తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం- 2018
1. గ్రామ పంచాయతీ సభ్యుల పదవీ కాలం?
1) 6 ఏళ్లు
2) 4 ఏళ్లు
3) 5 ఏళ్లు
4) 3 ఏళ్లు
సమాధానం: 3
2. గ్రామ సభ సభ్యుల సంఖ్య ఎంత?
1) 17
2) 19
3) 21
4) ఏదీకాదు
సమాధానం: 4
1) గ్రామంలోని ఓటర్లు అందరూ గ్రామసభలో సభ్యులే
2) 1000 మంది ఓటర్లు ఉన్న గ్రామంలో గ్రామసభ నిర్వహించడానికి కావాల్సిన కోరం 50 మంది
3) గ్రామసభ రెండు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది
4) ఏదీ కాదు
సమాధానం: 2
4. సర్పంచ్ గైర్హాజరులో గ్రామసభకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) ఉప సర్పంచ్
2) పంచాయతీ కార్యదర్శి
3) సీనియర్ సభ్యుడు
4) విలేజ్ రెవెన్యూ ఆఫీసర్
సమాధానం: 1
5. జతపరచండి.
గ్రామంలో ఓటర్ల సంఖ్య
i) 500 వరకు
ii) 501 నుంచి 1000
iii) 1001 నుంచి 3000
iv) 3001 నుంచి 5000
v) 5001 నుంచి 10000
vi) 10000 పైగా
గ్రామ సభ కోరం
a) 50 మంది
b) 150 మంది
c) 75 మంది
d) 400 మంది
e) 200 మంది
f) 350 మంది
g) 300 మంది
1) i-a, ii-b, iii-c,
iv-d, v-e, vi-f
2) i-a, ii-c, iii-b,
iv-e, v-g, vi-d
3) i-a, ii-b, iii-d,
iv-c, v-e, vi-g
4) i-a, ii-b, iii-d,
iv-e, v-f, vi-c
సమాధానం: 2
6. 5000 వరకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయాల్సిన వార్డుల సంఖ్య?
1) 13
2) 11
3) 15
4) 9
సమాధానం: 1
7. సర్పంచ్కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) విధులు సరిగా నిర్వహించని సర్పంచ్ను విధుల నుంచి జిల్లా కలెక్టర్ తొలగిస్తారు
2) సర్పంచ్ పదవీ కాలం ఐదేళ్ల్లు
3) సర్పంచ్ పదవి పోటీకి కనీస అర్హత వయసు 21 ఏళ్లు
4) సర్పంచ్ను గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నుకుంటారు
సమాధానం: 4
8. ఉప సర్పంచ్పై ఒక పదవీ కాలంలో ఎన్నిసార్లు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టవచ్చు?
1) 3
2) 4
3) 2
4) పరిమితి లేదు
సమాధానం: 3
9. కింది వారిలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ లేనివారు ఎవరు?
1) మహిళలు
2) ఎస్సీలు
3) బీసీలు
4) వికలాంగులు
సమాధానం: 4
10. నూతన గ్రామ పంచాయతీ చట్టం ప్రకారం సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది?
1) 50%
2) 30%
3) 34%
4) 27%
సమాధానం: 3
11. తెలంగాణలో ప్రస్తుతం గ్రామ పంచాయతీల సంఖ్య ఎంత?
1) 10431
2) 12751
3) 12250
4) 12175
సమాధానం: 2
12. తెలంగాణలో 100% ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల సంఖ్య?
1) 1308
2) 1326
3) 1362
4) 1380
సమాధానం: 2
13. 31 జిల్లాల ఏర్పాటు తర్వాత తెలంగాణలో ఎన్ని గ్రామ పంచాయతీలను అదనంగా ఏర్పాటు చేశారు?
1) 4383
2) 4873
3) 4500
4) 4688
సమాధానం: 1
14. నూతన గ్రామ పంచాయతీ రాజ్ చట్టం-2018లో గ్రామాల లిస్టును ఎన్నో షెడ్యూల్లో పేర్కొన్నారు?
1) 6వ షెడ్యూల్
2) 7వ షెడ్యూల్
3) 8వ షెడ్యూల్
4) 4వ షెడ్యూల్
సమాధానం: 3
15. తెలంగాణ నూతన పంచాయతీ రాజ్ చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి?
1) 297
2) 287
3) 268
4) 271
సమాధానం: 1
16. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం -2018 ఏ తేదీన అమల్లోకి వచ్చింది?
1) 2018 మార్చి 17
2) 2018 ఏప్రిల్ 24
3) 2018 ఏప్రిల్ 18
4) 2018 మార్చి 29
సమాధానం: 3
17. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శి ఉంటాడని ఏ సెక్షన్లో పేర్కొన్నారు?
1) సెక్షన్ - 42
2) సెక్షన్ - 41
3) సెక్షన్ - 40
4) సెక్షన్ - 43
సమాధానం: 1
18. సర్పంచ్ పదవి ఏ కారణం చేతనైనా ఖాళీ అయితే తిరిగి ఎన్ని రోజుల్లోగా ఎన్నుకోవాలి?
1) 180 రోజులు
2) 150 రోజులు
3) 120 రోజలు
4) ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ప్రకారం
సమాధానం: 3
19. గ్రామ పంచాయతీల్లో అత్యధికంగా వసూలు అయ్యే పన్ను?
1) ఆస్తి పన్ను
2) నీటి పన్ను
3) ఇంటి పన్ను
4) విద్యుత్ పన్ను
సమాధానం: 3
20. కింది వాటిలో గ్రామ పంచాయతీ విధించగలిగే పన్నులు ఏవి?
1) ఇంటి పన్ను
2) కొల దారము లేదా కాటా రుసుము
3) ప్రభుత్వం నిర్దేశించిన, ఇతర పన్నులు
4) పైవన్నీ
సమాధానం: 4
21. కాటా రుసుము దేనిపై విధిస్తారు?
1) పంట ఉత్పత్తిపై
2) మాంసం ఉత్పత్తిపై
3) చెట్ల పెంపకం పై
4) పై అన్నింటిపై
సమాధానం: 1
22. పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు?
1) ఏప్రిల్ 20
2) ఏప్రిల్ 22
3) ఏప్రిల్ 24
4) ఏప్రిల్ 28
సమాధానం: 3
23. గ్రేడ్ -1 గ్రామ పంచాయతీల ఆదాయం ఎంత?
1) రూ. 3 లక్షల నుంచి 4 లక్షలు
2) రూ. 2 లక్షల నుంచి 3 లక్షలు
3) రూ. 4 లక్షల కంటే ఎక్కువ
4) రూ. 2 లక్షల కంటే తక్కువ
సమాధానం: 3
24. కింది వాటిలో సర్పంచ్ పదవికి కనీస అర్హత కానిది ఏది?
1) వయస్సు కనీసం 21 ఏళ్లు పూర్తైఉండాలి
2) సంతానం ఇద్దరి కంటే ఎక్కువ ఉండకూడదు
3) కనీస విద్యార్
హత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
4) పైవన్నీ
సమాధానం: 3
25. పంచాయతీ పరిధిలో నిర్మాణాలకు సంబంధించి లే-అవుట్ అనుమతి కింది వారిలో ఎవరి నుంచి పొందాలి?
1) గ్రామసభ
2) పంచాయతీ కార్యదర్శి
3) గ్రామ పంచాయతీ
4) తహశీల్దార్
సమాధానం: 3
26. గ్రామ సభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1) పంచాయతీ కార్యదర్శి
2) సర్పంచ్
3) ఉప సర్పంచ్
4) వీఆర్వో
సమాధానం: 2
27. గ్రామ సభ తీర్మానాన్ని ఏ విధంగా ఆమోదిస్తారు?
1) గ్రామంలోని మొత్తం ఓటర్లలో సగం మంది ఆమోదంతో
2) గ్రామసభకు హాజరైన మొత్తం సభ్యుల్లో మెజారిటీ సభ్యుల ఆమోదంతో
3) గ్రామ పంచాయతీ మొత్తం సభ్యుల్లో సగం మంది ఆమోదంతో
4) గ్రామసభ మొత్తం సభ్యుల్లో 2/3 వంతు మంది సభ్యుల ఆమోదంతో
సమాధానం: 2
28. కింది వాటిలో గ్రామసభ ఎజెండాలో ఆమోదించాల్సిన అంశాలు ఏవి?
1) పారిశుధ్యం
2) వీధి దీపాల నిర్వహణ
3) కమ్యూనిటీ ఆస్తుల నిర్వహణ
4) పైవన్నీ
సమాధానం: 4
29. గ్రామ సభ ఎజెండాను ఎవరు రూపొందిస్తారు?
1) పంచాయతీ కార్యదర్శి
2) సర్పంచ్
3) ఉప సర్పంచ్
4) వీఆర్వో
సమాధానం: 1
30. కింది వాటిలో గ్రామసభ విధులు కానివి ఏవి?
1) గ్రామ పంచాయతీ ఆడిట్ రిపోర్టులు, అకౌంట్ వివరాలు తనిఖీ చేయడం
2) ఏడాది కనీసం రెండుసార్లు మహిళలు, వృద్ధుల సమస్యలపై దృష్టి సారించాలి
3) గ్రామసభ సమావేశానికి ఎమ్మెల్యే, ఎంపీలను ఆహ్వానించవచ్చు
4) ఉప సర్పంచ్ని ఎన్నుకోవాలి
సమాధానం: 4
31. గ్రామ సభ తీర్మానాలను ఏ విధంగా ఆమోదింపజేస్తుంది?
1) రహస్య పద్ధతిలో మెజారిటీ సభ్యుల బ్యాలెట్ ఓటింగ్ ద్వారా
2) 2/3 వంతు మంది ఓటు వేయడం ద్వారా
3) మెజారిటీ సభ్యులు చేతులు పెకైత్తడం ద్వారా
4) పై అన్నింటి ద్వారా
సమాధానం: 3
32.తెలంగాణ నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రకారం గ్రామసభ ఉంటుందని పేర్కొన్న సెక్షన్ ఏది?
1) సెక్షన్ - 5
2) సెక్షన్ - 4
3) సెక్షన్ - 3
4) సెక్షన్ - 6
సమాధానం: 4
33. జతపరచండి.
గ్రామ పంచాయతీ జనాభా
i) 501 నుంచి 1500 వరకు
ii) 1501 నుంచి 3000 వరకు
iii) 5001 నుంచి 10000 వరకు
iv) 15001 నుంచి 25000 వరకు
గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్య
a) 19
b) 15
c) 9
d) 11
1) i-a, ii-d, iii-b,
iv-c
2) i-c, ii-d, iii-b,
iv-a
3) i-c, ii-d, iii-a,
iv-b
4) i-a, ii-d, iii-c,
iv-b
సమాధానం: 2
34. కింది వారిలో గ్రామ పంచాయతీకి కో-ఆప్ట్ అయ్యే వ్యక్తి ఎవరు?
1) ఎంపీటీసీ
2) జెడ్పీటీసీ
3) ఎమ్మెల్యే
4) పదవీ విరమణ చేసిన ఉద్యోగి
సమాధానం: 4
35. గ్రామ పంచాయతీ వసూలు చేసే పన్నులపై సర్చార్జీ ఎవరు విధిస్తారు?
1) కేంద్ర ప్రభుత్వం
2) రాష్ట్ర ప్రభుత్వం
3) మండల పరిషత్
4) జిల్లా పరిషత్
సమాధానం: 3
36. గ్రామ పంచాయతీ ట్రైబ్యునల్లో సభ్యుల సంఖ్య ఎంత?
1) 6
2) 9
3) 5
4) 3
సమాధానం: 4
37. తెలంగాణ నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 ప్రకారం రాష్ట్రంలో అత్యల్ప గ్రామ పంచాయతీలు ఉన్న జిల్లా ఏది?
1) మేడ్చల్
2) సంగారెడ్డి
3) వనపర్తి
4) మహబూబ్నగర్
సమాధానం: 1
38. కింది వాటిలో గ్రామ పంచాయతీల ఏర్పాటును సూచించే అధికరణ ఏది?
1) అధికరణ - 40
2) అధికరణ - 39
3) అధికరణ - 44
4) అధికరణ - 35
సమాధానం: 1
39. గ్రామ సభను ఏడాదికి ఎన్నిసార్లు నిర్వహించాలి?
1) 2
2) 3
3) 4
4) 6
సమాధానం: 4
40. బ్లాక్ స్థాయి వ్యవస్థను ఎప్పుడు మండల పరిషత్గా మార్చారు?
1) 1985
2) 1986
3) 1976
4) 1973
సమాధానం: 2
41. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 బిల్లును రాష్ట్ర శాసనసభ ఏ తేదీన ఆమోదించింది?
1) 2018 మార్చి 23
2) 2018 ఏప్రిల్ 24
3) 2018 ఏప్రిల్ 26
4) 2018 మార్చి 29
సమాధానం: 4
42. గ్రామ పంచాయతీకి ఎన్నికైన ఎన్ని నెలల్లోగా రాజ్యాంగానికి బద్ధుడనై ఉంటానని ప్రమాణం చేయాలి?
1) 4 నెలల్లో
2) ఒక నెలలో
3) 3 నెలల్లో
4) 6 నెలల్లో
సమాధానం: 3
43. గ్రామ పంచాయతీకి ఎన్నికైన ఎన్ని నెలల్లోగా రాజ్యాంగానికి బద్ధుడనై ఉంటానని ప్రమాణం చేయాలి?
1) 4 నెలల్లో
2) ఒక నెలలో
3) 3 నెలల్లో
4) 6 నెలల్లో
సమాధానం: 3
44. కింది వారిలో ఎవరు ఒకటి కంటే ఎక్కువ జిల్లా పరిషత్లలో సభ్యులుగా సభ్యత్వం కలిగి ఉండవచ్చు?
1) ఎమ్మెల్యే
2) ఎంపీ
3) ఎమ్మెల్సీ
4) సర్పంచ్
సమాధానం: 2
45. గ్రామ పంచాయతీకి కింది వాటిలో ఏ వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది?
1) మండల పరిషత్ నుంచి వచ్చే నిధులు
2) జిల్లా పరిషత్లోని ఎండోమెంట్, ట్రస్టుల ఆదాయం నుంచి
3) జిల్లా పరిషత్కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మంజూరైన నిధుల నుంచి
4) పై అన్నింటి నుంచి
సమాధానం: 4
46. కింది వారిలో మండల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు కాని వారెవరు?
1) జిల్లా కలెక్టర్
2) మండల
పరిషత్ పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్లు
3) పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
4) జిల్లా పరిషత్ చైర్మన్
సమాధానం: 3
47. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూ సేకరణ చేయాలంటే తప్పనిసరిగా ఎవరిని సంప్రదించాలి?
1) గ్రామసభ
2) తహశీల్దార్
3) కలెక్టర్
4) ఆర్డీవో
సమాధానం: 4
48. తెలంగాణలో జిల్లా పరిషత్ చైర్మన్కి అందే గౌరవ వేతనం ఎంత?
1) రూ. 10,000
2) రూ. 1,00,000
3) రూ. 1,50,000
4) రూ. 50,000
సమాధానం: 2
49. సర్పంచ్ అభ్యర్థి రిజర్వేషన్ ఎన్నేళ్లకోసారి రొటేట్ అవుతుంది?
1) 5 ఏళ్లకోసారి
2) 15 ఏళ్లకోసారి
3) 10 ఏళ్లకోసారి
4) 20 ఏళ్లకోసారి
సమాధానం: 3
50. సర్పంచ్ పదవీకాలం పూర్తయిన తర్వాత నూతనంగా ఎన్నికైన సర్పంచ్కి ఆ గ్రామ పంచాయతీ కార్యాలయ డాక్యుమెంట్లు, ఆస్తులు, ఖర్చులను ఎన్ని రోజుల్లోగా అప్పగించాలి?
1) 30 రోజులు
2) 60 రోజులు
3) 120 రోజులు
4) 180 రోజులు
సమాధానం: 1
51. కింది వారిలో మండల పరిషత్, జిల్లా పరిషత్లకు అవసరమైన మార్గదర్శక సూచనలు చేసే అధికారం లేని వారెవరు?
1) జిల్లా కలెక్టర్
2) పంచాయతీ రాజ్ కమిషనర్
3) ఎమ్మెల్యే
4) రాష్ట్ర ప్రభుత్వం
సమాధానం: 3
52. రాష్ట్రంలోని ఒక గ్రామ పంచాయతీ విధుల నిర్వహణలో విఫలమైందని భావించినప్పుడు దాన్ని వివరణ కోరిన తర్వాత రద్దు పరిచే అధికారం ఎవరికి ఉంది?
1) జిల్లా కలెక్టర్
2) జిల్లా పరిషత్ చైర్మన్
3) పంచాయతీ రాజ్ కమిషనర్
4) రాష్ట్ర ప్రభుత్వం
సమాధానం: 4
EmoticonEmoticon