Today in History in Telugu - 23rd September

🌎 *చరిత్రలో ఈ రోజు*

23rd September 

👉 *సంవత్సరములో 267వ రోజు 39వ వారం*

👉 *సంవత్సరాంతమునకు ఇంకా 99 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*

〰〰〰〰〰〰〰〰

   _గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మాహార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్ర. చరిత్ర అంటే అనేక సంఘటనల సమహారం...అనేక మార్పులకు ...ప్రగతికి..పోరాటాలకు.. పరిణామ క్రమానికి..మంచి చెడులకు సాక్ష్యం.. అలాంటి సంఘటనలెన్నో...మార్పులెన్నో మానవాళి పరిణామ క్రమంలో ఆ వివరాలు మీకోసం అందిస్తున్న సమాచారం.._

〰〰〰〰〰〰〰〰

🔴 *ప్రత్యేక  దినాలు*

🚩 *.....

〰〰〰〰〰〰〰〰

🏀 *సంఘటనలు*

✴2009: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి ఓషన్ శాట్-2, మరో 6 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.

✴2009 నుంచి, HP ఎంటర్‌ప్రైజ్ సర్వీసెస్‌' గా EDS మార్కెట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది.

〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*

❇1886: దేవరాజు వేంకటకృష్ణారావు, పత్రికా సంపాదకుడు, రచయిత, ప్రచురణకర్త. (మ.1966)

❇1893: బులుసు అప్పన్నశాస్త్రి, తర్కశాస్త్ర పారంగతులు.

❇1902: స్థానం నరసింహారావు, రంగస్థల నటుడు. (మ.1971)

❇1914: ఒమర్ అలీ సైఫుద్దీన్ 3, బ్రూనై దేశపు 28వ సుల్తాన్. (మ.1986)

❇1917: అసీమా చటర్జీ, భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (మ.2006)

❇1922: ఈమని శంకరశాస్త్రి, వైణికుడు. (మ.1987)

❇1926: బాచు అచ్యుతరామయ్య రంగస్థల నటుడు, రాజకీయ నాయకుడు, క్రీడాకారుడు. (మ.2018)

❇1934: పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త. (మ.2008)

❇1939: కందుల వరాహ నరసింహ శర్మ, రచయిత.

❇1943: తనుజ, ఒక భారతీయ నటి

❇1949: ఒక అమెరికన్ గాయకుడు-గీతరచయిత బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్ జననం.

❇1972: కోరుకంటి చందర్ తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు.

❇1985: అంబటి రాయుడు, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.

❇1987: భారతీయ గాయకుడు రాహుల్ వైద్య జననం.

〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*

◾1939: సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1856)

◾1973: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1904)

◾1974: జయచామరాజ వడయార్‌ బహదూర్‌, మైసూర్‌ సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (జ.1919)

◾1996: సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి. (జ.1960)

◾2010: కె.బి. తిలక్, స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత. (జ.1926)

◾2010: భావరాజు సర్వేశ్వరరావు, భారత ఆర్థిక వేత్త, సామాజిక శాస్త్రవేత్త. (జ.1915)🙏




no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv