Showing posts with label polity. Show all posts
Showing posts with label polity. Show all posts
INDIAN CONSITUTION - PRESIDENT - ARTICLE 360 - PROVISIONS AS TO FINANCIAL EMERGENCY (రాష్ట్రపతి - ఆర్టికల్360 -  ఆర్థిక అత్యవసర పరిస్థితి)

INDIAN CONSITUTION - PRESIDENT - ARTICLE 360 - PROVISIONS AS TO FINANCIAL EMERGENCY (రాష్ట్రపతి - ఆర్టికల్360 - ఆర్థిక అత్యవసర పరిస్థితి)

 

రాష్ట్రపతి

దేశంలో తీవ్ర సంక్షోభం(ఆర్థిక సంక్షోభం) ఏర్పడిందని కానీ, దేశ ఆర్థిక స్థిరత్వం లోపిం చిందని కానీ, దేశ రుణగ్రస్థత పెరిగిందని కానీ రాష్ట్రపతి భావించినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తారు. రాష్ట్రపతి ప్రకటనను రెండు నెలల్లోగా సాధారణ మెజారిటీతో పార్ల మెంటు ఆమోదించాలి. ఆర్థిక అత్యవసర పరి స్థితిపై న్యాయసమీక్ష చేయవచ్చు.

పార్లమెంటు ఆమోదం: ఆర్థిక అత్యవసర పరిస్థితిని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. లోక్సభ రద్దయిన సందర్భంలో విధిస్తే ముందుగా దానిని రాజ్యసభ ఆమోదించాలి. లోక్సభ పునః సమావేశమైన 30 రోజుల్లోగా దానిని ఆమోదించాలి.

కాలపరిమితి: ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించిన తరువాత ఉపసం హరించే వరకూ కొనసాగుతుంది. దీనిని బట్టి రెండు అంశాలను అవ గాహన చేసుకోవచ్చు.

1. పార్లమెంటు ఉభయ సభలు సాధారణ మెజారిటీతో ఒకసారి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఆమోదిస్తే నిరవధికంగా అమలులో ఉంటుంది. దీనికి గరిష్ట కాలపరిమితి లేదు.

2. ప్రతి 'ఆరు' నెలలకు ఒకసారి పార్లమెంటు ఆమోదించాల్సిన అవ సరం లేదు.

ఇప్పటివరకు భారత్లో ఒక్కసారి కూడా ఆర్థిక అత్యవసర పరిస్థి తిని విధించలేదు.

ఉపసంహరణ: ఆర్థిక అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా ఉపసంహరించవచ్చు. దీనికి పార్లమెంటు ఆమోదం అవసరం లేదు.     

ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రభావం

కేంద్రం రాష్ట్రాలకు పొదుపు చర్యలు పాటించాలని మార్గదర్శకాలు సూచించవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు తగ్గించాలని సూచించవచ్చు. రాష్ట్రాల ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు ప్రవేశపెట్టమని సూచించవచ్చు. రాష్ట్రపతి మినహా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వేతనా లతో సహా అందరి వేతనాలను తగ్గించవచ్చు.

ఆర్థిక అత్యవసర పరిస్థితి వలన రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తి ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్.ఎం. కుంజ్రు భావిం చారు. దానికి సమాధానంగా డాక్టర్ అంబేడ్కర్ ఆర్థిక అత్యవసర పరిస్థితిని గురించి వ్యాఖ్యానించారు. 1933లో అమెరికా ఆర్థిక సంక్షో భాన్ని ఎదుర్కోవడానికి రూపొందించిన 'నేషనల్ రికవరీ యాక్ట్'తో దీనిని పోల్చవచ్చు అని చెబుతూ... ఆర్థిక, విత్త పరమైన ఆటంకా లను సమర్థమంతంగా ఎదుర్కోవడానికే 'ఆర్టికల్-360'ని రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు.

అత్యవసర అధికారాలపై ప్రముఖుల వ్యాఖ్యానాలు

Ø  'అసాధారణ పరిస్థితుల్లో అత్యవసర అధికారాలు రాజ్యాంగా నికి ఒక కవచం వంటివి. -మహావీర్ త్యాగి.

Ø  'ఆర్టికల్-356 రాష్ట్రాల తలలపై వేలాడే కేంద్రం కత్తి.. అంటే ప్రభుత్వాన్ని ఎప్పుడైనా వధించవచ్చును' - డి.కె.చటర్జీ

Ø  'అత్యవసర అధికారాల వలన రాష్ట్రపతి రాజ్యాంగపరమైన నియం తగా వ్యవహరించవచ్చు' - టి.టి.కృష్ణమాచారి.

Ø  'రాష్ట్రపతి పాలన అనేది కేంద్రప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలా టగా మారింది. గవర్నర్లు రాష్ట్రాల్లో కేంద్రం పాలువుగా మారారు'. - వి.ఆర్.కృష్ణయ్యర్.

Ø  'రాజ్యాంగంలో కేంద్రానికి రాష్ట్రాలపై సర్వ అధికారాలు ఇవ్వడం అనేది ఆశ్చర్యకరమై నది. అత్యవసర అధికారాలు మనదేశంలో అధికారయుత, నియంతృత్వ రాజ్యస్థాపనకు తోడ్పడేవిగా ఉన్నవి' - కె.టి.షా.

Ø  'ఒకవేళ రాష్ట్రపతి అధికారాలను నిజంగా ఉపయోగిస్తే రోజు ఒక అవమానకర, బాధాకరమైన రోజు అవుతుంది. అత్యవ సర అధికారాలను ఉపయోగించి నెలకొల్పే శాంతి స్మశానపు ప్రశాంతిని తలపిస్తుంది'. -హెచ్.వి. కామత్.

Ø  'అత్యవసర అధికారాలు, భారత రాజ్యాంగానికి శ్వాసనందించే మార్గాలు'. - అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్.

Ø  'రాజ్యాంగంలోని అత్యవసర పరిస్థితులు అవసరమైన చెడు' - టి.టి.కృష్ణమాచారి.

Ø  'ఆర్టికల్-356, రాష్ట్ర ప్రభుత్వాల రద్దు వంటి అంశాలు మన సమాఖ్య వ్యవస్థకు చేటు తెచ్చేవి' - పండిట్ హృదయనాథ్ కుంజ్రూ.

Ø  'అత్యవసర అధికారాలు రాజ్యాంగం ప్రకారమే రాష్ట్రపతిని నియం తగా మార్చే ప్రమాదమున్నది'- అలెన్ బ్లేడ్ హీల్

Ø  'అత్యవసర అధికారాలు మన రాజ్యాంగంపై జరిగే దోపిడీ వంటివి' - కె.ఎం. నంబియార్.

 

రాష్ట్రపతి పదవిపై ప్రముఖుల వ్యాఖ్యానాలు

 

Ø  రాష్ట్రపతి పదవి జాతీయ సమైక్యత, సమగ్రతలకు ప్రతీక. మన దేశ ప్రగతిలో రాష్ట్రపతి ముఖ్యపాత్రను పోషిస్తారు. - సర్వేపల్లి రాధాకృష్ణన్.

 

Ø  భారత్ పార్లమెంటరీ విధానం అనుసరిస్తున్నందున ప్రధాని నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే వ్యవహరించే రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి. - డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్.

 

Ø  భారత రాష్ట్రపతులందరూ ప్రధానమంత్రి యొక్క రాష్ట్రపతు తెలుగానే భావించాలి. - టి.ఎన్.శేషన్.

Ø  42,44 రాజ్యాంగ సవరణల తరువాత రాష్ట్రపతి స్థానం మరింత నామమాత్రంగా మిగిలిపోయింది. - ఎం.పి. జైన్

Ø రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలికి మిత్రునిగా, మార్గదర్శకు డిగా, తాత్వికుడిగా వ్యవహరిస్తారు.- డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్.

