ఆకాశంలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి కదా. మరి ఆ వెలుగులో రాత్రి సమయం చీకటిగా ఎందుకు ఉంటోంది

*🌏 ఆకాశంలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి కదా. మరి ఆ వెలుగులో రాత్రి సమయం చీకటిగా ఎందుకు ఉంటోంది?🌏*

రాత్రిపూట సూర్యుడు ఆకాశంలో ఉండడు. అందువల్ల రాత్రి చీకటిగా ఉంటుందని వివరిస్తూ ఉంటారు. నిజమే. నక్షత్రాలు భూమి నుంచి ఎంతో దూరంలో ఉన్నాయి.

 వాటి నుంచి భూమికి చేరే కాంతి చాలా తక్కువ. అయితే ఒక నక్షత్రం నుంచి వచ్చే కాంతి భూమికి చేరడం వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. ఆకాశంలో కనిపించే కోట్లాది నక్షత్రాలు విడుదల చేసే కాంతి అంతా ఎటు పోతున్నట్లు? ఏమవుతున్నట్లు? ఇవన్నీ కలిస్తే మరెంతో వెలుగు ఉండాలి కదా! అనేది ప్రశ్న.

ఆకాశంలో నక్షత్రాలు ఏకరీతిగా విస్తరించుకుని, కదలకుండా ఏకరీతి కాంతి విడుదల చేస్తున్నాయని మనం అనుకుంటున్నాం. కానీ నక్షత్రాలు కదలకుండా లేవు. నక్షత్రాల సముదాయాలున్న ‘గెలాక్సీ’లు దూరదూరంగా వెళ్లిపోతున్నాయి. వీటి నుంచి వచ్చే కాంతి ఎరుపు రంగు చివరి భాగంతో ఉంటుంది. దీనినే *‘రెడ్‌ షిప్ట్‌’* అంటారు.

‘గెలాక్సీ’లు దూరంగా వెళ్లిపోతూ ఉండటం వల్ల వాటి నుంచి భూమికి చేరే కాంతి దాదాపు ఉండదు. గతంలో శాస్త్రవేత్తలు విశ్వం నిశ్చలంగా ఉందని భావించడం వల్ల రాత్రి పూట చీకటికి కారణం పూర్తిగా వివరించలేకపోయారు. ‘గెలాక్సీ’లు దూరంగా వెళ్లిపోతున్నాయని మొట్టమొదట గుర్తించిన శాస్త్రవేత్త ఎడ్విన్‌ హబుల్‌. ఈ సంగతి తెలియడంతో హెర్‌మన్‌ బొండీ అనే మరొక శాస్త్రవేత్త రాత్రిపూట చీకటికి కారణాన్ని పైవిధంగా విశ్లేషించి చెప్పాడు.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv