పెట్రోలియం బావుల్లో పెట్రోలు కూడా వూరుతుందా?

పెట్రోలియం బావుల్లో పెట్రోలు కూడా వూరుతుందా?


నీళ్ల బావుల్లో నీరు వూరినట్టు పెట్రోలియం బావుల్లో పెట్రోలు వూరితే ప్రపంచవ్యాప్తంగా ఇంత ఆందోళన ఉండేది కాదు. నీటికి జలచక్రం ఉంది అంటే సముద్రాలలో వేసవిలో ఆవిరయిన నీరు మేఘాలుగా మైదాన ప్రాంతాలకు వెళ్లి వర్షించడం, వర్షపు నీరు నదుల ద్వారా అధిక భాగం తిరిగి ప్రత్యక్షంగా సముద్రాల్లో కలవడం కొంత వర్షపు నీరు భూమిలోకి ఇంకడం వల్ల అవి బావుల్లో వూరడం జరుగుతుంది. తర్వాత నీటిని సాగు నీరుగా, తాగు నీరుగా వాడుతున్న క్రమంలో అది పరోక్షంగా తిరిగి సముద్రాన్ని చేరడం వంటి వలయం నీటికి ఉంది. కానీ పెట్రోలియం బావుల్నించి తీసిన పెట్రోలు మరో పదార్థంగా మారుతూ ఉండటమే పెట్రోలు వినిమయం

నీటిని నీటిగానే ఉపయోగించి నీరుగానే వదిలేస్తాం. కాబట్టి వలయం పూర్తయ్యింది. కానీ పెట్రోలును పెట్రోలుగా తీసుకుని పెట్రోలుగా వదలం. కార్బన్డయాక్సైడ్‌, నీటి ఆవిరి తదితర వ్యర్థ పదార్థాలుగా మార్చి వదిలేస్తాం. కాబట్టి పెట్రోలు వలయం లేదు. కేవలం కొన్ని దశాబ్దాల వరకు మాత్రమే పెట్రోలు బావుల్లో పెట్రోలు వూరుతుంది. వూట క్రమేపి తగ్గిపోయి అవి ఎండు బావుల్లాగా మారే గడ్డురోజులు తొందర్లోనే ఉన్నాయి.

పెట్రోలియం బావుల్లో పెట్రోలు కూడా వూరుతుందా?




no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv