సూర్యరశ్మి దేహానికి హాని కలిగిస్తుందా?

*🔴సూర్యరశ్మి దేహానికి హాని కలిగిస్తుందా?🌞*


✳సూర్యకాంతిలోని నులివెచ్చని కిరణాలు ముఖ్యంగా ఉదయం, సాయంత్రపు వేళల్లో మన దేహానికి 'డి' విటమిన్‌ అందించినా, ఆహ్లాదం కలిగించినా, సూర్యరశ్మికి మరీ ఎక్కువగా ప్రభావితమైతే, కొన్నిసార్లు హాని జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాంటి ప్రమాదాలే శరీర చర్మంపై కమిలిన మరకలుగా (Sun burns) ఏర్పడుతాయి. అవే కాలం గడిచే కొద్దీ చర్మ సంబంధిత క్యాన్సర్‌గా పరిణామం చెందే ప్రమాదం ఉంది. వీటికి కారణం సూర్యరశ్మి నుంచి వెలువడే అత్యంత శక్తిమంతమైన అతి నీలలోహిత కిరణాలు. ఈ కిరణాలు మన దేహానికి సోకకుండా ఆకాశానికి భూమికి మధ్య ఓజోన్‌ పొర పరచుకొని ఉంటుంది. కానీ, ఇటీవల కాలంలో ఈ ఓజోన్‌ పొర గాఢత చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా ధ్రువ ప్రాంతాలపైన. దీనికి కారణం శీతలీకరణకు వాడే రిఫ్రిజిరేటర్లు, ఏసీలు. వాహనాలను నడపడానికి ఉపయోగించే పెట్రోలు, డీజిల్‌ లాంటి ఇంధనాల కాలుష్యాలు. అవి వెలువరించే క్లోరో ఫ్లోరో కార్బన్లు (సీఎఫ్‌సీఎస్‌). వీటి ప్రభా వాన్ని అరికట్టినా, ఆకాశంలోని ఓజోన్‌ పొర మునుపటి పరిమాణాన్ని, సాంద్రతను అందుకుంటుందనే విషయంలో శాస్త్రజ్ఞులు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఇప్పటికే ఎంతో నష్టం జరిగిపోయింది. ఇకనైనా ఆ ఓజోన్‌ పొర మరీ బలహీన పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv