ఏపి గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 3 వారాలు వాయిదా

✍ఏపి గ్రూప్‌-1 ప్రిలిమ్స్ 3 వారాలు వాయిదా

➡మార్చి 31న స్క్రీనింగ్ టెస్ట్

➡ఏఈఈ, ఎఫ్ఆర్‌వో నిర్వ‌హ‌ణ తేదీల్లోనూ మార్పు

✍గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ మూడు వారాల‌పాటు వాయిదా వేసింది. షెడ్యూలు ప్ర‌కారం మార్చి 10న ఈ పరీక్ష‌ను నిర్వ‌హించాల్సి ఉండ‌గా... మూడు వారాలు పొడిగిస్తూ మార్చి 31కి వాయిదా వేసింది.

✍దీంతోపాటు ఈనెల‌, ఏప్రిల్ నెల‌ల్లో జ‌ర‌గాల్సిన పరీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి.

✍ఈ మేర‌కు మార్పుల‌తో కూడిన ప్ర‌క‌ట‌న‌ను క‌మిష‌న్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

✍అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) మెయిన్స్ ప‌రీక్ష‌లను ఏప్రిల్ 1, 2 తేదీల్లో నిర్వ‌హించాల్సి ఉండగా... ఏప్రిల్ 29, 30 తేదీల‌కు వాయిదా ప‌డ్డాయి.

✍అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ (ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్‌), దేవాదాయ‌శాఖ‌లోని అసిస్టెంట్ క‌మిష‌నర్ పోస్టుల ప‌రీక్ష‌ తేదీల్లోనూ మార్పులు జ‌రిగాయి.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv