భారతదేశంలో విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పూర్తివివరాలు
చాలామంది భారత రాజ్యాంగాన్ని చదవరు.!! భారత సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకోరు...!! రిజర్వేషన్లు ఎందుకోసం వచ్చాయి..!!
వాటి లక్ష్యం ఏంది...!!
రాజ్యాంగంలో వాటిని ఎంతకాలం వరకు పొందుపరిచారు...??
అసలు రిజర్వేషన్లు అనేవి ఎన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయి అనే విషయాలమీద అవగాహన లేకుండా వితండవాదం చేస్తూ ఉంటారు...?? అలాంటి వారందరి కోసం భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన పొందుపరిచారు అవి ఏవిధంగా అమలుపరచబడు తున్నాయి, వాటి కాలపరిమితి ఎంత అనే విషయాలపై నాకు తెలిసినంతవరకు కొంత వివరించాలి అనుకుంటున్నా.
రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలో పొందుపరచడానికి ప్రధాన కారణం సామాజిక వెనుకబాటుతనం, విద్యలో వెనుకబాటుతనం, కొన్ని వర్గాలకు తగినంత ప్రాతినిధ్యం లేకపోవడం.
ఆర్థిక వెనకబాటుతనం అనే పదాన్ని రాజ్యాంగంలో ఉపయోగించలేదు. ప్రజల్లో సామాజిక వెనుకబాటుతనం కులం ఆధారంగా నిర్మించబడి ఉన్నది కాబట్టి సమాజంలో ఏ కులాలు అయితే వెనుకబాటుతనానికి గురై ఉన్నాయే అలాంటి వర్గాలవారికి రిజర్వేషన్ల ద్వారా కొన్ని రక్షణలు కల్పించారు. అంటే కొన్ని వేల సంవత్సరాలు కులం ఆధారంగా కిందిస్థాయి ప్రజలు అధికారానికి, వనరులకు, రాజ్యాధికారానికి దూరంగా నెట్టి వేయబడి అస్పృశ్యతకను అనుభవించారు కాబట్టి ఇకముందు రాజ్యాంగం అమల్లోకి వచ్చాక అలాంటి పరిస్థితులు సామాన్య ప్రజానీకం ఎదుర్కొనకుండా రాజ్యాంగం ద్వారా కుల వివక్షకు దూరంగా రక్షణ కల్పించడం జరిగింది.
రాజ్యాంగం ద్వారా మూడు రకాల రిజర్వేషన్లు కల్పించడం జరిగింది.
1... రాజకీయ రంగంలో రిజర్వేషన్లు.
2... విద్యా రంగంలొ రిజర్వేషన్లు.
3... ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు.
1.. .. రాజకీయ రంగంలో రిజర్వేషన్లు... ఇవి భారత రాజ్యాంగం అమలులోకి రావడం ద్వారానే అమలు చేయబడ్డాయి. వీటి కాలపరిమితి కేవలం పది సంవత్సరాలు మాత్రమే. భారత రాజ్యాంగం నిబంధన 334 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం అమలులోకి వచ్చిన 10 సంవత్సరాల వరకు రాజకీయ రిజర్వేషన్లు ( చట్టసభల్లో లోక్సభలో ఎమ్ పీ, శాసనసభలో ఎమ్మెల్యే) అమలులో ఉంటాయి.
## ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో సీట్లు రిజర్వేషన్ చేయాలని భారత రాజ్యాంగం 330 నిబంధన తెలుపుతుంది.
## ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర శాసనసభలో సీట్లు రిజర్వేషన్ చేయాలని భారత రాజ్యాంగం 332 నిబంధన తెలుపుతుంది.
## ప్రకరణ 341(1) ప్రకారం ఏదైనా కులాన్ని ఎస్సీ గా అలాగే ప్రకరణ 342(2) ప్రకారం ఏదైనా కులాన్ని ఎస్టీ గా రాష్ట్రపతి ప్రకటించవచ్చు.
** నిబంధన 334 పది సంవత్సరాల వరకు రిజర్వేషన్ అనే పదాలను 8 వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించి. ఎస్సీ ఎస్టీలకు చట్టసభలలో కల్పించిన రాజ్యాంగపర రిజర్వేషన్లను మరో పది సంవత్సరాలు కాలపరిమితి పెంచడం జరిగింది.
## 23 వ రాజ్యాంగ సవరణ ద్వారా నిబంధన 333, 332, 334 లను సవరించి రాజకీయ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల కాలం పొడిగించడం జరిగింది.
## 45 వ రాజ్యాంగ సవరణ::1980 ద్వారా ఎస్సీ ఎస్టీలకు ఆంగ్లో-ఇండియన్ లకు లోక్సభలో రాష్ట్ర శాసనసభలలో మరో పది సంవత్సరాలు 1990 వరకు రిజర్వేషన్ పొడిగించడంచడం జరిగింది.
## 62 వ రాజ్యాంగ సవరణ ద్వారా నిబంధన 334 ని సవరించి ఎస్సీ ఎస్టీ ఆంగ్లో-ఇండియన్ లకు మరో పది సంవత్సరాలు రిజర్వేషన్ను పొడిగించడం జరిగింది.
## అలాగే 79 వ రాజ్యాంగ సవరణ ద్వారా మరో పది సంవత్సరాలు రిజర్వేషన్ పొడిగించడం జరిగింది.
## అలాగే ప్రస్తుతం 95 వ రాజ్యాంగ సవరణ ద్వారా 334 నిబంధనలను సవరించి రిజర్వేషన్లను మరో పది సంవత్సరాలు అనగా 2020 వరకు పొడిగించడం జరిగింది. 334 నిబంధన లో 60 సంవత్సరాలు అనే పదం స్థానంలో 70 సంవత్సరాలు అనే పదాన్ని చేర్చడం జరిగింది.
అయితే 10 సంవత్సరాల కాలపరిమితి ముగిసినప్పుడు అల్లా ఈ రిజర్వేషన్లను పొడిగించాలని కిందిస్థాయి ప్రజలు కూడా కోరుకోవడంలేదు. SC ST ప్రజలు వాటి గురించి అడగ ముందే రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ పెంచడం జరుగుతుంది. ఒకవేళ ఈ పది సంవత్సరాలు ముగిసిన తరువాత రిజర్వేషన్ తీసివేస్తే వాళ్ళలో రాజకీయ చైతన్యం వస్తుంది అని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వాటిని పెంచుకుంటూ పోతున్నారు.
ఈ విధంగా రాజకీయ రిజర్వేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ సామాజికవర్గానికి పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఒక పార్టీ కింద గెలిచి చట్టసభలకు వెళ్లే ఇలాంటి వర్గాన్ని గౌరవనీయ కాన్షీరాం రాజకీయాలు చెంచాలుగాగ అభివర్ణించాడు
( నోట్ ఇక్కడ పది సంవత్సరాలు కాలపరిమితి అనే నిబంధన కేవలం రాజకీయ రంగంలో రిజర్వేషన్లకు మాత్రమే వర్తిస్తుంది. రాజ్యాంగ సవరణ చేసి కేవలం రాజకీయ రిజర్వేషన్లను మాత్రమే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి పెంచుకుంటూ రావడం జరుగుతుంది. ఈ పది సంవత్సరాలు అనే పదం విద్యారంగంలో ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లకు వర్తించదు)
2.... ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు.
ఈ రకమైన రిజర్వేషన్లు భారత రాజ్యాంగం అమలులోకి రావడం ద్వారానే అమలులోకి వచ్చాయి.
##... 16(4) ప్రకారం కొన్ని వెనుకబడిన తరగతుల వారికి ( BC SC ST) ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావించినట్లయితే వారికోసం కొన్ని ఉద్యోగాలను రిజర్వ్ చేస్తూ నిబంధనలను రూపొందించవచ్చు .
అంటే రాజ్యాంగం ద్వారా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లను కల్పిస్తున్న నిబంధన 16 class 4.వీటికి కాలపరిమితి లేదు. 10 సంవత్సరాల వరకే అనే నిబంధన ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లకు అసలు వర్తించదు. సామాజిక వెనుకబాటుతనం కులవివక్ష వలన ఈ రిజర్వేషన్లు సృష్టించబడ్డాయి కాబట్టి సామాజిక న్యాయం, సమసమాజ స్థాపన జరిగే వరకు ఇవి అందుబాటులో ఉంటాయి.
((కాకపోతే ఉద్యోగ రంగంలో ఉమ్మడి రిజర్వేషన్ల వలన ఏదైనా వర్గానికి సరైన ప్రాతినిధ్యం లభించక పోయినట్లయితే వారికోసం కొన్ని నిబంధనలు రూపొందించుకుంటే మంచిది.))
3.... విద్యారంగంలో రిజర్వేషన్లు.
ఈ రకమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అమలు ద్వారా అమలులోకి రాలేదు. దానికి కారణం ప్రాథమిక హక్కుల ద్వారా మొదట ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించబడలేదు.
నిబంధన 46:: లో రిజర్వేషన్ల యొక్క కాన్సెప్టు దాగి ఉన్నది.
దీని ప్రకారం బలహీనవర్గాల వారి ఆర్థికాభివృద్ధికి విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ ప్రభుత్వం తీసుకోవాలి. వారు ఏ విధంగా దోపిడీకి గురి కాకుండా సామాజికంగా అన్యాయానికి గురి కాకుండా ప్రభుత్వం శ్రద్ధ చూపాలీ.
46 నిబంధనలను అమలు చేయడానికి మద్రాసు ప్రభుత్వం 1951లో వైద్య ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ప్రతి కులానికి కొన్ని సీట్లు కేటాయించి ఒక జీవో జారీ చేసింది . ఈ జీవో ద్వారా champakam dorairajan అనే అమ్మాయి కీ ఎక్కువ మార్కులు వచ్చినా, మద్రాసు ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారం తనకంటే తక్కువ మార్కులు వచ్చిన అమ్మాయికి వైద్య కళాశాలలో సీటు రావడం జరిగింది. అప్పుడు చంపకం దొరైరాజన్ అనే అమ్మాయి ప్రాథమిక హక్కుల లోని నిబంధన 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానత్వం అనే హక్కుకు మద్రాసు ప్రభుత్వం తెచ్చిన జీవో విరుద్ధంగా ఉంది అని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది.
మద్రాసు ప్రభుత్వం 46వ ప్రకరనలో పేర్కొన్న ఆదేశం సూత్రాలను అమలుపరచడానికి ఈ జీవో జారీ చేయడం జరిగింది అని సుప్రీంకోర్టులో వాదించినా,,,
సుప్రీంకోర్టు 46వ ప్రకటనలో పేర్కొన్న ఆదేశ సూత్రాలను అమలు పరచడానికి ప్రాథమిక హక్కులను తోసివేయడం, ముఖ్యంగా ఈ జీవో నిబంధన 14 ,15 వ్యతిరేకమైనందువలన ఈ జీవో రాజ్యాంగ రీత్యా చెల్లదని కొట్టివేసింది.
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడానికి, 1951 లోమొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15(4) విద్యాపరంగా సాంఘికంగా వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వారి అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన నిబంధనలను జారీచేయవచ్చు అనే నిబంధనను ప్రాథమిక హక్కులలో చేర్చింది. అంటే ""రక్షత వివక్షత"" అనే భావనను ఈ నిబంధనలో పొందుపరచడం జరిగింది.
15(4) ప్రకారం వెనుకబాటుతనం అంటే కేవలం కులాన్ని బట్టి కాక సామాజిక విద్యా సంబంధమైన అనే అర్థం కూడా ఉండాలి అని రాజ్యాంగం పేర్కొన్నది.
దీన్నిబట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే విద్యాసంబంధమైన రిజర్వేషన్లు రాజ్యాంగము అమలుతో అమలులోకి రాలేదు, మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 15(4) class 4 నిబంధన ను రాజ్యాంగంలో చేర్చి రాజ్యాంగబద్ధత కల్పించిన తర్వాతనే విద్యాసంబంధ రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి.
అలాగే 2005లో 93వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రైవేటు విద్యాసంస్థలలో,30(1) మైనారిటీ విద్యాసంస్థలను మినహాయించి మిగతా ఎయిడెడ్ విద్యాసంస్థలతో సహా అన్ని విద్యాసంస్థల ప్రవేశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించే ప్రత్యేక నిబంధనలు ప్రభుత్వం చేయవచ్చు. ఇక్కడ బీసీ సామాజికవర్గానికి విద్యాసంస్థలలో రిజర్వేషన్ కల్పించాలి అని తెలిపే నిబంధన 15 (5) అనే విషయాన్ని గుర్తించుకోవాలీ.
నోట్"""" విద్యా సంస్థలలో రిజర్వేషన్లకు కూడా కాలపరిమితి లేదు. ఇవి అందరికీ విద్య అందేవరకు అనగా భారతదేశం 100% అక్షరాస్యత సాధించేవరకు అందుబాటులో ఉండాల్సిందే.
10 సంవత్సరాల కాలపరిమితి అనే నిబంధన విద్యారంగంలో రిజర్వేషన్లకు అసలు వర్తించదు.
మొత్తంమీద రిజర్వేషన్లు విద్యారంగంలో రాజకీయరంగంలో ఉద్యోగ రంగంలో ఎస్సీ ఎస్టీలకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో విద్యారంగంలో ఉద్యోగ రంగంలో కల్పించబడిన రిజర్వేషన్ల ద్వారా ఎస్సీ ఎస్టీల సామాజిక ఆర్థిక స్థితి మెరుగు పడింది కానీ రాజకీయరంగంలో కల్పించబడిన రిజర్వేషన్లు పూర్తిగా నిష్ప్రయోజన మయినాయి.
ఇంకపోతే బీసీ సామాజికవర్గానికి విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ రాజకీయ రంగంలో బీసీ సామాజికవర్గానికి రిజర్వేషన్లు కేటాయించబడే లేదు.ఏదేని రాష్ట్రంలో కాని దేశంలో కాని bc సామాజికవర్గం 55 శాతం పైగా ఉన్నది మరి వాళ్ళ జనాభా ఆధారంగా చట్టసభలలో ప్రాతినిధ్యం ఉన్నదా.....???
వాళ్లు ప్రాతినిథ్యం వహించ వలసిన స్థానాలలో చట్టసభలకు ఏ వర్గంవాళ్ళు వెళుతున్నారు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ సభ్యులైతే కాదు వాళ్లకు కేటాయించిన సీట్లు ఎన్ని ఉన్నాయో అంతమందే చట్టసభల్లోకి వెళుతున్నారు. ఈ అవగాహన బిసి సామాజికవర్గంలో ఎప్పుడైతే వస్తుందో...??

EmoticonEmoticon