🔲ప్రశ్న: ఆకాశంలో మెరుపులు వస్తుంటే, రేడియో గరగరమంటుందెందుకు?
జవాబు: వాతావరణ పీడనంలో తటాలున సంభవించే మార్పుల వల్ల ఆకాశంలోని మేఘాలు కదులుతాయి. అప్పుడు వాటిలోని మంచుముక్కలు, నీరు కొంత చెల్లాచెదురై వాటి మధ్య ఘర్షణ జరిగి మేఘాలకు విద్యుదావేశం కలుగుతుంది. మేఘాలపై రుణ విద్యుదావేశం (negetive electric charge) వస్తే, భూమిపై వస్తువులకు ధన విద్యుదావేశం (positive electric charge) సంక్రమిస్తుంది. వీటి మధ్య అనుసంధానం జరిగితే ఒక సారిగా తీవ్రమైన విద్యుత్ ఉత్సర్గం (electric discharge) వెలువడుతుంది. అదే ప్రకాశవంతమైన మెరుపు. ఈ ఎలక్ట్రిక్ స్పార్క్ వల్ల విద్యుత్ అయస్కాంత తరంగాలు ఏర్పడుతాయి.
రేడియో స్టేషన్ నుంచి మన రేడియోకి ప్రసారమయ్యేవి విద్యుదయస్కాంత తరంగాలే. మన రేడియో అందుకునే విద్యుదయస్కాంత తరంగాలు, మెరుపు వల్ల వచ్చే విద్యుదయస్కాంత తరంగాల పౌనఃపున్యం (frequency) సమానంగా ఉంటే, మెరుపు వల్ల జనించే తరంగాలు కూడా రేడియోలో వినిపిస్తాయి. అయితే వాటి తీవ్రత ఎక్కువగా ఉండడంతో రేడియోలో మనకు గరగరమనే శబ్దాలు కలుగుతాయి.
EmoticonEmoticon