How do security bugs occur in Telugu
ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు దాన్ని రియల్ టైమ్ లో సక్రమంగా టెస్ట్ చేయకపోతే ఆటోమేటిక్ గా దాంట్లో అనేక లోపాలు ఏర్పడుతుంటాయి. ఎప్పుడో ఒకప్పుడు ఫలానా అప్లికేషన్లో ఫలానా లోపం ఉంది అన్న విషయం వివిధ ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థల దగ్గర పనిచేసే సెక్యూరిటీ పరిశోధకులు గుర్తిస్తూ ఉంటారు. వెంటనే దానికి సంబంధించిన సమాచారం అధికారికంగా ఆయా అప్లికేషన్ తయారీ సంస్థలకి తెలియజేస్తారు. వెంటనే ఆ అప్లికేషన్లో లోపాలను సరి చేసిన తర్వాత సంస్థ అధికారికంగా ఒక అప్ డేట్ విడుదల చేస్తుంది. దాన్ని అప్ డేట్ చేసుకున్న వారికి ఆ బగ్ నుంచి రక్షణ లభిస్తుంది. పెద్దగా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన వారు బగ్ బారిన పడతారు.
EmoticonEmoticon