ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు. ఎందుకు?*
✳ప్లాస్టిక్ లేదా పాలిథిన్ అనేది సహజంగా తయారైన పదార్థం కాదు. కాబట్టి అది కుళ్ళిపోయి భూమిలో కలిసిపోయేందుకు కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుంది. అంతేగాకుండా వీటివల్ల వాతావరణంలో తీవ్రంగా కాలుష్యం ఏర్పడుతుంది. నూనె, కర్పూరం తో నైట్రోసెల్యులోజ్‌ను మెత్తగా చేస్తే ప్లాస్టిక్ తయారవుతుంది. వ్యాపార పరమైన ప్లాస్టిక్‌ను మొదట ఫినాల్ మరియు ఫార్మాల్డిహైడ్ నుంచి తయారు చేశారు. తర్వాత వివిధ రసాయనిక పదర్థాలతో తయారు చేసే పద్ధతులను కనిపెట్టారు.
*నష్టాలు :*
1.ఈ పాలిథిన్ కవర్లు భూమి నిండా పరచుకుని వర్షం నీటిని భూమిలో ఇంకనీయకుండా అడ్డుకోవడం వల్ల భూగర్భజలాలు తగ్గిపోతాయి.
2.మురుగు కాల్వల్లో ఈ కవర్లు పేరుకుపోవడం వల్ల డ్రైనైజీ సమస్యలు తలెత్తి వరదలకు కూడా కారణమవుతాయి.
3.అంతేగాకుండా పాలిథిన్ కవర్లలో ఆహార పదార్థాలను తీసుకెళ్తే... వాటిలోని రసాయనాలు ఆహారాన్ని కలుషితం చేస్తాయి.
4.వాడేసిన తరువాత పారేసిన ఈ కవర్లను పొరపాటున మింగటం వల్ల జంతువులు చనిపోయిన దాఖలాలు కూడా ఎక్కువే. ఇంత ప్రమాదానికి కారణమవుతున్న ఈ కవర్లను కాల్చి పడేద్దామనుకుంటే ఇంకా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.
5.అదెలాగంటే... ఈ పాలిథిన్ బ్యాగ్‌లను కాల్చుతున్నప్పుడు వీటినుండి వెలువడే డయాక్సిన్స్ అనే విషపదార్థాలు గాలిలో కలిస్తాయి. అలాంటి గాలిని పీల్చినవారు అనేక రకాల క్యాన్సర్ల బారిన పడక తప్పదు.
ఈ కవర్లకు బదులుగా గుడ్డసంచి, జనపనార సంచులనో వాడాలి. ఇలా చేయడం వల్ల మనకు మనము మేలు చేసుకున్నవారమే కాకుండా, ఈ సమాజానికి కూడా మేలు చేసినవారమవుతాము.

EmoticonEmoticon