ఓట్లు రకాలు - ఓట్లలో మొత్తం ఐదు రకాలుం

*ఓట్లు రకాలు*
ఓట్లలో మొత్తం ఐదు రకాలుంటాయి. వివిధ హోదాల్లో వీటిని వినియోగించుకోవచ్చు.

1)సాధారణ ఓటు:-సాధారణంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఓటు హక్కు పొందాలి.తనకు నచ్చిన ప్రజాప్రతినిధిని చట్ట సభలకు పంపేది సాధారణ ఓటు.

2) పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు:-ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులు తమ సొంత గ్రామాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోలేరు. ఇలాంటి వారికోసం పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం అమలులో ఉంది. అందరికన్నా ముందే తమ ఓటు హక్కును తపాలా బ్యాలెట్‌ పద్ధతిన వినియోగించుకునే అవకాశం కల్పించారు.

3)సర్వీస్‌ ఓటు:-దేశ రక్షణలో నిత్యం అప్రమత్తంగా ఉండే సైనికులు, పారామిలటరీ ఉద్యోగులు తమ స్వరాష్ట్రానికి దూరంగా ఉంటుంటారు. వీరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించారు. సర్వీస్‌ ఓటర్లుగా గుర్తించి అందుబాటులోకి తెచ్చినవే సర్వీస్‌ ఓట్లు.

4)ఫ్రాక్సీ ఓటు:-బీకాంలో కామర్స్‌ చదివిన వారికి సుపరిచితమైన పదం ఫ్రాక్సీ. తన ప్రతినిధిగా మరెవరినైనా పంపి ఓటు వేసే అవకాశం ఉండడం. కేంద్ర నిఘా సంస్థలు, గూడచారి సిబ్బంది తమ ఉనికిని మరెవరికీ తెలియనీయకుండా గోప్యంగా ఉంటారు. వారు బయటపడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. దీనిని ఫ్రాక్సీ ఓటు అంటారు.

5)టెండర్‌ ఓటు:-జాబితాలో పేరుండి తీరా బూత్‌లోకి వెళ్లాక తమ ఓటు వేరొకరు వేశారని తెలిసాక ఎంతో కోపం వస్తుంది. తన ఉనికిని నిర్ధారిస్తూ ప్రధానంగా.. తాను అంతకుముందు ఓటు వేయలేదని అధికారులను సంతృప్తి పర్చాలి. అప్పుడు మళ్లీ ఓటు వేసే క్రమాన్ని టెండర్‌ ఓటు అంటారు.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv