ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది?

ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది?

 ‘జీవం’ అంటేనే రసాయనిక ధర్మాల సమాకలనమేనని, ‘కణ నిర్మాణం’ అంటేనే రసాయనిక పదార్థాల మధ్య ఉన్న అనుబంధమేనని, రుచులు, వాసనలన్నీ రసాయనిక పదార్థాలకు, జ్ఞానేంద్రియాలైన నాలుక, ముక్కుల్లో ఉన్న రసాయనిక గ్రాహకాల (chemoreceptors) కు మధ్య ఏర్పడే చర్యాశీలతే (reactivity) నని జీవ రసాయనిక శాస్త్రం (biochemistry) ఋజువు చేసింది.

 ఆపిల్‌ పండులో ప్రధానంగా ఎన్నో ఇతర రుచిలేని గుజ్జు, నీటితో పాటు అందులో కరిగిన గ్లూకోజ్‌ వంటి చక్కెరలున్నాయి. ఆపిల్‌పండును నోటికి తాకిస్తే నాలుక మీదున్న రుచిగుళికల (taste buds) మీదకు ఆయా పదార్థాలు కొద్దిగా చేరుకుంటాయి. అక్కడ పరీక్ష చేసే డాక్టరులాగా రుచి నాడీ చివర్లు (taste nerve ends) ఉంటాయి. అక్కడ జరిగే విద్యుద్రసాయనిక చర్యల సారాంశంలో ప్రత్యేకమైన సంకేతాలు మెదడుకు చేరతాయి. ఆ సంకేతాలను మెదడు ‘తీయదనం’గా భావించి ఇంకాస్త తినమని ప్రోత్సహిస్తుంది. 

వేపపండులో చేదుగుణాన్ని కలిగించే ‘పిక్రిక్‌ ఆమ్లము’ తదితర అవాంఛనీయమైన ఆల్కలాయిడ్లు ఉంటాయి. వీటికి క్రిమిసంహారక లక్షణాలు (antibiotic characters) ఉన్నాయి. కాబట్టి పొలాల్లో క్రిమి సంహారిణులుగా వాడితే మంచిది. నోట్లో వేసుకొంటే ఆ నాడీ చివర్ల జరిగే రసాయనిక సంకేతాలు ‘మరోలా’ ఉండడం వల్ల ఆ సంకేతాల సారాన్ని మెదడు ‘చేదు’ అంటూ మానెయ్యమంటుంది.

ఆపిల్‌ ఎందుకు తీయగా ఉంటుంది? వేపపండు ఎందుకు చేదుగా ఉంటుంది?


EmoticonEmoticon