భారతీయ రిజర్వు బ్యాంకు దండిగా నోట్లు ముద్రించి అందరికీ పంచొచ్చు కదా.. ! అలా చేసి ప్రభుత్వం అందర్నీ ఒకేసారి దనవంతులగా చేయొచ్చు కదా..!!

*తెలుసుకొందాం*

*భారతీయ రిజర్వు బ్యాంకు దండిగా నోట్లు ముద్రించి అందరికీ పంచొచ్చు కదా.. ! అలా చేసి ప్రభుత్వం అందర్నీ ఒకేసారి దనవంతులగా చేయొచ్చు కదా..!!*
"""""""""""""""""""""""""""""""""''''"""""""''"""""""""""'"""
ప్రింటింగ్ ప్రెస్ మనది. పేపర్ మనది. సంతకం మన బ్యాంకు గవర్నర్ ది. ప్రజలకు కావల్సిన్ని నోట్లు ఎందుకని ముద్రించరు మరి.. ?

ఈ ప్రశ్న చిన్నప్పుడు నాకు చాలా సార్లు వచ్చింది. కానీ ఎవరినీ ఎప్పుడూ అడగలేదు, అడిగితే అది కూడా తెలియదా అని అంటారేమోనని అనిపించేది నాకు..
                 ****
మనకు భారతీయ రిజర్వు బ్యాంకు ఉన్నట్లే ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంకు ఉంటుంది, నోటు ముద్రణ, కమర్షియల్ బ్యాంకుల పర్యవేక్షణ చూడడానికి..

నోట్ల ముద్రణ ప్రతి ఏడాది జరిగే తంతే. దాని వెనకాల ఒక సూత్రం ఉంటుంది, అది ఎమిటంటే..

మన దేశం లో ఉన్న మొత్తం ఉత్పత్తి కి సమాన స్థాయి లో కరెన్సీ నోట్లు మార్కెట్ లో ఉండాలి. ఇదే ఆ సూత్రం..

అంటే, మన దేశం లో ఉన్న అన్ని రంగాలు కలిపి కొంత ఉత్పత్తిని చేశాయి అనుకుంటే, ఆ ఉత్పత్తికి ఉన్న విలువ మాత్రమే ఆ సమయం లో అందుబాటు లో ఉన్న నోట్లకి ఉంటుంది..

ఇక్కడ నోటుకి కాదు విలువ, ఆ నోటు వల్ల వచ్చే సరుకుకే విలువ. ఒక పేపర్ పై 100 రూపాయలు అని ముద్రించి నంత మాత్రాన దానికి వంద రూపాయల వేల్యూ వచ్చేయదు. ఆ వంద రూపాయలకి మార్కెట్ లో వచ్చే సరుకుని బట్టి, దాని విలువ ఆధారపడి ఉంటుంది..

ఇంకా విడమరచి చెప్పాలంటే, మనం ఒక ఉదాహరణ తీసుకుందాం..

ఒక పల్లెటూర్లో అందరూ కలిసి ఓ 100 బస్తాలు బియ్యం పండించారని అనుకుందాం. ఆ ఊర్లో అసలు కరెన్సీ నోట్లు లేవనీ అనుకుందాం. ఇప్పుడు మనం ఆ ఊర్లోకి ఒక 1000 రూపాయలు కరెన్సీ ఇచ్చాము. ఇప్పుడు ఆ బియ్యం విలువ, ఒక బస్తా 10 రూపాయలు అన్నమాట..

అలా కాకుండా, మనము 10,000 రూపాయలు ఇచ్చాం అనుకోండి, అప్పుడు ఒక బస్తా విలువ 100 రూపాయలు అవుతుంది. మనం ఎక్కువ కరెన్సీ నోట్లు ఇచ్చినంత మాత్రాన వాళ్లకి ఎక్కువ ఒనగూరేది ఏమీ ఉండదు. ఎందుకంటే అక్కడ అదే 100 బస్తాల బియ్యం ఉంటాయి కాబట్టి..

అలా కాకుండా వచ్చే ఏడాది వాళ్ళు 200 బస్తాలు పండిస్తే., అపుడు వారికి ఎక్కువ కరెన్సీ ఇవ్వొచ్చు..

ఇదే పద్ధతి మొత్తం దేశానికి అప్లై చేసుకుంటే, మనకు ఆ నోట్లు ఎలా, ఎంత ముద్రిస్తారో అర్థం అవుతుంది..

దాన్నే GDP అంటారు.. ఏటా GDP ని లెక్కించి పెరుగుతున్న ఉత్పత్తికి సమాన స్థాయిలో నోట్లు ముద్రించు కుంటూ ఉంటే ఇబ్బంది ఉండదు..

అలా కాకుండా, ఇష్టమొచ్చినట్లు నోట్లు ముద్రిస్తే, నోటు కి వెలువ పోయి, ఇప్పుడు 100 పెట్టి కొనేది, రేపు 1000 పెట్టి కొనాల్సి వస్తుంది..

మన దగ్గర ఉన్న మొత్తం ఉత్పత్తి కంటే, మనకు అందుబాటులో ఉండే కరెన్సీ ఎక్కువైతే, ద్రవ్యోల్బణం వస్తుంది. అంటే మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి, సరుకులు తక్కువ వస్తాయి. ఇది మనకు ప్రతి ఏడాది అనుభవం ఉంటుంది..

మనం వార్తల్లో చూసే ఉంటాం, జింబాబ్వేలో ఒక పెద్ద సంచిలో నోట్లు తీసుకెళ్తే, ఒక బ్రెడ్ ప్యాకెట్ మాత్రమే కొనుక్కోవచ్చు అని.  అదే అమెరికా డాలర్ నోటు ఒక్కటి తీసుకెళ్తే, ఇంకా చాలా సరుకులు కొనచ్చు..

అక్కడ జింబాబ్వేలో ద్రవ్యోల్బణం చాలా చాలా ఎక్కువ.. కారణం, సెంట్రల్ బ్యాంకు వాళ్ళు నోట్లు విపరీతంగా ముద్రించి దేశం మీద వదిలేయడం వల్ల అలా జరిగింది..

ఇంటర్నెట్ లో జింబాబ్వే నోటు చూడండి.. చాలా సున్నాలు ఉంటాయి.. అలాంటి నోట్లు ఎన్నున్నాపెద్ద విలువ ఏమీ ఉండదు, కాబట్టి వాటి వల్ల ఉపయోగం లేదు..

ఇక ఉత్పత్తికి సరిపడా కరెన్సీ లేకపోతే, అప్పుడు ఉత్పత్తి విలువ కూడా పడిపోతుంది. సరుకులు రేట్లు అన్నీ పడిపోయి తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే కరెన్సీ తక్కువ అందుబాటులో ఉంటుంది కాబట్టి దాన్ని "ప్రతి ద్రవ్యోల్బణం" అంటారు..

ఈ ద్రవ్యోల్బణం మహా ప్రమాదం. ప్రతి ఏడాది మన దేశంలో సగటున 5 - 6 % ద్రవ్యోల్బణం నమోదు అవుతుంటుంది. అంటే మనం ఈ ఏడాది 100 రూపాయలతో కొనే సరుకులకు వచ్చే ఏడాది అదే 100 రూపాయలు సరిపోవన్నమాట. 106 రూపాయలు పెట్టి కొనాలి అని అర్థం..

ఈ ద్రవ్యోల్బణం వల్లే పేదవారు మరీ పేదవారు అయ్యేది..

Rs.10,000 జీతం వచ్చేవారికి ఏడాది పని తర్వాత జీతం పెరిగి Rs.11,000 అయినా, మన చేతిలో ఏమీ మిగలదు. కారణం ఖర్చులు అనగా.. అదే వస్తువులు ఎక్కువ రేటు పెట్టి కొనాలి.  ద్రవ్యోల్బణం ఆ పెరిగిన జీతాన్ని మింగేస్తుంది..

ప్రభుత్వాల, సెంట్రల్ బ్యాంకుల ప్రధాన ఆర్ధిక కర్తవ్యాలలో ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణ నియంత్రణ కీలకమైనవి..

భారతీయ రిజర్వు బ్యాంకు దండిగా నోట్లు ముద్రించి అందరికీ పంచొచ్చు కదా.. ! అలా చేసి ప్రభుత్వం అందర్నీ ఒకేసారి దనవంతులగా చేయొచ్చు కదా..!!



no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv