గ్రూప్ 3 రాతపరీక్షల మార్కుల జాబితా వెల్లడి

 ఉద్యోగ నియామక రాత పరీక్షల మార్కులను ఏపీపీఎస్సీ డిసెంబరు 27న వెల్లడించింది. అనంతపురం, కడప జిల్లాల్లో రెండు పేపర్లలో కలిపి అభ్యర్థులు గరిష్ఠంగా 168, 169 మార్కులను సాధించారు. అభ్యర్థుల జాబితాను కమిషన్‌ జిల్లాల కలెక్టర్లకు పంపనుంది. ప్రకటించిన పోస్టుల సంఖ్య, సామాజిక వర్గాల వారీగా జిల్లాల్లో నేరుగా నియామకాలు జరుగుతాయి.

కొంత సమయం అనివార్యం! 
గ్రూపు-3 రాత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన వారు గ్రూపు-2 ఉద్యోగాల ఎంపికలో ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది. అందువల్లే ధ్రువపత్రాల పరిశీలన సమయంలో వారి నుంచి గ్రూపు-2 లేదా గ్రూపు-3 ఉద్యోగంలో దేనికి ప్రాధాన్యమిస్తారన్న దానిపై అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తీసుకుంటామని కమిషన్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గ్రూపు-3 మార్కులు వెలువడినప్పటికీ తదుపరి చర్యలకు మరికొంత సమయం పట్టనుంది.

For Details Visit: https://www.psc.ap.gov.in/Default.aspx


EmoticonEmoticon