ఎండాకాలంలో ఈ పండ్లుతింటే అనారోగ్యం మీ దరి చేరదు..

ఎండాకాలంలో ఈ పండ్లుతింటే అనారోగ్యం మీ దరి చేరదు..

పోషకాలను అందించే పండ్లు ఎన్నెన్నో

విరివిగా తీసుకుంటే శరీరానికి చలువదనం

వేసవి వచ్చేసింది. ఈ నేపథ్యంలో పండ్లు తింటే శరీరానికి కావాల్సిన పోషకవిలువలు లభిస్తాయి. కాలానుగుణంగా లభించే పండ్లలో పరిపూర్ణమైన ఆరోగ్యం దాగుంది. ఒక్కో పండులో వివిధ రకాల పోషకాలు ఉన్నాయి. కొన్ని పండ్లు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తే మరికొన్ని గుండె జబ్బులు రాకుండా నివారిస్తాయి. క్యాన్సర్‌ దరి చేరకుండా కాపాడుతాయి. రక్త కణాలను వృద్ధి చేసి రక్తహీనత నుంచి విముక్తి కలిగిస్తాయి. ముఖం ముడతలు పడకుండా దోహదం చేస్తాయి. మూత్రపిండాల వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా ఉపకరిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అన్నింటికి మించి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇలా మరెన్నో రుగ్మతలను దూరం చేస్తాయి. సీజన్ల వారిగా లభించే ఏ పండునైనా ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. పండ్లలో లభించే పోషక విలువలు మరెందులోనూ ఉండవంటే ఏ మాత్రం ఆతిశయోక్తి కాదు.

దానిమ్మ పండు...
రక్తాన్ని శుద్ధి చేసే గుణం దానిమ్మ పండులో ఉంది. ఈ పండు తింటే రక్తహీనత నుంచి సునాయాసంగా బయటపడొచ్చు. రోజు ఒక దానిమ్మ పండు తినడం ద్వారా వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. ఇతర ఏ పండులో లేని విధంగా దానిమ్మలో 600 మిల్లీ గ్రాముల పొటాషియం, 102 మిల్లీ గ్రాముల పాస్పరస్‌, 34 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 28 మిల్లీ గ్రాముల కాలియం, విటమిన్‌ సీ, ఈ ,కే, బి1, బీ2 విటమిన్లు, ఫైబర్‌ దానిమ్మలో మెండుగా లభిస్తాయి. అందుకే ఏ కాలంలోనైనా దానిమ్మ పండు తినడం ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తారు.

ఆపిల్‌ పండు....

ఆపిల్‌ పండులోని పెక్టిన్‌ అనే రసాయనం పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. మానవ శరీరంలోని పేగులు ఆరోగ్యంగా ఉండేలా బ్యాక్టిరియా సంఖ్యను ఆపిల్‌ గణనీయంగా వృద్ధి చేస్తుంది. క్రమం తప్పకుండా ఆపిల్‌ తినడం ద్వార సర్వసాధారణంగా వైద్యుడి వద్దకు వెళ్ళే పని ఉండదని చెబుతుంటారు. శరీరంలో బ్యాక్టిరియా ఎక్కువ వృద్ధి చెంది కోన్ని రకాల కొవ్వు ఆమ్లాల ఉత్పత్తిలో సహాయకారిగా ఆపిల్‌ పనిచేస్తుంది. పేగులకు హాన చేసే సూక్ష్మక్రీముల నుంచి రక్షణ కల్పిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఈ పండు తినడం వల్ల శరీరానికి తగిన విధంగా శక్తిని ఇస్తుంది. వీటి ధర ఎక్కువగానే ఉన్నా వీలైనంత వరకు ఆపిల్‌ తినడం అవసరం. ప్రస్తుతం మార్కెట్లో ఆపిల్‌ విరివిగా లభిస్తున్నాయి.

కర్బూజ పండు..

కర్బూజ పండు శరీరాన్ని చల్లబర్చే గు ణాన్ని కలిగి ఉం టుంది. సాధారణంగా కర్బూజను వేసవిలో అత్యధికంగా తింటారు. ఈ పండును తినడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రత క్రమేపి తగ్గిపోయి చలువనిస్తుంది. మలబద్దకం, ఆకలి లేకపోవడం, బరువను కోల్పోవడం, ఎసిడిటీ, అల్సర్‌ వంటి రుగ్మతలను నివారించడంలో కర్బూజ గుజ్జు సమర్థవంతంగా పనిచేస్తుంది. మూత్రనాళ సమస్యలను నివారించడంలో ఈ పండుకు సాటి మరోకటి లేదు. ఆకలిని పెంచి అలసటను తీర్చే గుణం ఈ పండులో ఉంది. రక్తపోటును నివారించి గుండె మెరుగ్గా పనిచేసేలా దోహదపడుతుంది. విటమిన్‌ సీ, పోలీక్‌ ఆమ్లం ఈ పండులో సమృద్ధిగా ఉంటాయి. కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా కొంత వరకు మేలు చేస్తుంది.

అరటి పండు..

ఒకటి రెండు కాదు అరటి పండులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఈ పండు తిన్న తర్వాత తీరికగా జీర్ణమవుతుంది. అంతే రీతిలో శరీరానికి బలాన్ని ఇస్తుంది. మలబద్ధకాన్ని నివారించడంలో ఈ పండు సమర్థవంతంగా తోడ్పడుతుంది. అరటిపండు రోజు తింటే శరీరంలో కొవ్వును గణనీయంగా తగ్గిస్తుంది. అదిక రక్తపోటును నియంత్రించి సమతుల్యతను పాటించేలా దోహదపడుతుంది. పొటాషియం, మినరల్స్‌, పండి పదార్థాలు, సోడియం, మాంగనీసు, కెరోటిన్‌, ఇనుము, ప్రోటీన్లు అరటిపండులో సమృద్ధిగా లభిస్తాయి.

జామ పండు..

గుండె సమర్థవంతంగా పనిచేసేలా జామ పండు ఉపకరిస్తుం ది. ఈ పండులో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటా యి. క్యాన్సర్‌ వ్యాధిని దరిచేరకుం డా జామ పండు పనిచేస్తుంది.

చెర్రీ పండు....
ఉబకాయం రాకుండా చెర్రీ పండ్లు దోహదపడుతాయి. ఈ పండ్లను తినడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరగకుండా నివారిస్తుంది. ఈ పండులోని ఎర్రని వర్ణంలో ఉన్న అంథో పాయానిక్స్‌ ఇన్‌ఫెక్షన్లను, నొప్పులను తగ్గిస్తుంది. చెర్రి పండ్లలో అపారంగా ఉండే యాంటి ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

పైనాపిల్‌ పండు..

పైనాపిల్‌ గుజ్జును తిన్నా ద్రవపదార్థంగా తీసుకున్నా అందులోని పోషక విలువలు శరీరానికి సమృద్ధిగా సంక్రమిస్తాయి. 100గ్రాముల పైనాపిల్‌లో 87.8 శాతం నీరు, 0.4 గ్రాములు ప్రోటీన్లు, 10.8 గ్రాములు పిండి పదార్థాలు, 20 మిల్లీ గ్రాముల కాల్సియం, 9మిల్లీగ్రాముల పాస్పరస్‌, 2.4 మిల్లీగ్రాముల ఇనుము, 34.7 మిల్లీగ్రాముల సోడియం, 37మిల్లీ గ్రాముల పొటాషియం, 0.50 మిల్లీ గ్రాముల మాంగనీసు ఉంటాయి.

బొప్పాయి పండు...

బొప్పాయి పండ్లు ప్రత్యేక గుణాలు ఉన్నాయి. విటమిన్‌ ఎ, బీ, సీ, ఈ తో పాటు కెరోటిన్‌ అపారంగా ఉంటుంది. బీ1, బీ2, బీ3, సీ విటమిన్లు, ఇనుము, బాస్వరం, కాల్షియం, ఖనిజాలు బొప్పాయిలో లభిస్తాయి.

స్ట్రాబెర్రీ పండు...

శరీరానికి శక్తిని ఇతర పోషక విలువలు అందించడంలో దిట్ట స్ట్రాబెర్రీ, ఈ పండులో విటమిన్‌ సీ, ఫ్లెవనాయిడ్స్‌ పుష్కలంగా లభిస్తాయి. ప్రోటీన్‌, లోటస్‌ ల్యూషిడ్‌, కార్బోహైడ్రేట్స్‌, యాష్‌ ఫైబర్‌, కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్‌, పొటాషియం, ఇతర లవణాలు స్ట్రాబెర్రీలో లభిస్తాయి.

ద్రాక్ష పండ్లు...

మూత్రపిండాలు సక్రమంగా పనిచేసేలా ద్రాక్ష పండ్లు ఉపయోగపడుతాయి. ద్రాక్ష పండ్లను రోజు వారిగా తినడం వల్ల రక్త ప్రసరణ వేగవంతం చేస్తాయి. సాధారణ స్థాయికంటే మెరుగ్గా మూత్రపిండాలకు రక్తప్రసరణ చేయడంలో ద్రాక్ష పండ్లు ఎంతగానో దోహదపడుతాయి. కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా తోడ్పడుతాయి. ఈ పండ్లు తేలికగా జీర్ణమవడమే కాకుండా జీర్ణాశయం చురుగ్గా పనిచేసేలా ఉపకరిస్తాయి. ద్రాక్షలో సీ, కే విటమిన్‌లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాన్సర్‌ ఎదుర్కొనేందుకు ఈ పండ్లు సమర్థవంతంగా పనిచేస్తాయి. కొవ్వును అదపు చేసే గుణం కూడా ఈ ద్రాక్ష పండ్లలో ఉంది. ఖనిజాలు, లవణాలు, విటమిన్లు, అపారంగా ఉన్న ద్రాక్ష పండ్లను తింటే నోరు, గొంతుకు ఉపయుక్తంగా ఉంటుంది.

మామిడి పండు..

పండ్లలో రారాజు మామిడి. ఈ పండులోని పోషకాలు క్యాన్సర్‌ కణాలను అరికట్టేందుకు సమర్థవంతంగా పనిచేస్తుంది. మామిడి పండులో ఏ, బీ, సీ, విటమిన్లు, మాంసకృత్తులు, పిండి పదార్థాలు, చక్కెర, పీచు పదార్థాలు, కొవ్వు పదార్థాలు, థయామిన్‌, సియాసిన్‌, పాంటోథిలిక్‌ ఆమ్లం, విటమిన్‌ బీ6, సీ విటమిన్‌, మెగ్నీషియం, ఇనుము, భాస్వరం, పొటాషియం, ఇనుము, తగిన మోతాదులో లభిస్తాయి.

కొబ్బరి బొండం..

పండ్లు సంతతికి భిన్నంగా ఉం డే కొబ్బరి నిళ్లలో తక్షణ శక్తినిచ్చే గుణం ఉంది. గొంతు తడారిపోకుండా చేసి కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. అనారోగ్యం బారిన పడిన వ్యక్తులు త్వరగా కోలుకోవడానికి కొబ్బరినీళ్లు దోహదపడుతాయి. కొబ్బరినీళ్లను తాగడం వల్ల శరీరం కాంతిమంతంగా తయారవుతుంది.

పుచ్చకాయతో చలువ

పుచ్చకాయలో నీటి శాతం అత్యధికంగా ఉంటుంది. ఈ పండులో ప్రధానంగా సుక్రోజ్‌, గ్లూకోజ్‌, పుష్కలంగా దొరుకుతాయి. ఈ పండు వేసవిలో మాత్రమే విరివిగా లభిస్తుంది. పుచ్చకాయ తినడం వల్ల శరీరాని కి నీటి శాతం తగిన మోతాదులో లభిస్తుంది. వడదెబ్బ బారిన పడకుండా నివారిస్తుంది. వేసవిలో గొంతు తడారిపోకుండా చూస్తుంది. పుచ్చకాయ గుజ్జులో కెరోటిన్‌ నాయిడ్స్‌ అపారంగా ఉంటాయి. వీటిని శరీరం ఏ విటమిన్‌గా మార్చుకుంటుంది. విటమిన్‌ బీ6. సీ, పీచు పదార్థాలు తగిన మోతాదులో లభిస్తాయి.

బత్తాయి పండు...

బత్తాయి పండు లాలాజలం అధికంగా ఊరేందుకు ఈ పండు దోహదం చేస్తుంది. ఈ పండులోని లభించే ప్లెవనాయిడ్స్‌ శరీరంలోని ఆమ్లాలు పిత్తరసం, ఇతర జీర్తరసాలు అధిక మోత్తంలో విడుదలయ్యేందుకు తోడ్పడుతాయి. ఈ పండును తినడం వల్ల భుజించిన ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. బత్తాయిలోఓని కొన్ని ఆమ్లాలు పేగులోని విషపూరిత పదార్థాలను అంతం చేసి శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. గొంతు, చిగుళ్ళ నొప్పులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా బత్తాయి పండ్లు రక్షణ ఇస్తాయి. బత్తాయి తొక్కులు ఎండబెట్టి చూర్ణం చేసి ముఖానికి రాసుకుంటే మచ్చలు మటుమాయమవుతాయి. ప్రస్తుతం ఈ పండ్లు మార్కెట్లో విరివిగా లభిస్తాయి.

ఎండాకాలంలో ఈ పండ్లుతింటే అనారోగ్యం మీ దరి చేరదు..


no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv