Showing posts with label Govt Jobs. Show all posts
Showing posts with label Govt Jobs. Show all posts
Lic Housing Finance - Assistant Manager, Assistant,  Associatte Vacancies

Lic Housing Finance - Assistant Manager, Assistant, Associatte Vacancies

🔳🔳ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌

ఎల్‌ఐసీ అనుబంధ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌... దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 300

పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌-125, అసోసియేట్‌-75, అసిస్టెంట్‌ మేనేజర్‌-100.

అర్హత: గ్రాడ్యుయేషన్‌, సీఏ-ఇంటర్‌, ఎంబీఏ/ ఎంఎంఎస్‌/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ పీజీపీఎం/ పీజీడీఎం ఉత్తీర్ణత.
వయసు: 21-28 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్ష తేది: అక్టోబరు 9, 10 


ఆన్‌లైన్‌ దరఖాస్తు: ఆగస్టు 8 నుంచి 26 వరకు


వెబ్‌సైట్‌: http://lichousing.com/
క్లర్కు కొలువులకు ఎస్‌బీఐ పిలుపు  8,904 పోస్టులకు ప్రకటన విడుదల

క్లర్కు కొలువులకు ఎస్‌బీఐ పిలుపు 8,904 పోస్టులకు ప్రకటన విడుదల

🔲క్లర్కు కొలువులకు ఎస్‌బీఐ పిలుపు
8,904 పోస్టులకు ప్రకటన విడుదల



ప్రపంచంలోని తొలి వంద అతి పెద్ద బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒకటి. మన దేశంలో ఇదే అన్నిటి కంటే పెద్దది. సాధారణ డిగ్రీ అర్హతతో ఆ అత్యున్నత బ్యాంకులోకి ఉద్యోగిగా అడుగుపెట్టే అవకాశం ఈ సంవత్సరానికి మళ్లీ వచ్చింది. దాదాపు తొమ్మిది వేల క్లర్కుల (జూనియర్‌ అసోసియేట్స్‌) ఖాళీలతో ప్రకటన వెలువడింది. రెండు వారాల్లో బ్యాంకు ఉద్యోగార్థులకు ఇది రెండో తీపికబురు. ఇటీవల రెండువేల పీవో పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చింది. ఇప్పుడు క్లర్కులు. అభ్యర్థులు పరీక్ష స్వరూపాన్ని, అందుబాటులో ఉన్న సమయాన్ని, తమ బలాలు, బలహీనతలను దృష్టిలో ఉంచుకొని సరైన ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగిస్తే విజయాన్ని సాధించవచ్చు.

ఎస్‌బీఐ దేశవ్యాప్తంగా 8904 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులను (251 బ్యాక్‌లాగ్‌లతో కలిపి) భర్తీ చేయనుంది. వాటిలో తెలంగాణ రాష్ట్రంలో 425, ఆంధ్రప్రదేశ్‌లో 253 పోస్టులు ఉన్నాయి. నియామకాలను రాష్ట్రాల వారీగా చేపడతారు. అభ్యర్థులు ఏ రాష్ట్రానికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఆ రాష్ట్రంలోనే రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు అక్కడి భాష (లోకల్‌ లాంగ్వేజి) పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం
ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు, అభ్యర్థులు ఎంపిక చేసుకునే లోకల్‌ లాంగ్వేజిపై నిర్వహించే టెస్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ప్రిలిమ్స్‌ పరీక్షలో ప్రతిభ చూపే అభ్యర్థుల్లో పోస్టుల సంఖ్యకు 10 రెట్ల మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో సాధించిన మార్కులతో  మెరిట్‌ లిస్ట్‌ తయారుచేస్తారు.

ఉమ్మడి ప్రిపరేషన్‌
ఎస్‌బీఐ పీఓ, క్లర్క్‌ పరీక్షలు రెండింటికీ కలిపి ఉమ్మడిగా ఒకటే ప్రిపరేషన్‌ సరిపోతుంది. పీఓకు ప్రిపేర్‌ అయితే క్లర్క్‌ పరీక్షకు సన్నద్ధమైనట్లే.  ఎస్‌బీఐ పీఓ మెయిన్స్‌ పరీక్షలోని ప్రశ్నల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్షకు సంబంధించినంత వరకు పెద్ద తేడాలు లేవు. దాదాపు ఒకేలా ఉంటున్నాయి. మెయిన్స్‌ పరీక్షలో మాత్రం రెండింటికీ చాలా భేదం ఉంటుంది. క్లర్క్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష జూన్‌ నెల చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. అంటే రెండు నెలలకు పైగా సమయం ఉంటుంది. ఈలోగా ప్రిపరేషన్‌ పూర్తి చేయాలి. పీఓ, క్లర్క్‌ పరీక్షలు రెండింటిని రాస్తున్న అభ్యర్థులు మాత్రం జూన్‌ 8న నిర్వహించే పీఓ ప్రిలిమ్స్‌ నాటికి తమ ప్రిపరేషన్‌ పూర్తయ్యేలా ప్రణాళికను తయారు చేసుకోవాలి. రెండు పరీక్షలకు సంబంధించి గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్నల స్థాయి పట్ల అవగాహన ఏర్పడుతుంది. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులను కవర్‌ చేస్తూ,  ఒక మోడల్‌ పేపర్‌ ప్రాక్టీస్‌ చేయాలి. దీని వల్ల పరీక్ష రాసే పద్ధతికి అలవాటు పడతారు. మొదటసారి పరీక్ష రాసే అభ్యర్థులకు ఇది చాలా అవసరం. మూడు లేదా నాలుగు నెలలు అంకితభావంతో శ్రమిస్తే దేశంలోని నెంబర్‌ వన్‌ బ్యాంక్‌లో ఉద్యోగం ఖాయం.

సాధన చేస్తే.. విజయం మనదే!

బీటెక్‌ పూర్తికాగానే బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపరేషన్‌ మొదలు పెట్టాను. దాదాపు ఏడాదిన్నరపాటు కోచింగ్‌ తీసుకుంటూ నిరంతరం శ్రమించాను. మొదటిసారి ఎస్‌బీఐ పీఓ ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. కానీ సెలక్షన్‌ రాలేదు. ఎస్‌బీఐ క్లర్క్స్‌కు మరింత జాగ్రత్త పడ్డాను.  93.5 (తెలంగాణ), 92.8 (ఆంధ్రప్రదేశ్‌) స్కోర్‌తో విజయం సాధించాను. ఒత్తిడికి లోనవకుండా ప్రణాళిక ప్రకారం చదివితే బ్యాంకు ఉద్యోగం కష్టమేమీ కాదు. మొదటి మూడునాలుగు నెలల పాటు రోజుకు 7 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించాను. ఆ తర్వాత రోజుకు గంటన్నర మాత్రమే సాధన చేసేవాడిని. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలను ప్రతిరోజూ సాధన చేశాను. దీన్ని స్కోరింగ్‌ సబ్జెక్టుగా పెట్టుకున్నాను. రీజనింగ్‌ కోసం ఎక్కువ సమయం కేటాయించాను. ఇంగ్లిష్‌, కరెంట్‌ అఫైర్స్‌ కోసం రోజూ న్యూస్‌ పేపర్లను చదివాను. బ్యాంకు పరీక్షలకు సాధనే కీలకమైంది. ఒక్క రోజు కూడా మిస్సవ్వకుండా ప్రాక్టీస్‌ చేయాలి. బ్యాంకు మేనేజర్‌ స్థాయికి ఎదగడం నా జీవిత లక్ష్యం.

- ఏలేటి పృథ్వీ తేజ; మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా
గెలిచే వరకు అలిసి పోవద్దు!

చిన్నప్పటి నుంచి బ్యాంకింగ్‌ రంగంలో రాణించాలన్న తపన ఉండేది. బీటెక్‌ పూర్తవగానే మొదట అమ్మానాన్నపై ఆధారపడ కూడదని లెక్చరర్‌గా కాలేజీలో చేరాను. తర్వాత పని చేస్తూనే మూడేళ్లపాటు బ్యాంకు పరీక్షలకు సిద్ధమయ్యాను.  సుమారు పదిహేను పరీక్షలు రాశాను. ఉత్తీర్ణత సాధించలేకపోయినా నిరుత్సాహపడకుండా రాస్తూనే ఉన్నాను.  92.5 (తెలంగాణ), 93.75 (ఆంధ్రప్రదేశ్‌) స్కోర్‌తో ఎస్‌బీఐ క్లర్క్స్‌లో విజయం సాధించాను. ఉద్యోగానికి ఎంపికయ్యాను. రోజుకు ఆరు గంటలపాటు అన్ని సబ్జెక్టులను సాధన చేసేవాడిని. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మిగిలిన విభాగాలను ప్రతిరోజూ చదివేవాడిని. జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ కోసం హిందూ న్యూస్‌పేపర్‌ రోజూ చదివాను. ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునేవారికి న్యూస్‌ పేపర్‌ పఠనం ముఖ్యం. కష్టపడి ప్రయత్నిస్తే బ్యాంకు ఉద్యోగం సాధించడం సులభమే. బ్యాంకింగ్‌ రంగంలో అత్యున్నత స్థాయికి చేరాలన్నదే నా లక్ష్యం.

- బొల్లం వీరనాగబాబు; పటవల, కాకినాడ
లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌



మెరిట్‌ లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న లోకల్‌ లాంగ్వేజిని పదో తరగతి లేదా పన్నెండో తరగతిలో చదివి ఉంటే లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌ రాయాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం లోకల్‌ లాంగ్వేజి టెస్ట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. మెయిన్స్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్‌ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
10 తప్పులు.. చేయవద్దు!

ప్రిపరేషన్‌ సమయంలో అభ్యర్థులు చాలా పొరపాట్లు చేస్తుంటారు. అలాంటి వాటిలో ముఖ్యమైన పది పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడితే విజయానికి చేరువకావచ్చు.
1 సరైన ప్రణాళిక లేదా టైమ్‌-టేబుల్‌ లేకపోవడం: పరీక్ష తేదీ వరకు ఉన్న సమయం, సబ్జెక్టులు, దేనికి ఎంత సమయం కేటాయించాలి మొదలైన వాటి పట్ల అభ్యర్థికి స్పష్టమైన అవగాహన ఉండాలి. దానికి అనుగుణంగా స్వీయ ప్రణాళిక వేసుకొని తప్పనిసరిగా ఆచరించాలి.

2 కొన్ని సబ్జెక్టులపైనే దృష్టి కేంద్రీకరించడం: పరీక్షలో అభ్యర్థులు అన్ని సబ్జెక్టుల్లోనూ కనీస మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. తమకు నచ్చిన ఏవో కొన్నింటి పైనే ఎక్కువ దృష్టిపెడితే మిగిలిన సబ్జెక్టుల్లో నష్టం జరగవచ్చు.

3 పరిమాణంపై దృష్టి పెట్టి, నాణ్యతను విస్మరించడం: కొంతమంది రోజుకు 16 లేదా 18 గంటలు చదివాం అంటుంటారు. ఎన్ని గంటలు సిద్ధమైనా ఎంత నేర్చుకున్నారన్నదే ముఖ్యం. గంటలకు గంటలు సమయం గడిపి బాగా ప్రిపేర్‌ అవుతున్నాం అనుకోకూడదు. ఈ రోజు ఎంత నేర్చుకున్నారో కచ్చితంగా పరిశీలించుకోవాలి.

4 రివిజన్‌ చేయకపోవడం: అభ్యర్థులు తాము నేర్చుకున్న టాపిక్స్‌ అన్నింటినీ ఎప్పటికప్పుడు రివిజన్‌ చేయాలి. రివిజన్‌ చేయకపోతే చదివింది సరిగా గుర్తుకు రాక మార్కులు కోల్పోవాల్సి ఉంటుంది.

5 తాజా మోడల్‌ ప్రశ్నలకు, ట్రెండ్‌కు అనుగుణంగా ప్రిపరేషన్‌ లేకపోవడం: ప్రతి పరీక్షలోనూ ఎంతో కొంత మార్పు కనిపిస్తుంటుంది. గత పరీక్షలను పరిశీలించి  ప్రిపేర్‌ కావాలి. అదే సిలబస్‌, అవే ప్రశ్నలు అంటూ పరీక్ష సరళిని గమనించకుండా సాగితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

6 ప్రిలిమ్స్‌ పూర్తయ్యాక మెయిన్స్‌కు ప్రిపేరవడం: ప్రిలిమ్స్‌ అయిన తర్వాత మెయిన్స్‌ సంగతి చూద్దామని కొందరు అనుకుంటారు. అప్పుడు సమయం సరిపోక ఫెయిల్‌ అవుతారు. అందుకే ప్రిలిమ్స్‌, మెయిన్స్‌కు ఏకకాలంలో ప్రిపరేషన్‌ ఉండాలి. కామన్‌ టాపిక్స్‌ నుంచి మొదలు పెట్టాలి.

7 ఆన్‌లైన్‌ మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేయకపోవడం: పరీక్షలు ఆన్‌లైన్‌ పద్ధతిలోనే ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా ప్రాక్టీస్‌ చేయాలి. దానివల్ల అసలు పరీక్ష సమయంలో ఎలాంటి తడబాటు లేకుండా ఉంటుంది.

8 మోడల్‌ పేపర్‌ విశ్లేషించుకోకపోవడం: అభ్యర్థులు మోడల్‌ పేపర్‌ రాసిన తర్వాత దాన్ని విశ్లేషించుకోవాలి. ఎందులో వెనుకబడి ఉన్నారో గమనించాలి. మెరుగుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రిపరేషన్‌ గుడ్డిగా సాగకూడదు.

9 ఇంగ్లిష్‌ సబ్జెక్టుపై అశ్రద్ధ: ఇది ఎక్కువ మంది అభ్యర్థులు చేసే పొరపాటు.  తెలిసిన భాషే కదా అని అశ్రద్ధ చేస్తారు. భాష తెలిసి ఉండటానికి, దానిలో అడిగే ప్రశ్నలకు తేేడా ఉంటుంది. అందుకే ఈ సబ్జెక్టుకు ప్రత్యేకంగా ప్రిపరేషన్‌ అవసరమే.

10 షార్ట్‌కట్స్‌ నేర్చుకోకపోవడం: సంప్రదాయ పద్ధతిలో ప్రశ్నలు సాధించడం వల్ల సమయం ఎక్కువ పడుతుంది. సంక్షిప్త పద్ధతుల (షార్ట్‌కట్స్‌) వల్ల తక్కువ టైమ్‌లో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టవచ్చు. వాటిని నేర్చుకోకపోతే నష్టపోతారు.

- జి.ఎస్‌. గిరిధర్‌
ముఖ్యాంశాలు

మొత్తం పోస్టులు: 8,904 (251 బ్యాక్‌లాగ్‌ ఖాళీలతో కలిపి)
అర్హత: ఏదైనా డిగ్రీ (డిగ్రీ చివరి సంవత్సరం/ చివరి సెమిస్టర్‌ అభ్యర్థులు కూడా అర్హులే)
వయసు: 01.04.2019 నాటికి 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ఫీజు చెల్లింపునకు చివరి తేది: 03.05.2019
పరీక్ష: ప్రిలిమ్స్‌ -జూన్‌లో, మెయిన్స్‌ - జులైలో
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: తెలంగాణ - హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.
ఆంధ్రప్రదేశ్‌ - చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
https://bank.sbi/careers/
https://www.sbi.co.in/careers/

IVRI Recruitment 2019-20: Apply Online for 34 Assistant Vacancies

ఐవీఆర్ఐలో అసిస్టెంట్ పోస్టులు 

* ఇజ్జత్నగర్ (ఉత్తర్ ప్రదేశ్)లోని ఐకార్ - ఇండియన్ వెటర్నరీ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఐవీఆర్ఐ) డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పద్దతిలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* పోస్టు: అసి స్టెంట్

* ఖాళీలు: 34

* అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

* వయసు: 15. 05, 2018 నాటికి 20 - 27 సంవత్సరాల | మధ్య ఉండాలి.

* ఎంపిక: ఆన్ లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆధారంగా.

* దరఖాస్తు: ఆఫ్లైన్.

* చివరితేదీ: ఏప్రిల్ 30

వెబ్ సైట్: www.ivri.nic.in



IVRI Recruitment 2019-20: Apply Online for 34 Assistant Vacancies



IITM Pune Jobs 2019: 15 Project Assistant, Project Scientist , Scientific Assistant Posts

ఐఐటీఎంలో ప్రాజెక్టు సైంటిస్టులు

* పుణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం) షార్ట్ టర్న్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్-05, సైంటిఫిక్
అసిస్టెంట్-03, ప్రాజెక్ట్ అసి స్టెంట్-07.

* అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంటెక్, |ఎంఎస్సీ, పీహెచ్డీ, అనుభవం.

* ఎంపిక: ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా.

* ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 5

వెబ్ సైట్: www.tropmet.res.in

IITM Pune Jobs 2019: 15 Project Assistant, Project Scientist , Scientific Assistant Posts



Indian Navy - Permanent Commission Officer & Short Commission Officer Notification 2019 – 53 Vacancies

ఇండియన్ నేవీలో ఎస్ ఎస్ సీ ఆఫీసర్లు

* ఇండియన్ నేవీ అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఎస్ఎససీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* పోస్టు: షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్/ పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్

* ఖాళీలు: 53

* విభాగాలవారీ ఖాళీలు: అబ్జర్వర్-06, పైలట్-08,
లాజిస్టిక్స్-15, ఎడ్యుకేషన్-24.

* అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఏ,
ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ, బ్యాచిలర్ డిగ్రీతోపాటు పీజీ డిప్లొమా, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

ఎంపిక: ఎస్ఎస్ఓ ఇంటర్వ్యూ, పీఏబీటీ (పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్), మెడికల్ టెస్ట్ ఆధారంగా.

* ఆన్ లైన్ దరఖాస్తుకు చివరితేది: ఏప్రిల్ 5

వెబ్ సైట్: www.joinindiannavy.gov.in

Indian Navy - Permanent Commission Officer & Short Commission Officer Notification 2019 – 53 Vacancies



National Fertilizers Limited (NFL) Recruitment 2019, Apply Online for 40 Marketing Representative Vacancies

National Fertilizers Limited (NFL) Recruitment 2019, Apply Online for 40 Marketing Representative Vacancies


ఎన్ఎఫ్ఎల్లో మార్కెటింగ్ పోస్టులు

* నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్ ఎఫ్ఎల్)...దేశవ్యాప్తంగా మార్కెటింగ్ డివిజన్లు/ యూనిట్లు/ ఆఫీసుల్లో కింది రెగ్యులర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* పోస్టు: మార్కెటింగ్ రిప్రజెంటేటివ్

* ఖాళీలు: 40

* అర్హత: 50 శాతం మార్కులతో బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణత.

* వయసు: 28.02.2019 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.

* ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఆధారంగా.

* ఆన్లైన్ దరఖాస్తు: మార్చి 18 నుంచి ఏప్రిల్ 18  వరకు,

వెబ్ సైట్: www.nationalfertilizers.com



National Fertilizers Limited (NFL) Recruitment 2019, Apply Online for 40 Marketing Representative Vacancies





Central Electronics Limited - Recruitment of Graduate Engineers on Contract Basis

Central Electronics Limited - Recruitment of Graduate Engineers on Contract Basis


సీఈఎల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు
* సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (సీఈఎల్) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* పోస్టులు: గ్రాడ్యుయేట్ ఇంజినీర్లు

* అర్హత: సంబంధిత బ్రాంచీల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.

* వయసు: 21 సంవత్సరాలు మించకూడదు.

* ఎంపిక విధానం: గేట్ - 2019 స్కోరు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా..

* ఆన్లైన్ దరఖాస్తు: మార్చి 11 నుంచి ఏప్రిల్ 16 వరకు.

వెబ్ సైట్: www.celindia.co.in

Central Electronics Limited - Recruitment of Graduate Engineers on Contract Basis



AP Vijayawada Mangalagiri AIIMS Recruitment - Various Vacancies

AP Vijayawada Mangalagiri AIIMS Recruitment - Various Vacancies

విజయవాడ మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇనిస్టి ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) - కింది ఉద్యో గాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

ఉద్యోగాలు: ప్రొఫెసర్లు, అడిషనల్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగాలు,
సీనియర్ రెసిడెంట్లు


బోధన విభాగాలు: ఫోరెన్సిక్ మెడిసిన్, ఖాళీలు మైక్రో బయాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, అనెస్తీషియాలజీ, డెర్మటాలజీ, ఇఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, గైనకాలజీ, ఆప్త ల్మాలజీ, ఆర్థోపీడిక్స్, పీడి యాట్రిక్స్ విద్యా-విజాన-వార్తా సమాచారం గ్రూప్స్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఎల్డీసీ, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రా ఫర్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్, వార్డెన్ మేల్), మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ (గ్రేడ్ 1) 

సీనియర్ రెసిడెంట్ విభాగాలు: ఆప్తాల్మాలజీ, డెంటిస్ట్రీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: బోధన విభాగాల్లో మొదటి నాలుగింటికి మార్చి 15 కాగా మిగిలిన విభాగాలకు ఏప్రిల్ 15. నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మే 1. సీనియర్ రెసిడెంట్లకు మార్చి 13 

ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మొదటి నాలుగు విభాగాలకు ఏప్రిల్ 30, మిగిలిన విభాగాలకు అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలకు మే 30. సీనియర్ రెసిడెంట్లకు మార్చి 23 

వెబ్ సైట్: www.aiimsmangalagiri.edu.in
AP Transco - Assist Executive Engineer - 171 Vacancies

AP Transco - Assist Executive Engineer - 171 Vacancies

ఏపీ ట్రాన్స్క్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్కో )- అసిస్టెంట్ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

జోన్లవారీ ఖాళీలు: విశాఖపట్నం 54, విజయవాడ 38, కడప 79

విభాగం: ఎలక్ట్రికల్ 

అర్హత: బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ. 500 

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 26 ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరుతేదీ: ఏప్రిల్ 25. 

వెబ్ సైట్: www.aptransco.gov.in
Telangana High Court Civil Judge - 67 Vacancies

Telangana High Court Civil Judge - 67 Vacancies

హైదరాబాద్లోని తెలంగాణ హైకోర్టు క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టు-ఖాళీలు: సివిల్ జడ్జి  - 67 (ఇందులో 13 ఖాళీలను బదిలీ ద్వారా భర్తీ చేస్తారు) 

అర్హత: తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్ & కేడర్ రూల్స్-2017 ఆధారంగా, 

వయసు: 55 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక విధానం: సీనింగ్ టెస్ట్ దాత, మౌఖిక పరీక్షల ఆధారంగా, 

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తేదీలు: 16.3 19 నుంచి 15.4.19

కంప్యూటర్ ఆధారిత ప్రాథమిక పరీక్ష తేది: 11.05.2019.

 వెబ్ సైట్: http://fic ts.nic.in/
Railway Recruitment 2019- 103768 Level1 Vacancies

Railway Recruitment 2019- 103768 Level1 Vacancies

రైల్వేలో 1,03,769 లెవల్ 1 పోస్టులు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 103,769 లేవల్ 1 పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(ఆర్ఆర్స్) దరఖాస్తులు కోరుతోంది.

 పోస్టులు: అసిస్టెంట్ (వర్క్ షాప్), సి సైంట్ ట్రేడ్ అసిస్టెంట్ సీ అండ్ డబ్యూ, అసిస్టెంట్ డిపోల్ (సోర్స్), అసిస్టెంట్ లో , షెడ్(డీజిల్, ఎలక్ట్రికల్), అసి స్టెంట్ ఆపరేషన్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ పాయింట్స్మన్, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం, ఆసీ నెంట్ ట్రాక్ మెషీన్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసి స్టెంట్ టీఆర్ ఓ, అసి స్టెంట్ వర్క్స్, హాస్పిటల్ అసిస్టెంట్, ట్రాక్ మెయింటైనర్ తదితరాలు. 

మొత్తం ఖాళీలు:
1,03,769 ఇదులో దక్షిణమధ్య రైల్వే జోన్,
సికింద్రాబాద్లో 9,328 ఖాళీలున్నాలు) 

అర్హత: పదో తరగతి లేదా ఐటీఐ/ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ ఉత్తీర్ణత,

 వయసు: 18-43 ఏళ్ల మధ్య ఉండాలి.

 ఎంపిక: కంప్యూటర్ అధారిత, శారీరక సామర్ద్య, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా, 

ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: 12, 04 2018. 

ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు చివరితేది: 23 04 2019. 

దరఖాస్తుల తుది సమర్పణ; 26.04.2019

కప్యూటర్ ఆధారిత పరీక్ష: సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో 

వెబ్ సైట్: http://rrbsecunderabad.nic.in/
Employees State Insurance Corporation (ESIC) -Telangana Region - Stenographer,  Upper division Clerk Vacancies

Employees State Insurance Corporation (ESIC) -Telangana Region - Stenographer, Upper division Clerk Vacancies

ఈఎస్ఐసీ తెలంగాణ రీజియన్ *ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) తెలంగాణ రీజియన్ లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 

* పోస్టులు-ఖాళీలు: స్టెనోగ్రాఫర్-21, అప్పర్ డివిజన్ క్లర్క్-112. 

* అర్హత: ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంగ్లిష్/ హిందీ స్టెనోగ్రఫీ, కంప్యూటర్ పరిజ్ఞానం. 

* వయసు: 15.04.2019 నాటికి 18 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి. 

* ఎంపిక: రాతపరీక్ష, కంప్యూటర్ స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీ | టెస్ట్ ఆధారంగా, 

* ఆన్ లైన్ దరఖాస్తు: మార్చి 18 నుంచి ఏప్రిల్ 15 వరకు. 

వెబ్ సైట్: www.csic.nic.in
LIC Administrative Officers  Recruitment 2019 - 590 Vacancies

LIC Administrative Officers Recruitment 2019 - 590 Vacancies

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఏఏవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

 * పోస్టు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏవో) 

* మొత్తం ఖాళీలు: 590

 విభాగాలవారీ ఖాళీలు: జనరలిస్ట్-450, ఐటీ-150, చార్జ్డ్ అకౌంటెంట్-50, యాక్చూరియల్-30, రాజభాష-10.

 * అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ,
సీఏ ఉత్తీర్ణత. 

* వయసు: 01.03. 2019 నాటికి 21-30 సంవత్సరాల
మధ్య ఉండాలి. 

* ఎంపిక: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, | వైద్య పరీక్షల ఆధారంగా,


 * దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 100,
మిగిలినవారికి రూ. 600. 

* ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపు: మార్చి 2 నుంచి 22 వరకు.


వెబ్ సైట్: https://www.licindia.in
Indian Oil Corporation Limited- 466 Apprentice Vacancies

Indian Oil Corporation Limited- 466 Apprentice Vacancies

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లిమిటెడ్ (ఐఓసీఎల్)- వివిధ రిఫైనరీల్లో 466 అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

విభాగాలు: ట్రేడ్ అప్రెంటిస్లు, టెక్నీషియన్ అప్రెంటిస్లు
ఖాళీలు 

అర్హత: విభాగాన్ని అనుసరించి దోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. లేదా డిప్లొమా లేదా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

వయసు: 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసుండాలి 
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఆన్లైన్ 

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 8 దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు 

ఆఖరు తేదీ: మార్చి 22 

వెబ్ సైట్: www.iocl.com
Indian Railways Notification 2019 - 130000 Various Vacancies

Indian Railways Notification 2019 - 130000 Various Vacancies

Indian Railways Notification 2019 - 130000 Various Vacancies

రైల్వేలో 1.30 లక్షల ఖాళీలు 

దేశ వ్యాప్తంగా దక్షిణ మధ్య రైల్వే సహా ఇతర జోన్లలో 1.30 లక్షల ఉద్యోగాల భర్తీకి ఇండియన్ రైల్వే దరఖాస్తులు - కోరుతోంది. రైల్వే రిక్రూట్ మెంట్ జోరు (ఆర్ఆర్టీ), రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ (ఆర్ఆర్)ల ద్వారా వీటిని భర్తీ చేస్తారు. త్వరలో నియమణాలు చేపడతామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. 

పోస్టులు: నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ(ఎస్టీపీసీ) - జూనియర్ క్లర్క్ కు టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్, ట్రెయిన్ క్లర్క్, కమర్షియల్ కం టికెట్ క్లర్క్స్ ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, స్టేషన్ మాస్టర్ తదితరాలు. - పారా మెడికల్ స్టాఫ్- స్టాఫ్ నర్స్ ఫార్మాసిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ సూపరింటెండెంట్ తదితరాలు - మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ- స్టెనోగ్రాఫర్, చీఫ్ లా అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ తదితరాలు, ఆ లెవల్ 1- ట్రాక్ మెయింటైనర్, గేట్ మ్యాన్, పాయింట్స్ మ్యాన్, హెల్పర్, పోర్టర్ తదితరాలు. 

మొత్తం ఖాళీలు: 1,30,000 ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఎన్టీపీసీ పోస్టులకు ఫిబ్రవరి 28, పారామెడికల్ కు- మార్చి 1, మినిస్టీరియల్-కు- మాచ్చి 8, లెవల్ 1 ఖాళీలకు మార్చి 12. 

అర్హత, వయసు, ఎంపిక తదితర వివరాలకు ఎంప్లాయిమెంట్ న్యూస్ (2018, ఫిబ్రవరి 28- మార్చి 1) చూడవచ్చు
AP Special DSC 2019- 602 Teacher Vacancies

AP Special DSC 2019- 602 Teacher Vacancies

ఏపీలో 602 ప్రత్యేక ఉపాధ్యాయ పోస్టులు ఆంద్రప్రదేశ్ లో ప్రత్యేక విద్య పాఠశాల సహాయకుల పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ఈ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) కలిపి నిర్వహించనున్నారు.
వీజయనగరం- 41, విశాఖపట్నం - 34, * తూర్పు గోదావరి- 52, పశ్చిమ గోదావరి 1) 48, కృష్ణా- E, గుంటూరు 50, ప్రకాశం
S), నెలూరు , కడప- JE, చిత్తూరు
57, అనంతపురం- 55, కర్నూలు - 48,

మొత్తం పోస్టులు: 602 

అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ(జనరల్)తో పాటు ప్రత్యేక విద్యలో డిపాష/ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఉత్తీర్ణత. 

వయసు: 18 నుంచి 44 ఏళ్ళ మధ్య ఉండాలి. 

దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11 వరకు

 ఆన్లైన్ దరఖాస్తు చివరితేది: మార్చి 12. 

టెట్ కం వీఆర్టీ నిర్వహణ: మే 15 

వెబ్ సైట్: https://schooledu.ap.gov.in/DSENEW/
UPSC - Civil,  Forest Services Notification 2019

UPSC - Civil, Forest Services Notification 2019

UPSC - Civil,  Forest Services Notification 2019


యూపీఎస్సీ- సివిల్, ఫారెస్ట్ సర్వీసుల్లో 986 పోస్టులు కేంద్రంలోని వివిధ సర్వీసుల్లో 896 సివిల్స్, ఫారెస్ట్ సర్వీసులో 90 ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన జారీచేసింది. 

అర్హత: సివిల్ సర్వీసెకు ఏదైనా డిగ్రీ, ఐఎఫ్ఎస్క యానిమల్ హజ్బెండరీ
/ వెటర్నరీ సైన్స్ బోటనీ/ కేమి జియాలజీ/ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్/ స్టాటిస్టిక్స్/ జువాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఆగ్రికల్చరల్/ ఫారెస్ట్రీ/ ఇంజినీరింగ్ లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. ఆఖరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న వారూ ఆర్హులే. 

వయసు: ఆగస్టు 1, 2019 నాటికి 21-22 ఏళ్ల మధ్య ఉండాలి(ఎస్సీ, ఎస్టీలకు ఐదేళస్ట్, కబీసీలకు మూడేళ్లు గరిష్టంగా సడలింపు ఉంటుంది), 

ఎంపిక: ప్రాథమిక, ప్రధాన పరీక్షలు, ఇంటర్వూం పర్సనాలిటీ బెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా,


 ఆన్లైన్ దరఖాస్తు చివరితేద: మార్చి 18, 

ప్రాథమిక పరీక్ష తేది: జూన్ 2 

తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, 

వెబ్ సైట్: https://upsc.gov.in/
ఏపీ వైద్యారోగ్య శాఖలో 1900 పోస్టులు (చివరితేది: 20.02.19)

ఏపీ వైద్యారోగ్య శాఖలో 1900 పోస్టులు (చివరితేది: 20.02.19)

*ఏపీ వైద్యారోగ్య శాఖలో 1900 పోస్టులు (చివరితేది: 20.02.19)*

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం బహుళ ప్రయోజన ఆరోగ్యకార్యకర్త (ఎంపీహెచ్‌ఏ-ఉమెన్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
* ఏఎన్‌ఎం/ బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్త-మహిళలు (ఎంపీహెచ్‌ఏ)

*మొత్తం పోస్టుల సంఖ్య: 1900.*

జిల్లాలు-ఖాళీలు:
1) శ్రీకాకుళం: 52
2) విజయనగరం: 29
3) విశాఖపట్నం: 150
4) తూర్పు గోదావరి: 227
5) పశ్చిమ గోదావరి: 193
6) కృష్ణా: 168
7) గుంటూరు: 242
8) ప్రకాశం: 99
9) నెల్లూరు: 176
10) చిత్తూరు: 182
11) కడప: 97
12) అనంతపురం: 140
13) కర్నూలు: 145
అర్హత: ఎస్సెస్సీ ఉత్తీర్ణతతోపాటు 18/24 నెలల ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌) (లేదా) రెండేళ్లఇంటర్మీడియట్‌ వొకేషనల్‌ మల్టీ పర్సస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌), ప్రభుత్వాసుపత్రుల్లో ఏడాదిక్లినికల్‌ శిక్షణ పూర్తి చేసుండాలి.
వయఃపరిమితి: 01.02.2019 నాటికి 42 ఏళ్లు మించకూడదు. ఒప్పంద పద్ధతిలోఎంపీహెచ్‌ఏగా పనిచేస్తున్నవారికి వెయిటేజీ ఇవ్వనున్నారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. దరఖాస్తులను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
ఫీజు: రూ.300.
చివరితేది: 20.02.2019.
చిరునామా: పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికార్యాలయాలకు పంపాలి