ఆస్ట్రేలియన్ ఓపెన్-2019 -
జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాకా ఈ ఏడాది తొలి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత. -2019, జనవరి 26న మెల్ బోర్న్లో జరిగిన ఫైనల్లో ఆమె పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)ను 7-6, 5-7, 6-4 స్కోరుతో ఓడించింది. -2018 యూఎస్ ఓపెన్ టైటిల్ కూడా గెలిచిన నవోమి ఒసాకాకు ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. -ఈ విజయంతో 21ఏళ్ల ఒసాకా ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకునూ కైవసం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రీడాకారిణి నవోమి ఒసాకా కావడం విశేషం. -సెర్బియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను 7వసారి గెలుచుకున్నాడు. -2019, జనవరి 27న మెల్ బోర్న్లో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ స్పెయిన్ కు చెందిన రఫెల్ నాదల్ ను 6-3, 6-2, 6
3 స్కోర్తో వరుస సెట్లలో ఓడించి టైటిల్ ను కైవసం చేసుకున్నాడు.. -31 ఏళ్ల జొకోవిచ్ కు ఇది 15వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాక ఆయనకు ఇది వరుసగా మూడో గ్రాండ్స్లామ్ టైటిల్. -2018లో అతడు వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకున్నాడు. ఈ విజయంతో ఆయన పీట్ సంప్రాప్ (14 టైటిళ్లు)ను అధిగమించాడు. -పురుషుల టెన్నిస్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచిన క్రీడాకారుల జాబితాల్డోరోజర్ ఫెదరర్ (20), రఫెల్ నాదల్ (17) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.
మాదిరి ప్రశ్నలు:
1. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు?
ఎ) సిమోనా హాలెప్
బి) పెట్రా క్విటోవా
సి) కరోలినా ప్లిస్కోవా
డి) నవోమీ ఒసాకా సమాధానం: డి
2. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఎవరిని ఓడించి నొవాక్ జొకోవిచ్ టైటిల్ సాధించాడు?
ఎ) కీ నిషికోరి
బి) మిలోస్ కౌనిక్
సి) రఫెల్ నాదల్
EmoticonEmoticon