Telangana TSPSC Recruitment- Vacancies in Horticulture,Health, Hostel welfare Departments

Telangana TSPSC Recruitment- Vacancies in Horticulture,Health, Hostel welfare Departments

తెలంగాణలో వైద్యఆరోగ్య, ఉద్యానశాఖల్లో 423 పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్పీఎస్సీ ప్రకటనలు విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏడాదిలో తొలి ఉద్యోగ ప్రకటనలు వెలువరించింది. ఇందులో ఉద్యానశాఖలో ఉద్యాన అధికారులు, వైద్యవిద్యలో సహాయ లైబ్రేరియన్లు, ప్రజారోగ్య, వైద్యవిద్య, వైద్యవిధాన పరిషత్లో 238 ఫార్మాసిస్టు గ్రేడ్-2 పోస్టులున్నాయి. వైద్యవిధాన పరిషత్లో ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ పోస్టులు 152 ఉన్నాయని కమిషన్ కార్యదర్శి వాణీప్రసాద్ ఓప్రకటనలో పేర్కొన్నారు. ఆయా పోస్టులకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు జనవరి 31 బీసీ, గిరిజన సంక్షేమశాఖల్లోని 310 పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువరించేందుకు కమిషన్ కసరత్తు పూర్తి చేసింది. బీసీ సంక్షేమశాఖలో 219 పోస్టులు, గిరిజన సంక్షేమశాఖలో 91 పోస్టులున్నాయి
ప్రకటనలు విడుదలైన పోస్టులు 
ఉద్యాన అధికారులు 27
సహాయ లైబ్రేరియన్లు, డీఎంఈ 06
గ్రేడ్-2 ఫార్మాసిస్ట్ 238
ఏఎన్ఎం, ఎంపీహెచ్లు 152
31 విడుదలయ్యే ప్రకటనలు 
బీసీ వసతిగృహ సంక్షేమ అధికారులు (గ్రేడ్-2) - 219
గిరిజన వసతిగృహ సంక్షేమ అధికారులు (గ్రేడ్-2) - 87
గిరిజన వసతిగృహ సంక్షేమ అధికారులు (గ్రేడ్-1)- 04
టీఆర్టీ దరఖాస్తుల ఎడిట్కు అవకాశం 
ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) దరఖాస్తుల్లో వ్యక్తిగత వివరాలు సరిచేసుకునేందుకు, పది జిల్లాల ప్రాతిపదికన ప్రాధాన్యక్రమాన్ని మార్చుకునేందుకు మరోసారి అవకాశమివ్వనున్నట్లు కమిషన్ ఓప్రకటనలో తెలిపింది. జనవరి 26, 27 తేదీల్లో అభ్యర్థులు దరఖాస్తులను ఎడిట్ చేసుకోవాలంది. ఇప్పటికే అవకాశాన్ని ఇచ్చినా కొందరు అభ్యర్థులు వాటిని సరిచేయలేదని... ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది.

Telangana TSPSC Recruitment- Vacancies in Horticulture,Health, Hostel welfare Departments

1 comments:


EmoticonEmoticon