Ø  రాష్ట్రపతికి మన రాజ్యాంగం కల్పించిన విచక్షణాధికారాలను వినియోగించడం పైనే వారి స్థానం, ప్రాముఖ్యం ఆధారపడి ఉంటుంది. - ఎం.వి.లీ.

 

Ø  భారత రాష్ట్రపతి కొన్ని ప్రత్యేక అధికారాలను కలిగి ఉంటాడు. రాజ్యాంగ పరిరక్షకునిగా అవసరమైనప్పుడు తన విచక్షణను అనుసరించి నిర్వర్తిస్తాడు. - కె. సంతానం.

 

Indian Polity Bits for Competitive Exams in Telugu

Indian Polity Bits for Competitive Exams in Telugu

 *ఇండియన్ పాలిటి బిట్స్?* 

*🌺1.ప్రాథమిక హక్కులు అనే భావనను తొలుత ప్రతిపాదించిన వారు ?మోతిలాల్ నెహ్రూ నివేదిక* 


*🌺2.భారత రాజ్యాంగంలో బందీహాజర్ అధిలేఖను జారీ చేసే అధికారం  మాత్రమే ఉంది?సుప్రీం కోర్టు ,హైకోర్టులు* 


*🌺3.ప్రాథమిక హక్కులకు భంగం పరిచయమే చట్టమైనా డిలవరి అధికారం న్యాయస్థానాలకు కలదని భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన తెలియపరుస్తుంది?13 వ నిబంధన* 


*🌺4. ప్రాథమిక హక్కులకు సవరించే అధికారం ఎవరికి కలదు?పార్లమెంట్* 


*🌺5.హక్కులు ప్రాథమిక హక్కుల ను ప్రత్యేకంగా ప్రస్తావించలేదు కానీ సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో వీటిని సమర్పించింది?ప్రతీక స్వేచ్ఛ హక్కు* 


*🌺6.   ప్రాథమిక హక్కులు దేనికి రక్షణ కల్పిస్తాయి?వ్యక్తి స్వేచ్ఛకు* 


*🌺7.ఏ హక్కును  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి హృదయం అనేది ఆత్మ అభివర్ణిస్తారు?రాజ్యాంగ పరిహారపు హక్కు* 


*🌺8.భారత రాజ్యాంగానికి లోబడి రాజ్యం మత సమాజానికి పరిమితులు విధించడానికి ఒక ప్రత్యేక కారణం కాదు?సామాజిక న్యాయం .అజారుద్దీన్ జికె గ్రూప్స్* 


*🌺9.14 వ రాజ్యాంగ నిబంధనల పరిధిలోకి రాని రాజ్యాంగ పదవులు ఏవి ?ప్రధానమంత్రి ,ముఖ్యమంత్రులు* 


*🌺10.రాజ్యాంగంలోని మూడవ భాగంలోని నిబంధనలు అంటరానితనం నిషిద్ధమని  ప్రకటించబడింది ? 17 వ నిబంధన*   


*🌺11.స్వచ్ఛభారత్  రాజ్యాంగం నుంచి కల్పించబడలేదు? ఆస్తిని సంపాదించే స్వంతం చేసుకునే &బదిలీ చేసే స్వేచ్ఛ* 


*🌺12.ఏది స్వాతంత్రపు హక్కును సంబంధించి భారత రాజ్యాంగంలోని నిబంధన 19 లో పొందుపరచబడ లేదు?అల్పసంఖ్యాకుల కు విద్యార్థులకు ఏర్పాటు చేసుకుని మరియు నిర్వహించుకునే హక్కు* 


*🌺13.1955 అస్పృశ్యతను రా చట్టాన్ని పౌర హక్కుల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో స్థాపించారు?  1976.*

Indian Constitution - ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు,  షెడ్యూళ్ళు  - వివరాలు

Indian Constitution - ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు, షెడ్యూళ్ళు - వివరాలు

 🎓🎓✍✍✍✍


👉ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు👈👈


భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి


ఏక పౌరసత్వం--బ్రిటన్

పార్లమెంటరీ విధానం--బ్రిటన్

స్పీకర్ పదవి--బ్రిటన్

భారతదేశంలో ప్రాథమిక హక్కులు--అమెరికా

సుప్రీం కోర్టు--అమెరికా

న్యాయ సమీక్షాధికారం--అమెరికా

భారతదేశంలో ఆదేశిక సూత్రాలు--ఐర్లాండ్

రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి--ఐర్లాండ్

రాజ్యసభ సభ్యుల నియామకం--ఐర్లాండ్

భారతదేశంలో ప్రాథమిక విధులు--రష్యా

కేంద్ర రాష్ట్ర సంబంధాలు--కెనడా

అత్యవసర పరిస్థితి--వైమర్ (జర్మనీ)



👉👉భారత రాజ్యాంగం లోని షెడ్యూళ్ళు సవరించు

భారత రాజ్యంగ రూపకల్పన సమయంలో 8 షెడ్యూళ్ళు ఉండగా ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9 వ షెడ్యూల్ ను చేర్చగా, 1985లో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో 10 వ షెడ్యూల్ ను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత 1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 11, 12 వ షెడ్యూళ్ళను చేర్చబడింది.


1 వ షెడ్యూల్ .......భారత సమాఖ్యలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు

2 వ షెడ్యూల్ ......జీత భత్యాలు

3 వ షెడ్యూల్ ......ప్రమాణ స్వీకారాలు

4 వ షెడ్యూల్ ......రాజ్యసభలో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీట్ల విభజన

5 వ షెడ్యూల్ ...... షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన

6 వ షెడ్యూల్ ......ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన

7 వ షెడ్యూల్ ......కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన

8 వ షెడ్యూల్ ......రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు

9 వ షెడ్యూల్ ......కోర్టుల పరిధిలోకి రాని కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసిన చట్టాలు

10 వ షెడ్యూల్ ......పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం

11 వ షెడ్యూల్ ......గ్రామ పంచాయతిల అధికారాలు

12 వ షెడ్యూల్ ......నగర పంచాయతి, మునిసిపాలిటిల అధికారాలు

INDIAN POLITY - భారత రాజ్యాంగం - నిర్దేశిక నియమాలు


భారత రాజ్యాంగం - నిర్దేశిక నియమాలు

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాల గురించి 39 ఆర్టికల్ లో పొందుపరిచారు.

* పరిపాలనా క్రమంలో ప్రభుత్వాలు గుర్తుంచుకోవాల్సిన నిబంధనలను ఆర్టికల్ లో వివరించారు.

* 39 (సి) నిబంధనలో సంపద వికేంద్రీకరణ సంబంధిత అంశాలున్నాయి. ఆర్థిక, ఉత్పాదక వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని నిబంధన చెబుతోంది

* 39 (డి) నిబంధన ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.

* 39 () నిబంధన ప్రకారం కార్మికులు తమ శక్తికి మించి భారమైన పనిచేయకుండా ఉండేటట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. కార్మికులు, మహిళలు, బాలలపై వారి వయసు / శక్తికి మించి భారం వేసి వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం కలిగేలా పనిచేయమని వారిని బలవంత పెట్టరాదని నిబంధన తెలియజేస్తుంది

* 39 (ఎఫ్) నిబంధన ప్రకారం బాల బాలికలు, యువతీ యువకులు వ్యసనాలకు లోనుకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బాలలు స్వేచ్ఛా యుతమైన, గౌరవప్రదమైన వాతావరణంలో వికాసం చెందేందుకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించాలి. బాలలు నైతికంగా, భౌతికంగా దోపిడీకి గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. నిబంధనను 42 (ఎఎ) 1976 ద్వారా చేర్చారు.

40 ఆర్టికల్
* గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణ అభివృద్ధికి బాటలు వేయాలని ఆర్టికల్ చెబుతుంది.

* భారతదేశంలో 1959లో పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. * 18 ఎఎ 1998 ద్వారా దీనికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.


41 ఆర్టికల్
Ø  నిరుద్యోగులకు భృతి కల్పించాలని ఆర్టికల్ చెబు తుంది. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నిబంధనను అనుసరిస్తున్నాయి.
Ø  వృద్ధులకు 'వృద్ధాప్య పెన్షన్' కల్పించాలని ఆర్టికల్ లో పేర్కొన్నారు.
Ø  వికలాంగులకు భృతి కల్పించాలని ఆర్టికల్ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, సిక్కిం రాష్ట్రాలు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
Ø  ఆర్టికల్ ప్రకారం పౌరులందరికీ పనిహక్కు/ ఉపాధి పొందే హక్కు/ ఉద్యోగం పొందే హక్కు కల్పించాలి. దీని ప్రకారమే MGNREGS కింద పని కల్పిస్తున్నారు.
Ø  41 ఆర్టికల్ ప్రకారం విద్యార్థులందరికీ విద్యార్జన హక్కును / చదువుకొనే హక్కును కల్పించాలి. పౌరులం దరూ విద్యాహక్కును వినియోగించుకొనేటట్లు ప్రభుత్వంచర్యలు తీసుకోవాలి.




42 ఆర్టికల్

Ø  కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులు కల్పించాలి.

Ø  ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి హేతుబద్ధమైన పనిగంటలు, పనిచేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు తోడ్పడాలి.

* మహిళలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలి


43 ఆర్టికల్
* ఆర్టికల్ నాలుగు అంశాలను పేర్కొంటోంది.
Ø  కార్మికుల మానసిక,శారీరక, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
Ø  కార్మికులకు కనీస పని గంటలు కల్పించాలి.
Ø  కార్మికులకు కనీస వేతనాన్ని కల్పించాలి.
Ø  కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి.

44 ఆర్టికల్
* ఒకే శిక్షాస్మృతి లేదా ఉమ్మడి పౌర చట్టాన్ని భారతీయ పౌరులందరికీ అందించాలి. దీనిని ప్రస్తుతం గోవా రాష్ట్రం అమలు చేస్తోంది. దీనిని నిర్దేశిక నియమాల్లో నిర్జీవమైందిగా పేర్కొంటారు. దేశమంతటా ఒకే రకమైన క్రిమినల్ చట్టాలు ఉన్నాయి. కానీ సివిల్ వ్యవహారాల్లో వారసత్వం, వివాహం, ఆస్తి, మొదలైన వాటిలో మతాలవారీగా విభిన్నమైన సాంప్రదా యాలు ఉన్నాయి. అందుకే సామాజిక సామరస్యానికి,జాతీయ భావానికి అనుగుణంగా ఉమ్మడి పౌర నియమావళి ఉండాలని పేర్కొన్నారు.

* ఇప్పటి వరకు ఉమ్మడి పౌర నియమావళి అమలు పరచలేదు. అమలుకు నోచుకోని ఏకైక ఆదేశ నియమం ఇదే.
45 ఆర్టికల్
* ఆరేళ్లలోపు బాలలకు పూర్వ థమిక విద్య అందించాలి. * మౌలిక రాజ్యాంగంలో 6 నుంచి 14 ఏళ్ల వయసులోపు బాలలకు ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్య కల్పించాలని ఉండేది.
* ప్రస్తుతం అంశాన్ని 21 () లో చేర్చారు.

46 ఆర్టికల్
* ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలవారి విద్య, ఆర్థికాభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధ వహించాలి. నిబంధన 15 (4) నిబంధనకు అనుబంధంగా ఉంది.

47 ఆర్టికల్

* మత్తు మందులు, మత్తు పానీయాలను నిషేధించి ప్రజా రోగ్య స్థాయిని పెంచాలి. అంటే మద్యపాన నిషేధాన్ని విధించాలని అర్థం.

* గుజరాత్, బీహార్ రాష్ట్రాలు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి.

48 ఆర్టికల్

* వ్యవసాయం, పశు పోషణ అభివృద్ధికి ఆధునిక, శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలి.

* పశువులు, గోవులు, ఇతర పెంపుడు జంతువుల వధను నిషేధించాలి.

* మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు గోవధను నిషేధించాయి.

49 ఆర్టికల్

* చారిత్రక ప్రదేశాలను, కట్టడాలను, జాతీయ వస్తువులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంరక్షించాలి.

50 ఆర్టికల్
* న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరుచేయాలని ఆర్టికల్ సూచిస్తోంది.

* భారతదేశంలో న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది స్వాతంత్ర్యానంతరం కలెక్టర్ నుంచి న్యాయాధికారాలను తొలగించారు.
* ప్రస్తుతం కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మాత్రమే.

51 ఆర్టికల్
ప్రతి భారతీయుడు ప్రపంచ శాంతికి కృషి చేయాలని ఈ ఆర్టికల్ తెలియజేస్తోంది.
* భారత విదేశాంగ విధానం (అలీన విధానం) గురించి ఈ నిబంధనే వివరిస్తుంది. కొత్తగా చేర్చిన ఆదేశిక సూత్రాలు
* 42 రాజ్యాంగ సవరణ - 1976 ద్వారా కింది అంశాలను చేర్చారు
• 39 () ప్రకారం పేదలకు ఉచిత న్యాయ సలహా పద్ధతిని అందించాలి.
• 43 () ప్రకారం పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి.
• 48 () ప్రకారం పర్యావరణ పరిరక్షణకు అడవులను,అడవి జంతువులను, వన్యప్రాణులను సంరక్షించాలి.
• 39 (ఎఫ్) ప్రకారం పిల్లలకు పౌష్టికాహరం అందించాలి. • పిల్లలు హుందాగా పెరిగే అవకాశం కల్పించాలి. • దోపిడీకి గురైన యువత నైతిక పతనం చెందకుండా చూడాలి.

44 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన అంశాలు
* 38(2) ప్రకారం దేశంలో ఆర్థిక అసమానతలను తగ్గించాలి. హోదాలో, అవకాశంలో అందరికీ సమానత్వం కల్పించాలి.
86 రాజ్యాంగ సవరణ ద్వారా ఆరేళ్లలోపు బాల బాలికలకు సంరక్షణతోపాటు విద్యను కూడా అందించాలనే నిబంధనను చేర్చారు
* 97 రాజ్యాంగ సవరణ - 2011 ప్రకారం 'సహకార సంఘాలను' ఏర్పాటు చేసి వాటిని స్వతంత్రంగా, ప్రజాస్వామ్య పద్దుతుల్లో నైపుణ్యంతో నిర్వహించేలా చూడాలి.

రాజ్యాంగంలో నిర్దేశిక నియమాలు
* రాజ్యాంగం నాలుగవ భాగంలో 36 నుంచి 51 నిబంధనల వరకు వివిధ నిర్దేశిక నియమాలను వివరించారు.

* 16 భాగంలో 335 నిబంధనలో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత ప్రాతినిథ్యం లేనపుడు వారికి ప్రత్యేక సదుపాయాలను కల్పించాలని ఉంది.

* 17 భాగంలో 350 () నిబంధనలో అల్ప సంఖ్యాక వర్గాల పిల్లలకు మాతృభాషలో ప్రాథమిక విద్య బోధించేలా రాష్ట్రాలు శ్రద్ధ వహించాలని ఉంది.

* 17 భాగంలోని 351 నిబంధనలో హిందీ భాషాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉంది. హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించి అమలు చేయాలని ఉంది. నిర్దేశిక నియమాల వర్గీకరణ

* ఎం.పి. శర్మ అనే భారతదేశ ప్రభుత్వ పరిపాలనా శాస్త్ర పితామహుడి అభిప్రాయం ప్రకారం నిర్దేశిక నియమా లను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
సామ్యవాద నియమాలు (38, 39, 41, 42, 43)
గాంధేయ నియమాలు (40, 43, 46, 47, 48)
ఉదారవాద నియమాలు (44, 45, 49, 50)

నియమాలు - ప్రాథమిక హక్కులు

* రెండూ పరస్పర సంబంధంతో ఉంటాయి.
* మౌలిక రాజ్యాంగంలో రెంటి మధ్య సంయమనాన్ని ఏర్పరచారు.
* రాజ్యాంగ సవరణల వల్ల వీటి మధ్య సంబంధాల్లో ఒడిదుడుకులు ఏర్పడి దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే సమస్య ఉత్పన్నమై పార్లమెంట్, సుప్రీంకోర్టు మధ్య సంఘర్షణలకు దారి తీసింది.

ప్రముఖుల వ్యాఖ్యలు

డా. బి.ఆర్. అంబేద్కర్
* అంబేద్కర్ నిర్దేశిక నియమాల గురించి ఇలా పేర్కొన్నారు. 'ఆధునిక రాజ్యాంగానికి నిర్దేశిక నియమాలు ఒక నూతన పోకడ వంటివి." 'నిర్దేశిక నియమాలు సాంఘిక న్యాయానికి దోహదం చేస్తాయి.” 'ఆర్థిక ప్రజాస్వామ్యానికి మంచి మార్గం'
* 1935 చట్టంలోని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ను పోలి ఉంటాయి.
* 'ఆదేశిక సూత్రాలను ప్రభుత్వం విస్మరించదు. అలా విస్మరిస్తే వారు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

' ఎం.సి. చాగ్లా
* ఈయన నిర్దేశిక నియమాలను విధంగా వర్ణిం చారు.
*'భారత ప్రభుత్వం నిర్దేశిక నియమాలను నిజాయతీగా అమలు చేస్తే భారతదేశం భూలోక స్వర్గం అవుతుంది'

* ఎం.సి. సెతల్ వాడే
*వీటి గురించి వివరిస్తూ 'నిర్దేశిక నియమాలు శాసన వ్యవస్థకు కరదీపం వంటివి' అన్నారు.


*'నిర్దేశిక నియమాలు భారత ప్రభుత్వ అధికార నీతి బోధనలు. ఇవి నైతిక ప్రవచనాలు. అధికారులు, ప్రభుత్వం వీటిని గౌరవించాలి' అని బి.ఎన్. రావు పేర్కొన్నారు.

* 'నిర్దేశిక నియమాలు సామాజిక విప్లవ సాధనకు దోహదం చేస్తాయి' అని గ్రాన్విల్ ఆస్టిన్ అన్నారు

* 'నిర్దేశిక నియమాలు లక్ష్యాలుఆశయాల తీర్మానానికి మ్యానిఫెస్టో' అని కె.సి.వేర్ పేర్కొన్నారు.

* ఎల్.ఎం.సింఘ్వీ వీటి గురించి వివరిస్తూ 'నిర్దేశిక నియమాలు భారత రాజ్యాంగ మూలతత్వం' అని
తెలిపారు.

* 'వసతి లేనపుడు ఒక బ్యాంక్ చెల్లించే చెక్కుల వంటివి నిర్దేశిక నియమాలు' అని కె.టి. షా పేర్కొ
న్నారు.
* 'వైవిధ్య సెంటిమెంట్లతో కూడిన ఒక చెత్త బుట్ట' అని టి.టి. కృష్ణమాచారి వ్యాఖ్యానించారు.