అంతరిక్షంలోకి వెళ్లడానికి రాకెట్లనే ఎందుకు వాడాలి? విమానాలు, హెలికాప్టర్లు ఎందుకు వాడరు?

*🌏 అంతరిక్షంలోకి వెళ్లడానికి రాకెట్లనే ఎందుకు వాడాలి? విమానాలు, హెలికాప్టర్లు ఎందుకు వాడరు? 🌏*

విమానాలు, హెలికాప్టర్లు అంతర్దహన యంత్రాల (ఇంటర్నల్‌ కంబషన్‌ యంత్రాలు) సాయంతో ఎగరడానికి కావాల్సిన శక్తిని పొందుతాయి. అందుకు ఇంధనంతోపాటు ఆక్సిజన్‌ ఉన్న గాలి కూడా అవసరం. అంతే కాదు. వీటి చలనానికి అంతర్దహన యంత్రాలతో పాటు వాతావరణంలో ఉన్న గాలి నొక్కడం ద్వారా న్యూటన్‌ తృతీయ యాంత్రిక సూత్రం ఆధారంగా ఇవి పైకెగురుతాయి.

అంటే విమానాలు, హెలికాప్టర్లు వాతావరణం లేనిదే పని చేయలేవు. కానీ అంతరిక్షంలో గాలి ఉండదు. కాబట్టి వీటిని భూ వాతావరణాన్ని దాటేలా ప్రయోగించలేం. రాకెట్ల చలనానికి గాలి అవసరం లేదు. ఇంధనంతో దాన్ని మండించడానికి కావాల్సిన ఆక్సిజన్‌ రాకెట్లో నిల్వ ఉంచి మండిస్తారు.

ఆ మండే క్రమంలో విడుదలయ్యే వాయువులు అత్యంత వేగంగా రాకెట్టు అడుగు భాగం నుంచి రావడం వల్ల న్యూటన్‌ తృతీయ యాంత్రిక సూత్రం ఆధారంగా రాకెట్టు అంతరిక్షంలోకి ఎగురుతుంది. వాతావరణాన్ని ఆ విధంగా దాటి గ్రహాంతర చలనం చేయగలదు.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv