Daily Current Affairs 07.August.2018


*Today CA..07.08.2018*


01) ఇటాలియన్ బ్రాండ్ టూ వీలర్ సంస్థ బెనెలీ హైదరాబాద్ లో మహావీర్ గ్రూపుతో కలసి అసెంబ్లింగ్ ప్లాంట్ ను ఎక్కడ ఏర్పాటు చేయబోతోంది ?
జ: గుండ్ల పోచంపల్లిలో


02) 123వ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ కమిషన్ కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర సామాజిక న్యాయం- సాధికారత శాఖ మంత్రి ఎవరు ?
జ: థావర్ చంద్ గహ్లోత్

03) జమ్ము కశ్మీర్ పౌరులకు ప్రత్యేక హక్కులు విశేష అధికారాలు కల్పించే 35ఏ అధికరణాన్ని ఏ సంవత్సరంలో రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా పొందుపరిచారు ?
జ: 1954లో


04) ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమల అభివృద్ధికి ఉద్దేశించిన ఈశాన్య రాష్ట్రాల పారిశ్రామిక అభివృద్ధి పథకంను ఎప్పటి వరకూ పొడిగిస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌదరి తెలిపారు ?
జ: 2022 వరకూ


05) ఢిల్లీలో చనిపోయిన రాజన్ నందా ఏ సంస్థ గ్రూపు ఛైర్మన్ గా ఉన్నారు ?
జ: ఎస్కార్ట్స్ గ్రూపు ఛైర్మన్


06) అంకుర (స్టార్టప్ ) సంస్థలను ప్రోత్సహించేందుకు ‘‘స్టార్టప్ అండ్ టెక్నాలజీ సమ్మిట్’’ 2018 అక్టోబర్ 11-13 తేదీల్లో ఎక్కడ జరుగుతోంది ?
జ: గుజరాత్ గాంధీనగర్ లో


07) ఎయిర్ సెల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత National Stock Exchange ఛైర్మన్ ఎవరు ?
జ: అశోక్ చావ్లా


08) ఇందిరాగాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి ఢిల్లీలో చనిపోయారు. ఆయన పేరేంటి ?
జ: ఆర్.కె.ధావన్


09) పెప్సికో CEOగా 12 యేళ్ళ పాటు పనిచేసి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ఇండో అమెరికన్ ఎవరు ?
జ: ఇంద్రానూయి (2019 వరకూ ఛైర్మన్ గా కొనసాగుతారు )


10) పెప్సికో కొత్త CEO గా ఎవరు నియమితులయ్యారు ?
జ: రామన్ లగార్తా


11) సెకనుకు బిలియన్ బిలియన్ ( క్వింటిలియన్) లెక్కలు చేయగల సూపర్ కంప్యూటర్ ను చైనా ఆవిష్కరించింది. దాని పేరేంటి ?
జ: సన్ వే ఎక్సా స్కేల్
(నోట్: 700కోట్ల మంది క్యాలిక్యులేటర్ తో 33యేళ్ల పాటు చేసే కాలిక్యులేషన్ ను ఇది ఒక్క నిమిషంలో చేయగలదు )


12) 2018 ఆగస్ట్ 7 నుంచి ఏ దేశంపై మళ్లీ ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది ?
జ: ఇరాన్ పై


13) కౌంటీ దిగ్గజం మిడిలెసెక్స్ తో కలసి భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నడుపుతున్న అకాడమీ ఎక్కడ ప్రారంభించారు ?
జ: లండన్ లో (నార్త్ వుడ్ లోని మార్చంట్ టేలర్ స్కూల్లో ).

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv