భారత రాజ్యాంగం - నిర్దేశిక నియమాలు
*
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సిన విధానాల గురించి 39వ ఆర్టికల్ లో పొందుపరిచారు.
*
పరిపాలనా క్రమంలో ప్రభుత్వాలు గుర్తుంచుకోవాల్సిన నిబంధనలను ఈ ఆర్టికల్ లో వివరించారు.
* 39 (సి) నిబంధనలో సంపద వికేంద్రీకరణ సంబంధిత అంశాలున్నాయి. ఆర్థిక, ఉత్పాదక వనరులు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ నిబంధన చెబుతోంది
* 39 (డి) నిబంధన ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
* 39 (ఇ) నిబంధన ప్రకారం కార్మికులు తమ శక్తికి మించి భారమైన పనిచేయకుండా ఉండేటట్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. కార్మికులు, మహిళలు, బాలలపై వారి వయసు / శక్తికి మించి భారం వేసి వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం కలిగేలా పనిచేయమని వారిని బలవంత పెట్టరాదని ఈ నిబంధన తెలియజేస్తుంది
* 39 (ఎఫ్) నిబంధన ప్రకారం బాల బాలికలు, యువతీ యువకులు వ్యసనాలకు లోనుకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బాలలు స్వేచ్ఛా యుతమైన, గౌరవప్రదమైన వాతావరణంలో వికాసం చెందేందుకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించాలి. బాలలు నైతికంగా, భౌతికంగా దోపిడీకి గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. ఈ నిబంధనను 42 (ఎఎ) 1976 ద్వారా చేర్చారు.
40వ ఆర్టికల్
* గ్రామ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణ అభివృద్ధికి బాటలు వేయాలని ఈ ఆర్టికల్ చెబుతుంది.
* భారతదేశంలో 1959లో పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. * 18 ఎఎ 1998 ద్వారా దీనికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.
41వ ఆర్టికల్
Ø నిరుద్యోగులకు భృతి కల్పించాలని ఈ ఆర్టికల్ చెబు తుంది. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఈ నిబంధనను అనుసరిస్తున్నాయి.
Ø వృద్ధులకు 'వృద్ధాప్య పెన్షన్' కల్పించాలని ఈ ఆర్టికల్ లో పేర్కొన్నారు.
Ø వికలాంగులకు భృతి కల్పించాలని ఈ ఆర్టికల్ చెబుతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, సిక్కిం రాష్ట్రాలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
Ø ఈ ఆర్టికల్ ప్రకారం పౌరులందరికీ పనిహక్కు/ ఉపాధి పొందే హక్కు/ ఉద్యోగం పొందే హక్కు కల్పించాలి. దీని ప్రకారమే MGNREGS కింద పని కల్పిస్తున్నారు.
Ø 41వ ఆర్టికల్ ప్రకారం విద్యార్థులందరికీ విద్యార్జన హక్కును / చదువుకొనే హక్కును కల్పించాలి. పౌరులం దరూ విద్యాహక్కును వినియోగించుకొనేటట్లు ప్రభుత్వంచర్యలు తీసుకోవాలి.
42వ ఆర్టికల్
Ø కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులు కల్పించాలి.
Ø ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి హేతుబద్ధమైన పనిగంటలు, పనిచేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు తోడ్పడాలి.
*
మహిళలకు ప్రసూతి సౌకర్యం కల్పించాలి
43వ ఆర్టికల్
* ఈ ఆర్టికల్ నాలుగు అంశాలను పేర్కొంటోంది.
* ఈ ఆర్టికల్ నాలుగు అంశాలను పేర్కొంటోంది.
Ø కార్మికుల మానసిక,శారీరక, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
Ø కార్మికులకు కనీస పని గంటలు కల్పించాలి.
Ø కార్మికులకు కనీస వేతనాన్ని కల్పించాలి.
Ø కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి.
44వ ఆర్టికల్
* ఒకే
శిక్షాస్మృతి లేదా
ఉమ్మడి
పౌర
చట్టాన్ని భారతీయ
పౌరులందరికీ అందించాలి. దీనిని
ప్రస్తుతం గోవా
రాష్ట్రం అమలు
చేస్తోంది. దీనిని
నిర్దేశిక నియమాల్లో నిర్జీవమైందిగా పేర్కొంటారు. దేశమంతటా ఒకే రకమైన క్రిమినల్ చట్టాలు ఉన్నాయి. కానీ సివిల్ వ్యవహారాల్లో వారసత్వం, వివాహం, ఆస్తి, మొదలైన
వాటిలో
మతాలవారీగా విభిన్నమైన సాంప్రదా యాలు
ఉన్నాయి. అందుకే
సామాజిక సామరస్యానికి,జాతీయ
భావానికి అనుగుణంగా ఉమ్మడి
పౌర
నియమావళి ఉండాలని పేర్కొన్నారు.
* ఇప్పటి
వరకు
ఉమ్మడి
పౌర
నియమావళి అమలు పరచలేదు. అమలుకు
నోచుకోని ఏకైక
ఆదేశ
నియమం ఇదే.
45వ ఆర్టికల్
* ఆరేళ్లలోపు బాలలకు పూర్వ థమిక విద్య అందించాలి. * మౌలిక రాజ్యాంగంలో 6 నుంచి 14 ఏళ్ల వయసులోపు బాలలకు ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్య కల్పించాలని ఉండేది.
* ప్రస్తుతం ఈ అంశాన్ని 21 (ఎ) లో చేర్చారు.
46వ ఆర్టికల్
* ఎస్సీ,
ఎస్టీ,
బీసీ
వర్గాలవారి విద్య,
ఆర్థికాభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన
శ్రద్ధ
వహించాలి.ఈ నిబంధన 15 (4) నిబంధనకు అనుబంధంగా ఉంది.
47వ ఆర్టికల్
* మత్తు మందులు, మత్తు పానీయాలను నిషేధించి ప్రజా రోగ్య స్థాయిని పెంచాలి. అంటే మద్యపాన నిషేధాన్ని విధించాలని అర్థం.
* గుజరాత్, బీహార్ రాష్ట్రాలు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాయి.
48వ ఆర్టికల్
* వ్యవసాయం, పశు
పోషణ
అభివృద్ధికి ఆధునిక,
శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలి.
* పశువులు, గోవులు,
ఇతర
పెంపుడు జంతువుల వధను నిషేధించాలి.
* మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు గోవధను
నిషేధించాయి.
49వ ఆర్టికల్
* చారిత్రక ప్రదేశాలను, కట్టడాలను, జాతీయ
వస్తువులను కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు సంరక్షించాలి.
50వ ఆర్టికల్
* న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరుచేయాలని ఈ ఆర్టికల్ సూచిస్తోంది.
* భారతదేశంలో న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది స్వాతంత్ర్యానంతరం కలెక్టర్ నుంచి న్యాయాధికారాలను తొలగించారు.
* ప్రస్తుతం కలెక్టర్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మాత్రమే.
51వ ఆర్టికల్
• ప్రతి భారతీయుడు ప్రపంచ శాంతికి కృషి చేయాలని ఈ ఆర్టికల్ తెలియజేస్తోంది.
* భారత విదేశాంగ విధానం (అలీన విధానం) గురించి ఈ నిబంధనే వివరిస్తుంది. కొత్తగా చేర్చిన ఆదేశిక సూత్రాలు
* 42వ రాజ్యాంగ సవరణ - 1976 ద్వారా కింది అంశాలను చేర్చారు
• 39 (ఎ) ప్రకారం పేదలకు ఉచిత న్యాయ సలహా పద్ధతిని అందించాలి.
• 43 (ఎ) ప్రకారం పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి.
• 48 (ఎ) ప్రకారం పర్యావరణ పరిరక్షణకు అడవులను,అడవి జంతువులను, వన్యప్రాణులను సంరక్షించాలి.
• 39 (ఎఫ్) ప్రకారం పిల్లలకు పౌష్టికాహరం అందించాలి. • పిల్లలు హుందాగా పెరిగే అవకాశం కల్పించాలి. • దోపిడీకి గురైన యువత నైతిక పతనం చెందకుండా
చూడాలి.
44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన అంశాలు
* 38(2) ప్రకారం దేశంలో ఆర్థిక అసమానతలను తగ్గించాలి. హోదాలో, అవకాశంలో అందరికీ సమానత్వం కల్పించాలి.
86వ రాజ్యాంగ సవరణ ద్వారా
ఆరేళ్లలోపు బాల బాలికలకు సంరక్షణతోపాటు విద్యను కూడా అందించాలనే నిబంధనను చేర్చారు
* 97వ రాజ్యాంగ సవరణ - 2011 ప్రకారం
'సహకార
సంఘాలను'
ఏర్పాటు చేసి వాటిని స్వతంత్రంగా, ప్రజాస్వామ్య పద్దుతుల్లో నైపుణ్యంతో నిర్వహించేలా చూడాలి.
రాజ్యాంగంలో నిర్దేశిక నియమాలు
*
రాజ్యాంగం నాలుగవ భాగంలో 36 నుంచి 51వ నిబంధనల వరకు వివిధ నిర్దేశిక నియమాలను వివరించారు.
*
16వ భాగంలో 335వ నిబంధనలో ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో సముచిత ప్రాతినిథ్యం లేనపుడు వారికి ప్రత్యేక సదుపాయాలను కల్పించాలని ఉంది.
*
17వ భాగంలో 350 (ఎ) నిబంధనలో అల్ప సంఖ్యాక వర్గాల పిల్లలకు మాతృభాషలో ప్రాథమిక విద్య బోధించేలా రాష్ట్రాలు శ్రద్ధ వహించాలని ఉంది.
*
17వ భాగంలోని 351 నిబంధనలో హిందీ భాషాభివృద్ధికి
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉంది. హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించి అమలు చేయాలని ఉంది. నిర్దేశిక నియమాల వర్గీకరణ
* ఎం.పి. శర్మ అనే భారతదేశ ప్రభుత్వ పరిపాలనా శాస్త్ర పితామహుడి అభిప్రాయం ప్రకారం నిర్దేశిక నియమా లను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి
• సామ్యవాద నియమాలు
(38, 39, 41, 42, 43)
• గాంధేయ నియమాలు (40, 43, 46, 47, 48)
• ఉదారవాద నియమాలు
(44, 45, 49, 50)
నియమాలు - ప్రాథమిక హక్కులు
*
ఈ రెండూ పరస్పర సంబంధంతో ఉంటాయి.
*
మౌలిక రాజ్యాంగంలో రెంటి మధ్య సంయమనాన్ని ఏర్పరచారు.
*
రాజ్యాంగ సవరణల వల్ల వీటి మధ్య సంబంధాల్లో ఒడిదుడుకులు ఏర్పడి దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే సమస్య ఉత్పన్నమై పార్లమెంట్, సుప్రీంకోర్టు మధ్య సంఘర్షణలకు దారి తీసింది.
ప్రముఖుల వ్యాఖ్యలు
డా. బి.ఆర్. అంబేద్కర్
*
అంబేద్కర్ నిర్దేశిక నియమాల గురించి ఇలా పేర్కొన్నారు. 'ఆధునిక రాజ్యాంగానికి నిర్దేశిక నియమాలు ఒక నూతన పోకడ వంటివి." 'నిర్దేశిక నియమాలు సాంఘిక న్యాయానికి దోహదం చేస్తాయి.” 'ఆర్థిక ప్రజాస్వామ్యానికి మంచి మార్గం'
*
1935 చట్టంలోని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ను పోలి ఉంటాయి.
*
'ఆదేశిక సూత్రాలను ఏ ప్రభుత్వం విస్మరించదు. అలా విస్మరిస్తే వారు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
'
ఎం.సి. చాగ్లా
*
ఈయన నిర్దేశిక నియమాలను ఈ విధంగా వర్ణిం చారు.
*'భారత ప్రభుత్వం నిర్దేశిక నియమాలను నిజాయతీగా అమలు చేస్తే భారతదేశం భూలోక స్వర్గం అవుతుంది'
*
ఎం.సి. సెతల్ వాడే
*వీటి గురించి వివరిస్తూ 'నిర్దేశిక నియమాలు శాసన వ్యవస్థకు కరదీపం వంటివి' అన్నారు.
*'నిర్దేశిక నియమాలు భారత ప్రభుత్వ అధికార నీతి బోధనలు. ఇవి నైతిక ప్రవచనాలు. అధికారులు, ప్రభుత్వం వీటిని గౌరవించాలి' అని బి.ఎన్. రావు పేర్కొన్నారు.
*
'నిర్దేశిక నియమాలు సామాజిక విప్లవ సాధనకు దోహదం చేస్తాయి' అని గ్రాన్విల్ ఆస్టిన్ అన్నారు
*
'నిర్దేశిక నియమాలు లక్ష్యాలు – ఆశయాల తీర్మానానికి మ్యానిఫెస్టో' అని కె.సి.వేర్ పేర్కొన్నారు.
*
ఎల్.ఎం.సింఘ్వీ వీటి గురించి వివరిస్తూ 'నిర్దేశిక నియమాలు భారత రాజ్యాంగ మూలతత్వం' అని
తెలిపారు.
*
'వసతి లేనపుడు ఒక బ్యాంక్ చెల్లించే చెక్కుల వంటివి నిర్దేశిక నియమాలు' అని కె.టి. షా పేర్కొ
న్నారు.
* 'వైవిధ్య సెంటిమెంట్లతో కూడిన ఒక చెత్త బుట్ట' అని టి.టి. కృష్ణమాచారి వ్యాఖ్యానించారు.
EmoticonEmoticon