మనలో ఆందోళనని (STRESS) తగ్గించుకోవడం ఎలా......?
ఆందోళన నుండి బయట పడడం ఎలా.....??
మన అందరిలోనూ Stress ఆనేది ఉంటుంది ఈ Stress వల్ల మన ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ Stress ని తగ్గించుకునేందుకు నాలుగు పాయింట్స్ చెప్తాను వీటిని మీరు పాటించి Stress ని తగ్గించుకొని ఆరోగ్యాంగా ఉండండి.
1. DONT CONFUSE
మనం Stress కి గురికావడానికి Main Reason
మనం Confuse అవ్వడం.
దీనిని తగ్గించుకోవడానికి మనం మూడు Steps Follow అవ్వాలి అవి ఏంటి అంటే
★. మనం ఎందుకు Confuse అవుతున్నాము దానికి గల కారణాలు ఏవి అనేది తెలుసుకోవాలి.
★. తర్వాత ఆ కారణాల్ని Analyze చేసుకోవాలి. అంటే దాని నుండి బయట పడడానికి మనం ఏం చేయగలం అనేది మనం ఆలోచించాలి. అవి ఆచరించాలి.
★. మనం ఏం చేయాలి అనే దానికి ఒక నిర్ణయానికి వచ్చి దాన్నే చేయాలి.
2. Take actions and never look back
మనలో చాలా మందికి ఉండే అలవాటు మనం ఎప్పుడు మనం చేసింది కరెక్టే నా ఇలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా అని ఆలోచించడం
ఇలా ఆలోచించడం వల్ల మనకి నష్టం ఎక్కువ మనం ఏ విషయం పై అంతగా ఆలోచిస్తున్నామో తెలుసుకోవాలి. అలాగే మనం ఒక నిర్ణయం తీసుకున్నాక ఒక దాని గురించి పదే పదే ఆలోచించకూడదు ఒకసారి Decide అయ్యామంటే ఇక దానిని ఎలా చేయాలి అని ఆలోచించాలి తప్ప అది చేయొచ్చ లేదా అని కాదు దీని వల్ల మనకి ఒక్క సందేహం వచ్చి దాని నుండి కొన్ని వందల సందేహాలు పుట్టుకొస్తాయి. ఇలా మనం చేయకుండా ఉండడం వల్ల మనలోని Stress ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
3. Live today foget yesterday and dont think about tomorrow
మనం ఎప్పుడు ప్రస్తుతం లో జీవించాలి.
మన Concentration అంతా కూడా ప్రస్తుతం పైనే ఉండాలి. అంతే కాని నిన్న ఇలా జరిగింది రేపు ఎం జరుగుతుందో ఆ తర్వాత ఏం జరుగుతోందో అని ఆలోచించడం మానేయాలి. ఎలా అంటే గతం లో జరిగిన దానిగురించి భవిష్యత్ లో జరగబోయేదాని గురించి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని కోల్పోవద్దు. మన కర్తవ్యం ఎంటో ఆలోచించాలి దాన్ని నిర్వర్తించాలి తప్ప గతం గురించి భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని కోల్పోవద్దు. మన Future గురించి Plans ఉండాలి కానీ అవి ఆందోళన కలిగించెవి అలాగే మన ప్రస్తుతాన్ని కోల్పోయేవి అయ్యి ఉండకూడదు. మన Future బాగుండాలి అంటే ఈరోజు మనం ఎంత చేయగలమో అంత చెయాలి మన స్ధాయి కి మించి పనిచేయాలి కానీ అనవసరమైన వాటి గురించి ఆలోచించకూడదు.
4. Embrace the worst case scenario
మనం మన పరిస్థితులని పూర్తిగా ఆహ్వానించాలి ఒప్పుకోగలగాలి వాటిని మన Style లో ఎదుర్కోవాలి అవి పాజిటివ్ అయినా నెగటివ్ అయినా మనం ఒకలాగే స్వీకరించాలి. మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి వాటన్నిటికి మనం ఆందోళన చెందకూడదు, మనం ఏం చేయగాలమో అది చేస్తూ పోవాలి అంటే తప్ప పదే పదే దాని గురించే ఆలోచిస్తూ ఉండకూడదు. ఎలాంటి ఆపద వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా మనం ఏం చేయగలమో నిశ్చయించుకొని క్డ్ చెయ్యాలి తప్ప అనవసరంగా ఆలోచిస్తూ ఆందోళన కి గురికావద్దు.
ముగింపు :-
మన జీవితం లో సంతోషాలు బాధలు రెండు వస్తుంటాయి పోతుంటాయి అవి సర్వ సాధారణం. వాటి గురించే ఆలోచిస్తూ మనలో ఆందోళన పెంచుకోవద్దు. దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండకపోగా మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. వాటి గురించి ఆలోచిస్తూ ఉండకూడదు.
మనం మనకి సమస్య వచ్చిన ప్రతీసారీ ఈ సమయం వెళ్ళిపోతుంది మళ్ళీ మన ఆనంద క్షణాలు రాబోతున్నాయి అని మన మనసుకి సర్దిచెప్పుకోవాలి తప్ప ఇంకా కృంగిపోకూడదు.
EmoticonEmoticon