ఆంధ్రప్రదేశ్ చరిత్ర - శాతవాహనులు-ముఖ్యాంశాలు


*_🖊📘శాతవాహనులు-ముఖ్యాంశాలు_*🖊📗

శాతవాహనులు-ముఖ్యాంశాలు

ఆంధ్ర శబ్దాన్ని పేర్కొంది - ఐతరేయ బ్రాహ్మణం
ఆంధ్ర పథాన్ని ప్రస్తావించింది - భీమసేన జాతకం
ఆంధ్ర నగరిని పేర్కొంది - సెరివణిజ జాతకం
త్రిలింగ దేశాన్ని ప్రస్తావించింది - శక్తి సంగ్రమ తంత్రం
శాతవాహనులు, పురాణాల్లో పేర్కొన్న ఆంధ్ర భృత్యులు ఒకరేనని ఆర్.జి.భండార్కర్ అభిప్రాయపడ్డారు.
శాతవాహనుల ఆదిమ నివాసం నాసిక్ ప్రాంతమని పి. శ్రీనివాస అయ్యంగార్ గోపాలాచారి, పులాస్కర్ పేర్కొన్నారు.
వి.ఎన్.సుంక్తాంకర్ అభిప్రాయంలో శాతవాహనుల తొలి నివాసం ‘బళ్లారి’ ప్రాంతం.
శాతవాహనులు గోదావరి, కృష్ణా, మండల వాసులని వి.ఎ.స్మిత్, రాయ్ చౌదరి, గుత్తి వెంకట్రావ్‌లు అభిప్రాయపడ్డారు.
‘వాసుదేవ విష్ణు మిరాసీ’ అభిప్రాయంలో శాతవాహనుల జన్మభూమి విదర్భ ప్రాంతం.
శాతవాహనుల ప్రాచీన రాజధాని శ్రీకాకుళం (కృష్ణాజిల్లా) ఆ తర్వాత వరుసగా ధాన్యకటకం, ప్రతిష్టానపురాలని ఎల్.డి.బార్నెట్ అభిప్రాయపడ్డారు.
సంస్కృత భాషలో ‘శర్వవర్మన్’ కాతంత్ర వ్యాకరణం రచించాడు.
ఆచార్య నాగార్జునుడు సుహృల్లేఖ గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు.
ప్రాకృత భాషలో హాలుడు రచించిన గ్రంథం‘గాథాసప్తశతి’.
నానాఘట్ శాసనాన్ని మొదటి శాతకర్ణి భార్య నాగనిక వేయించింది.
నాసిక్ శిలా శాసనాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమీ బాలాశ్రీ వేయించింది.
హతిగుంఫా శిలాశాసనాన్ని - కళింగాధిపతి ఖారవేలుడు (ఒడిశా) వేయించాడు.
క్రీ.శ.150లో శకరాజైన రుద్రదమనుడు మొట్ట మొదటిసారిగా సంస్కృత భాషలో వేయించిన శాసనం ‘గిర్నార్ శాసనం’
శాతవాహన రాజ్య స్థాపకుడు - శ్రీముఖుడు
రెండు అశ్వమేధ, ఒక రాజసూయ యాగం చేసిన శాతవాహన రాజు - మొదటి శాతకర్ణి
మొదటి శాతకర్ణికి గల బిరుదులు - దక్షిణాపథపతి, ఏక వీరుడు, శూరుడు
కార్షాపణులు అంటే - వెండి నాణేలు
మధ్యప్రదేశ్‌లో ఉన్న సాంచీ స్థూపానికి దక్షిణ తోరణ ద్వారాన్ని నిర్మించిన శాతవాహన రాజు - రెండో శాతకర్ణి
ఏ శాతవాహన రాజు కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం రాజ భాష అయింది?
- కుంతల శాతకర్ణి
17వ శాతవాహన రాజైన హాలుడికి గల బిరుదు?
- కవి వత్సలుడు
లీలావతి పరిణయ కావ్యాన్ని రచించింది - కుతూహలుడు
కావ్య మీమాంస గ్రంథాన్ని రచించింది - రాజశేఖరుడు
నహపాణుని రాజధాని - మిన్నగార
‘క్షహరాట వంశ నిరవశేషకర’అనే బిరుదు ఎవరికి ఉంది?
- శకరాజైన నహపాణుడికి
క్షత్రియ దర్పమాన, త్రిసముద్రతోయ పీతవాహన, ఏకబ్రాహ్మణ, ఆగమనిలయ అనే బిరుదులున్న శాతవాహన రాజు?
- గౌతమీపుత్ర శాతకర్ణి
నహపాణుడు (శకరాజు) వేయించిన వెండి నాణేలు ఎక్కడ లభించాయి?
- మహారాష్ర్టలోని జోగల్‌తంబిలో
నాణేలపై ఓడ బొమ్మలు ముద్రించిన శాతవాహన రాజు?
- యజ్ఞశ్రీ శాతకర్ణి
పురుషార్థాలు అంటే - ధర్మ, అర్థ, కామ, మోక్షాలు
ఆహారాలు అంటే - రాష్ట్రాలు
నిగమాలు అనగా?
- ప్రధాన నగరాలు
గ్రామిణి, గుల్మిక, గ్రామిక పదాలు దేన్ని సూచిస్తాయి?
- గ్రామ పరిపాలనాధికారిని
ఒక వృత్తిని అనుసరించే వారిని శ్రేణులు (సంఘాలు)అంటారు. దీని అధ్యక్షుడు శ్రేష్టి
స్కంధావారం అంటే - సైనిక శిబిరం
సాగుభూమిని కొలిచేందుకు ‘రజ్జు’ అనే కొలమానాన్ని వాడేవారు. భూమి కొలతలు, లావాదేవీలను పర్యవేక్షించే వారిని రజ్జు గాహకుడు అనేవారు.
వృత్తి పనులవారు కరుకర అనే పన్నును చెల్లించేవారు.
దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ‘భూదానం’ చేయడం అనే ప్రక్రియను శాతవాహనులే ప్రారంభించారు.
కుటుంబ పెద్దను గహపతి (గృహపతి) అని పిలిచేవారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట చిహ్నం పూర్ణ కుంభాన్ని అమరావతి స్థూపంనుంచి తీసుకున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ‘విదిశ’ ప్రాంతంలో హోలియో డోరస్ క్రీ.పూ.1వ శతాబ్దంలో వేసిన స్తంభ శాసనం భాగవత మతం గురించి ప్రస్తావించింది.
ఆంధ్ర దేశంలో అతి ప్రాచీనమైన గుడి మల్లం శివలింగం చిత్తూరు జిల్లాలో లభ్యమైంది.
ఆంధ్ర దేశంలో అతి ప్రాచీన స్థూపం (క్రీ.పూ.2వ శతాబ్దం) ‘భట్టిప్రోలు’ (గుంటూరు జిల్లా)లో లభించింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లి గుహాలయాలు శాతవాహనుల కాలంలో నిర్మాణమయ్యాయి.
శాతవాహన రాజుల ఆజ్ఞలను అమలు చేయటానికి ‘అక్ష పటలం’ అనే సచివాలయం ఉండేది.
శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు అజంతాలోని 9.10 గుహల్లో ఉన్నాయి.
చైత్యగృహాలు అంటే బౌద్ధుల ప్రార్థనా స్థలాలు.
తిలపిష్టకులు అంటే ఎవరు?
- తెలకలివాళ్లు (గానుగ ద్వారా నూనె తీసేవారు)
గధికులు అంటే - మందులు తయారుచేసేవారు
సార్థవాహులు అంటే ఎవరు?
ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తువులు తీసుకొనిపోయి వ్యాపారం చేసేవారు
కోలికులు అంటే - సాలెవారు
ఒసకరులు అంటే - మేదర్లు
వజ్రయానం అంటే - బుద్ధుడిని తాంత్రిక పూజా విధానంలో పూజించడం
శాతవాహనుల ప్రధాన ఆదాయం భూమిశిస్తు. పంటలో 1/6 వంతును శిస్తుగా వసూలు చేసేవారు.
కొండ కుందాచార్యుడు ‘సమయసారం’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడు శాతవాహన రాజుల సమకాలికుడు.
‘కథా సరిత్సాగరం’ను సంస్కృత భాషలో ‘సోమదేవసూరి’ రచించాడు.
బృహత్కథా శ్లోక సంగ్రహం రచయిత - బుధస్వామి
మహాయాన మాధ్యమిక సిద్ధాంత కర్త - ఆచార్య నాగార్జునుడు.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv