*ప్రశ్న: డిపాజిట్ గల్లంతు’ అంటే ఏంటి?*
■■■■■■■■■■■■■
*జవాబు:*
◆ ఎన్నికల సమయంలో నాయకులు చేసే సవాళ్లలో.. ‘ఇక నీ డిపాజిట్ గల్లంతు!’ అన్న వ్యాఖ్యలు తరుచూ వింటూనే ఉంటాం.
◆అసలు ఈ డిపాజిట్ అంటే ఏమిటి?.. డిపాజిట్ దక్కించుకోవడానికి.. కోల్పోవడానికి తేడా ఏంటి? ఎన్నికల నేపథ్యంలో ‘డిపాజిట్’ అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
◆ సాధారణంగా ఎవరైనా అభ్యర్థి ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే.. నిర్ణీత వయసుతో పాటు, డిపాజిట్ కింద రూ.10వేలు, ఎస్సీ-ఎస్టీలైతే రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుంది.
◆ఇది రీఫండబుల్. అయితే ఇక్కడే ఓ చిన్న మెలిక ఉంది. ఎవరైతే డిపాజిట్ దక్కించుకుంటారో వారికి మాత్రమే డిపాజిట్ డబ్బును తిరిగి చెల్లిస్తారు. డిపాజిట్ దక్కనివారికి రీఫండ్ చేయడం జరగదు.
◆ డిపాజిట్ దక్కాలంటే.. మొత్తం పోలైన ఓట్లలో కనీసం 1/6 ఓట్లు సదరు అభ్యర్థికి పోల్ అవాలి.
◆ లేనిపక్షంలో సదరు అభ్యర్థి డిపాజిట్ గల్లంతు అయినట్టు లెక్క.
◆అలాంటి సందర్భాల్లో నామినేషన్ సమయంలో అభ్యర్థి చెల్లించిన డిపాజిట్ ఖర్చును తిరిగి వెనక్కి ఇవ్వరు.
◆సాధారణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పితే మిగతావారు డిపాజిట్ కోల్పోయే సందర్భాలు ఎక్కువ.
◆సమీకరణాలు మారిపోతే కొన్నిసార్లు బడా లీడర్స్ అయినా డిపాజిట్ దక్కించుకోలేరు.
◆ఏదేమైనా డిపాజిట్ దక్కడమనేది కాస్తయినా పరువు దక్కించుకునే వ్యవహారం. లేదూ.. డిపాజిట్ గల్లంతయ్యిందంటే అది తమకు ప్రతిష్టకు భంగంగా భావిస్తారు.

EmoticonEmoticon