భూగోళంపై అత్యధిక భాగం ఆక్రమించి ఉన్న సముద్రాల విశిష్టత ఏమిటి? అవి మనకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి?

*🌞🌟సముద్రాల ఉపయోగమేంటి?🌟🌞*

*భూగోళంపై అత్యధిక భాగం ఆక్రమించి ఉన్న సముద్రాల విశిష్టత ఏమిటి? అవి మనకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి?*

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆవశ్యకమైన పెట్రోలియం, మాంగనీసు, సహజవాయువు, పాస్ఫరేట్‌, సల్ఫర్‌, టైటానియం, మోనోజైట్‌, బంగారం, ప్లాటినం, వజ్రాలు, తగరం, ఇనుము, ఇసుక, కంకరలకు సముద్రాలు పుట్టిళ్లు. ఆహారం నుంచి దివ్యఔషధాల వరకు సముద్రాలు ఎన్నో ప్రయోజనాలు సమకూరుస్తున్నాయి.

చేపలు, రొయ్యలు లాంటి సముద్ర జీవులు పోషక విలువలతో కూడిన ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. కేవలం ఆహారమే కాదు... నూనె, తోలు, జిగురు వంటి ఎన్నో ఉత్పత్తులు సముద్రం నుంచి లభిస్తున్నాయి.

భూమి ఉపరితలంపై చెట్లూచేమల్లాగే పర్యావరణ సమతుల్యంలో నీటి మొక్కలకూ ప్రాముఖ్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా సాగర జలాల్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో, వాటి సంఖ్య తెలుసుకునేందుకు ‘యాచ్‌’లను ఉపయోగిస్తున్నారు.


‘యాచ్‌’ అంటే పందేల్లో ఉపయోగించే ప్రత్యేకంగా నిర్మితమైన నౌకలు. ఈ నౌకల్లో ఉండే పరికరాలు సాగర జలాల ఉపరితలం రంగు మారడం వల్ల ఆ రంగుల ఆధారంగా మొక్కల జనాభాను గుర్తిస్తాయి.

సాగర గర్భంలో ఫైటో ప్లాంక్‌టన్‌ అధికంగా ఉండటం వల్ల కార్బన్‌డైఆక్సైడ్‌ను ఇవి స్వీకరించి గ్రీన్‌ హౌస్‌ ప్రభావం నుంచి భూగోళాన్ని పరిరక్షిస్తున్నాయని పరిశోధకులు తెలుసుకున్నారు. సముద్ర గర్భంలో పదివేల అడుగుల లోతులో ఒక రకం సూక్ష్మ జీవులను పరిశోధకులు గుర్తించారు.

ఆటోపిక్‌ డెర్మటైటిస్‌ అనే చర్మ వ్యాధిని నివారించడంలో ఇవి శక్తిమంతంగా పనిచేస్తాయట. అంతేకాదు వీటితో పాటు వ్యాధులను అరికట్టే శక్తి ఉన్న మరొక పది రకాల సూక్ష్మ జీవులు పరిశోధకుల దృష్టికి వచ్చాయి. ఈ విధంగా సాగరాలు మానవాళి మనుగడకు ఉపయోగపడుతున్నాయి.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv