Today in History in Telugu - 22nd March

🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *22 మార్చి, 2020*
👉 *ఆదివారం*
👉 *సంవత్సరములో 82వ రోజు 12వ వారం*
👉 *సంవత్సరాంతమునకు ఇంకా 284 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*
〰〰〰〰〰〰〰〰
🔴 *ప్రత్యేక  దినాలు*
🚩 *జనతా కర్ఫ్యూ*
[ఇది మన కోసం. మన దేశ ప్రజల క్షేమం కోసం. అందరం భాగస్వాములౌదాం.
ముందు పాటించి చూద్దాం. తరువాత ఫలితాల ఫలితాల కోసం బేరీజు వేద్దాం. మనం అనుకున్నంత ఫలితం లేకపోయినా పాటించడంలో తప్పులేదు. మరచిపోకండి ఇది మన కోసం మన అందరికోసం.]
🚩 *ప్రపంచ జల దినోత్సవం*
[సాధారణ ప్రజలకు అవగాహనరేకెత్తించేందు కోసం, నీటి ప్రాధాన్యతను తెలియజేసేందుకు ఆ మొత్తం రోజంతా ప్రజలు వారి కుళాయిలను ఉపయోగించకుండా ఉండేందు కోసం ప్రోత్సహపడింది.
"ప్రాణకోటికి   జీవనాధారం   జలం. అలాంటి జలాన్ని కాపాడి ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మన ముందుంది."
నీళ్ల గురించి చెప్పమంటే మంచినీళ్లు తాగినంత ఈజీగా చెప్పొచ్చు అని అనుకుంటున్నారా?... ఆగండాగండి.
జీవ మనుగడకు ఆధారమైన నీటి గురించి మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి.
ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి గురించి మరికొంత తెలుసుకుందాం.
రంగు, రుచి, వాసన లేని పదార్థం నీరు అనే విషయం మనకు తెలిసిందే.
అయితే, అన్ని పదార్థాల మాదిరిగా సాధారణ రసాయిన నిమయాలను నీళ్లు పాటించవు.
ఆ విరుద్ధ స్వభావం వల్లే భూమ్మీద జీవ మనుగడ సాధ్యం అయింది.
మన భూగోళం మీద నీరు మొదట వాయురూపంలో ఉండేది.
తేలికైన ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులతో అది రూపొందింది.
శీతలీకరిస్తే అన్ని రసాయన పదార్థాల మాదిరిగా కాకుండా నీరు విస్తరిస్తుంది. అందువల్లే మంచుగడ్డలు నీటిపై ప్రవహిస్తాయి.
నిజానికి ఇది చాలా అసహజంగా కనిపిస్తుంది.
మంచు యుగాల నుంచి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి కారణంగా గడ్డ కట్టిన నీటిలోనూ జీవరాశులు బతికేలా చేసింది.
ఇదొక్కటే కాదు. చల్లటి నీటి కంటే వేడి నీళ్లే త్వరగా గడ్డకడుతాయనే విషయం మీకు తెలుసా.. చాలా మందికి తెలియదు.
ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. గ్లాసులో నీళ్లు పోసి రంగు, రుచి, వాసనలు లేని ఆ అద్భుత పదార్థాన్ని చూడండి.
నీటికి ఆ విచిత్ర లక్షణం లేకుంటే మీరు, నేనే కాదు ఈ భూమ్మీద జీవమే లేదు.]
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴1739: నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు.
✴1946: బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్కు స్వాతంత్ర్యం లభించింది.
✴1957: భారత ప్రభుత్వం శకసంవత్సరాన్ని జాతీయ సంవత్సరంగా స్వీకరించింది.
✴1960: ఆర్థర్ లియొనార్డ్, చార్లెస్ హెచ్ టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
✴1971: భారత లోక్ సభ స్పీకర్గా గుర్‌దయాళ్ సింగ్ థిల్లాన్ పదవి స్వీకారం.
✴1982: నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.
✴2000: భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇1828: అమరావతి శేషయ్య శాస్త్ర్రి, ఎండోమెంటు డిప్యూటీ కలెక్టరుగా రెండున్నర లక్షల ఒరిజనల్ క్లైమ్సు పత్రాలను పరిశీలించి అనేక వేలఎండోమెంటు క్లైమ్సులు పరిష్కరించాడు. (మ.1903)
❇1868: అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953)
❇1900: యజ్ఞనారాయణ శాస్త్రి, ప్రముఖ తెలుగు రచయిత, కవి, శతావధానులు.
❇1920: కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (మ.2007)
❇1907: టేకుమళ్ల కామేశ్వరరావు, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾1832: గేథే, జర్మనీ రచయిత. (జ.1749)
◾2005: జెమినీ గణేశన్, సుప్రసిద్ధ తమిళ నటుడు. (మ.2005)
◾2007: ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, సుప్రసిద్ధ తత్వవేత్త. (జ.1918)
◾2009: టి.ఎల్. ( తాడేపల్లి లక్ష్మీ) కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1923)
◾2016: మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1939) 🙏🏻

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv