🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *01 మార్చి, 2020*
👉 *ఆదివారం*
👉 *సంవత్సరములో 61వ రోజు 9వ వారం*
👉 *సంవత్సరాంతమునకు ఇంకా 305 రోజులు మిగిలినవి (ఇది లీపు సంవత్సరము)*
〰〰〰〰〰〰〰〰
🔴 *ప్రత్యేక దినాలు*
🚩 .....
〰〰〰〰〰〰〰〰
🏀 *సంఘటనలు*
✴1768: మార్చి 1, 1768లో సంతకాలు చేసిన మరో ఒప్పందం ద్వారా షా ఆలం దానాన్ని అంగీకరించి సర్కారులను కంపెనీకి అప్పగించి, తమ స్నేహానికి గుర్తుగా, నిజాము, 50,000 భరణం పొందాడు. చివరికి, 1823లో ఉత్తర సర్కారులపై పూర్తి హక్కులను నిజాము నుండి కొనేసాక అవి బ్రిటిషు వారి అధీనమై పోయాయి. సర్కారులు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమవగా, ప్రస్తుతపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలున్న ప్రాంతాన్ని గోదావరి జిల్లాగా ఏర్పరిచారు. బ్రిటిషు పాలన, 1768-1947.
✴1925: గోదావరి జిల్లా ను, కృష్ణా జిల్లాను విడదీసి, 1925 ఏప్రిల్ 15, 1925 లో, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటినుండి, గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తరువాత, తూర్పు గోదావరి జిల్లాగా పేరు మార్చుకొంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా ఏర్పడింది.విశాఖపట్నం జిల్లా నుంచి, శ్రీకాకుళం జిల్లా 1950 ఆగస్టు 15 నాడు ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది. చూడు: తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వెబ్‌సైటు
✴1925:బ్రిటిష్ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మారింది). తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు.[1] చూడు: పశ్చిమ గోదావరి జిల్లా.
✴1969 : భారతీయ రైల్వేలు రాజధాని ఎక్స్‌ప్రెస్ లను ప్రవేశపెట్టాయి. మొదటి రైలు ఢిల్లీ, కోల్‌కతాల మధ్య మొదలైంది.
✴2008: బంగ్లాదేశ్తో చిట్టగాంగ్లో జరుగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.
〰〰〰〰〰〰〰〰
🌐 *జననాలు*
❇1887: *చెరుకువాడ వేంకట నరసింహం,* ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (మ.1964)
❇1901: *నల్లపాటి వెంకటరామయ్య,* ఆంధ్ర రాష్ట్ర ప్రథమ శాసనసభ స్పీకర్. (మ.1983)
❇1908: *ఖండవల్లి లక్ష్మీరంజనం,* సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు పరిశోధకులు. వీరు తూర్పు గోదావరి జిల్లా పెదపూడి గ్రామం. (మ.1986)
❇1918: *ఆవేటి పూర్ణిమ,* ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి. (మ.1995)
❇1938: *యలమంచిలి హనుమంతరావు,* ఆల్‌ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (మ.2016)
❇1942: *.జె.రావు,* భారత ఎన్నికల కమిషన్ పరిశీలకులు, బీహార్ లాంటి ప్రమాదకర రాష్ట్రంలో ఎనికల ప్రక్రియను గాడిలో పెట్టిన ధీరుడు.
❇1951: *నితీశ్ కుమార్,* బీహార్ ముఖ్యమంత్రి.
❇1955: *వెలమల సిమ్మన్న,* బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు.
❇1968 : భారతీయ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి *కుంజరని దేవి* జననం.
❇1986: *ఎన్. సి. కారుణ్య,* పాడుతా తీయగా కార్యక్రమంలో విజేతగా నిలిచాడు. ఇతడి రెండవ ఆల్బమ్ సాయి మాధురిని శ్రీ సత్యసాయి బాబా సమక్షంలో విడుదల చేశాడు. ఇతడు ఇండియన్ అయిడల్ (సీజన్ 2) లో రెండవ స్థానాన్ని పొంది జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
〰〰〰〰〰〰〰〰
⚫ *మరణాలు*
◾1989: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి *వసంత్‌దాదా పాటిల్.*
◾1997: *యలమంచిలి వెంకటప్పయ్య,* స్వాతంత్ర్య సమర యోధుడు. హేతువాది. మంత్రాలులేని వివాహాలు, కులాంతర వివాహాలు పట్టుబట్టి చేయించారు. (జననం: 30 డిశెంబరు 1898 )
◾2010: *తాడూరి బాలాగౌడ్,* భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు మరియు నిజామాబాదు లోకసభ నియోజకవర్గం సభ్యుడు. (జ.1931) 🙏🏻
EmoticonEmoticon