రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటే ఏమిటి?

*ప్రశ్న: రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటే ఏమిటి?*
■■■■■■■■■■■■■■■■■
*సమాధానం:*

◆ ప్ర‌భుత్వం ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివిధ కాంట్రాక్టు సంస్థ‌ల ద్వారా చేయించ‌డానికి టెండ‌ర్లు పిలుస్తారు.

◆ భిన్న‌మైన ప‌ద్ధ‌తుల్లో టెండ‌ర్లు ఉంటాయి.

◆ ఓపెన్ టెండ‌ర్, బిడ్డింగ్ స‌హా ప‌లు ప‌ద్ధ‌తులు అవ‌లంభిస్తారు. ఇటీవ‌ల ఆన్ లైన్ లో టెండ‌ర్లు నిర్వ‌హిస్తున్నారు.

◆ ఒక‌సారి ఒక ప్రాజెక్ట్ కాంట్రాక్టుని ఏదైనా సంస్థ‌కు అప్ప‌గించిన త‌ర్వాత ప్ర‌భుత్వం ఏకార‌ణం చేత‌నైనా సంతృప్తి చెంద‌క‌పోతే పాత టెండ‌ర్లు ర‌ద్దు చేసే అధికారం ఉంటుంది.

◆ మ‌ళ్లీ టెండ‌ర్లు పిల‌వ‌డానికి ఏ విధానాన్న‌యినా అవ‌లంభించే స్వేచ్ఛ‌కూడా ఉంటుంది.

*◆ కానీ పాత ప‌ద్ధ‌తిలోనే, అదే కాంట్రాక్టుని, అంత క‌న్నా త‌క్కువ‌కు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించి మ‌ళ్లీ టెండ‌ర్లు పిల‌వ‌డాన్ని రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటారు.*

◆ మొద‌టి సారి పిలిచిన టెండ‌ర్ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌నే నిర్ధర‌ణ‌కు రావ‌డం లేదా ఆ ప‌నిని మ‌రింత చౌక‌గా నిర్వ‌హించ‌డానికి అవ‌కాశాలున్నాయ‌నే అభిప్రాయానికి రావ‌డంతోనే రివ‌ర్స్ టెండ‌రింగ్‌కు పిలుస్తారు.

*ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే తొలిసారిగా...*

◆ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కూ రివ‌ర్స్ టెండ‌రింగ్‌ను ఏ రాష్ట్ర ప్ర‌భుత్వమూ నిర్వ‌హించ‌లేదు.

◆ కానీ జాతీయ స్థాయిలో ఎన్టీపీసీ, కోల్ ఇండియా, సోలార్ ప‌వ‌ర్ కార్పోరేష‌న్ వంటి సంస్థ‌ల్లో ఇది అమ‌ల‌వుతోంది.

◆ ఇప్పుడు అదే త‌ర‌హాలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుని ప‌లు ప్రాజెక్టుల టెండ‌ర్ల వ్య‌వ‌హారంలో రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్టు సీఎం  ప్ర‌క‌టించారు.

◆ అందుకు అనుగుణంగా మొద‌టిసారిగా పోల‌వ‌రం ప్రాజెక్టుతో రివ‌ర్స్ టెండ‌రింగ్‌కి శ్రీకారం చుడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

◆ ఆ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇరిగేష‌న్ డిపార్ట్మెంట్ కార్యాచ‌ర‌ణ రూపొందిస్తోంది.
■■■■■■■■■■■■■■■■■

no Related Posts


EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng
:lv