Important Military Operations of Indian Army in Telugu

ఆపరేషన్ విజయ్
1999 మే 14న కార్గిల్ లో అక్రమంగా చొరబడిన వారిని నిరోధించడానికి భారత సైన్యం చేపట్టిన చర్య.

🏓ఆపరేషన్ టోర్నడో
ముంబయిలో తీవ్రవాదుల దాడి జరిగినప్పుడు నారీమన్ హోటల్లో చిక్కుకున్న బందీలను విడిపించడానికి సైన్యం నిర్వహించిన చర్య.

🏓ఆపరేషన్ బ్లూ స్టార్
అమృతసర్ లోని స్వర్ణదేవాలంలో ఉన్న తీవ్రవాదులను చంపడానికి 1984లో భారత సైన్యం చేపట్టిన చర్య ఇది

🏓ఆపరేషన్ సైక్లోన

ముంబయి నగరంపై 2009 సంవత్సరం నవంబరు 26న జరిగిన దాడిలో తాజ్ హోటల్ లో దాక్కున ఉగ్రవాదులను నాశనం చేయడానికి నిర్వహించిన కార్యక్రమం.

🏓ఆపరేషన్ కోబ్రా
జమ్మూ-కశ్మీర్ లో తీవ్రవాదుల ప్రాబల్య నిరోధానికి చేపట్టిన చర్య.

🏓ఆపరేషన్ పరాక్రమ్
భారత్ పార్లమెంటుపై 2001లో దాడి జరిగినప్పుడు తలెత్తిన అవాంఛనీయ పరిస్థితులు, ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దులోకి సైన్యాన్ని తరలించే చర్య.

🏓ఆపరేషన్ గుడ్ విల్
జమ్మూ-కశ్మీర్ లోని ప్రజల విశ్వాసాన్ని సంపాదించడానికి భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం.

🏓ఆపరేషన్ సెర్చ్
ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోసం స్వర్ణదేవాలయం కేంద్రంగా పోరాడుతున్న ఖలిస్థాన్ తీవ్రవాదులను నిరోధించడానికి భారత సైన్యం చేసిన చర్య.

🏓ఆపరేషన్ కూంబింగ్-1
పంజాబ్ లో తీవ్రవాదుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వారిని నిరోధించడానికి

చేపట్టిన చర్య.

* 🏓ఆపరేష,Tejonath
న్ ఉడ్ రోజ్*
1984లో పంజాబ్ లో తీవ్రవాదుల ఏరివేత చర్య

*🏓ఆపరేషన్ షాప

్*
1984లో స్వర్ణ దేవాలం మినహా మిగతా గురుద్వారాలలో చేపట్టిన చర్య.

🏓ఆపరేషన్ బ్లాక్ థండర్
1988లో స్వర్ణ దేవాలయం నుంచి తీవ్రవాదుల ఏరివేత.

🏓ఆపరేషన్ రక్షక్ 1, 2
పంజాబ్ లో తీవ్రవాదుల అరాచకాలకు అడ్డుకట్ట వేసి, అక్కడ ప్రశాంత ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన చర్య.

🏓ఆపరేషన్ నైట్ డామినేన్
పంజాబ్ లో రాత్రి వేళల్లో గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం.

* 🏓ఆపరేషన్ ఫైనల్ ఎసాల్ట్*
పంజాబ్ లో ఉగ్రవాద అణచివేత చర్యలు.

🏓ఆపరేషన్ విన్ ఓవర్
పంజాబ్ లో ప్రజల అభిమానాన్ని పొందడానికి సైన్యం చేపట్టిన కార్యక్రమం.

🏓ఆపరేషన్ హంట్ డౌన్
సరిహద్దు భద్రతా దళం, కశ్మీర్ లోని పోలీసులతో కలిసి కశ్మీర్ లోని ఉగ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన ఆపరేషన్.

🏓ఆపరేషన్ టైగర్
జమ్మూ-కశ్మీర్ లో ఉగ్రవాద నిరోధానికి చేపట్టిన చర్య.

🏓ఆపరేషన్ ఫాక్స్
జమ్మూ – కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి నిర్వహించిన కార్యక్రమం ఇది.

🏓ఆపరేషన్ విక్రమ్
ఉగ్రవాదుల నిర్మూలనకు, శాంతి స్థాపనకు జమ్మూ-కశ్మీర్ లో నిర్వహించిన సైనిక చర్య.
ఆపరేషన్ క్రాంతిఅసోమ్ లో చెలరేగిన తీవ్రవాదులను నిర్మూలించి ప్రజలకు రక్షణ కల్పించడానికి భారత సైన్యం ఈ చర్య చేపట్టింది.

🏓ఆపరేషన్ భజరంగ్
1980లో అసోమ్ లో ఉల్ఫా తీవ్రవాదుల ఏరివేతకు సైన్యం చేపట్టిన చర్య ఇది. ఇది విఫలమైంది.

🏓ఆపరేషన్ రైనో
ఆపరేషన్ భజరంగ్ విఫలం కావడంతో అసోమ్ తీవ్రవాదలను అణచివేయడానికి చేపట్టిన చర్య.

🏓ఆపరేషన్ క్లౌడ్ బరస్ట్
ఇది కూడా అసోమ్ లోని తీవ్రవాదుల నిర్మూలన కోసం చేపట్టిందే.

* 🏓ఆపరేషన్ బ్లూ ప్రింట్*
ఉల్ఫా తీవ్రవాదులు అసోమ్ లో చేస్తున్న కార్యకలాపాలను వెలుగులోకి తీసుకురావడానికి చేపట్టిన చర్య.

🏓ఆపరేషన్ సహయోగ్
అసోంలో ప్రజల అభిమానాన్ని సంపాదించడం కోసం భారత సైన్యం నిర్వహించిన కార్యక్రమం.

🏓ఆపరేషన్ అగ్ని
ఉత్తర ప్రదేశ్ లోని తెరాయ్ ప్రాంతంలోని తీవ్రవాదుల ఏరివేతకు చేపట్టిన చర్య.

🏓ఆపరేషన్ సైకో
హజ్రత్ మహల్ మసీదులో దాక్కున్న తీవ్రవాదులకు ఆహార పదార్థాలు అందకుండా అడ్డుకుంటూ వారిపై ఒత్తిడి పెంచడానికి చేపట్టిన సైనిక చర్య.

🏓 ఆపరేషన్ పోలో
1948లో హైదరాబాద్ సంస్థానం స్వాధీనానికి భారత ప్రభుత్వం చేపట్టిన పోలీసు చర్య.

🏓ఆపరేషన్ లోటస్
బోఫోర్స్ కుంభకోణంలోని రహస్యాలను ఛేదించడానికి చేపట్టిన పోలీసు కార్యక్రమం.

🏓ఆపరేషన్ శాండల్ ఫాక్స్
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను పట్టుకోడానికి చేపట్టిన పోలీసు చర్య ఇది.

* 🏓ఆపరేషన్ మిడ్ నైట్*
సేంట్రల్ రిజర్వ్ పోలీసు, పంజాబ్ పోలీసులు 1987లో స్వర్ణ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న తీవ్రవాదులను ఏరివేయడానికి చేపట్టిన కార్యక్రమం.

🏓ఆపరేషన్ కోకూన్
గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను బంధించడానికి తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన చర్య.

🏓ఆపరేషన్ ధన్వంతరి
దొంగ మందులను తయారు చేస్తున్న 4 పరిశ్రమలను గుర్తించి వాటిని నాశనం చేయడానికి బిహార్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం.

🏓ఆపరేషన్ త్రీ స్టార్
 పార్లమెంట్ పై దాడి జరిగిన కేసులో ప్రధాన నిందితుడు అఫ్జల్ గురును ఉరి తీయడానికి చేపట్టిన చర్య.

🏓ఆపరేషన్ ఎక్స్ ముుంబయిలో తీవ్రవాదుల దాడి కేసులో పట్టుబడిన అజ్మల్ కసబ్ ను పుణేలోని ఎరవాడ జైల్లో రహస్యంగా ఉరి తీసిన చర్య.ఇతర ముఖ్యమైన ఆపరేషన్లు


no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv