*✍ఫిబ్రవరి నెలాఖరుకు డీఎస్సీ సెలెక్షన్స్*
*➡7902 ఖాళీల భర్తీకి పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు*
✍జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) ద్వారా నోటిఫై చేసిన 7,902 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేసేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది.
✍ప్రభుత్వ, జిల్లా పరిషత్, మోడల్, మున్సిపల్, బీసీ వెల్ఫేర్ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి నెలాఖరుకల్లా మెరిట్ లిస్టు, సెలెక్షన్ లిస్టులను రూపొందించే దిశగా కసరత్తు జరుగుతోంది.
✍సాధ్యమైనంత వరకు మార్చిలో నియామక ప్రక్రియను కూడా పూర్తిచేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
✍పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఫిబ్రవరి నెలాఖరులోగా భర్తీచేయాలని సుప్రీంకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైంది.
✍సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ), స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్) లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ, పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపాళ్లు, మ్యూజిక్, డ్రాయింగ్, క్రాఫ్టు, ఆర్ట్.. తదితర కేటగిరీల పోస్టుల భర్తీ కోసం గతేడాది డిసెంబర్ 24 నుంచి రాత పరీక్షలు ప్రారంభమయ్యాయి.
✍ప్రస్తుతం ఎస్‌జీటీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 31 నాటికి అన్ని పరీక్షలూ పూర్తవుతాయి.
✍ఈ సారి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా ఉపాధ్యాయ నియామకాలను పూర్తిచేసి విమర్శలకు తావులేకుండా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది.

EmoticonEmoticon