.

తెలుగు, తమిళ  భాషలు కలిపి వేయించిన శాతవాహన రాజు వాసిస్టీపుత్ర శాతకర్ణి.
  🌸💐🌸💐🌸💐🌸💐🌸
AP HISTORY PRACTICE BITS FOR APPSC,  GRAMA/WARD SACHIVALAYAM EXAMS

AP HISTORY PRACTICE BITS FOR APPSC, GRAMA/WARD SACHIVALAYAM EXAMS

*🔥AP HISTORY PRACTICE BITS🔥*

*▪1. 1906 లో కొమర్రాజు లక్ష్మణరావుచే ప్రారంభించబడిన విజ్ఞాన చంద్రికా మండలి 1910 లో ఎవరు రచించిన “ఆంధ్రుల చరిత్ర” గ్రంధ ప్రథమ భాగాన్ని రచించింది?*

A. ఏటుకూరి బలరామమూర్తి
B. సురవరం ప్రతాపరెడ్డి
*C. చిలుకూరి వీరభద్రరావు*✅
D. ఖండవల్లి లక్ష్మీరంజసం

*▪2. ఈ క్రిందివారిలో ఎవరు బహిర్గతం చేసిన “దేవులపల్లి శాసనం” ద్వారా విజయనగర సాళువ వంశం విశేషాలు తెలిశాయి?*

A. కందుకూరి వీరేశలింగం
*B. జయంతి రామయ్య*✅
C. కొమర్రాజు లక్ష్మణరావు
D. చిలుకూరి వీరభద్రరావు

*▪3. ఈ క్రిందివాటిలో సరైనవి?*

*A. అభినవ తిక్కన – తుమ్మల సీతారామమూర్తి చౌదరి*✅

*B. గద్య తిక్కన – కందుకూరి వీరేశలింగం*✅

A. 1 మాత్రమే
B. 2 మాత్రమే
*C. రెండూ సరైనవే*✅
D. రెండూ సరికాదు

*▪4. గురజాడ అప్పారావు వాడుక భాషలో రచించిన “కన్యాశుల్కం” నాటక మొదటి ముద్రణ ఎప్పుడు జరిగింది?*

A. 1890
*B. 1897*✅
C. 1905
D. 1912

*▪5. వ్యవహారిక భాషోద్యమ ప్రచారం కోసం “తెలుగు” అనే పత్రిక నిర్వహించినది?సైదేశ్వర రావు*

A. గురజాడ అప్పారావు
B. కందుకూరి వీరేశలింగం
*C. గిడుగు రామమూర్తి*✅
D. కొమర్రాజు లక్ష్మణరావు

*▪6. 1914 లో అఖిల భారత కాంగ్రెస్ సభకు కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు?*

*A. న్యాపతి సుబ్బారావు*✅
B. కొండా వెంకటప్పయ్య
C. పట్టాభి సీతారామయ్య
D. B.N. శర్మ

*▪7. బ్రహ్మసమాజ సిద్ధాంతాలచే ప్రభావితమై “శిథిలమైన ఆలయంలో శివుడు లేడు” అని వ్యాఖ్యానించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పుస్తకం?,సైదేశ్వర రావు*

A. సావిత్రి
B. హేమలత
C. అమీనా
*D. ఊర్వశి*✅

*▪8. సహాయనిరాకరణ ఉద్యమకాలంలో గరిమెళ్ళ సత్యనారాయణ వ్రాసిన “మాకొద్దీ తెల్లదొరతనం” అనే పాటను ఆలపించి జైలుశిక్షను అనుభవించినది?*

*A. కృష్ణ పరబ్రహ్మశాస్త్రి*✅
B. గాడిచర్ల హరిసర్వోత్తమరావు
C. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
D. ఉన్నవ లక్ష్మీనారాయణ

*▪9. ఉన్నవ లక్ష్మీనారాయణచే రచించబడిన “మాలపల్లి” నవల ఎప్పుడు వెలువడింది?*

A. 1910
B. 1919
*C. 1922*✅
D. 1938

*▪10. తెలుగు నాటక పితామహుడు?*

A. ఆదిభట్ల నారాయణదాసు
*B. ధర్మవరం రామకృష్ణమాచార్యుల*✅
C. షేక్ నాజర్
D. బళ్ళారి రాఘవ

AP History - Sathavahans - Very Important Practice Bits in Telugu for APPSC Group2

AP History - Sathavahans - Very Important Practice Bits in Telugu for APPSC Group2








AP History - వివిధ శాసనాలు

AP History - వివిధ శాసనాలు

➖➖➖➖➖
*శాసనాలు:చరిత్ర*
➖➖➖

*●నాసిక్ శాసనం:*
 గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను తెలియజేస్తూ ఇతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించినది.ఈ శాసనమును రెండవ పులోమావి కాలంలో వేయించింది.గౌతమి బాలశ్రీ తనను తాను రాజర్షి వధువుగా పేర్కొంది.

*●నానాఘట్ శాసనం:*
మొదటి శాతకర్ణి విజయాలను తెలియజేస్తూ ఇతని భార్య నాగానిక వేయించినది.ఈయన రెండు అశ్వమేధాలు  ఒక రాజసూయయాగం చేసినట్లు ఈ శాసనం తెలుపుతుంది.

*●కార్లే శాసనం:*
గౌతమీ పుత్రశాతకర్ణి విజయాలను గురించి తెలుపుతుంది.

*●ఐహూల్ శాసనం:*
 2వ పులకేశి  విజయాలను తెలుపుతుంది. ఈ శాసనాన్ని రవి కీర్తి రచించాడు.

*●హథిగుంపా  శాసనం:*
దీనిని వేయించిన కళింగ చక్రవర్తి ఖరవేలుడు. ఇతనికి బిక్షురాజు, మహ మేఘవాహాన అను బిరుదులు కలవు. ఈ శాసనం ప్రాకృతిక భాష (బ్రాహ్మిలిపి)లో రచింపబడినది. ఈ శాసనం ఉదయగిరి వద్ద లభించింది. ఖారవేలుడు దిగ్విజయ సూచకంగా రాజసూయయాగం చేసినట్లు ఈ శాసనం ద్వార తెలుస్తుంది.

*●అలహద్ శాసనం:*
సముద్ర గుప్తుని విజయాలను గురించి తెలుపును. ఈ శాసనాన్ని  హరిసేనుడు రచించాడు.

*●చేజేర్ల శాసనం:*
కందరుడు వేయించాడు. కందరుని విజయాలను గురించి తెలియజేస్తుంది.
బయ్యారం చెరువు శాసనం:
దీన్ని గణపతిదేవుని సోదరి మైలాంబ వేయించింది.

*●జునాఘడ్ శాసనం:*
రుద్రదమనుడు  వేయించాడు.

*●సాంచీ శాసనం:*
రెండవ శాతకర్ణి వేయించాడు. ఈ శాసనం ఇతనిని "రాజస్యశ్రీ శాతకర్ణి"  గా పేర్కొంది.

*శాసనాలు*

*యజ్ఞశ్రీ శాతకర్ణి:*
చినగంజాంలో దొరికిన శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి తెలుపుచున్నది.
హైదరాబాద్  శాసనం:
రెండవ పులకేశి క్రీ.శ. 609 లో రాజ్యానికి వచ్చినట్లు తెలిపే శాసనం.

*మంచి కళ్ళు శాసనం:*
సిం హవర్మ వేయించిన పల్లవుల తొలి శాసనం (విజయపురి సమీపంలో)
అశోకుని గిర్నాల్ శాసనం:
పశ్చిమ భారతదేశం మీద  చంద్రగుప్తుడి ఆధిపత్యాన్ని తెలుపుతుంది. 

*●భట్టిఫ్రోలు శాసనం:*
కుబేరకుడనే యక్షరాజు వేయించాడు. శాతవాహనుల కాలంలో నిగమసభల గురించి ఈ శాసనం తెలుపుతుంది.

*●కాజీపేట శాసనం:*
మోదటి  బ్రేతరాజును ప్రధమ కాకతీయ రాజుగా
పేర్కొన్నది.

శాతవాహనుల శాసనాలు:
ఇవన్నీ ప్రాకృతిక భాషలోను మరియు బ్రాహ్మి లిపిలోను ఉన్నాయి.

*●ఉత్తర మేరూర్ శాసనం:*
మొదటి పరాంతకుని గురించి తెలుపును. ఈ శాసనం దక్షిణ భరతదేశంలో చోళుల కాలంలో గ్రామీణ ప్రభుత్వాలు వర్దిల్లాయని  తెలుపుతుంది.

శాసనాలు
మోదటి  బ్రేతరాజును ప్రధమ కాకతీయ రాజుగా
పేర్కొన్నది.

శాతవాహనుల శాసనాలు:
ఇవన్నీ ప్రాకృతిక భాషలోను మరియు బ్రాహ్మి లిపిలోను ఉన్నాయి.

*●అద్దంకి శాసనం:*
పాండురంగడు వేయించిన తొలి తెలుగు శాసనం.

తెలుగు, తమిళ  భాషలు కలిపి వేయించిన శాతవాహన రాజు వాసిస్టీపుత్ర శాతకర్ణి.
              🍃🌷🤗🌷🍃

AP History - సామాజిక, సాంస్కృతిక చరిత్ర-2 - Multiple Choice Questions for APPSC Exams

ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర - 2

1. హంపీ-విజయ నగరాన్ని యునెస్కో ఏ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ  కట్టడంగా  ప్రకటించింది?
 1) 1975
 2) 1982
 3) 1980
 4) 1986

View Answer

సమాధానం: 4

2. శాతవాహనుల కాలంలో ‘నిగమ సభలు’ వేటి పాలనను నిర్వహించేవి?(Group-II, 2008)
 1) గ్రామాలు
 2) నగరాలు
 3) ప్రాదేశికులు
 4) మత విషయాలు

View Answer

సమాధానం: 2

3. ‘సింహాసన ద్వాత్రింశిక’ రచయిత ఎవరు?Group-I, 1995)
 1) కొరవి గోపరాజు
 2) గౌరన
 3) మారన
 4) పోతన

View Answer

సమాధానం: 1

4. ‘కంఠక శోధన’ దేనికి సంబంధించింది?(Group-II, 2003)
 1) న్యాయ వ్యవస్థ
 2) రెవెన్యూ పాలన
 3) ఆర్థిక వ్యవస్థ
 4) పరిపాలనా వ్యవస్థ

View Answer

సమాధానం: 1

5. రెడ్డిరాజుల తొలి రాజధాని ఏది?
 1) రాజమహేంద్రవరం
 2) పిఠాపురం
 3) దేవరకొండ
 4) అద్దంకి

View Answer

సమాధానం: 4

6. కొండవీటి దుర్గాన్ని ఎవరు నిర్మించారు?
 1) కుమార గిరిరెడ్డి
 2) పెదకోమటి వేమారెడ్డి
 3) అనపోతారెడ్డి
 4) కాటయ వేమారెడ్డి

View Answer

సమాధానం: 3

7. రాజధానిని ‘అద్దంకి’ నుంచి ‘కొండవీటి’కి మార్చిన రెడ్డిరాజు ఎవరు?
 1) అనపోతారెడ్డి
 2) రాచ వేమారెడ్డి
 3) ప్రోలయ వేమారెడ్డి
 4) కుమార గిరిరెడ్డి

View Answer

సమాధానం: 1

8. ‘కర్పూర వసంతరాయలు’ అనే ఆధునిక కావ్యాన్ని ఎవరు రచించారు?
 1) ఆరుద్ర
 2) దాశరథీ
 3) సి. నారాయణ రెడ్డి
 4) శ్రీశ్రీ

View Answer

సమాధానం: 3

9.పురిటి సుంకాన్ని విధించిన రెడ్డిరాజు ఎవరు?
 1) అన వేమారెడ్డి
 2) రాచ వేమారెడ్డి
 3) పెదకోమటి వేమారెడ్డి
 4) కుమారగిరి రెడ్డి

View Answer

సమాధానం: 2

10. ‘చాటు కృతులు’ అంటే ఏమిటి?
 1) హాస్య గీతాలు
 2) నాటకాలు
 3) శతకాలు
 4) రాజులను కీర్తించే గీతాలు

View Answer

సమాధానం: 4

11. చోళ సింహాసనం అధిష్టించిన రాజేంద్రుడు (కులోత్తుంగ చోళుడు) ఎవరి కుమారుడు? (Civils prelims, 1997)
 1) విమలాదిత్యుడు
 2) గుణగ విజయాదిత్యుడు
 3) రాజరాజ నరేంద్రుడు
 4) చాళుక్య భీముడు

View Answer

సమాధానం: 3

12.గుంటూరు జిల్లా ఫిరంగిపురం వద్ద ‘సంతాన సాగరం’ అనే పెద్ద చెరువును ఎవరు తవ్వించారు?
 1) కాటయ వేమారెడ్డి
 2) పెదకోమటి వేమారెడ్డి
 3) కుమార గిరిరెడ్డి
 4) సూరమాంబ

View Answer

సమాధానం: 4

13. రెడ్డిరాజుల ‘రాజ లాంఛనం’ ఏది?
 1) పులి
 2) సింహం
 3) వరాహం
 4) వృషభం

View Answer

సమాధానం: 4

14. రెడ్డిరాజుల కాలంలో భూమిని దేనితో కొలిచేవారు?
 1) తాడు
 2) గొలుసు
 3) కేసరపాటి గడ
 4) మూరలు

View Answer

సమాధానం: 3

15. అవచి తిప్పయ్య చెట్టిని ఏ రెడ్డిరాజు కాలంలో ‘సుగంధ భాండాగారికుడు’గా నియమించారు?
 1) అన వేమారెడ్డి
 2) కుమారగిరి రెడ్డి
 3) పెదకోమటి వేమారెడ్డి
 4) రాచ వేమారెడ్డి

View Answer

సమాధానం: 2

16. కృష్ణ దేవరాయల ఆస్థాన విద్వాంసుడు ఎవరు? (Civils prelims, 2000)
 1) నంది తిమ్మన
 2) అల్లసాని పెద్దన
 3) ధూర్జటి
 4) భట్టుమూర్తి

View Answer

సమాధానం: 2

17.కింది వాటిలో క్రీ.శ. 1565 నాటి విజయనగర రాజు ‘అలియ రామరాయలు’ కాలం నాటి ‘తాళికోట (తల్లికోట) యుద్ధం’లో పాల్గొనని దక్కన్ రాజ్యం ఏది?(Civils prelims, 2000)
 1) బీరార్
 2) బీజాపూర్
 3) గోల్కొండ
 4) బీదర్

View Answer

సమాధానం: 1

18. కింది వాటిలో సరైన జత ఏది?(Civils prelims, 1999)
 1) శ్రీకృష్ణదేవరాయలు - మనుచరిత్ర
 2) మొదటి బుక్కరాయలు - వైదిక మార్గ ప్రవర్తక
 3) అల్లసాని పెద్దన - ఆముక్త మాల్యద
 4) గంగాదేవి - అమరు శతకం

View Answer

సమాధానం: 2

19. జైనులు, వైష్ణవుల మధ్య ఘర్షణలను నివారించిన విజయనగర పాలకుడు ఎవరు?(Group-I, 2001; Group-II, 2003)
 1) మొదటి దేవరాయలు
 2) మొదటి హరిహరరాయలు
 3) మొదటి బుక్కరాయలు
 4) సాళువ నరసింహుడు

View Answer

సమాధానం: 3

20. వాగ్గేయకారుడు అన్నమయ్య కింద పేర్కొన్నవారిలో ఎవరి సమకాలీకుడు? (Civils prelims, 1997)
 1) హరిహరరాయలు
 2) మొదటి దేవరాయలు
 3) రెండో దేవరాయలు
 4) సాళువ నరసింహరాయలు

View Answer

సమాధానం: 4

21. కృష్ణ దేవరాయల పాలనా కాలం ఏది? Civils prelims, 1998)
 1) క్రీ.శ. 1485  1502
 2) క్రీ.శ. 1509  1530
 3) క్రీ.శ. 1533  1545
 4) క్రీ.శ. 1550  1565

View Answer

సమాధానం: 2

22. తన సైన్యంలో  పది వేల మంది మహమ్మదీయులను నియమించిన విజయ నగర రాజు ఎవరు?(Civils prelims, 1998; Group-II, 2011)
 1) మొదటి దేవరాయలు
 2) రెండో దేవరాయలు
 3) శ్రీకృష్ణదేవరాయలు
 4) రామరాయలు

View Answer

సమాధానం: 2

23. ‘ఫర్‌గాటెన్ ఎంపైర్’ గ్రంథ రచయిత ఎవరు? Civils prelims, 1997)
 1) రాబర్ట్ సీవెల్
 2) జేమ్స్ ఫెర్గూసన్
 3) ఫాదర్ హీరాస్
 4) హెచ్.జి. వేల్స్

View Answer

సమాధానం: 1

24. చైనా దేశానికి తన రాయబారిని పంపిన విజయనగర రాజు ఎవరు?
 1) మొదటి బుక్కరాయలు
 2) రెండో హరిహరరాయలు
 3) రెండో దేవరాయలు
 4) శ్రీకృష్ణ దేవరాయలు

View Answer

సమాధానం: 1

25. విజయనగర సామ్రాజ్యంలో వివాహ సుంకాలను రద్దు చేసిన పాలకుడు ఎవరు?
 1) తుళువ వీరనరసింహుడు
 2) శ్రీకృష్ణదేవరాయలు
 3) మొదటి హరిహర రాయలు
 4) బుక్కరాయలు

View Answer

సమాధానం: 2

26. కింది వాటిలో యాచక వృత్తిపై విధించిన పన్ను ఏది?
 1) పుల్లం పన్ను
 2) అడికాసు పన్ను
 3) గణాచారి పన్ను
 4) పింజుణి సిద్ధాయం

View Answer

సమాధానం: 3

27. ‘పింజుణి సిద్ధాయం’ అనే పన్నును ఎవరి/ దేనిపై విధించేవారు?
 1) వేశ్యలు
 2) దూదిని ఏకి దారం తీసేవారు
 3) చేనేత పనివారు
 4) పశువులు మేసే పచ్చిక బయళ్లు

View Answer

సమాధానం: 2

28. ‘బ్రహ్మదేవ గ్రామాలు’ అంటే ఏమిటి?
 1) మఠాధిపతులకు ఇచ్చే భూములు
 2) బ్రాహ్మణులకు దానంగా ఇచ్చే పన్నులు లేని గ్రామాలు
 3) రాజోద్యోగులకు ఇచ్చే గ్రామాలు
 4) శాస్త్రవేత్తలకు ఇచ్చే గ్రామాలు

View Answer

సమాధానం: 2

29. ‘భండార వార గ్రామాలు’ అంటే ఏమిటి?
 1) వృత్తి పనివారికి ఇచ్చే గ్రామాలు
 2) మఠాధిపతులకు ఇచ్చే గ్రామాలు
 3) రాచగ్రామాలు (రాజులకు ఇచ్చేవి)
 4) పండితులు, కవులకు ఇచ్చే గ్రామాలు

View Answer

సమాధానం: 3

30. విజయనగర రాజుల కులదైవం?
 1) విరూపాక్షుడు
 2) శివుడు
 3) విష్ణువు
 4) సూర్యుడు

View Answer

సమాధానం: 1

31. విజయనగర రాజుల ‘రాజ లాంఛనం’ ఏది?
 1) ఎద్దు
 2) సింహం
 3) వరాహం
 4) చేప

View Answer

సమాధానం: 3

32. కుమార కంపన భార్య గంగాదేవి ‘మధురా విజయం’ గ్రంథాన్ని ఏ భాషలో రాశారు?
 1) తెలుగు
 2) కన్నడం
 3) ప్రాకృతం
 4) సంస్కృతం

View Answer

సమాధానం: 4

33. ‘కృష్ణలీలా తరంగిణీ’ గ్రంథ రచయిత ఎవరు?
 1) విద్యారణ్యుడు
 2) బండారు లక్ష్మీనారాయణ
 3) నారాయణ తీర్థులు
 4) రాజనాథ డిండిముడు

View Answer

సమాధానం: 3

34.కృష్ణదేవరాయలు ‘విద్యాగోష్టులు’ జరిపే సభా భవనం పేరేమిటి?
 1) రాచ భవనం
 2) మలయ కూటం
 3) భువనవిజయం
 4) ముత్యాల శాల

View Answer

సమాధానం: 3

35. ‘అమరు నాయంకర వ్యవస్థ’ దేన్ని సూచిస్తుంది?
 1) రెవెన్యూ పరిపాలనా వ్యవస్థ
 2) సైనిక వ్యవస్థ
 3) గ్రామ పరిపాలన
 4) నాడుల పరిపాలన

View Answer

సమాధానం: 2

36. ‘తలారి’ అని ఎవరిని పిలిచేవారు?
 1) గ్రామ రక్షక భటుడు
 2) నగర పాలకుడు
 3) దేవదాసీల నిర్వాహకుడు
 4) పన్నులు వసూలు చేసేవాడు

View Answer

సమాధానం: 1

37. ‘రాయ వాచకం’ రచయిత ఎవరు?
 1) ధూర్జటి
 2) స్థానాపతి
 3) భట్టుమూర్తి
 4) ముక్కు తిమ్మన

View Answer

సమాధానం: 2

38. తన తల్లి నాగలాంబ పేరుతో ‘నాగలాపురం’ పట్టణాన్ని నిర్మించిన విజయనగర రాజు ఎవరు?
 1) మొదటి దేవరాయలు
 2) మొదటి బుక్కరాయలు
 3) అళియ రామరాయలు
 4) శ్రీకృష్ణదేవరాయలు

View Answer

సమాధానం: 4

39. అచ్చ తెలుగు కావ్యమైన ‘యయాతి చరితం’ రచయిత ఎవరు?
 1) పొన్నెగంటి తెలగనాచార్యుడు
 2) అద్దంకి గంగాధర కవి
 3) సారంగు తమ్మయ్య
 4) కందుకూరి రుద్రకవి

View Answer

సమాధానం: 1

40. కవులు తమ రచనల్లో ‘ఇభరాముడు’గా కీర్తించిన గోల్కొండ నవాబు ఎవరు?
 1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
 2) ఇబ్రహీం కుతుబ్‌షా
 3) మహమ్మద్ కుతుబ్‌షా
 4) అబ్దుల్లా కుతుబ్‌షా

View Answer

సమాధానం: 2

41. ‘వైజయంతీ విలాసం’ అనే శృంగార కావ్యాన్ని ఎవరు రచించారు?
 1) పొన్నెగంటి తెలగనార్యుడు
 2) సారంగు తమ్మయ్య
 3) కందుకూరి రుద్రకవి
 4) అద్దంకి గంగాధర కవి

View Answer

సమాధానం: 2

42. ‘దాశరథీ శతకం’ రచయిత ఎవరు?
 1) క్షేత్రయ్య
 2) కంచర్ల గోపన్న (రామదాసు)
 3) కందుకూరి రుద్రకవి
 4) సారంగు తమ్మయ్య

View Answer

సమాధానం: 2

43. కూచిపూడి (కృష్ణా జిల్లా) నాట్యాచార్యుల సేవలకు గుర్తింపుగా ‘కూచిపూడి’ గ్రామాన్ని అగ్రహారంగా దానం చేసిన గోల్కొండ నవాబు ఎవరు?
 1) ఇబ్రహీం కుతుబ్‌షా
 2) అబుల్ హసన్ తానీషా
 3) అబ్దుల్లా కుతుబ్‌షా
 4) మహమ్మద్ కులీ కుతుబ్‌షా

View Answer

సమాధానం: 2

44. తెలుగులో మొదటి యక్షగాన నాటకమైన ‘సుగ్రీవ విజయం’ రచయిత ఎవరు?
 1) కందుకూరి రుద్రకవి
 2) సారంగు తమ్మయ్య
 3) సంకుశాల నృసింహకవి
 4) పొన్నెగంటి తెలగనాచార్యులు

View Answer

సమాధానం: 1

45. ‘మువ్వ గోపాల’ శృంగార పదాల రచయిత క్షేత్రయ్య కింద పేర్కొన్న ఏ కుతుబ్‌షాహీ పాలకుడి సమకాలీకుడు?
 1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
 2) అబ్దుల్లా కుతుబ్‌షా
 3) అబుల్ హసన్ తానీషా
 4) మహమ్మద్ కుతుబ్‌షా

View Answer

సమాధానం: 2

46. కుతుబ్‌షాహీ (గోల్కొండ) రాజ్య స్థాపకుడు ఎవరు?
 1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
 2) ఇబ్రహీం కుతుబ్‌షా
 3) అబ్దుల్లా కుతుబ్‌షా
 4) సుల్తాన్ కుతుబ్ - ఉల్ - ముల్క్

View Answer

సమాధానం: 4

47. శ్రీశైలం, అహోబిలంలోని దేవాలయాలకు సోపానాలు (మెట్లు) ఎవరు నిర్మించారు?
 1) ప్రోలయ వేమారెడ్డి
 2) అనవేమారెడ్డి
 3) పెదకోమటి వేమారెడ్డి
 4) రాచ వేమారెడ్డి

View Answer

సమాధానం: 1

48. హంపీ - విజయ నగరం శిథిలాలను మొట్ట మొదట (క్రీ.శ.1800లో) ఎవరు వెలుగులోకి తీసుకువచ్చారు?
 1) కల్నల్ కోలిన్ మెకంజీ
 2) రాబర్ట్ సీవెల్
 3) జనరల్ కన్నింగ్‌హామ్
 4) మార్షల్

View Answer

సమాధానం: 1

49. కింద పేర్కొన్న వారిలో విజయనగర సామ్రాజ్యం గురించి వర్ణించిన విదేశీ యాత్రికుడు ఎవరు?
 1) నికితిన్ - రష్యా
 2) దూర్తె బార్బొసా - పోర్చుగల్
 3) డొమింగో పయస్ - పోర్చుగల్
 4) ఫెర్నావో న్యూనిజ్ - పోర్చుగల్

View Answer

సమాధానం: 3

AP History - సామాజిక, సాంస్కృతిక చరిత్ర - Multiple Choice Questions for APPSC Exams

ఏపీ- సామాజిక, సాంస్కృతిక చరిత్ర

1. ఆంధ్ర ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఎక్కడ ఉంది?
1) అమరావతి
2) నాగార్జున కొండ
3) చందవరం
4) భట్టిప్రోలు

View Answer

స‌మాధానం: 4

2. శాతవాహనుల కాలం నాటి ‘చిత్రకళ’ అవశేషాలు ఎక్కడ కనిపిస్తాయి?
1) శాలిహుండం
2) పిల్లలమర్రి
3) అజంతా 9,10వ గుహలు
4) అమరావతి

View Answer

స‌మాధానం: 3

3. క్రీ.పూ. 200 ఏళ్ల నాటి ‘గుంటుపల్లి గుహాలయాలు’ ఏ జిల్లాలో ఉన్నాయి?
1) శ్రీకాకుళం
2) పశ్చిమ గోదావరి
3) గుంటూరు
4) విశాఖపట్నం

View Answer

స‌మాధానం: 2

4. ప్రసిద్ధి చెందిన బౌద్ధ క్షేత్రం ‘శాలిహుండం’ ఏ నది ఒడ్డున ఉంది?
1) కృష్ణా
2) నాగావళి
3) వంశధార
4) శారద

View Answer

స‌మాధానం: 3

5. ఆంధ్ర ప్రాంతంలో ‘రోమన్ దేశ బంగారు నాణేలు’ ఎక్కడ లభించాయి?
1) అమరావతి, వినుకొండ, చేబ్రోలు, నాగార్జున కొండ
2) చందవరం, శ్రీశైలం, త్రిపురాంతకం
3) రామతీర్థం, శంకరం, బావికొండ
4) శాలిహుండం, జగ్గయ్యపేట, ఘంటసాల

View Answer

స‌మాధానం: 1

6. గౌతమ బుద్ధుడు స్వయంగా ‘కాలచక్రతంత్రం’ను ఎక్కడ ప్రవర్తింపజేశాడు?
1) శాలిహుండం
2) అమరావతి (ధాన్యకటకం)
3) నాగార్జున కొండ
4) జగ్గయ్యపేట

View Answer

స‌మాధానం: 2

7. అశ్వఘోషుడు ‘బుద్ధ చరితం’, ‘సౌందర నందనం’ లాంటి కావ్యాలను ఏ భాషలో రచించాడు?
1) తెలుగు
2) పాళీ
3) సంస్కృతం
4) కన్నడ

View Answer

స‌మాధానం: 3

8. ఎన్నో బౌద్ధ సంగీతి (సమావేశం)లో బౌద్ధమతం హీనయానం, మహాయాన శాఖలుగా విడిపోయింది?
1) ప్రథమ బౌద్ధ సంగీతి
2) రెండో బౌద్ధ సంగీతి
3) నాలుగో బౌద్ధ సంగీతి
4) మూడో బౌద్ధ సంగీతి

View Answer

స‌మాధానం: 3

9. ‘వజ్రయానం’ అంటే..?
1) బుద్ధుడిని చిహ్నాల రూపంలో పూజించడం
2) బుద్ధుడిని ప్రతిమ రూపంలో పూజించడం
3) తాంత్రిక పూజా విధానం (మంత్ర-తంత్రాలు)
4) ఆధ్యాత్మిక విధానం

View Answer

స‌మాధానం: 3

10. ‘సల్లేఖనం’ ఏ మతానికి సంబంధించింది?(Group-I, 1994)
1) వైదిక మతం
2) జైన మతం
3) వీర శైవం
4) బౌద్ధ మతం

View Answer

స‌మాధానం: 2

11. ఇటీవల కనుగొన్న ‘బావి కొండ’ బౌద్ధ క్షేత్రం ఏ జిల్లాలో ఉంది? (Group-I, 1994)
1) శ్రీకాకుళం
2) విశాఖపట్నం
3) విజయనగరం
4) అనంతపురం

View Answer

స‌మాధానం: 2

12. ఆంధ్రప్రదేశ్‌లోని ‘బేతంచర్ల’ దేనికి ప్రసిద్ధి?(Group-I, 1994)
1) ప్రాక్ చరిత్ర నాటి గుహలు
2) దేవాలయాలు
3) పుణ్యతీర్థం
4) శైవ క్షేత్రం

View Answer

స‌మాధానం: 1

13. జైన తీర్థంకరుల జీవిత చరిత్రను తెలిపే గ్రంథం? (Civils prelims, 1999)
1) కాతంత్ర వ్యాకరణం
2) గాథాసప్తశతి
3) కల్పసూత్రం
4) త్రిపీఠకాలు

View Answer

స‌మాధానం: 3

14. పండిత బ్రాహ్మణులకు ఇచ్చిన పన్నులేని గ్రామాలను ఏవిధంగా వ్యవహరించేవారు? (Group-I, 1999)
1) ఘటికలు
2) భోగమాన్యాలు
3) అగ్రహారాలు
4) రాజమాన్యాలు

View Answer

స‌మాధానం: 3

15. కళింగదేశంపై అశోకుడి విజయాన్ని ఏ శాసనంలో పేర్కొన్నారు? (Group-I, 1999)
1) నాసిక్ శిలాశాసనం
2) రాజుల మందగిరి శాసనం
3) హాతిగుంఫా శాసనం
4) ప్రభుత్వ రాజ శాసనం (13వ శిలా శాసనం)

View Answer

స‌మాధానం: 4

16. మహావీరుడు 24వ తీర్థంకరుడైతే ప్రథమ తీర్థంకరుడు ఎవరు? (Group-I, 2004)
1) నేమినాథుడు
2) రుషభనాథుడు
3) పార్శ్వనాథుడు
4) అరిష్టనేమి

View Answer

స‌మాధానం: 2

17. గౌతమబుద్ధుడు పరమపదించిన ప్రదేశం?(Group-I, 2004)
1) కుశీ నగరం
2) పావపురి
3) సార్నాద్
4) రాజగృహ

View Answer

స‌మాధానం: 1

18. భాగవత మత స్థాపకుడు ఎవరు?
1) శంకరాచార్యులు
2) కృష్ణ వాసుదేవుడు
3) రామానుజాచార్యులు
4) మధ్వాచార్యులు

View Answer

స‌మాధానం: 2

19. క్రీ.శ. 885 నాటి ‘బెజవాడ శాసనం’ ఎవరి కాలానికి సంబంధించింది?(Group-I, 2003)
1) గుణగణాధిత్యుడు
2) మొదటి చాళుక్య భీముడు
3) యుద్ధమల్లుడు
4) విమలాదిత్యుడు

View Answer

స‌మాధానం: 3

20. హాలుడి వివాహ వృత్తాంతాన్ని తెలిపే ‘లీలావతి’ గ్రంథ రచయిత ఎవరు? (Group-II, 2003)
1) కుతూహలుడు
2) కొండకుందాచారి
3) పంపడు
4) కొరవి గోపరాజు

View Answer

స‌మాధానం: 1

21. తొలి తెలుగు శాసనాన్ని ఎవరి కాలంలో వేశారు? (Group-I, 1995)
1) కాకతీయులు
2) ఇక్ష్వాకులు
3) శాతవాహనులు
4) రేనాటి చోడులు

View Answer

స‌మాధానం: 4

22. ‘ప్రతీత్ప సముత్పాదన సిద్ధాంతం’ను ఎవరు ప్రతిపాదించారు? (Group-I, 1994)
1) రామానుజాచార్యుడు
2) జైన మహావీరుడు
3) గౌతమబుద్ధుడు
4) నాగార్జునుడు

View Answer

స‌మాధానం: 3

23. ‘మాచల్దేవి’ ఏ తెలుగు సాహిత్య గ్రంథంలోని పాత్ర? (Group-I, 1995)
1) క్రీడాభిరామం
2) భాగవతం
3) పల్నాటి వీరచరిత్ర
4) ఆముక్తమాల్యద

View Answer

స‌మాధానం: 1

24. ‘జక్కులపురంద్రి’ ఏ జానపద కళకు సంబంధించింది? (Group-I, 1995)
1) యక్షగానం
2) తోలుబొమ్మలాట
3) కోలాటం
4) చెక్కభజన

View Answer

స‌మాధానం: 1

25. క్రీ.శ. 927లో గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రీపురం (రాజమండ్రి) నగరాన్ని నిర్మించిన తూర్పు చాళుక్యరాజు ఎవరు?
1) రాజరాజ నరేంద్రుడు
2) మొదటి అమ్మరాజు
3) విమాలాదిత్యుడు
4) గుణగ విజయాదిత్యుడు

View Answer

స‌మాధానం: 2

26. సమస్త గాంధర్వ విద్యల్లో ప్రవీణురాలైన ‘చెల్లవ-చెల్లాంబిక’ను పోషించిన చాళుక్యరాజు ఎవరు? (Civils prelims, 1997)
1) రాజరాజ నరేంద్రుడు
2) మొదటి చాళుక్య భీముడు
3) గుణగ విజయాదిత్యుడు
4) విమలాదిత్యుడు

View Answer

స‌మాధానం: 2

27. తూర్పు చాళుక్యుల కాలంలో తెలుగులో సగం, సంస్కృతంలో సగం వేసిన శాసనం ఏది? (Group-I, 2004)
1) అహదనకర శాసనం
2) బెజవాడ యుద్ధమల్లుడి శాసనం
3) పండరంగడి అద్దంకి శాసనం
4) మైదవోలు శాసనం

View Answer

స‌మాధానం: 1

28. రాజరాజ నరేంద్రుడి నుంచి ‘నవఖండవాడ’ అగ్రహారాన్ని పొందినవారు ఎవరు? (Group-II, 2008)
1) నన్నయ భట్టు
2) నారాయణ భట్టు
3) పావులూరి మల్లన
4) విద్యానాథుడు

View Answer

స‌మాధానం: 3

29. ‘నరేంద్ర మృగేశ్వరాలయాలు’ అనే పేరుతో 108 శివాలయాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? (Group-II, 2008)
1) మొదటి అమ్మరాజు
2) విమలాదిత్యుడు
3) మొదటి చాళుక్య భీముడు
4) రెండో విజయాదిత్యుడు

View Answer

స‌మాధానం: 4

30. భారతీయ న్యాయశాస్త్రానికి ఆధారమైన యాజ్ఞవల్క స్మృతిపై ‘మితాక్షరీ’ పేరుతో వ్యాఖ్యానం రాసింది ఎవరు? (Civils prelims, 1999)
1) విజ్ఞానేశ్వరుడు
2) జైమినీ
3) కణాదుడు
4) కపిలుడు

View Answer

స‌మాధానం: 1

31. పావులూరి మల్లన తన ‘గణితసార సంగ్రహం’ గ్రంథాన్ని ఏ భాషలో రచించాడు?
1) తెలుగు
2) సంస్కృతం
3) ప్రాకృతం
4) కన్నడం

View Answer

స‌మాధానం: 1

32. రాజరాజ నరేంద్రుడు ‘నందంపూడి’ గ్రామాన్ని అగ్రహారంగా ఎవరికి దానం చేశాడు? (Group-II, 2008)
1) నన్నయ భట్టు
2) నారాయణ భట్టు
3) పావులూరి మల్లన
4) సోమదేవ సూరి

View Answer

స‌మాధానం: 2

33. తూర్పుగోదావరి జిల్లా ‘బిక్కవోలు’లో రాజరాజేశ్వర, గోలింగేశ్వర, చంద్రశేఖర దేవాలయాలను నిర్మించిన చాళుక్య రాజు ఎవరు?
1) రాజరాజ నరేంద్రుడు
2) అమ్మంగ దేవుడు
3) గుణగ విజయాదిత్యుడు
4) మొదటి చాళుక్య భీముడు

View Answer

స‌మాధానం: 3

34. తెలుగు భాషలో తొలి వ్యాకరణ గ్రంథమైన ‘ఆంధ్రశబ్ద చింతామణి’ రచయిత ఎవరు?
1) శ్రీనాథుడు
2) నన్నయ భట్టు
3) పోతన
4) నారాయణ భట్టు

View Answer

స‌మాధానం: 2

35. వేంగి (లేదా) తూర్పు చాళుక్య రాజుల ‘రాజ లాంఛనం’ ఏది?
1) వరాహం
2) సింహం
3) పులి
4) చేప

View Answer

స‌మాధానం: 1

36. ‘స్థల మహత్యాలు’ అంటే..?
1) స్థానిక దేవతల గురించి వివరించే కథలు
2) బ్రాహ్మణ గ్రామాలు
3) గ్రామ సభలు
4) న్యాయస్థానాలు

View Answer

స‌మాధానం: 1

37. ‘బృహత్ సంహిత’ గ్రంథ రచయిత ఎవరు?(Gazetted, 2005)
1) కాళిదాసు
2) వరాహమిహిరుడు
3) సుశ్రుతుడు
4) పతంజలి

View Answer

స‌మాధానం: 2

38. వర్తక శ్రేణులను ‘నకరం’గా పేర్కొనేవారు. తూర్పు చాళుక్యుల కాలంలో వీటికి ప్రధాన కేంద్రం ఏది?
1) భీమవరం
2) ఏలూరు
3) ద్రాక్షారామం
4) పెనుగొండ

View Answer

స‌మాధానం: 4

39. తూర్పు చాళుక్యుల కాలంలో ‘కొదెన’ అనే సుంకాన్ని వేటిపై విధించేవారు?
1) మగ్గాల తయారీ
2) గొడుగుల తయారీ
3) రాచభూములు
4) నూనె తీయడం

View Answer

స‌మాధానం: 2

40. ‘అభిదాన చింతామణి’ గ్రంథ రచయిత ఎవరు?
1) పెదకోమటి వేమారెడ్డి
2) ఎలకూచి బాలసరస్వతి
3) విశ్వేశ్వర కవి
4) హేమాద్రి

View Answer

స‌మాధానం: 4

41. ద్రాక్షారామ ‘భీమేశ్వరాలయం’, సామర్లకోట ‘చాళుక్య భీమేశ్వరాలయం’ నిర్మించిన తూర్పు చాళుక్య రాజు ఎవరు?
1) రాజరాజ నరేంద్రుడు
2) విమలాదిత్యుడు
3) మొదటి చాళుక్య భీముడు
4) గుణగ విజయాదిత్యుడు

View Answer

స‌మాధానం: 3

42. ‘పూర్వ మీమాంస’ (కర్మ మార్గం) వాదానికి మూల పురుషుడు జైమినీ అయితే, జ్ఞానమార్గాన్ని ప్రతిపాదించిన ‘ఉత్తర మీమాంస’ వాదానికి మూలపురుషుడు ఎవరు?
1) పతంజలి
2) కణాదుడు
3) కపిలుడు
4) బాదరాయణుడు

View Answer

స‌మాధానం: 4

43. వైష్ణవ మతంలో ‘పంచారాత్ర’ క్రతువును ప్రతిపాదించినవారు?
1) కశ్యపుడు
2) మాతంగుడు
3) శాండిల్యుడు
4) కౌండిన్యుడు

View Answer

స‌మాధానం: 3

44. తెలుగులో తొలి శాసనమైన ‘కళ్లమల్ల’ శాసనాన్ని వేయించిన రాజు ఎవరు?
1) రేనాటి చోడ రాజు ధనుంజయుడు
2) జయసింహ వల్లభుడు
3) పాండురంగడు
4) యుద్ధమల్లుడు

View Answer

స‌మాధానం: 1

45. కింది వాటిలో సరికాని జత ఏది? (Group-I, 2004)
1) నన్నెచోడుడు - కుమార సంభవం
2) పాల్కురికి సోమనాథుడు - పండితారాధ్య చరిత్ర
3) వేములవాడ భీమకవి - బసవ పురాణం
4) మల్లికార్జున పండితారాధ్యుడు - శివతత్త్వసారం

View Answer

స‌మాధానం: 3

46. ముసునూరి ప్రోలయ నాయకుడి రాజధాని ఏది?
1) అద్దంకి
2) చందవోలు
3) రేకపల్లి దుర్గం
4) ఆమనగల్లు

View Answer

స‌మాధానం: 3

47. కాకతీయ రాజ్య పతనాంతరం, ఆంధ్రదేశంలో మహమ్మదీయ దాడులను వర్ణించిన శాసనం ఏది?
1) గణపేశ్వర శాసనం
2) విలస తామ్ర శాసనం
3) ఆర్యావట శాసనం
4) హనుమకొండ శాసనం

View Answer

స‌మాధానం: 2

48. ఆంధ్రదేశాదీశ్వర, ప్రఖ్యాతాంధ్ర సురత్రాణుడు అనేవి ఎవరి బిరుదులు?
1) పోతన నాయకుడు
2) కామన నాయకుడు
3) ప్రోలయ నాయకుడు
4) ముసునూరి కాపయ నాయకుడు

View Answer

స‌మాధానం: 4

49. ‘దయాభాగ’ రచయిత ఎవరు?(Group-I, 1999)
1) విఘ్నేశ్వర
2) కుల్లక భట్ట
3) విశ్వరుద్ర
4) జీమూత వాహనుడు

View Answer

స‌మాధానం: 4

50. రెడ్డి - వెలమ రాజుల మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించినవారెవరు?
1) పోతన
2) శ్రీనాథుడు
3) వేమన
4) విశ్వేశ్వరకవి

View Answer

స‌మాధానం: 2


AP History - Sathavahana, Ikshwaka Multiple choice questions for APPSC Exams

శాతవాహనులు, ఇక్ష్వాకులు

1. గ్రంథాలు, వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత? (Group-II, 2003)
  1) గాథాసప్తశతి - హాలుడు
 2) బుద్ధచరితం - నాగార్జునుడు
 3) కామసూత్రం - వాత్స్యాయనుడు
 4) బృహత్కథ - గుణాఢ్యుడు

View Answer

సమాధానం: 2

2. అశోకుడి శిలా శాసనాలను ఏ లిపిలో చెక్కారు? (Gazetted, 2005)
 1) పాళీ
 2) ఖరోష్టి
 3) బ్రాహ్మి
 4) దేవనాగరి

View Answer

సమాధానం: 3

3.‘కవివత్సలుడు’ అనేది ఎవరి బిరుదు?(Group-II, 2008)
 1) గౌతమీపుత్ర శాతకర్ణి
 2) హల శాతవాహనుడు
 3) మూడో మాధవ వర్మ
 4) రాజరాజ నరేంద్రుడు

View Answer

సమాధానం: 2

4. ‘ఆంధ్ర’ అనే పదాన్ని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారు?
 1) రుగ్వేదం
 2) సామవేదం
 3) ఐతరేయ బ్రాహ్మణం
 4) మాండ్యూకోపనిషత్తు

View Answer

సమాధానం: 3

5. ఆంధ్ర ప్రాంతాన్ని ‘త్రిలింగ దేశం’ అని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రస్తావించారు?
 1) భీమసేన జాతకం
 2) శక్తి సంగమ తంత్రం
 3) సెరివణిజ జాతకం
 4) సింహళ జాతకం

View Answer

సమాధానం: 2

6. పురాణాల్లో పేర్కొన్న ‘ఆంధ్ర భృత్యులు’, శాతవాహనులు ఒక్కరేనని అభిప్రాయపడిన చరిత్రకారుడు ఎవరు?
 1) విష్ణువాసుదేవ మిరాశీ
 2) వి.ఎన్. సుక్తాంకర్
 3) పి.టి. శ్రీనివాస అయ్యంగార్
 4) ఆర్.జి. భండార్కర్

View Answer

సమాధానం: 4

7. శాతవాహన రాజులు వారి పేర్ల ముందు మాతృ గోత్ర నామాలను చేర్చుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది?(Group-II, 2008)
 1) గౌతమీపుత్ర శాతకర్ణి   
 2) శ్రీముఖుడు
 3) వాసిష్టీపుత్ర పులోమావి
 4) హాలుడు

View Answer

సమాధానం: 1

8. ‘ఓడ ముద్రలు’ ఉన్న సీసపు నాణేలను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు?
 1) హాలుడు
 2) యజ్ఞశ్రీ శాతకర్ణి
 3) రెండో పులోమావి
 4) కుంతల శాతకర్ణి

View Answer

సమాధానం: 2

9. కింద పేర్కొన్న వారిలో ఎవరిని శాతవాహన పాలనా స్థాపకుడిగా గుర్తించారు? (Group-II, 2008)
 1) మొదటి శాతకర్ణి
 2) సిముఖుడు
 3) కుంతల శాతకర్ణి
 4) గౌతమీపుత్ర శాతకర్ణి

View Answer

సమాధానం: 4

10. కింది వాటిలో ఖారవేలుడు వేయించిన శాసనం ఏది?(Group-I, 1991)
 1) నాసిక్ గుహ శాసనం
 2) నానాఘాట్
 3) అమరావతి
 4) హాతిగుంఫా

View Answer

సమాధానం: 4

11. ‘అమరావతి స్తూపం’ను ఎవరి కాలంలో నిర్మించారు?(Group-II, 2008)
 1) ఇక్ష్వాకులు
 2) శాతవాహనులు
 3) విష్ణుకుండినులు
 4) శాలంకాయనులు

View Answer

సమాధానం:2

12.‘నానాఘాట్’ శాసనాన్ని వేయించింది ఎవరు?(Gazetted, 2009)
 1) గౌతమీ బాలాశ్రీ
 2) గౌతమీపుత్ర శాతకర్ణి
 3) దేవీ నాగానిక
 4) రెండో శాతకర్ణి

View Answer

సమాధానం: 3

13. ‘గాథాసప్తశతి’ ప్రాకృత పదాల్లో ప్రధాన అంశం ఏది? (Civils Prelims, 2002)
 1) జానపద పదాల వివరణ
 2) శృంగార పదాల వివరణ
 3) చిలుక చెప్పిన కథలు
 4) పురాణాల కథనం

View Answer

సమాధానం: 2

14. గౌతమీపుత్ర బాలాశ్రీ నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించారు?(Group-II, 2008)
 1) గౌతమీపుత్ర శాతకర్ణి
 2) వాసిష్టీపుత్ర పులోమావి
 3) సుందర శాతకర్ణి
 4) శివశ్రీ శాతకర్ణి

View Answer

సమాధానం: 2

15.నహపాణుడిని ఓడించిన శాతవాహన రాజు ఎవరు? (Group-I, 1994)
 1) సిముఖుడు
 2) యజ్ఞశ్రీ శాతకర్ణి
 3) రెండో శాతకర్ణి
 4) గౌతమీపుత్ర శాతకర్ణి

View Answer

సమాధానం: 4

16. శాతవాహనులు ఆంధ్రులు కారని, ఆంధ్రులకు భృత్యులని వాదించిన పండితుడు ఎవరు?  (Group-II, 2008)
 1) ఆర్.జి. భండార్కర్
 2) వి.ఎన్. సుక్తాంకర్
 3) రాప్సన్
 4) గోపాలాచారి

View Answer

సమాధానం: 1

17. గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విజయాలను తెలిపే శాసనం ఎక్కడ ఉంది?(Group-II, 2008)
 1) పితల్ కోరా
 2) నాసిక్
 3) నానాఘాట్
 4) జున్నార్

View Answer

సమాధానం: 2

18. శాతవాహనులకు చెందిన ఏ పాలకుడి కాలంలో ప్రాకృత భాష స్థానంలో ‘సంస్కృతం’  రాజభాషగా మారింది?
 1) శ్రీముఖుడు
 2) గౌతమీపుత్ర శాతకర్ణి
 3) హాలుడు   
 4) కుంతల శాతకర్ణి

View Answer

సమాధానం: 4

19. మధ్యప్రదేశ్‌లోని సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు?
 1) మొదటి శాతకర్ణి
 2) గౌతమీపుత్ర శాతకర్ణి
 3) యజ్ఞశ్రీ శాతకర్ణి
 4) రెండో శాతకర్ణి

View Answer

సమాధానం:4

20. శకరాజైన విదేశీయుడు మొదటిసారిగా  సంస్కృత భాషలో వేయించిన శాసనం ఏది?
 1) గిర్నార్ శాసనం
 2) నాసిక్ శాసనం
 3) హాతిగుంఫా శాసనం
 4) నానాఘాట్ శాసనం

View Answer

సమాధానం:1

21. ప్రముఖ వర్తక కేంద్రం ‘ప్రతిష్టానపురం’ ఏ నది తీరాన ఉంది?(Gazetted, 2005)
 1) కృష్ణా
 2) నర్మద
 3) గోదావరి
 4) తుంగభద్ర

View Answer

సమాధానం: 3

22. మాకడోని శాసనంలో పేర్కొన్న ‘గుల్మిక’ పదానికి అర్థం? (Group-II, 2008)
 1) గ్రామపెద్ద
 2) బానిస
 3) వాణిజ్య సుంకం
 4) భూస్వామ్య ప్రభువు

View Answer

సమాధానం: 1

23. గ్రంథాలు, వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికాని జత? (Group-I, 2003)
 1) బృహత్కథ - గుణాఢ్యుడు
 2) గాథాసప్తశతి - హాలుడు
 3) హర్షచరిత్ర - బాణుడు
 4) రాజశేఖర చరితం - మల్లన

View Answer

సమాధానం: 4

24. అతి ప్రాచీన శివాలయంగా పరిగణించే పరశురామేశ్వరాలయం ఎక్కడ ఉంది?(Group-II, 2008)
 1) తొండవాడ
 2) గుడిమల్లం
 3) రేణిగుంట
 4) జోగుల మల్లవరం

View Answer

సమాధానం: 2

25.ఆంధ్ర రాజ్యంలో ఏ పట్టణాన్ని గొప్ప మార్కెట్‌గా టాలెమీ వర్ణించాడు? (Gazetted, 2005)
 1) మైసోలియా (మచిలీపట్నం)
 2) నిజాం పట్నం
 3) కళింగ పట్నం
 4) కోటిలింగాల

View Answer

సమాధానం: 1

26. మధ్యయుగ భారతదేశంలో రసాయన శాస్త్ర ప్రక్రియలను తెలిపే ‘రసరత్నాకరం’ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు?(Gazetted, 2005)
 1) నాగార్జున సిద్ధుడు
 2) వాగ్భటాచార్యుడు
 3) మాధవాచార్యుడు
 4) నిత్యనాథ సిద్ధుడు

View Answer

సమాధానం: 1

27.శాతవాహనుల కాలం నాటి సామాజిక ఆర్థిక, మత పరిస్థితులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?(Group-II, 2008)
 1) శాతవాహనులు హిందూ మతాన్ని అనుసరించినప్పటికీ వారి రాజుల్లో కొందరు బౌద్ధమతాన్ని పోషించారు.
 2) చాతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉంది.
 3) స్త్రీలను తక్కువగా చూసేవారు.
 4) నౌకాయానం అభివృద్ధి దశలో ఉంది.

View Answer

సమాధానం: 3

28. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం ‘పూర్ణకుంభం’ను దేని నుంచి గ్రహించారు?
 1) నాగార్జున కొండ శిల్పం
 2) కాకతీయ శిల్పం
 3) విజయనగర శిల్పం
 4) అమరావతి శిల్పం

View Answer

సమాధానం: 4

29. ‘కథాసరిత్సాగరం’ రచయిత ఎవరు?
 1) ధనపాలుడు
 2) సోమదేవసూరి
 3) క్షమేంద్రుడు
 4) హాలుడు

View Answer

సమాధానం: 2

30.‘స్కంధా వారం’ దేన్ని సూచిస్తుంది?
 1) సైనిక శిబిరం
 2) భోజన శాల
 3) వ్యాపార కేంద్రం
 4) విద్యా శాల

View Answer

సమాధానం: 1

31. ‘దక్షిణ భారతదేశ మనువు’గా ఎవరిని అభివర్ణిస్తారు?
 1) అగస్త్యుడు
 2) ఆపస్తంభుడు
 3) రామానుజుడు
 4) ధర్మకీర్తి

View Answer

సమాధానం: 2

32. ‘కులరికలు’ పదం దేన్ని సూచిస్తుంది?
 1) వ్యాపారులు
 2) కుమ్మరివారు
 3) చర్మకారులు
 4) ఔషధాలు తయారు చేసేవారు

View Answer

సమాధానం: 2

33. ‘సార్థవాహులు’ అంటే?
 1) ధనికులు   
 2) వ్యవసాయదారులు
 3) యంత్రాలు తయారుచేసేవారు
 4) వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లి వర్తకం చేసేవారు

View Answer

సమాధానం: 4

34.శాతవాహనుల కాలంలో రాజు ఆదేశాలను అమలు చేసే ‘సచివాలయం’ కార్యాలయం పేరు?
 1) గ్రామేయ
 2) నిగమసభ
 3) అక్షపటల
 4) స్కంధావారం

View Answer

సమాధానం: 3

35.దక్షిణ భారతదేశ చరిత్రలో తొలిసారిగా బ్రాహ్మణులు, బౌద్ధ బిక్షువులకు భూదానా లు చేసిన రాజవంశం ఏది?
 1) ఇక్ష్వాకులు
 2) విష్ణుకుండినులు
 3) కాకతీయులు
 4) శాతవాహనులు

View Answer

సమాధానం: 4

36. శాతవాహనుల కాలంలో వృత్తిపనివారు చెల్లించే సుంకం?
 1) ఇక్తా
 2) భోగ పన్ను
 3) కురుకుర
 4) దేయభోగం

View Answer

సమాధానం: 3

37. ఇక్ష్వాకుల రాజ్య స్థాపకుడు ఎవరు?
 1) రుద్ర పురుష దత్తుడు
 2) శ్రీ వీర పురుష దత్తుడు
 3) వాసిష్టీపుత్ర శ్రీ చాంతమూలుడు
 4) ఎహూవల చాంతమూలుడు

View Answer

సమాధానం: 3

38.ఇక్ష్వాకుల వంశానికి చెందిన ఏ రాజు కాలంలో ఆంధ్ర దేశం బౌద్ధ మతానికి  స్వర్ణ యుగంగా వర్ధిల్లింది?
 1) చాంతమూలుడు
 2) రుద్ర పురుషదత్తుడు
 3) ఎహూవల చాంతమూలుడు
 4) శ్రీ వీర పురుషదత్తుడు

View Answer

సమాధానం: 4

39. భారతదేశ చరిత్రలో తొలిసారిగా దేవాలయాలను నిర్మించిన రాజవంశం ఏది?
 1) శాతవాహనులు
 2) గుప్తులు
 3) ఇక్ష్వాకులు
 4) మౌర్యులు

View Answer

సమాధానం:3

40. సంస్కృత భాషలో శాసనాలు వేయించిన తొలి ఇక్ష్వాక రాజు ఎవరు?
 1) ఎహూవల చాంతమూలుడు
 2) శ్రీ వీర పురుషదత్తుడు
 3) రుద్ర పురుషదత్తుడు
 4) వాసిష్టీపుత్ర శ్రీ చాంతమూలుడు

View Answer

సమాధానం: 1

41. బృహత్పలాయనుల వంశ చరిత్రను తెలిపే ఏకైక శాసనం ఏది?
 1) నాగార్జున కొండ శాసనం
 2) మంచికల్లు శాసనం
 3) కొండముది తామ్ర శాసనం
 4) తుండి శాసనం

View Answer

సమాధానం: 3

42. శాలంకాయనుల ఆరాధ్య దైవం ఎవరు?
 1) ఇంద్రుడు
 2) చిత్రరథ స్వామి
 3) విష్ణువు
 4) నందీశ్వరుడు

View Answer

సమాధానం: 2

43. ‘శ్రీ పర్వత స్వామి’ని కులదైవంగా స్వీకరించిన రాజవంశం ఏది?
 1) శాతవాహనులు
 2) ఇక్ష్వాకులు
 3) శాలంకాయనులు
 4) విష్ణుకుండినులు

View Answer

సమాధానం: 4

44. ‘చేజర్ల కపోతేశ్వరాలయం’ నిర్మించిన రాజవంశం ఏది?
 1) ఆనంద గోత్రీయులు
 2) విష్ణుకుండినులు
 3) ఇక్ష్వాకులు
 4) శాతవాహనులు

View Answer

సమాధానం: 1

45. ఉండవల్లి గుహలు (5),  నెల్లూరులోని భైరవుని కొండ గుహలు (8), విజయవాడలోని మొగల్రాజపురం గుహాలయాలను నిర్మించిన రాజవంశం ఏది?
 1) శాతవాహనులు
 2) ఇక్ష్వాకులు
 3) వాకాటకులు
 4) విష్ణుకుండినులు

View Answer

సమాధానం: 4

46. ‘ప్రమాణ సముచ్ఛయం’ గ్రంథ రచయిత ఎవరు?
 1) నాగార్జునుడు
 2) బుద్ధ పాలితుడు
 3) దిగ్నాగుడు
 4) భావ వివేకుడు

View Answer

సమాధానం: 3

47. ‘పర్ణిక శ్రేణి’ అని ఏ సంఘాన్ని పిలుస్తారు?
 1) మిఠాయిలు చేసేవారి సంఘం
 2) తమలపాకులు అమ్ముకునే వారి సంఘం
 3) కుమ్మరి పనిచేసే వారి సంఘం
 4) సాలెపని వారి సంఘం

View Answer

సమాధానం: 2

48. ఆంధ్ర దేశంలో ‘సింహళ విహారం’ను ఎక్కడ నిర్మించారు?
 1) ధాన్యకటకం
 2) ఘంటసాల
 3) జగ్గయ్యపేట
 4) నాగార్జున కొండ

View Answer

సమాధానం: 4

49. శాలంకాయనుల రాజ లాంఛనం ఏది?
 1) నందీశ్వరుడు
 2) సింహం
 3) ఎద్దు
 4) చేప

View Answer

సమాధానం: 3

50. ‘ఘటికలు’ అంటే ఏమిటి?
 1) ఉన్నత విద్యాసంస్థలు
 2) గురుకుల పాఠశాలలు
 3) సంఘాలు
 4) నాటికలు

View Answer

సమాధానం: 1

51. బెజవాడలోని ‘అక్కన్న - మాదన్న’ గుహలను ఏ రాజవంశ కాలంలో తొలిచారు?
 1) ఇక్ష్వాకులు
 2) పల్లవులు
 3) శాలంకాయనులు
 4) విష్ణుకుండినులు

View Answer

సమాధానం: 4

52. విష్ణుకుండినుల కాలం నాటి ప్రఖ్యాతిగాంచిన గుహలు కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో ఉన్నాయి?
 1) భైరవకొండ
 2) బేతంచర్ల
 3) ధూళికట్ట
 4) ఉండవల్లి - మొగల్రాజపురం

View Answer

సమాధానం: 4



AP History - Sathavahana, Ikshwaka important practice bits for APPSC Exams

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర – శాతవాహనులు

శాతవాహన వంశ స్థాపకుడు?
– శ్రీముఖ శాతకర్ణి

మౌర్య సామ్రాజ్య పతనానంతరం, శ్రీముఖుని నాయకత్వంలో శాతవాహనులు స్వతంత్రించారు అని తెలిపినవారు?
–వి.ఎ.స్మిత్‌

శ్రీముఖ శాతకర్ణి ఆంధ్ర జాతీయుడు అని పేర్కొన్న పురాణం?
– మత్స్య పురాణం

శాతవాహనులు – ఆంధ్రులు ఒక్కరే అన్నవారు?
– ఆర్‌.జి.భండార్కర్, వి.ఎ. స్మిత్, రాప్సన్‌

శాతవాహనుల జన్మస్థలం మహారాష్ట్ర అని పేర్కొన్నవారు?
– పి.టి. శ్రీనివాస అయ్యంగార్‌

శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని వాదించినవారు?
– వి.వి. మిరాశి

శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని పేర్కొన్నవారు?
–సూక్తాంకర్‌

శాతవాహనుల తొలి రాజధాని?
– కోటిలింగాల

ఏ శాతవాహన రాజుకు చెందిన నాణేలు పూనా సమీపంలో లభించాయి?
–మొదటి శాతకర్ణి

నానాఘాట్‌ శాసన కర్త?
– నాగానిక

సాంచీ స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించిన రాజు?
– రెండో శాతకర్ణి

రెండో శాతకర్ణి శుంగుల రెండో రాజధాని విదిశను జయించాడని పేర్కొనే గ్రంథం?
– గార్గి సంహిత

తన పేరు మీద తొలిసారిగా శాసనాలు వేయించిన శాతవాహన రాజు?
– మొదటి పులోమావి

ఏ రాజు కాలంలో గౌతమీ బాలశ్రీ నాసిక్‌ శాసనం వేయించింది?
– వాశీష్టపుత్ర పులోమావి

నహపాణుడి పునర్ముద్రిత నాణేలు ఎక్కడ లభించాయి?
– జోగల్‌తంబి

ఆంధ్ర రాజులు సుశర్మను చంపి మగధను ఆక్రమించినట్లు పేర్కొనే పురాణం?
– మత్స్య పురాణం

కామర్థకవంశ చష్టానుడు.. వాశీష్ఠపుత్ర పులోమావి సమకాలీనుడు అని తెలిపిన విదేశీ రచయిత?
– టాలమీ

రాజు పేరు ముందు తల్లి నామం పెట్టుకునే ఆచారం ఏ రాజుతో ప్రారంభమైంది?
– గౌతమీపుత్ర శాతకర్ణి

శ్రీముఖుడు మొదట ఆదరించిన మతం?
– జైన మతం

‘కవి వత్సల’ అనే బిరుదున్న రాజు?
– హాలుడు

శాతవాహన వంశంలో అతి గొప్ప రాజు?
– గౌతమీపుత్ర శాతకర్ణి

శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచేవారు?
– ఆహారము

భారత్‌లో తొలిసారిగా బ్రాహ్మణులకు భూ దానాలు ప్రారంభించిన రాజవంశం?
– శాతవాహనులు

నిగమ సభల గురించి వివరిస్తున్న శాసనం?
– భట్టిప్రోలు

శాతవాహనుల కాలంలో గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉన్నాయని తెలిపే గ్రంథం?
– గాథాసప్తశతి

అమరావతి స్థూపాన్ని విస్తృతపరిచి, మహాచైత్య వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి?
– యజ్ఞశ్రీ శాతకర్ణి

శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు?
– భూమి శిస్తు

శాతవాహనుల కాలంలో శ్రేణులు అంటే?
– వృత్తి సంఘాలు

శాతవాహనుల కాలంలో నౌకా వాణిజ్యాన్ని ప్రోత్సహించారని పేర్కొన్న శాసనం?
– గుంటుపల్లి

శాతవాహనుల రాజ భాష?
– ప్రాకృతం

సంస్కృతాన్ని రాజభాషగా చేసుకున్న రాజు?
– కుంతల శాతకర్ణి

నాణేలపై ఉజ్జయిని చిహ్నాన్ని ముద్రించిన రాజు?
– మొదటి శాతకర్ణి

సోమదేవసూరి రచించిన కథాసరిత్సాగరం ప్రకారం శాతవాహనుల మూలపురుషుడు?
– శాతవాహనుడు

శాతవాహనుల కాలంలో జనపదాలు అంటే?
– సామంత రాజ్యాలు

శాతవాహనుల శాసనాలు అన్నీ ఏ భాషలో, ఏ లిపిలో ఉన్నాయి?

– ప్రాకృత భాషలో, బ్రాహ్మి లిపిలో

శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన కుంద కుందనాచార్యుడు ఏ మతానికి చెందినవాడు?
– జైనం

నాసిక్, కన్హేరి గుహలను బౌద్ధ మతస్తులకు దానం చేసిన శాతవాహన lరాజు?
– కృష్ణుడు

కార్లే గుహలను మహాసాంఘిక బౌద్ధశాఖకు దానం చేసిన రాజు?
– రెండో పులోమావి

అజంతా గుహల్లోని 9, 10 గుహలు ఏ యుగానికి చెందినవి?
– శాతవాహనులు

గాథాసప్తశతిని పోలిన గ్రంథం ‘వజ్జలగ్గ’ను రచించింది?
– జయవల్లభ

శాతవాహనుల కాలంలో రాతిలో తొలిచిన చైత్యం ఎక్కడ ఉంది?
– గుంటుపల్లి

శ్రీ పర్వతం వద్ద శైల మండపాలు నిర్మించిన రాజు?
– యజ్ఞశ్రీ శాతకర్ణి

శాతవాహనుల కాలంలో బౌద్ధ స్థూపాలను వేటితో నిర్మించారు?
– ఇటుకలు

ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విలసిల్లిన శాతవాహనుల రేవు పట్టణం?
– ఘంటసాల

శాతవాహనుల కాలంలో విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించిన వర్తకులు?
– స్థారవాహులు

శాతవాహనుల కాలానికి సంబంధించిన రోమ్‌ దేశ నాణేలు ఏ ప్రాంతంలో లభించాయి?
– కొండాపూర్‌

బృహత్కథను గుణాఢ్యుడు ఏ భాషలో రచించాడు?
– పైశాచీ భాష

శాతవాహనుల కాలంలో ఒక సువర్ణ (బంగారు) నాణేనికి ఎన్ని కార్షపణాలు (వెండి)?
– 1:35 (ఒక బంగారు నాణేనికి 35 కార్షపణాలు)

శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు?
– 12 శాతం

శాతవాహనుల కాలంలో వృత్తి పన్నులు?
– కారుకర

ఏ శాతవాహన రాజు కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశానికి విస్తరించింది?
– మొదటి కృష్ణుడు

ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు?
– సుహృల్లేఖ, ఆరోగ్య మంజరి, ప్రజ్ఞా పారమిత, మాధ్యమిక కారిక

బౌద్ధ మతస్తుల కోసం నాగానిక తొలిపించిన గుహలు?

– నానాఘాట్‌

‘బెణకటకస్వామి’ అని బిరుదు గల శాతవాహన రాజు?
– గౌతమీపుత్ర శాతకర్ణి

గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు?
– శకారి, ఆగమనిలయ, క్షహరాట వంశ నిషేశకర, త్రిసముద్రతోయ పీతవాహన

క్రీ.శ.78లో శాలివాహన శకాన్ని ప్రారంభించింది?
– గౌతమీపుత్ర శాతకర్ణి

ఇక్ష్వాకులు

శాసనాల ప్రకారం ఇక్ష్వాకు వంశ మూల పురుషుడు?
–వాశీష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు

ఏ రాజును ఓడించి ఇక్ష్వాకులు విజయపురిలో అధికారాన్ని స్థాపించారు?
–మూడో పులోమావి

ఇక్ష్వాకులు స్థానికులు అని వాదించిన చరిత్రకారుడు?
– కాల్డ్‌వెల్‌

ఇక్ష్వాకులు కర్ణాటక ప్రాంతం నుంచి ఆంధ్రకు వలస వచ్చారని పేర్కొన్నవారు?
– వోగేల్‌

శ్రీశాంతమూలుడు ఏ మతాన్ని ఆదరించాడు?
– వైదిక మతం

ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని పేర్కొనే పురాణం?
– విష్ణు పురాణం

రెంటాల, దాచేపల్లి, కెసానపల్లి శాసనాలు వేయించిన ఇక్ష్వాక రాజు?
– శ్రీశాంతమూలుడు

శతసహస్రహలక, మహాదానపతి బిరుదులు కలిగిన ఇక్ష్వాక రాజు?
– శ్రీశాంతమూలుడు

ఇక్ష్వాకుల చరిత్రకు మూలాధారాలైన శాసనాలు?
– నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి

వీరపురుష దత్తుడి కాలంలో మహాచైత్య నిర్మాణానికి ఆయక స్తంభాన్ని ప్రతిష్టించింది ఎవరు? – అడవి శాంతిశ్రీ

నాగార్జునకొండ వద్ద చుళ్ల ధర్మగిరిపై చైత్యగృహాన్ని నిర్మించింది?
– ఉపాసిక బోధిశ్రీ

మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ఏ రాజు కాలంలో ప్రారంభమైంది?
– వీరపురుష దత్తుడు

ఏ రాజు కాలాన్ని ఆంధ్రలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు?
– వీరపురుషదత్తుడు

రాజు.. శివలింగాన్ని కాలితో తొక్కుతూ, బౌద్ధులకు అభయం ఇస్తున్న శిల్పం ఏ ప్రాంతంలో లభించింది?
– నాగార్జునకొండ

అశ్వమేథయాగం చేసిన ఇక్ష్వాక రాజు?
– శ్రీశాంతమూలుడు

ఇక్ష్వాకుల రాజభాష?
– ప్రాకృతం

ఇక్ష్వాకుల రాజ చిహ్నం?
– సింహం

భారతదేశంలో తొలి వైదిక (హిందూ) దేవాలయాలు నిర్మించిన రాజులు?
– ఇక్ష్వాకులు

ఏ ఇక్ష్వాక రాజు కాలంలో శ్రీ పర్వతం మహాయాన మతానికి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లింది?
– వీరపురుషదత్తుడు

దక్షిణ భారతదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించిన రాజు?
– ఎహుబల శాంతమూలుడు

ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన వృత్తి?
– వ్యవసాయం

హారతి అంటే?
– చిన్న పిల్లలను రక్షించే దేవత

వీరగల్‌ అంటే?
– యుద్ధంలో మరణించిన వీరుల స్మారక చిహ్నాలు

ఇక్ష్వాకుల కాలం నాటి వృత్తి పన్నుల గురించి వివరిస్తున్న శాసనం?
– విషవట్టి శాసనం

ఇక్ష్వాకుల కాలంలో ప్రముఖ వర్తక శ్రేణులు?
– పర్నిక శ్రేణి, పుసిన శ్రేణి

మొదటిసారిగా ఆయా నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైంది?
– ఇక్ష్వాకులు


AP History Practice Bits for APPSC Group1, Group2, other exams

AP History Practice Bits for APPSC Group1, Group2, other exams

ప్రాక్టీస్ బిట్స్ 
1. ఆంధ్రప్రదేశ్ ఉత్తర అక్షాంశాలు
ఎ) 12°41-22° -- బి) 12°82'-26° సి) 14°121-22° డి) 16°821-260" 

2. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం సుమారు
ఎ) 1,85,200 చ.కి.మీ. బి) 1,56,208 చ.కి.మీ
సి) 1,60, 205 చ.కి.మీ. డి) 1,87,208 చ.కి.మీ 

3. భారతదేశం మొత్తం భూభాగంలో ఆంధ్రప్రదేశ్ భూభాగం ఎంత శాతం. 
ఎ) 4.86%
బి) 4.36% సి) 5,86% డి) 5.36% 

4. విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది. 
ఎ) 1970 ఫిబ్రవరి 2 బి) 1978 ఆగస్టు 15 సి) 1979 జూన్ 1 డి) 1976 మే 15 - 

5. ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా
ఎ) విశాఖపట్నం బి) అనంతపురం సి) చిత్తూరు - డి) తూర్పుగోదావరి 

6. ఆంధ్రప్రదేశ్ జనాభా పరంగా అతితక్కువ గల జిల్లా
ఎ) విజయనగరం బి) శ్రీకాకుళం సి) ప్రకాశం డి) కడప 

7. డాల్ఫిన్స్ ఈ క్రింది ఏ జిల్లాలో కలవు?
ఎ) విజయనగరం బి) శ్రీకాకుళం సి) విశాఖపట్నం డి) నెల్లూరు 

8. శ్రీధర్మలింగేశ్వరాలయం ఏ జిల్లాలో కలదు. - ఎ) విశాఖపట్నం బి) తూర్పుగోదావరి సి) పశ్చిమగోదావరి డి) కృష్ణాజిల్లా 

9. అరకు లోయ ఏ కొండలలో కలదు.
ఎ) యారాడ బి) పాలకొండలు సి) డాల్ఫినోస్ డి) సీతానగరం కొండలు 

10. ఉండవల్లి గుహలు ఏ జిల్లాలో కలవు.. - ఎ) నెల్లూరు బి) గుంటూరు సి) విశాఖపట్నం డి) విజయనగరం

11. అశోకుడి ఎన్నవ శిలాశాసనం ఆంధ్రుల గురించి ప్రస్తావించబడింది. ఎ) 12
బి) 13 సి) 14 డి) 9 

12. బిల్లసర్గం అనే పాత రాతి యుగ స్థావరం ఏ జిల్లాలో కలదు.
ఎ) కర్నూలు బి) కడప సి) చిత్తూరు డి) అనంతపురం 

13. స్థిరనివాసాలు ఏ యుగంలో ఏర్పాటు చేసుకున్నారు? 
ఎ) నవీన శిలాయుగం బి) మధ్యశిలాయుగం సి) తాత్రేయుగం !. డి), ఇనుపయుగం

 14. మానవుడు వేటాడడం ఏ యుగం నుండి ప్రారంభమయింది.
52 ఎ) మధ్యశిలాయుగం బి) నవీన శిలాయుగం సి) ప్రాచీన శిలాయుగం డి) తాత్రేయుగం 

15. చిత్రాలంకృతి మృణ్మయ పాత్రలు ఏ జిల్లాలో లభ్యమయినవి.
ఎ) కర్నూలు జిల్లా పాతపాడు బి) అనంతపురం జిల్లా కదిరి - సి) నెల్లూరు జిల్లా ముతుకూరు . డి) కడప జిల్లా బద్వేలు 

16. చేతితో తయారు చేసిన కుండలు ఏ కాలం నాటివి?
ఎ) మధ్యశిలాయుగం (మీసోలిథిక్ ఏజ్) బి) నవీన శిలాయుగం (నియోలిథిక్ ఏజ్)
సి) ప్రాచీన శిలాయుగం (పొలియోలిథిక్ ఏజ్) డి) లోహయుగం (చాకోలిథిక్ ఏజ్), 

17. కాల్చిన బంకమట్టితో చేసిన శవపేటిక ఏ రకమునకు చెందినది. ఎ) నిస్ట్
బీ) డాల్మిన్ సి) సాక్రోపగి డి ) మెన్షిర్ 

18 గ్రానైటితో చేసిన శవపేటిక ఏ రకమునకు చెందినది? ఎ) డాల్మీస్ బి) సాక్రోపగిసి) సిస్ట్
డి) మెన్షిర్

 19. కృష్ణా నది సముద్రంలో ఈ ప్రాంతంలో కలుస్తుంది.?
ఎ) హంసల దీవి బి) ఊటకూరు సి) పావురాల దీవి డి) అంతర్వేది 

20. యారాడ కొండ ఈ ప్రాంతంలో వ్యాపించి ఉన్నది.?
ఎ) విజయనగరం - బి) పశ్చిమ గోదావరి సి) తూర్పుగోదావరి డి) విశాఖపట్నం 

21. చరిత్రపూర్వ యుగంలో పనిముట్ల స్వభావాలను బట్టి కాలాన్ని ఈ క్రమంలో విభజించారు.?
ఎ) రాత్, రాగి, ఇనుప యుగాలు బి) ఇనుప, రాతి, రాగి, కంచు యుగాలు :
సి) రాగి, రాతి, కంచు, ఇనుప యుగాలు .. డి) కంచు, రాతి, రాగి, ఇనుప యుగాలు 

22. ఆంధ్రదేశానికి సంబంధించి ప్రాచీన స్థావరాలని కనిపెట్టిన వారిలో లేని వ్యక్తి ఎవరు?
ఎ) ఎడ్వర్డు బ్రూస్ఫూట్ బి) హైమన్ డార్క్ సి) మెడోస్ టేలర్ డి) అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ 

23. జతపరుచుము.
1) పశ్చిమగోదావరి . ఎ) అరసవెల్లి సూర్యదేవాలయం
 2) విజయనగరం బి) కాణిపాకం విఘ్నేశ్వరుని ఆలయం 3) శ్రీకాకుళం సి) పంచారామాలు 
4) చిత్తూరు డి) రామతీర్థ కొండలు 

ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ బి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
సి) 1-బి, 2-డి, 3-ఎ, 4-సి డి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ 

24. జతపరుచుము. 
1) పంపానది ఎ) నెలూరు 
2) గోదావరి బి) అనకాపల్లి 
3) పెన్నా నది సి) అన్నవరం 
4) శారదా నది డి) పంచవటి. 

ఎ) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
బి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ 
సి) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి 
డి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ


జవాబులు 1) ఎ 2) సి 3) ఎ 4) సి 5) బి 6) వ 7) సి 3) ఎ 2) బి 10)బి 11)బి 12)ఎ 13)ఎ 14)ఎ 15)ఎ 16) 17)సి 18)సి;19) 20) డి (21) ఎ 2) బి, 28)బి. 24)సి
ఆంధ్రప్రదేశ్ చరిత్ర - కృష్ణదేవరాయల కొలువులో మహాకవులు ఎవరు

ఆంధ్రప్రదేశ్ చరిత్ర - కృష్ణదేవరాయల కొలువులో మహాకవులు ఎవరు

*శ్రీకృష్ణదేవరాయల కొలువులో మహాకవులు ఎవరు?*


శ్రీ కృష్ణదేవరాయల కొలువులోని మహాకవులను అష్టదిగ్గజాలని అంటారు .

▪అల్లసాని పెద్దన : మనుచరిత్ర అనే ప్రబంధాన్ని రచించాడు . ఇతనికి ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు ఉంది .

▪నంది తిమ్మన : ఈయనను ముక్కుతిమ్మన అని కూడా అంటారు . పారిజాతాపహరణం అనే గ్రంధాన్ని రచించాడు .

▪పింగళి సూరన : ఇతడు రాఘవ పాండవీయము అను ద్వర్ధి(శ్లేష)కావ్యమును , కళాపూర్ణోదయము , ప్రభావతీ ప్రద్యుమ్నము అనే గ్రంధాలు రచించాడు .

▪మాదయగారి మల్లన : ఇతడు రజశేఖర చరిత్ర అనే గ్రంధాని రచించాడు .

▪ధూర్జటి : శ్రీకాళహస్తి మహాత్యము , శ్రీకాళహస్తీశ్వర శతకము లను రచించాడు .

▪అయ్యలరాజ రామభద్రుడు : ఇతడు ' రామాభ్యుదయాన్ని రచించాడు ,

▪తెనాలి రామకృష్ణుడు : వికట కవి . పాండు రంగ మహత్యం కావ్యాన్ని రచించాడు .

▪రామరాజ భూషణుడు : భట్టుమూర్తి ఇతని నామాంతరము . వసువరిత్ర అనే శ్లేష కావ్యమును , హరిశ్చంద్రోపాఖ్యానము అనే ద్వర్ధి కావ్యము రచించాడు .

APPSC/TSPSC Exams- AP History Practice Bits

✍ 1. 1906 లో కొమర్రాజు లక్ష్మణరావుచే ప్రారంభించబడిన విజ్ఞాన చంద్రికా మండలి 1910 లో ఎవరు రచించిన “ఆంధ్రుల చరిత్ర” గ్రంధ ప్రథమ భాగాన్ని రచించింది?

A. ఏటుకూరి బలరామమూర్తి
B. సురవరం ప్రతాపరెడ్డి
C. చిలుకూరి వీరభద్రరావు 👈
D. ఖండవల్లి లక్ష్మీరంజసం

✍ 2. ఈ క్రిందివారిలో ఎవరు బహిర్గతం చేసిన “దేవులపల్లి శాసనం” ద్వారా విజయనగర సాళువ వంశం విశేషాలు తెలిశాయి?

A. కందుకూరి వీరేశలింగం
B. జయంతి రామయ్య 👈
C. కొమర్రాజు లక్ష్మణరావు
D. చిలుకూరి వీరభద్రరావు

✍ 3. ఈ క్రిందివాటిలో సరైనవి?

A. అభినవ తిక్కన – తుమ్మల సీతారామమూర్తి చౌదరి
B. గద్య తిక్కన – కందుకూరి వీరేశలింగం

A. 1 మాత్రమే
B. 2 మాత్రమే
C. రెండూ సరైనవే 👈
D. రెండూ సరికాదు

✍ 4. గురజాడ అప్పారావు వాడుక భాషలో రచించిన “కన్యాశుల్కం” నాటక మొదటి ముద్రణ ఎప్పుడు జరిగింది?

A. 1890
B. 1897 👈
C. 1905
D. 1912

✍ 5. వ్యవహారిక భాషోద్యమ ప్రచారం కోసం “తెలుగు” అనే పత్రిక నిర్వహించినది?

A. గురజాడ అప్పారావు
B. కందుకూరి వీరేశలింగం
C. గిడుగు రామమూర్తి 👈
D. కొమర్రాజు లక్ష్మణరావు

✍ 6. 1914 లో అఖిల భారత కాంగ్రెస్ సభకు కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు?

A. న్యాపతి సుబ్బారావు 👈
B. కొండా వెంకటప్పయ్య
C. పట్టాభి సీతారామయ్య
D. B.N. శర్మ

✍ 7. బ్రహ్మసమాజ సిద్ధాంతాలచే ప్రభావితమై “శిథిలమైన ఆలయంలో శివుడు లేడు” అని వ్యాఖ్యానించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన పుస్తకం?

A. సావిత్రి
B. హేమలత
C. అమీనా
D. ఊర్వశి 👈

✍ 8. సహాయనిరాకరణ ఉద్యమకాలంలో గరిమెళ్ళ సత్యనారాయణ వ్రాసిన “మాకొద్దీ తెల్లదొరతనం” అనే పాటను ఆలపించి జైలుశిక్షను అనుభవించినది?

A. కృష్ణ పరబ్రహ్మశాస్త్రి 👈
B. గాడిచర్ల హరిసర్వోత్తమరావు
C. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
D. ఉన్నవ లక్ష్మీనారాయణ

✍ 9. ఉన్నవ లక్ష్మీనారాయణచే రచించబడిన “మాలపల్లి” నవల ఎప్పుడు వెలువడింది?

A. 1910
B. 1919
C. 1922 👈
D. 1938

✍ 10. తెలుగు నాటక పితామహుడు?

A. ఆదిభట్ల నారాయణదాసు
B. ధర్మవరం రామకృష్ణమాచార్యులు 👈
C. షేక్ నాజర్
D. బళ్ళారి రాఘవ

APPSC/TSPSC Exams- AP History Practice Bits