Today in History in Telugu - 8th October

🌎 *చరిత్రలో ఈ రోజు*

👉 *08 అక్టోబర్  2020*

👉 *గురువారం* 

👉 *సంవత్సరములో 282వ రోజు 41వ వారం*

👉 *సంవత్సరాంతమునకు ఇంకా 84 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*

〰〰〰〰〰〰〰〰

   _గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మాహార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్ర. చరిత్ర అంటే అనేక సంఘటనల సమహారం...అనేక మార్పులకు ...ప్రగతికి..పోరాటాలకు.. పరిణామ క్రమానికి..మంచి చెడులకు సాక్ష్యం.. అలాంటి సంఘటనలెన్నో...మార్పులెన్నో మానవాళి పరిణామ క్రమంలో ఆ వివరాలు మీకోసం అందిస్తున్న సమాచారం.._

〰〰〰〰〰〰〰〰

_అక్టోబరు (October), సంవత్సరంలోని ఆంగ్లనెలలులో పదవ నెల. ఈ నెలలో 31 రోజులు ఉన్నాయి.అక్టోబరు నెలలో గాంధీ జయంతి వంటి మరిన్ని ప్రత్యేక రోజులతో ముడుపడి ఉంటుంది.ఈ మాసంలో శరదృతువు జరిగే కాలంలో అక్టోబరు రెండవ నెల. పండుగలు, కాలానుగుణ సంఘటనలు వంటి సందర్భాలను గుర్తించే ముఖ్యమైన రోజులు అక్టోబరు‌లో ఉన్నాయి.ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు ఈ నెలలో ఉన్నాయి._

〰〰〰〰〰〰〰〰

🔴 *ప్రత్యేక  దినాలు*

🚩 *భారత వైమానిక దళం వ్యవస్థాపక దినోత్సవం*

1932 అక్టోబరు 8 న భారత వైమానిక దళం అనేక యుద్ధాలు, మిషన్లలో పాల్గొంది. అందువల్ల అక్టోబర్ 8 ను భారత వైమానిక దళం వార్షికోత్సవంగా జరుపుకుంటారు.ప్రతి సంవత్సరం ఐ.ఎ.ఎఫ్. ముందుగానే ఈ రోజుకు ప్లాన్ చేస్తుంది.

తనకు అవసరమైన సిబ్బందికి అధునాతన శిక్షణ ఇచ్చుకోవడంలోను, అధునాతన యంత్రసామాగ్రిని సమకూర్చుకోవడంలోను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ముందంజలో ఉండటమే కాకుండా.. ప్రపంచ దేశాలతో పోటీ పడుతోంది. 1932 అక్టోబరు ఎనిమిదో తేదీన స్థాపితమైనప్పటికీ.. భారత వైమానిక దళంలోకి తొలి ఎయిర్‌క్రాఫ్ట్‌ను 1933 ఏప్రిల్ ఒకటో తేదీన వచ్చి చేరింది. ఆరంభంలో కేవలం ఐదు మంది పైలట్స్, ఒక ఆర్‌ఏఎఫ్‌ను కలిగివున్నది.

భారత రక్షణ వ్యవస్థలో మూడు రక్షణ దళాలు ఉన్నాయి. అవి : సైనిక, వైమానిక, నావికా దళాలు. ఈ రక్షణ దళాలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆధీనంలో ఉంటాయి. వీటి ప్రధాన కార్యాలయాలు న్యూడిల్లీలో ఉన్నాయి. బ్రిటీష్‌ కాలంలో 1932 అక్టోబర్‌ 8న వైమానిక దళం ఏర్పడింది. ఈ దళం రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గంది. దేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత 'భారత వైమానిక దళం' (ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌) ఏర్పడింది. 1.70 లక్షల మంది సిబ్బందితో, 1300 విమానాలతో భారత వైమానిక దళం ప్రపంచంలోనే నాలుగో పెద్ద వైమానిక దళంగా ప్రసిద్ధి పొందింది. వైమానిక దళం సేవలను గుర్తిస్తూ ఏటా అక్టోబర్‌ 8న భారత వైమానిక దళ దినోత్సవం నిర్వహిస్తారు.

1933 ఏప్రిల్‌ 1న భారత వైమానిక ఎయిర్‌ క్రాఫ్ట్‌ వచ్చింది. హరీష్‌ చంద్ర సిర్కార్‌, సుబ్రతో ముఖర్జీ, భూపేంద్ర సింగ్‌, అజాద్‌ భక్షా అవాన్‌, అమర్జీత్‌ సింగ్‌ మన తొలి వైమానిక దళ పైలట్లు. వీరు రెండో ప్రపపంచ యుద్ధంలో విధులు నిర్వహించారు. తర్వాత సుబ్రతో ముఖర్జీ తొలి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. సైన్యానికి అధునాతన శిక్షణ ఇవ్వడంలో, అధునాతన యుద్ధ సామగ్రిని సమకూర్చుకోవడంలో భారత వైమానిక దళం ముందుంది. ఈ దళం నిత్యం మన దేశ తీర ప్రాంతానికి గస్తీ కాస్తూ ఉంటుంది.

🚩 *రాపిడ్ యాక్షన్ దళాల అవతరణ దినోత్సవం.*

〰〰〰〰〰〰〰〰

🏀 *సంఘటనలు*

✴1932: భారతీయ వైమానిక దళం ఏర్పాటయింది.

✴1993: దక్షిణాఫ్రికాలో జాతివివక్ష అంతమవడంతో దానిపై విధించిన ఆంక్షలను ఐక్యరాజ్యసమితి ఎత్తివేసింది.

✴2009: 2009 అక్టోబరు 8న, ఒబామా మాథ్యూ, షెపర్డ్, జేమ్స్ బైర్డ్, Jr. హేట్ ప్రతీకార నేరాల నిరోధక చట్టంపై సంతకం చేశారు

〰〰〰〰〰〰〰〰

🌐 *జననాలు*

❇1860: గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు.(మ.1933)

❇1891: భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత, నాటక కర్త. (మ.1940)

❇1895: అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. (మ.1952)

❇1902: వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ ఉపకులపతి (మ.1961).

❇1918: పేకేటి శివరాం, తెలుగు సినిమా నటుడు. (మ.2006)

❇1918: బత్తుల సుమిత్రాదేవి, హైదరాబాదుకు చెందిన తెలంగాణ విమోచనోద్యమకారులు, దళిత నాయకురాలు. (మ.1980)

❇1935: ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, వైద్యుడు. (మ.1997)

❇1935: భారత క్రీడాకారుడు మిల్ఖా సింగ్ జననం.

❇1950: చివుకుల ఉపేంద్ర, అమెరికా లోని ఫ్రాంక్లిన్‌టౌన్‌షిప్‌కు డెప్యూటీ మేయర్‌గా, 2000లో మేయర్‌గా, న్యూజెర్సీ శాసనసభ్యుడుగా, శాసనసభకు ఉపసభాపతి.

❇1977: మంచు లక్ష్మి, భారతీయ సినీ, టెలివిజన్ నటి, నిర్మాత,

❇1981: దాసరి మారుతి, తెలుగు సినీ దర్శకుడు.

❇1981: భారతీయ సినిమా నటి వేద శాస్త్రి జననం.

〰〰〰〰〰〰〰〰

⚫ *మరణాలు*

◾1936: ప్రేమ్‌చంద్, భారతదేశపు హిందీ, ఉర్దూ కవి. (జ.1880)

◾1963: సి.యస్.ఆర్. ఆంజనేయులు, ( చిలకలపూడి సీతారామాంజనేయులు) తెలుగు సినిమా నటుడు. (జ.1907)

◾1976: కందుకూరి రామభద్రరావు, తెలుగు రచయిత, కవి, అనువాదకుడు. (జ.1905)

◾1979 : భారత స్వాతంత్ర్య సమర యోధుడు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మరణం (జ.1902).

◾2008: చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త సంఘ సేవకురాలు, చిత్రకారిణి. (జ.1917) 🙏🏻




no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv