*నేడు..మన మాజీ ఉప ప్రధానమంత్రి శ్రీ బాబూ జగజ్జీవన్ రామ్ గారి 112 వ జయంతి.*
జగజ్జీవన్ రామ్ గారు భారతదేశపు తొలి కార్మిక శాఖామంత్రి. మరియు 38 ఏళ్ళ చిన్నవయసులోనే కేంద్రమంత్రిగా పనిచేసిన తొలి భారతీయుడు. జగజ్జీవన్ రామ్ గారు..మొత్తం 40 ఏళ్ళు కేంద్రమంత్రిగా పనిచేయడం వీరి మరొక రికార్డు. మన దేశ నూతన రాజ్యాంగాన్ని రాయడానికి ఏర్పాటుచేసిన 'రాజ్యాంగపరిషత్' లో జగజ్జీవన్ రామ్ గారు కీలక సభ్యులుగా కూడా పనిచేశారు.1976 లో 'Congress for democracy' అనే రాజకీయ పార్టీని స్దాపించి..1977 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఈపార్టీతరపున కొన్ని సీట్లను పొంది..జనతాపార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. నాడు మురార్జీ దేశాయ్..ప్రధానమంత్రిగా ఉండగా..జగజ్జీవన్ రామ్ గారు ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు
జగజ్జీవన్ రామ్ గారు..నేతాజీ సుభాస్ చంద్రభోస్ తో కలిసి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని కొన్నిసార్లు జైలుశిక్షనూ అనుభవించారు.డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారితో కలిసి దళిత హక్కులను పరిరక్షించడంలోనూ కీలకపాత్ర పోషించారు.1971 లో జరిగిన ఇండో-పాక్ యుద్ద సమయంలో మనదేశ రక్షణ శాఖామంత్రి గా ఉండి..మనదేశం విజయం సాదించడానికి జగజ్జీవన్ రామ్ గారు చేసినకృషి ప్రశంసనీయం. 1972 లో ..అప్పుడు తూర్పు పాకిస్దాన్ పేరుతో ఉన్న 'బంగ్లాదేశ్' ఏర్పాటులోనూ వీరి కృషి శ్లాఘనీయం
మనదేశ 'ఏకైక మహిళా స్పీకర్' శ్రీమతి మీరాకుమార్ జగజ్జీవన్ రామ్ గారి కూతురే. జగజ్జీవన్ రామ్ గారు బీహార్ లోని 'చమర్' అనే 'చర్మకారుల' కుటుంబంలో జన్మించారు.చర్మకారులు అంటే పూర్వం చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్నవారు. జగజ్జీవన్ రామ్ గారు1908 ఏప్రిల్ 5 వతారీఖు జన్మించి..1986 జూలై 6 వతారీఖు..78 వ యేట మరణించారు.

EmoticonEmoticon