AP History - Sathavahana, Ikshwaka important practice bits for APPSC Exams

ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర – శాతవాహనులు

శాతవాహన వంశ స్థాపకుడు?
– శ్రీముఖ శాతకర్ణి

మౌర్య సామ్రాజ్య పతనానంతరం, శ్రీముఖుని నాయకత్వంలో శాతవాహనులు స్వతంత్రించారు అని తెలిపినవారు?
–వి.ఎ.స్మిత్‌

శ్రీముఖ శాతకర్ణి ఆంధ్ర జాతీయుడు అని పేర్కొన్న పురాణం?
– మత్స్య పురాణం

శాతవాహనులు – ఆంధ్రులు ఒక్కరే అన్నవారు?
– ఆర్‌.జి.భండార్కర్, వి.ఎ. స్మిత్, రాప్సన్‌

శాతవాహనుల జన్మస్థలం మహారాష్ట్ర అని పేర్కొన్నవారు?
– పి.టి. శ్రీనివాస అయ్యంగార్‌

శాతవాహనుల జన్మస్థలం విదర్భ అని వాదించినవారు?
– వి.వి. మిరాశి

శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని పేర్కొన్నవారు?
–సూక్తాంకర్‌

శాతవాహనుల తొలి రాజధాని?
– కోటిలింగాల

ఏ శాతవాహన రాజుకు చెందిన నాణేలు పూనా సమీపంలో లభించాయి?
–మొదటి శాతకర్ణి

నానాఘాట్‌ శాసన కర్త?
– నాగానిక

సాంచీ స్థూపానికి దక్షిణ తోరణం నిర్మించిన రాజు?
– రెండో శాతకర్ణి

రెండో శాతకర్ణి శుంగుల రెండో రాజధాని విదిశను జయించాడని పేర్కొనే గ్రంథం?
– గార్గి సంహిత

తన పేరు మీద తొలిసారిగా శాసనాలు వేయించిన శాతవాహన రాజు?
– మొదటి పులోమావి

ఏ రాజు కాలంలో గౌతమీ బాలశ్రీ నాసిక్‌ శాసనం వేయించింది?
– వాశీష్టపుత్ర పులోమావి

నహపాణుడి పునర్ముద్రిత నాణేలు ఎక్కడ లభించాయి?
– జోగల్‌తంబి

ఆంధ్ర రాజులు సుశర్మను చంపి మగధను ఆక్రమించినట్లు పేర్కొనే పురాణం?
– మత్స్య పురాణం

కామర్థకవంశ చష్టానుడు.. వాశీష్ఠపుత్ర పులోమావి సమకాలీనుడు అని తెలిపిన విదేశీ రచయిత?
– టాలమీ

రాజు పేరు ముందు తల్లి నామం పెట్టుకునే ఆచారం ఏ రాజుతో ప్రారంభమైంది?
– గౌతమీపుత్ర శాతకర్ణి

శ్రీముఖుడు మొదట ఆదరించిన మతం?
– జైన మతం

‘కవి వత్సల’ అనే బిరుదున్న రాజు?
– హాలుడు

శాతవాహన వంశంలో అతి గొప్ప రాజు?
– గౌతమీపుత్ర శాతకర్ణి

శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచేవారు?
– ఆహారము

భారత్‌లో తొలిసారిగా బ్రాహ్మణులకు భూ దానాలు ప్రారంభించిన రాజవంశం?
– శాతవాహనులు

నిగమ సభల గురించి వివరిస్తున్న శాసనం?
– భట్టిప్రోలు

శాతవాహనుల కాలంలో గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉన్నాయని తెలిపే గ్రంథం?
– గాథాసప్తశతి

అమరావతి స్థూపాన్ని విస్తృతపరిచి, మహాచైత్య వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి?
– యజ్ఞశ్రీ శాతకర్ణి

శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు?
– భూమి శిస్తు

శాతవాహనుల కాలంలో శ్రేణులు అంటే?
– వృత్తి సంఘాలు

శాతవాహనుల కాలంలో నౌకా వాణిజ్యాన్ని ప్రోత్సహించారని పేర్కొన్న శాసనం?
– గుంటుపల్లి

శాతవాహనుల రాజ భాష?
– ప్రాకృతం

సంస్కృతాన్ని రాజభాషగా చేసుకున్న రాజు?
– కుంతల శాతకర్ణి

నాణేలపై ఉజ్జయిని చిహ్నాన్ని ముద్రించిన రాజు?
– మొదటి శాతకర్ణి

సోమదేవసూరి రచించిన కథాసరిత్సాగరం ప్రకారం శాతవాహనుల మూలపురుషుడు?
– శాతవాహనుడు

శాతవాహనుల కాలంలో జనపదాలు అంటే?
– సామంత రాజ్యాలు

శాతవాహనుల శాసనాలు అన్నీ ఏ భాషలో, ఏ లిపిలో ఉన్నాయి?

– ప్రాకృత భాషలో, బ్రాహ్మి లిపిలో

శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన కుంద కుందనాచార్యుడు ఏ మతానికి చెందినవాడు?
– జైనం

నాసిక్, కన్హేరి గుహలను బౌద్ధ మతస్తులకు దానం చేసిన శాతవాహన lరాజు?
– కృష్ణుడు

కార్లే గుహలను మహాసాంఘిక బౌద్ధశాఖకు దానం చేసిన రాజు?
– రెండో పులోమావి

అజంతా గుహల్లోని 9, 10 గుహలు ఏ యుగానికి చెందినవి?
– శాతవాహనులు

గాథాసప్తశతిని పోలిన గ్రంథం ‘వజ్జలగ్గ’ను రచించింది?
– జయవల్లభ

శాతవాహనుల కాలంలో రాతిలో తొలిచిన చైత్యం ఎక్కడ ఉంది?
– గుంటుపల్లి

శ్రీ పర్వతం వద్ద శైల మండపాలు నిర్మించిన రాజు?
– యజ్ఞశ్రీ శాతకర్ణి

శాతవాహనుల కాలంలో బౌద్ధ స్థూపాలను వేటితో నిర్మించారు?
– ఇటుకలు

ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా విలసిల్లిన శాతవాహనుల రేవు పట్టణం?
– ఘంటసాల

శాతవాహనుల కాలంలో విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించిన వర్తకులు?
– స్థారవాహులు

శాతవాహనుల కాలానికి సంబంధించిన రోమ్‌ దేశ నాణేలు ఏ ప్రాంతంలో లభించాయి?
– కొండాపూర్‌

బృహత్కథను గుణాఢ్యుడు ఏ భాషలో రచించాడు?
– పైశాచీ భాష

శాతవాహనుల కాలంలో ఒక సువర్ణ (బంగారు) నాణేనికి ఎన్ని కార్షపణాలు (వెండి)?
– 1:35 (ఒక బంగారు నాణేనికి 35 కార్షపణాలు)

శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు?
– 12 శాతం

శాతవాహనుల కాలంలో వృత్తి పన్నులు?
– కారుకర

ఏ శాతవాహన రాజు కాలంలో భాగవత మతం దక్షిణ భారతదేశానికి విస్తరించింది?
– మొదటి కృష్ణుడు

ఆచార్య నాగార్జునుడు రచించిన గ్రంథాలు?
– సుహృల్లేఖ, ఆరోగ్య మంజరి, ప్రజ్ఞా పారమిత, మాధ్యమిక కారిక

బౌద్ధ మతస్తుల కోసం నాగానిక తొలిపించిన గుహలు?

– నానాఘాట్‌

‘బెణకటకస్వామి’ అని బిరుదు గల శాతవాహన రాజు?
– గౌతమీపుత్ర శాతకర్ణి

గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు?
– శకారి, ఆగమనిలయ, క్షహరాట వంశ నిషేశకర, త్రిసముద్రతోయ పీతవాహన

క్రీ.శ.78లో శాలివాహన శకాన్ని ప్రారంభించింది?
– గౌతమీపుత్ర శాతకర్ణి

ఇక్ష్వాకులు

శాసనాల ప్రకారం ఇక్ష్వాకు వంశ మూల పురుషుడు?
–వాశీష్ఠపుత్ర శ్రీశాంతమూలుడు

ఏ రాజును ఓడించి ఇక్ష్వాకులు విజయపురిలో అధికారాన్ని స్థాపించారు?
–మూడో పులోమావి

ఇక్ష్వాకులు స్థానికులు అని వాదించిన చరిత్రకారుడు?
– కాల్డ్‌వెల్‌

ఇక్ష్వాకులు కర్ణాటక ప్రాంతం నుంచి ఆంధ్రకు వలస వచ్చారని పేర్కొన్నవారు?
– వోగేల్‌

శ్రీశాంతమూలుడు ఏ మతాన్ని ఆదరించాడు?
– వైదిక మతం

ఇక్ష్వాకులు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చారని పేర్కొనే పురాణం?
– విష్ణు పురాణం

రెంటాల, దాచేపల్లి, కెసానపల్లి శాసనాలు వేయించిన ఇక్ష్వాక రాజు?
– శ్రీశాంతమూలుడు

శతసహస్రహలక, మహాదానపతి బిరుదులు కలిగిన ఇక్ష్వాక రాజు?
– శ్రీశాంతమూలుడు

ఇక్ష్వాకుల చరిత్రకు మూలాధారాలైన శాసనాలు?
– నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి

వీరపురుష దత్తుడి కాలంలో మహాచైత్య నిర్మాణానికి ఆయక స్తంభాన్ని ప్రతిష్టించింది ఎవరు? – అడవి శాంతిశ్రీ

నాగార్జునకొండ వద్ద చుళ్ల ధర్మగిరిపై చైత్యగృహాన్ని నిర్మించింది?
– ఉపాసిక బోధిశ్రీ

మేనత్త కుమార్తెలను వివాహమాడే సంప్రదాయం ఏ రాజు కాలంలో ప్రారంభమైంది?
– వీరపురుష దత్తుడు

ఏ రాజు కాలాన్ని ఆంధ్రలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా పేర్కొంటారు?
– వీరపురుషదత్తుడు

రాజు.. శివలింగాన్ని కాలితో తొక్కుతూ, బౌద్ధులకు అభయం ఇస్తున్న శిల్పం ఏ ప్రాంతంలో లభించింది?
– నాగార్జునకొండ

అశ్వమేథయాగం చేసిన ఇక్ష్వాక రాజు?
– శ్రీశాంతమూలుడు

ఇక్ష్వాకుల రాజభాష?
– ప్రాకృతం

ఇక్ష్వాకుల రాజ చిహ్నం?
– సింహం

భారతదేశంలో తొలి వైదిక (హిందూ) దేవాలయాలు నిర్మించిన రాజులు?
– ఇక్ష్వాకులు

ఏ ఇక్ష్వాక రాజు కాలంలో శ్రీ పర్వతం మహాయాన మతానికి పుణ్యక్షేత్రంగా వర్ధిల్లింది?
– వీరపురుషదత్తుడు

దక్షిణ భారతదేశంలో తొలి సంస్కృత శాసనం వేయించిన రాజు?
– ఎహుబల శాంతమూలుడు

ఇక్ష్వాకుల కాలంలో ప్రధాన వృత్తి?
– వ్యవసాయం

హారతి అంటే?
– చిన్న పిల్లలను రక్షించే దేవత

వీరగల్‌ అంటే?
– యుద్ధంలో మరణించిన వీరుల స్మారక చిహ్నాలు

ఇక్ష్వాకుల కాలం నాటి వృత్తి పన్నుల గురించి వివరిస్తున్న శాసనం?
– విషవట్టి శాసనం

ఇక్ష్వాకుల కాలంలో ప్రముఖ వర్తక శ్రేణులు?
– పర్నిక శ్రేణి, పుసిన శ్రేణి

మొదటిసారిగా ఆయా నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సంప్రదాయం ఎవరి కాలంలో ప్రారంభమైంది?
– ఇక్ష్వాకులు


no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv