మనం ఇంట్లో వాడే స్పాంజిని దేనితో, ఎలా తయారు చేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకోగలుగుతుంది

*🔴మనం ఇంట్లో వాడే స్పాంజిని దేనితో, ఎలా తయారు చేస్తారు? అది నీటిని ఎలా పీల్చుకోగలుగుతుంది?*

✳మామూలు నార, దూది, పాత గుడ్డ వంటి వాటిని లుంగచుట్టినా అవి కూడా స్పాంజిలాగే పనిచేస్తాయి. మనం వాడే తువ్వాలు, జేబురుమాలు, వంటింటి మసిగుడ్డ కూడా స్పాంజి పనిచేసే సూత్రం ఆధారంగానే పయోగపడుతున్నాయి. స్పాంజి ఒక ప్లాస్టిక్‌ పాలిమర్‌. అంటే ముద్దగా ఉన్న పాలిమర్‌ పదార్థంలో అత్యధికంగా గాలి గదులు ఉంటాయి. ఒక గదికి, మరొక గదికి కూడా మార్గాలు ఉంటాయి.అందువల్ల చూడ్డానికి పెద్దగానే ఉన్నా అందులో ఉండేది ఎక్కువ ఖాళీనే. దీని తయారీ దశలోనే ద్రవస్థితిలో ఉండే పాలిమర్‌లోకి నైట్రోజన్‌ను కానీ, గాలిని కానీ, కార్బన్‌డయాక్సైడును కానీ నురగ రూపంలోపంపుతారు. అందువల్లనే రంధ్రాలతో స్పాంజి ఏర్పడుతుంది. ఇక అది నీటిని పీల్చుకోవడానికి కారణం ద్రవాలకుండే తలతన్యత అనే ధర్మమే. సన్నపాటి సందుల్లోకి ద్రవాలు పాకడాన్నే కేశనాళికీయత (capillarity) అంటారు. ఈ లక్షణం వల్లనే అద్దుడు కాగితం ఇంకుని, సుద్దముక్క నీటిని, తువ్వాలు తడిని, స్పాంజి నీటిని పీల్చుకుంటాయి. దీపంలో వత్తి ద్వారా నూనె పైకి పాకడానికి, చెట్ల వేర్ల ద్వారా నీరు ఆకుల్లోకంటా చేరడానికి కూడా ఇదే కారణం.

===================

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv