Showing posts with label Ap Jobs. Show all posts
Showing posts with label Ap Jobs. Show all posts
APCOB - AP STATE COOPERATIVE BANK - MANAGER, STAFF ASSISTANT 61 VACANCIES

APCOB - AP STATE COOPERATIVE BANK - MANAGER, STAFF ASSISTANT 61 VACANCIES

*ఏపీ ఆప్కాబ్‌లో 61 మేనేజర్లు, స్టాఫ్‌ అసిస్టెంట్ పోస్టులు*

 విజయవాడలోని ది ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (ఆప్కాబ్‌) ఐబీపీఎస్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 *వివరాలు* ..

*మొత్తం ఖాళీలు* : 61

1) *మేనేజర్‌* (స్కేల్‌ 1): 26 (ఇందులో 06 పోస్టులు వివిధ స్పెషలైజేషన్స్‌కి కేటాయించారు.)

*స్పెషలైజేషన్లు* : అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌.

*అర్హత* : 40శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. వివిధ స్పెషలైజేషన్ల అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్ ఉండాలి.

*వయసు* : 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

2) *స్టాఫ్‌ అసిస్టెంట్లు* : 35


*అర్హత* : అర్హత: 40శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.  తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్ ఉండాలి.

 *వయసు* : 01.06.2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

*ఎంపిక విధానం* : ఆన్‌లైన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

 *దరఖాస్తు విధానం* : ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*దరఖాస్తు ఫీజు* :  ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు రూ.500, ఇతరులు రూ.700 చెల్లించాలి.

*ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం* : 21.07.2021.

 *ఆన్‌లైన్‌ దరఖాస్తులకి చివరి తేది* : 05.08.2021.

 *ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేది* : 2021, సెప్టెంబరు మొదటి వారం.

 website: https://www.apcob.org/careers/
నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళా శాల ఒప్పంద ప్రాతిపదికన వైద్య సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళా శాల ఒప్పంద ప్రాతిపదికన వైద్య సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

 నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళా శాల ఒప్పంద ప్రాతిపదికన వైద్య సిబ్బంది నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.

 

ఖాళీలు: 27

 

ఉద్యోగాలు: రీసెర్చ్ సైంటిస్టులు 3, రీసెర్చ్ అసిస్టెంట్లు 3, ల్యాబ్ టెక్నీషియన్లు 15, వీఆర్డీఎల్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు 6. వేతనం: రీసెర్చ్ సైంటిస్టులకు రూ.60,000; రీసెర్చ్ అసిస్టెంట్లకు రూ.30,000; ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.25,000; డేటా ఎంట్రీ

ఆపరేటర్లకు రూ.16,000.

అర్హత: రీసెర్చ్ అసిస్టెంట్లకు ఎమ్మెస్సీ(మైక్రోబయాలజీ/ బయోటెక్నాల జీ) తోపాటు పీహెచ్ డీ, రీసెర్చ్ అసిస్టెంట్లకు ఎమ్మెస్సీ(మైక్రోబయా లజీ), ల్యాబ్ టెక్నీషియన్లకు బీఎస్సీ(ఎంఎల్)/ డీఎంఎల్, డేటా ఎంట్రీ ఆపరేటరు డిగ్రీతోపాటు డిప్లొమా(కంప్యూటర్ అప్లికేషన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

వెయిటేజీ: అకడమిక్ ప్రతిభకు 90 శాతం, సీనియారిటీకి 10 మార్కులు దరఖాస్తు ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీలకు రూ.300) దరఖాస్తు సబ్మిషన్ కు చివరి తేదీ: ఏప్రిల్ 22 చిరునామా: ప్రిన్సిపాల్, ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరు

Website: www.spsnellore.ap.gov.in

MEDICAL AND HEALTH DEPARTMENT VIJAYAWADA, CIVIL ASSISTANT SURGEON 13 VACANCIES (విజయవాడలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామ కానికి దరఖాస్తులు కోరుతోంది)

MEDICAL AND HEALTH DEPARTMENT VIJAYAWADA, CIVIL ASSISTANT SURGEON 13 VACANCIES (విజయవాడలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామ కానికి దరఖాస్తులు కోరుతోంది)

విజయవాడలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లు

 

విజయవాడలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామ కానికి దరఖాస్తులు కోరుతోంది

 

ఖాళీలు: 13

 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

 

ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ గుర్తింపు తప్పని సరి.

 

వయసు: 2020 డిసెంబరు 1 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వుడు వర్గాలవారికి వయోపరి మితిలో సడలింపు వర్తిస్తుంది.

 

వెయిటేజీ: అకడమిక్ ప్రతిభకు 75 శాతం, అనుభవానికి 15 శాతం, సీనియారిటీకి గరిష్ఠంగా 10 మార్కులు వెయిటేజీ ఇస్తారు.

 

దరఖాస్తు ఫీజు: రూ.600 దరఖాస్తు సబ్మిషన్ కు చివరి తేదీ: ఏప్రిల్ 17 చిరునామా:

జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, మచిలీ పట్నం, కృష్ణా జిల్లా,

 

వెబ్ సైట్: www.krishna.ap.gov.in 

ఏపీసీపీడీసీఎల్ లో 86 ఎనర్జీ అసిస్టెంట్ కొలువులు

ఏపీసీపీడీసీఎల్ లో 86 ఎనర్జీ అసిస్టెంట్ కొలువులు

  ఏపీసీపీడీసీఎల్ లో 86 ఎనర్జీ అసిస్టెంట్ కొలువులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయ వాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొ రేషన్ లిమిటెడ్(ఏపీసీపీ డీసీఎల్)

గ్రామ/ వార్డు సెక్రటేరియట్స్ లో ఎనర్జీ అసిస్టెంట్ (జేఎల్‌ఎం గ్రేడ్-2) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.



> మొత్తం పోస్టుల సంఖ్య: 86



* అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా ఫైర్మె న్ ట్రేడ్ ) ఉత్తీర్ణత ఉండాలి. లేదా ఇంటర్మీడియెట్ వొకేషనల్ (ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లియెన్సెస్ అండ్ రివైండింగ్/ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్/ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్

సర్వీసింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. + వయసు: 31.01.2021 నాటికి 18-35 ఏళ్ల

మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు లభిస్తుంది. .


* ఎంపిక విధానం: వంద మార్కులకు రాత

పరీక్షతోపాటు పోల్‌ క్లైంబింగ్ టెస్ట్, మీటర్ రీడింగ్ తదితరాల ద్వారా ఎంపిక జరుగుతుంది.


» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.05.2021 -


వెబ్ సైట్: https://www.apcpdal.in

Krishna District - DHMO - DR YSR KANTI VELUGU PROGRAM - Various vacancies on Contract Basis

Krishna District - DHMO - DR YSR KANTI VELUGU PROGRAM - Various vacancies on Contract Basis

 🔳కృష్ణా జిల్లా మెడికల్ హెల్త్ విభాగంలోని డాక్టర్. వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : పారా మెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్(PMOA)

ఖాళీలు : 40

అర్హత : 1). ఇంటర్మీడియట్ (MPC& BIPC)ఉత్తీర్ణ‌త‌తో పాటు పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి/బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

2). అభ్యర్థి A.P.పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోని ఉండాలి.

వయసు : 42 ఏళ్లు మించ‌కూడ‌దు.

వేతనం : నెలకు రూ.15,000 /-

ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 30, 2020.

దరఖాస్తులకు చివరితేది: జనవరి 08, 2021


https://krishna.ap.gov.in/

ప్రజారోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ డైరైక్టర్ గుంటూరు జిల్లా వైద్య‌, ఆరోగ్య విభాగం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ప్రజారోగ్య‌, కుటుంబ సంక్షేమశాఖ డైరైక్టర్ గుంటూరు జిల్లా వైద్య‌, ఆరోగ్య విభాగం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :            మెడికల్ ఆఫీసర్ (MBBS)

ఖాళీలు :      66

అర్హత :          ఎంబీబీఎస్ ఉత్తీర్ణ,ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలి.

వయసు :     42 ఏళ్లు మించకూడదు.

వేతనం :      రూ. 85,000 /- 1,70,000/-

ఎంపిక విధానం:   రాత పరీక్ష / ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం:          ఆఫ్లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు :     జనరల్ కు రూ. 500/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 15, 2020.

దరఖాస్తులకు చివరితేది:         డిసెంబర్ 21, 2020.

 

web site: https://guntur.ap.gov.in/




క్లర్కు కొలువులకు ఎస్‌బీఐ పిలుపు  8,904 పోస్టులకు ప్రకటన విడుదల

క్లర్కు కొలువులకు ఎస్‌బీఐ పిలుపు 8,904 పోస్టులకు ప్రకటన విడుదల

🔲క్లర్కు కొలువులకు ఎస్‌బీఐ పిలుపు
8,904 పోస్టులకు ప్రకటన విడుదల



ప్రపంచంలోని తొలి వంద అతి పెద్ద బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒకటి. మన దేశంలో ఇదే అన్నిటి కంటే పెద్దది. సాధారణ డిగ్రీ అర్హతతో ఆ అత్యున్నత బ్యాంకులోకి ఉద్యోగిగా అడుగుపెట్టే అవకాశం ఈ సంవత్సరానికి మళ్లీ వచ్చింది. దాదాపు తొమ్మిది వేల క్లర్కుల (జూనియర్‌ అసోసియేట్స్‌) ఖాళీలతో ప్రకటన వెలువడింది. రెండు వారాల్లో బ్యాంకు ఉద్యోగార్థులకు ఇది రెండో తీపికబురు. ఇటీవల రెండువేల పీవో పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చింది. ఇప్పుడు క్లర్కులు. అభ్యర్థులు పరీక్ష స్వరూపాన్ని, అందుబాటులో ఉన్న సమయాన్ని, తమ బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని సరైన ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే విజయాన్ని సాధించవచ్చు.

ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా 8904 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులను (251 బ్యాక్‌లాగ్‌లతో కలిపి) భర్తీ చేయనుంది. వాటిలో తెలంగాణ రాష్ట్రంలో 425, ఆంధ్రప్రదేశ్‌లో 253 పోస్టులు ఉన్నాయి. నియామకాలను రాష్ట్రాల వారీగా చేపడతారు. అభ్యర్థులు ఏ రాష్ట్రానికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఆ రాష్ట్రంలోనే రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు అక్కడి భాష (లోకల్‌ లాంగ్వేజి) పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం
ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు, అభ్యర్థులు ఎంపిక చేసుకునే లోకల్‌ లాంగ్వేజిపై నిర్వహించే టెస్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్‌ పరీక్షలో ప్రతిభ చూపే అభ్యర్థుల్లో పోస్టుల సంఖ్యకు 10 రెట్ల మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో సాధించిన మార్కులతో  మెరిట్‌ లిస్ట్‌ తయారుచేస్తారు.

ఉమ్మడి ప్రిపరేషన్‌
ఎస్‌బీఐ పీఓ, క్లర్క్‌ పరీక్షలు రెండింటికీ కలిపి ఉమ్మడిగా ఒకటే ప్రిపరేషన్‌ సరిపోతుంది. పీఓకు ప్రిపేర్‌ అయితే క్లర్క్‌ పరీక్షకు సన్నద్ధమైనట్లే.  ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ పరీక్షలోని ప్రశ్నల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించినంత వరకు పెద్ద తేడాలు లేవు. దాదాపు ఒకేలా ఉంటున్నాయి. మెయిన్స్‌ పరీక్షలో మాత్రం రెండింటికీ చాలా భేదం ఉంటుంది. క్లర్క్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష జూన్‌ నెల చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. అంటే రెండు నెలలకు పైగా సమయం ఉంటుంది. ఈలోగా ప్రిపరేషన్‌ పూర్తి చేయాలి. పీఓ, క్లర్క్‌ పరీక్షలు రెండింటిని రాస్తున్న అభ్యర్థులు మాత్రం జూన్‌ 8న నిర్వహించే పీఓ ప్రిలిమ్స్‌ నాటికి తమ ప్రిపరేషన్‌ పూర్తయ్యేలా ప్రణాళికను తయారు చేసుకోవాలి. రెండు పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి పట్ల అవగాహన ఏర్పడుతుంది. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులను కవర్‌ చేస్తూ,  ఒక మోడల్‌ పేపర్‌ ప్రాక్టీస్‌ చేయాలి. దీని వల్ల పరీక్ష రాసే పద్ధతికి అలవాటు పడతారు. మొదటసారి పరీక్ష రాసే అభ్యర్థులకు ఇది చాలా అవసరం. మూడు లేదా నాలుగు నెలలు అంకితభావంతో శ్రమిస్తే దేశంలోని నెంబర్‌ వన్‌ బ్యాంక్‌లో ఉద్యోగం ఖాయం.

సాధన చేస్తే.. విజయం మనదే!

బీటెక్‌ పూర్తికాగానే బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపరేషన్‌ మొదలు పెట్టాను. దాదాపు ఏడాదిన్నరపాటు కోచింగ్‌ తీసుకుంటూ నిరంతరం శ్రమించాను. మొదటిసారి ఎస్‌బీఐ పీఓ ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. కానీ సెలక్షన్‌ రాలేదు. ఎస్‌బీఐ క్లర్క్స్‌కు మరింత జాగ్రత్త పడ్డాను.  93.5 (తెలంగాణ), 92.8 (ఆంధ్రప్రదేశ్‌) స్కోర్‌తో విజయం సాధించాను. ఒత్తిడికి లోనవకుండా ప్రణాళిక ప్రకారం చదివితే బ్యాంకు ఉద్యోగం కష్టమేమీ కాదు. మొదటి మూడునాలుగు నెలల పాటు రోజుకు 7 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించాను. ఆ తర్వాత రోజుకు గంటన్నర మాత్రమే సాధన చేసేవాడిని. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలను ప్రతిరోజూ సాధన చేశాను. దీన్ని స్కోరింగ్‌ సబ్జెక్టుగా పెట్టుకున్నాను. రీజనింగ్‌ కోసం ఎక్కువ సమయం కేటాయించాను. ఇంగ్లిష్‌, కరెంట్‌ అఫైర్స్‌ కోసం రోజూ న్యూస్‌ పేపర్లను చదివాను. బ్యాంకు పరీక్షలకు సాధనే కీలకమైంది. ఒక్క రోజు కూడా మిస్సవ్వకుండా ప్రాక్టీస్‌ చేయాలి. బ్యాంకు మేనేజర్‌ స్థాయికి ఎదగడం నా జీవిత లక్ష్యం.

- ఏలేటి పృథ్వీ తేజ; మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా
గెలిచే వరకు అలిసి పోవద్దు!

చిన్నప్పటి నుంచి బ్యాంకింగ్‌ రంగంలో రాణించాలన్న తపన ఉండేది. బీటెక్‌ పూర్తవగానే మొదట అమ్మానాన్నపై ఆధారపడ కూడదని లెక్చరర్‌గా కాలేజీలో చేరాను. తర్వాత పని చేస్తూనే మూడేళ్లపాటు బ్యాంకు పరీక్షలకు సిద్ధమయ్యాను.  సుమారు పదిహేను పరీక్షలు రాశాను. ఉత్తీర్ణత సాధించలేకపోయినా నిరుత్సాహపడకుండా రాస్తూనే ఉన్నాను.  92.5 (తెలంగాణ), 93.75 (ఆంధ్రప్రదేశ్‌) స్కోర్‌తో ఎస్‌బీఐ క్లర్క్స్‌లో విజయం సాధించాను. ఉద్యోగానికి ఎంపికయ్యాను. రోజుకు ఆరు గంటలపాటు అన్ని సబ్జెక్టులను సాధన చేసేవాడిని. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన విభాగాలను ప్రతిరోజూ చదివేవాడిని. జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ కోసం హిందూ న్యూస్‌పేపర్‌ రోజూ చదివాను. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునేవారికి న్యూస్‌ పేపర్‌ పఠనం ముఖ్యం. కష్టపడి ప్రయత్నిస్తే బ్యాంకు ఉద్యోగం సాధించడం సులభమే. బ్యాంకింగ్‌ రంగంలో అత్యున్నత స్థాయికి చేరాలన్నదే నా లక్ష్యం.

- బొల్లం వీరనాగబాబు; పటవల, కాకినాడ
లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌



మెరిట్‌ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న లోకల్‌ లాంగ్వేజిని పదో తరగతి లేదా పన్నెండో తరగతిలో చదివి ఉంటే లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌ రాయాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. మెయిన్స్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
10 తప్పులు.. చేయవద్దు!

ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు చాలా పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి వాటిలో ముఖ్యమైన పది పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడితే విజయానికి చేరువకావచ్చు.
1 సరైన ప్రణాళిక లేదా టైమ్‌-టేబుల్‌ లేకపోవడం: పరీక్ష తేదీ వరకు ఉన్న సమయం, సబ్జెక్టులు, దేనికి ఎంత సమయం కేటాయించాలి మొదలైన వాటి పట్ల అభ్యర్థికి స్పష్టమైన అవగాహన ఉండాలి. దానికి అనుగుణంగా స్వీయ ప్రణాళిక వేసుకొని తప్పనిసరిగా ఆచరించాలి.

2 కొన్ని సబ్జెక్టులపైనే దృష్టి కేంద్రీకరించడం: పరీక్షలో అభ్యర్థులు అన్ని సబ్జెక్టుల్లోనూ కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. తమకు నచ్చిన ఏవో కొన్నింటి పైనే ఎక్కువ దృష్టిపెడితే మిగిలిన సబ్జెక్టుల్లో నష్టం జరగవచ్చు.

3 పరిమాణంపై దృష్టి పెట్టి, నాణ్యతను విస్మరించడం: కొంతమంది రోజుకు 16 లేదా 18 గంటలు చదివాం అంటుంటారు. ఎన్ని గంటలు సిద్ధమైనా ఎంత నేర్చుకున్నారన్నదే ముఖ్యం. గంటలకు గంటలు సమయం గడిపి బాగా ప్రిపేర్‌ అవుతున్నాం అనుకోకూడదు. ఈ రోజు ఎంత నేర్చుకున్నారో కచ్చితంగా పరిశీలించుకోవాలి.

4 రివిజన్‌ చేయకపోవడం: అభ్యర్థులు తాము నేర్చుకున్న టాపిక్స్‌ అన్నింటినీ ఎప్పటికప్పుడు రివిజన్‌ చేయాలి. రివిజన్‌ చేయకపోతే చదివింది సరిగా గుర్తుకు రాక మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది.

5 తాజా మోడల్‌ ప్రశ్నలకు, ట్రెండ్‌కు అనుగుణంగా ప్రిపరేషన్‌ లేకపోవడం: ప్రతి పరీక్షలోనూ ఎంతో కొంత మార్పు కనిపిస్తుంటుంది. గత పరీక్షలను పరిశీలించి  ప్రిపేర్‌ కావాలి. అదే సిలబస్‌, అవే ప్రశ్నలు అంటూ పరీక్ష సరళిని గమనించకుండా సాగితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

6 ప్రిలిమ్స్‌ పూర్తయ్యాక మెయిన్స్‌కు ప్రిపేరవడం: ప్రిలిమ్స్‌ అయిన తర్వాత మెయిన్స్‌ సంగతి చూద్దామని కొందరు అనుకుంటారు. అప్పుడు సమయం సరిపోక ఫెయిల్‌ అవుతారు. అందుకే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు ఏకకాలంలో ప్రిపరేషన్‌ ఉండాలి. కామన్‌ టాపిక్స్‌ నుంచి మొదలు పెట్టాలి.

7 ఆన్‌లైన్‌ మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేయకపోవడం: పరీక్షలు ఆన్‌లైన్‌ పద్ధతిలోనే ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ప్రాక్టీస్‌ చేయాలి. దానివల్ల అసలు పరీక్ష సమయంలో ఎలాంటి తడబాటు లేకుండా ఉంటుంది.

8 మోడల్‌ పేపర్‌ విశ్లేషించుకోకపోవడం: అభ్యర్థులు మోడల్‌ పేపర్‌ రాసిన తర్వాత దాన్ని విశ్లేషించుకోవాలి. ఎందులో వెనుకబడి ఉన్నారో గమనించాలి. మెరుగుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రిపరేషన్‌ గుడ్డిగా సాగకూడదు.

9 ఇంగ్లిష్‌ సబ్జెక్టుపై అశ్రద్ధ: ఇది ఎక్కువ మంది అభ్యర్థులు చేసే పొరపాటు.  తెలిసిన భాషే కదా అని అశ్రద్ధ చేస్తారు. భాష తెలిసి ఉండటానికి, దానిలో అడిగే ప్రశ్నలకు తేేడా ఉంటుంది. అందుకే ఈ సబ్జెక్టుకు ప్రత్యేకంగా ప్రిపరేషన్‌ అవసరమే.

10 షార్ట్‌కట్స్‌ నేర్చుకోకపోవడం: సంప్రదాయ పద్ధతిలో ప్రశ్నలు సాధించడం వల్ల సమయం ఎక్కువ పడుతుంది. సంక్షిప్త పద్ధతుల (షార్ట్‌కట్స్‌) వల్ల తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టవచ్చు. వాటిని నేర్చుకోకపోతే నష్టపోతారు.

- జి.ఎస్‌. గిరిధర్‌
ముఖ్యాంశాలు

మొత్తం పోస్టులు: 8,904 (251 బ్యాక్‌లాగ్‌ ఖాళీలతో కలిపి)
అర్హత: ఏదైనా డిగ్రీ (డిగ్రీ చివరి సంవత్సరం/ చివరి సెమిస్టర్‌ అభ్యర్థులు కూడా అర్హులే)
వయసు: 01.04.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపునకు చివరి తేది: 03.05.2019
పరీక్ష: ప్రిలిమ్స్‌ -జూన్‌లో, మెయిన్స్‌ - జులైలో
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: తెలంగాణ - హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.
ఆంధ్రప్రదేశ్‌ - చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
https://bank.sbi/careers/
https://www.sbi.co.in/careers/

ONGC Oil and Natural Gas Corporation Recruitment 2019 - Apply Online for 4014 Apprentice Posts

ONGC Oil and Natural Gas Corporation Recruitment 2019 - Apply Online for 4014 Apprentice Posts


ఓఎన్జీసీలో 4OI4 అప్రెంటిస్ ఖాళీలు

* ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం అప్రెంటిస్ ఖాళీలు: 4,014 (సదరన్ సెక్టార్లోని కాకినాడలో 51, రాజమండ్రిలో 306 ఉన్నాయి).

* అర్హత: సంబంధిత ట్రేడులో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.

* వయసు: 28. 03. 2019 నాటికి 18-24 సంవత్సరాల మధ్య ఉండాలి.

* ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.

* ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 28

వెబ్ సైట్: www.ongcindia.com


ONGC Oil and Natural Gas Corporation Recruitment 2019 - Apply Online for 4014 Apprentice Posts



Employees State Insurance Corporation (ESIC) -Telangana Region - Stenographer,  Upper division Clerk Vacancies

Employees State Insurance Corporation (ESIC) -Telangana Region - Stenographer, Upper division Clerk Vacancies

ఈఎస్ఐసీ తెలంగాణ రీజియన్ *ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) తెలంగాణ రీజియన్ లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 

* పోస్టులు-ఖాళీలు: స్టెనోగ్రాఫర్-21, అప్పర్ డివిజన్ క్లర్క్-112. 

* అర్హత: ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంగ్లిష్/ హిందీ స్టెనోగ్రఫీ, కంప్యూటర్ పరిజ్ఞానం. 

* వయసు: 15.04.2019 నాటికి 18 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి. 

* ఎంపిక: రాతపరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీ | టెస్ట్ ఆధారంగా, 

* ఆన్ లైన్ దరఖాస్తు: మార్చి 18 నుంచి ఏప్రిల్ 15 వరకు. 

వెబ్ సైట్: www.csic.nic.in
Junior Assistant cum Typist Vacancies in Acharya N G Ranga University,  Guntur

Junior Assistant cum Typist Vacancies in Acharya N G Ranga University, Guntur

జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్
గుంటూరులోని ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యా లయం- జూనియర్ అసి స్టెంట్ కం టైపిస్ట్ ఉద్యో గాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: కంప్యూటర్ అప్లికేషన్స్ విభాగంలో డిగ్రీ/ డిప్లొమా ! బీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. లేదా డిగ్రీ(కంప్యూ |
ఖాళీలు టర్ సైన్స్) చేసి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్లో లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణులై 115 ఉండాలి. 

వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, ప్రధాన పరీక్ష ఆధా రంగా. 

దరఖాస్తు ఫీజు: రూ.1500 (ఎస్సీ) ఎస్టీ/ దివ్యాంగులకు రూ.750) 

ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 7 

వెబ్ సైట్: www.angrau.ac.in
AP Special DSC 2019- 602 Teacher Vacancies

AP Special DSC 2019- 602 Teacher Vacancies

ఏపీలో 602 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు ఆంద్రప్రదేశ్ లో ప్రత్యేక విద్య పాఠశాల సహాయకుల పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) కలిపి నిర్వహించనున్నారు.
వీజయనగరం- 41, విశాఖపట్నం - 34, * తూర్పు గోదావరి- 52, పశ్చిమ గోదావరి 1) 48, కృష్ణా- E, గుంటూరు 50, ప్రకాశం
S), నెలూరు , కడప- JE, చిత్తూరు
57, అనంతపురం- 55, కర్నూలు - 48,

మొత్తం పోస్టులు: 602 

అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ(జనరల్)తో పాటు ప్రత్యేక విద్యలో డిపాష/ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఉత్తీర్ణత. 

వయసు: 18 నుంచి 44 ఏళ్ళ మధ్య ఉండాలి. 

దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11 వరకు

 ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: మార్చి 12. 

టెట్ కం వీఆర్టీ నిర్వహణ: మే 15 

వెబ్ సైట్: https://schooledu.ap.gov.in/DSENEW/
ఏపీ వైద్యారోగ్య శాఖలో 1900 పోస్టులు (చివరితేది: 20.02.19)

ఏపీ వైద్యారోగ్య శాఖలో 1900 పోస్టులు (చివరితేది: 20.02.19)

*ఏపీ వైద్యారోగ్య శాఖలో 1900 పోస్టులు (చివరితేది: 20.02.19)*

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం బహుళ ప్రయోజన ఆరోగ్యకార్యకర్త (ఎంపీహెచ్‌ఏ-ఉమెన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* ఏఎన్‌ఎం/ బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్త-మహిళలు (ఎంపీహెచ్‌ఏ)

*మొత్తం పోస్టుల సంఖ్య: 1900.*

జిల్లాలు-ఖాళీలు:
1) శ్రీకాకుళం: 52
2) విజయనగరం: 29
3) విశాఖపట్నం: 150
4) తూర్పు గోదావరి: 227
5) పశ్చిమ గోదావరి: 193
6) కృష్ణా: 168
7) గుంటూరు: 242
8) ప్రకాశం: 99
9) నెల్లూరు: 176
10) చిత్తూరు: 182
11) కడప: 97
12) అనంతపురం: 140
13) కర్నూలు: 145
అర్హత: ఎస్సెస్సీ ఉత్తీర్ణతతోపాటు 18/24 నెలల ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌) (లేదా) రెండేళ్లఇంటర్మీడియట్‌ వొకేషనల్‌ మల్టీ పర్సస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌), ప్రభుత్వాసుపత్రుల్లో ఏడాదిక్లినికల్‌ శిక్షణ పూర్తి చేసుండాలి.
వయఃపరిమితి: 01.02.2019 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఒప్పంద పద్ధతిలోఎంపీహెచ్‌ఏగా పనిచేస్తున్నవారికి వెయిటేజీ ఇవ్వనున్నారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. దరఖాస్తులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
ఫీజు: రూ.300.
చివరితేది: 20.02.2019.
చిరునామా: పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికార్యాలయాలకు పంపాలి
ఏపీ గురుకులాల్లో 750 పోస్టులు

ఏపీ గురుకులాల్లో 750 పోస్టులు

ఏపీ గురుకులాల్లో 750 పోస్టులు ఆంధ్రప్రదేశ్ లోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. టీజీటీ, కేర్ టేకర్ తదితర పోస్టులను ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ భర్తీ చేయనుంది. 

పోస్టులు-ఖాళీలు: డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్-04, ప్రిన్సిపల్ (గ్రేడ్ 2)-21, టైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)- 552, కేర్ టేకర్ (వార్డెన్)-167. 

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ఫీజు: రూ. 500 గమనిక: టీజీటీ సబ్జెక్టులవారీ ఖాళీలు, అర్హతలు, పరీక్షా విధానం, దరఖాస్తు తేదీలు తదితర పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడవచ్చు. 

వెబ్ సైట్: https://jnanabhumi.ap.gov.in/
సీడ్యాక్, నోయిడా సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్), నోయిడా కింది కాంట్రాక్టు పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్ మేనేజర్-03, ప్రాజెక్ట్ ఇంజినీర్-69, ప్రాజెక్ట్ ఆఫీసర్-04. 

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత, అనుభవం. 

ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ , ఆన్ లైన్ టెస్ట్, మల్టీ లెవల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్ లైన్. దరఖాస్తు ఫీజు: రూ. 500. 

చివరితేదీ: ఫిబ్రవరి 25 వెబ్ సైట్: https://cdac.in/
Steal Authority of India -72 Various Vacancies

Steal Authority of India -72 Various Vacancies

సెయిల్లో 72 పోస్టులు

 స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయి ల్) వివిధ కాల రీస్ డివిజన్లలో ఖాళీగా ఉన్న 72
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

• విభాగాలు: ఓవర్ మ్యాన్-19, మైనింగ్ సిద్దా
ర్-52, సర్వేయర్-1.. -

 అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం, నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. • 

వయసు: మార్చి 10, 2019 నాటికి 28 ఏళ్లు
మించకూడదు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడ లింపు ఉంటుంది. 

ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా. 

• దరఖాస్తు విధానం: ఆన్ లైన్లో.

 - దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు ఓవర్ మ్యాన్, సర్వేయర్ పోస్టులకు రూ.250, మైనింగ్ సిర్ధార్ పోస్టులకు రూ.150. (రిజర్వేషన్ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు). 

- దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 10, 2019. 

వెబ్సైటు: www.sailcareers.com