చీమ అంత బరువుఎలా మోస్తుంది?

*🌏 చీమ అంత బరువుఎలా మోస్తుంది? 🌏*

*చీమ తన బరువుకు 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలదు. ఇదెలా సాధ్యం?*

చీమ శరీరం బరువు చాలా తక్కువ. ఒక గ్రాముకు తక్కువగా ఉంటుంది. కీటకాలు తమ బరువుకు మించిన బరువు మోయడానికి తమకున్న ఆరుకాళ్లు వాడుకుంటాయి. రెండు గ్రాములుండే మిడత కూడా ఇరవై గ్రాముల బరువును సులువుగా మోస్తుంది.

 గ్రాము బరువున్న కీటకం ఇంత బరువు మోయాలంటే దాని సామర్థ్యం 20 వేల గ్రాముల వరకు ఉండాలి.

జంతు ప్రపంచంలో ఇంతటి శక్తిమంతమైన కండరాలు.. గుల్ల ఉండే (నత్తల్లాంటివి) వాటికి ఉంటాయి. మనిషికి ఇటువంటి కండర సామర్థ్యం గ్రాముకు రెండు వేల గ్రాములు మాత్రమే ఉంటుంది.

ఈ శక్తి కీటకాలకు రావడానికి ఓ కారణం ఉంది. దానిలో గణిత, కీటక, జీవరసాయన శాస్త్రాలు మిళితమవ్వడం.

అంటే *కీటక ఘన పరిమాణం తగ్గే కొద్దీ దాని కండర శక్తి విపరీతంగా పెరిగిపోతుంది. కీటకాలకు ఉండే కండర పోగులు చిన్నవిగా ఉండి దగ్గరగా ప్యాక్‌ చేయబడి ఉంటాయి.*

*మిడత విషయం తీసుకుంటే..*

నూలు కండెలా ఈకలు మాదిరి దాని తొడ, కాళ్లలో కండరాలు అతి దగ్గరగా నొక్కి ఉంటాయి. బయటివైపు పంజరభాగ నిర్మాణం ఉండటం కీటకాల్లో మాత్రమే కనిపిస్తుంది.

వీటి కండరాలకు కొన్ని విశేష లక్షణాలు ఉన్నాయి. వీటిలో శ్వాసక్రియకు సంబంధించిన ఫీడర్స్‌ ఉంటాయి. వీటి వల్ల కండర శక్తి బాగుంటుంది. పైగా అలసట అనేది రాకుండా చేస్తుంది.

శరీరం తేలికగా ఉండటం, కాళ్ల వైపు కండరాలు సమంగా విస్తరించి బలంగా ఉండటం కీటక జాతికి ప్రకృతి ప్రసాదించిన సౌలభ్యం.

మనిషి విషయంలో పంజరం లోపల ఉండి భారీ శరీర నిర్మాణాకృతి బయటకు ఉంటుంది. కీటకాల్లో అయితే పంజరభాగం బయటకు ఉంటుంది. అందుకే బరువులు మోయడం విషయంలో చీమలకు ఉన్న శక్తి మనుషులకు ఉండదు.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv