Indian Constitution - ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు, షెడ్యూళ్ళు - వివరాలు

 🎓🎓✍✍✍✍


👉ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు👈👈


భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి


ఏక పౌరసత్వం--బ్రిటన్

పార్లమెంటరీ విధానం--బ్రిటన్

స్పీకర్ పదవి--బ్రిటన్

భారతదేశంలో ప్రాథమిక హక్కులు--అమెరికా

సుప్రీం కోర్టు--అమెరికా

న్యాయ సమీక్షాధికారం--అమెరికా

భారతదేశంలో ఆదేశిక సూత్రాలు--ఐర్లాండ్

రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి--ఐర్లాండ్

రాజ్యసభ సభ్యుల నియామకం--ఐర్లాండ్

భారతదేశంలో ప్రాథమిక విధులు--రష్యా

కేంద్ర రాష్ట్ర సంబంధాలు--కెనడా

అత్యవసర పరిస్థితి--వైమర్ (జర్మనీ)



👉👉భారత రాజ్యాంగం లోని షెడ్యూళ్ళు సవరించు

భారత రాజ్యంగ రూపకల్పన సమయంలో 8 షెడ్యూళ్ళు ఉండగా ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9 వ షెడ్యూల్ ను చేర్చగా, 1985లో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో 10 వ షెడ్యూల్ ను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత 1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 11, 12 వ షెడ్యూళ్ళను చేర్చబడింది.


1 వ షెడ్యూల్ .......భారత సమాఖ్యలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు

2 వ షెడ్యూల్ ......జీత భత్యాలు

3 వ షెడ్యూల్ ......ప్రమాణ స్వీకారాలు

4 వ షెడ్యూల్ ......రాజ్యసభలో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీట్ల విభజన

5 వ షెడ్యూల్ ...... షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన

6 వ షెడ్యూల్ ......ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన

7 వ షెడ్యూల్ ......కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన

8 వ షెడ్యూల్ ......రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు

9 వ షెడ్యూల్ ......కోర్టుల పరిధిలోకి రాని కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసిన చట్టాలు

10 వ షెడ్యూల్ ......పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం

11 వ షెడ్యూల్ ......గ్రామ పంచాయతిల అధికారాలు

12 వ షెడ్యూల్ ......నగర పంచాయతి, మునిసిపాలిటిల అధికారాలు

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv