కర్పూరపు బిళ్ళలను నీళ్ళలో ఉంచి వెలిగించినా వెలుగుతాయి. ఎందువల్ల?

*✅ తెలుసుకుందాం ✅*


*కర్పూరపు బిళ్ళలను నీళ్ళలో ఉంచి వెలిగించినా వెలుగుతాయి. ఎందువల్ల?*

కర్పూరాన్ని నీటి✳లో ముంచి వెలిగిస్తే వెలగదు. లేదా వెలుగుతున్న కర్పూరాన్ని నీటిలో ముంచినా ఆరిపోతుంది. కర్పూరాన్ని జాగ్రత్తగా నీటి మీద ఉంచి వెలిగిస్తే వెలుగుతుంది. కర్పూరం నీటిలో కరగదు. ఇది ఒకటర్పీను జాతికి చెందిన సేంద్రియ పదార్థం. ఇందులో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్ మాత్రమే ప్రత్యేక పద్దతిలో సంధానించుకుని ఉంటాయి. కర్పూరం మంచి ఇంధనం అంటే అది త్వరగా మండుతుంది. కర్పూరం సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ కావడం వల్ల అది నీటిపై గాలిలో ఉండడం వల్ల గాలిలోని ఆక్సిజన్ సహాయంతో ఇంధనం లాగా కర్పూరం మండగలదు. కర్పూరానికి ఉష్ణవాహకత కూడా బాగా తక్కువ కాబట్టి నీటి చల్లదనం కర్పూరపు ముద్దపైన వెలుగుతున్న జ్వాలను చల్లబరచి అది ఆరిపోయేలా చేయలేదు.

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv