TSPSC Exams Special - Important Current Affairs Practice Bits

*🔥IMP CA & GK BITS🔥*

01) కరీంనగర్ టు ముంబై లోకమాన్య తిలక్ రైలు పొడగింపునకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ లో ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు ?

*జ: రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గోహెన్*

02) ఉస్మానియా యూనివర్సిటీకి రూ.100 కోట్ల రూసా నిధులు మంజురు అయ్యాయి. రూసా అంటే ఏంటి ?

*జ: రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్*

03) ప్రయాణీకులకు సంతృప్తి, భద్రత, సౌకర్యాల విషయంలో 98శాతం మెరుగైన స్కోరు సాధించిన సంస్థగా హైదరాబాద్ మెట్రో నిలిచింది. ఏ సంస్థ దీనిపై సర్వే నిర్వహించింది ?

*జ: మెట్రో ప్రాజెక్ట్ నిర్వహణ సంస్థ కియోలిస్ (ఫ్రాన్స్ )*

04) పాన్ కార్డ్, ఆదాయపు పన్ను రిటర్న్స్, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ రాయితీలకు ఆధార్ అవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు చెప్పింది. ఈ ధర్మాసనానికి ఎవరు నేతృత్వం వహించారు ?

*జ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర*

05) ప్రపంచంలో పర్యావరణ మార్పులకు నిరంతర కృషి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి ‘‘చాంపియన్స్ఆఫ్ ది ఎర్త్’’ అవార్డును ప్రకటించిన సంస్థ ఏది ?

*జ: ఐక్యరాజ్య సమితి*

06) ఏసీలు, చెప్పులు, వజ్రాలతో పాటు ఎన్ని వస్తువులపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచింది ?

*జ: 18 వస్తువులపై*

07) 5G సేవలు, ఇంటర్నెట్ ఆప్ థింగ్స్,యంత్రాల మధ్య సమాచార మార్పిడి తదితర లక్ష్యాలతో నాలుగేళ్ళల్లో రూ.7.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించేందుకు జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం 2018 ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టెలికాం మంత్రి ఎవరు ?

*జ: మనోజ్ సిన్హా*

08) చెరుకు రైతులు, మిల్లులకు సబ్సిడీ ఇచ్చేందుకు పంచదార రంగానికి కేంద్ర ఎంత మొత్తం ప్యాకేజీ ప్రకటించింది ?

*జ: రూ.5,538 కోట్లు*

09) లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల రుణ అవసరాలను తీర్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించిన పోర్టల్ ఏది ?

*జ: www.psbloansin59minutes.com*
(నోట్: గంలో రూ.1కోటి రుణం ఇస్తారు )*

10) రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి తమిళనాడులోని రామేశ్వరంకు రైలు ప్రవేశపెట్టేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఆ రైలు పేరేంటి ?*

*జ: హమ్ సఫర్*

11) భారత వైద్య మండలి (MCI) రద్దు చేసిన దాని స్థానంలో బోర్డ్ ఆప్ గవర్నర్స్ ను కేంద్రం ఆర్డినెన్స్ ద్వారా ఏర్పాటు చేసింది. అయితే MCIకి బదులు ఏ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ?

*జ: నేషనల్ మెడికల్ కమిషన్*

12) భూమి, వాతావరణం, సాగర, గ్రహాధ్యయన శాస్త్రం కేటగిరీలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (2018)కి ఎంపికైన తెలుగు శాస్త్రవేత్త ఎవరు ?

*జ: డాక్టర్ మాదినేని వెంకటరత్నం*

13) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశం నుంచి ఆకాశంలోని సుదూర లక్ష్యాలను చేధించగల ఏ క్షిపణిని సుఖోయ్ నుంచి శాస్త్రవేత్తలు ప్రయోగించారు ?

*జ: అస్త్ర క్షిపణి*

14) ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ ఎవరు ?

*జ: మన్ ప్రీత్ సింగ్*


no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv