పాదరసం అంటిన చోట బంగారం తెల్లగా మారుతుంది, ఎందుకు?

పాదరసం అంటిన చోట బంగారం తెల్లగా మారుతుంది, ఎందుకు?


పాదరసంలో చాలా లోహాలు కరిగిపోతాయి. చక్కెర, ఉప్పులను నీటిలో వేస్తే కరిగిపోయినట్లు. చక్కెర, ఉప్పు బయట స్ఫటికరూపంలో అణువుల సముదాయంగా ఉన్నప్పటికీ, నీటిలో వేయగానే అవి విడివిడి అణువులుగా విడిపోతాయి. అలాగే పాదరసంలో బంగారాన్ని వేసినప్పుడు కూడా దాని పరమాణువులు విడిపోతాయి. ఒక్క బంగారమే కాదు, రాగి, జింకు కూడా పాదరసంలో కరిగిపోయి, అమాల్గములనే ద్రావణులను ఏర్పరుస్తాయి. అయితే ఒక బంగారు ఆభరణానికి కొద్దిగా పాదరసం అంటుకున్నప్పుడు మొత్తం బంగారాన్ని కరిగించే మోతాదు లేకపోవడం వల్ల అది తాకిన చోట మాత్రం అమాల్గము ఏర్పడుతుంది. పాదరసానికి గాలిలో స్థిరత్వం లేకపోవడం వల్ల బంగారానికి అంటుకున్న పాదరసపు పరమాణువులు గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి మెర్కురిక్ఆక్సైడు అనే తెల్లని సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. అదే బంగారంపై ఏర్పడే తెల్లని మచ్చ. దాన్ని చెరపాలంటే మొదట స్టానస్క్లోరైడు ద్రావణంలో ముంచిన దూదితో రుద్ది, ఆపై రాగి లేదా జింకు బిళ్లతో పదేపదే రుద్దితే అక్కడున్న పాదరస పరమాణువులు వైదొలగిపోతాయి.


no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv