సాలెపురుగుకు గూడెందుకు ?

*✅ తెలుసుకుందాం ✅*


*🔴సాలెపురుగుకు గూడెందుకు ?, Why do spiders need nest(spiderweb)*


✳సాలెపురుగు గోడల మూలల్లో, చెట్ల కొమ్మల్లో గూళ్ళు కడతాయి . ఇవి తమ ఆహారమైన పురుగులను పట్టుకునేందుకు ఇలా గూళ్ళు కడతాయి. గూడు కట్టేందుకు అవసరమైన దారాన్ని వాటి శరీరం నుండి ఉత్పత్తి చేస్తాయి . ఆ దారపు పోగుల్లోని పొడి దారం తో గూడులో చిక్కుకున్న కీటకాలను బంధించి ఆ తరువాత ఆహారము గా తీసుకుంటుంది . తమ గూటిలో తమ కాళ్ళు మాత్రం చిక్కుకోకుండా వెళ్ళగలిగిన నేర్పు సాలెపురులకు ఉన్నది . సాలెపురుగు ద్రవరూపం లోనే తన ఆహారము తీసుకుంటుంది . వాటి లో స్రవించే ద్రవాలు వలన గూడులో చిక్కుకున్న కీటకము ద్రవరూపం లోనికి మారుతుంది . . అప్పుడు ఆ కీటకద్రవాన్ని నోటిలో పీల్చుకుంటుంది . ద్రవరూపమ్లోనికి మారని కీటక అవశేషాలు ఆ వెబ్ లోనే మచ్చలుగా కనిపిస్తాయి.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv